వ్యవసాయ ఆదాయ పన్నుపై జైట్లీ వివరణ | Sakshi
Sakshi News home page

వ్యవసాయ ఆదాయ పన్నుపై జైట్లీ వివరణ

Published Wed, Apr 26 2017 1:49 PM

వ్యవసాయ ఆదాయ పన్నుపై  జైట్లీ వివరణ - Sakshi

న్యూఢిల్లీ: వ్యవసాయ ఆదాయంపై పన్ను విధింపు పై ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. వ్యవసాయ ఆదాయంపై ఎలాంటి పన్ను  విధించే యోచన ఏదీ లేదని బుధవారం స్పష్టం  చేశారు.  కేంద్ర ప్రభుత్వం వద్ద అలాంటి ప్రణాళిక  ఏదీ లేదని ఆయన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. నీతి ఆయోగ్‌  సూచించినట్టుగా  వ్యవసాయ ఆదాయంలో ఏ పన్ను విధించాలనే ప్రణాళిక లేదని జైట్లీ  ట్వీట్‌ చేశారు.తద్వారా  నీతి ఆయోగ్‌ సభ్యుడు వివేక్‌ డెబ్రాయ్‌  సలహాను ఆయన కొట్టివేశారు.   వ్యవసాయ ఆదాయంపై కూడా పన్ను విధించాలన్న నీతి ఆయోగ్‌  సూచనల  నేపథ్యంలో జైట్ల వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వ్యవసాయ ఆదాయంపై న్ను వేయాలన్న యోచన ఏ దశలోనూ కలగలేదని జైట్లీ స్పష్టం చేశారు.

ప్రస్తుతం రష్యాల్లో ఉన్నఅరుణ్ జైట్లీ వ్యవసాయ ఆదాయంపై ఎలాంటి పన్ను విధించేందుకు ప్రభుత్వం ప్రణాళిక వేయలేదని ప్రకటించారు.   రాజ్యాంగ కేటాయించిన అధికారం ప్రకారం, ఈ తరహా పన్ను విధించేందుకు కేంద్రానికి ఎలాంటి అధికారంలేదని ఆయన వివరించారు.    

టాక్స్‌ ఆదాయాన్ని పెంచుకునేందుకుగాను వ్యక్తిగత ఆదాయపు పన్నుపై మినహాయింపులు తొలగించాలని, అలాగే రాష్ట్రాల ఆదాయ వనరుల్ని పెంచేందుకు వ్యవసాయాన్ని కూడా పన్ను పరిధిలోకి తీసుకురావాలని నీతి ఆయోగ్‌ సభ్యుడు వివేక్‌ డెబ్రాయ్‌  సూచించారు. దీనివల్ల పన్ను పరిధి పెరిగి, సాంఘిక సంక్షేమ పథకాలకు మరిన్ని నిధులు సమకూరుతాయని చెప్పారు.  పట్టణ ప్రాంతాల్లో అమలవుతున్న వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉండాలని సూచించడం ఆందోళన రేపింది.  కాగా  వ్యవసాయ ఆదాయం పన్ను విధించబోమని మార్చి 22న జైట్లీ పార్లమెంటుకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
 

Advertisement
Advertisement