టాప్ 10 గ్లోబల్ కంపెనీల్లో రిలయన్స్ | Sakshi
Sakshi News home page

టాప్ 10 గ్లోబల్ కంపెనీల్లో రిలయన్స్

Published Thu, Sep 8 2016 9:44 AM

టాప్ 10 గ్లోబల్ కంపెనీల్లో రిలయన్స్

సింగపూర్ : టాప్ 10 గ్లోబల్ ఆయిల్ కంపెనీల్లో రిలయన్స్ చోటు దక్కించుకుంది. భారత రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్10 గ్లోబల్ ఆయిల్ కంపెనీల్లో ఎనిమిదో స్థానంలో నిలిచినట్టు తాజా సర్వే పేర్కొంది. గతేడాది 14వ స్థానంలో ఉన్న రిలయన్స్ తన స్థానాలను మెరుగుపరుచుకుని ఈ ఏడాది 8వ ర్యాంకును సంపాదించుకున్నట్టు "ప్లాట్స్ టాప్ 250 గ్లోబల్ ఎనర్జీ కంపెనీ ర్యాంకింగ్స్ 2016"లో వెల్లడైంది. రిఫైనరీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 66వ స్థానం నుంచి 14వ స్థానానికి, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొ లిమిటెడ్ 133 ర్యాంకు నుంచి 48వ స్థానానికి ఎగిసినట్టు ఈ గ్లోబల్ ఎనర్జీ బిజినెస్ల సర్వే తెలిపింది.
 
అయితే ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొ లిమిటెడ్ తన స్థానాన్ని కోల్పోయింది. ఏడాది క్రితం 17వ ర్యాంకులో ఉన్న ఈ సంస్థ ఈ ఏడాది 20 స్థానానికి పడిపోయింది. మార్జిన్లు మెరుగవ్వడం రిఫైనింగ్ సెక్టార్లో బలమైన వృద్ది నమోదవుతుందిన ప్లాట్స్ తెలిపింది. బొగ్గు డిమాండ్కు భారత్ చాలా ప్రముఖమైన దేశమని, దీనివల్ల ప్రపంచంపు ఇంధన కంపెనీల్లో బొగ్గు ప్రాముఖ్యం పెరుగుతూ ఉందని సర్వే పేర్కొంది. ఈ ప్రాముఖ్యంతో కోల్ ఇండియా టాప్ 250 ర్యాంకుల్లో 38వ స్థానంలో నిలిచిందని ప్లాట్స్ వివరించింది. అదేవిధంగా స్వతంత్ర విద్యుత్ తయారీదారి అదానీ పవర్ లిమిటెడ్ 250 ర్యాంకులో ఉంది. మూడేళ్ల కాంపౌండ్ వృద్ధి రేటు 54.9 శాతంతో ఆసియా-ఫసిఫిక్ ఎనర్జీ కంపెనీల్లో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీగా అదానీ నిలిచినట్టు ప్లాట్స్ తెలిపింది.  

Advertisement
Advertisement