భారత్‌లోనే మైక్రోమ్యాక్స్ ఫోన్ల తయారీ | Sakshi
Sakshi News home page

భారత్‌లోనే మైక్రోమ్యాక్స్ ఫోన్ల తయారీ

Published Mon, Nov 11 2013 1:24 AM

Micromax to start assembling phones in India from next year

 న్యూఢిల్లీ: మైక్రోమ్యాక్స్ కంపెనీ భారత్‌లో ఫోన్ల అసెంబ్లింగ్‌ను వచ్చే ఏడాది మార్చికల్లా ప్రారంభించనున్నది. ఇప్పటికి ప్రయోగాత్మకంగా రుద్రపూర్ ప్లాంట్‌లో ఫోన్లను అసెంబ్లింగ్ చేస్తున్నామని మైక్రోమ్యాక్స్ సహ-వ్యవస్థాపకులు రాహుల్ శర్మ చెప్పారు. ప్రస్తుతం ఈ కంపెనీ చైనా నుంచి ఫోన్లను దిగుమతి చేసుకుంటోంది. వచ్చే ఏడాది నుంచి రష్యాకు ఫోన్ల ఎగుమతులు ప్రారంభిస్తామని శర్మ చెప్పారు. ఆర్నెల్ల 20 కొత్త మొబైళ్లను అందుబాటులోకి తెస్తామని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.3,168 కోట్ల టర్నోవర్ సాధించామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6,000 కోట్ల టర్నోవర్ సాధించడం లక్ష్యమని పేర్కొన్నారు.
 

Advertisement
Advertisement