మతతత్వవాది మోడీకి మద్దతా ? | Sakshi
Sakshi News home page

మతతత్వవాది మోడీకి మద్దతా?

Published Fri, Mar 7 2014 9:53 AM

మతతత్వవాది మోడీకి మద్దతా ? - Sakshi

గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీదీ కరాకండిగా చెప్పారు. మోడీ మతతత్వవాది అని ఆమె ఆరోపించారు. తమిళనాడు సీఎం జయలలిత, లేక బీఎస్పీ అధినేత్రి మాయావతితో జతకట్టేందుకు ఆమె సుముఖత వ్యక్తం చేశారు. మమతా దీదీ గురువారం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దేశ ప్రజల సంక్షేమం కోసమే తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు.

 

లోక్సభ ఎన్నికల తర్వాత జయలలిత ప్రధాని పీఠం అధిష్టించిన మద్దతు ఇస్తానన్నారు. యూపీఏ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇవ్వడాని దీదీ ఈ సందర్భంగా సమర్థించుకున్నారు. కాంగ్రెస్, బీజేపీలతో పొత్తు పెట్టుకుంటారా అంటూ విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఎందుకు అంత తొందరా ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాలని అని విలేకర్లకు సూచించారు.

 

తన హద్దులు తనకు తెలసని, ప్రధాని పదవి ఎవరు అధిష్టించాలనేది ప్రజలే నిర్ణయిస్తారని దీదీ వెల్లడించారు. ప్రధాని పదవి చేపట్టాలని కోరుకుంటున్నారా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆమె పైవిధంగా వెల్లడించారు. భారత మాజీ ప్రధాని వాజ్పాయ్ హయాంలో ఆయనతో కలసి పని చేయడం పట్ల మమతా బేనర్జీ సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement