రాష్ట్ర మార్కెట్లోకి గెలాక్సీ గ్రాండ్ 2 | Sakshi
Sakshi News home page

రాష్ట్ర మార్కెట్లోకి గెలాక్సీ గ్రాండ్ 2

Published Mon, Jan 27 2014 1:14 AM

రాష్ట్ర మార్కెట్లోకి గెలాక్సీ గ్రాండ్ 2

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ శామ్‌సంగ్ నూతన స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ గ్రాండ్ 2’ రాష్ట్ర మార్కెట్లోకి విడుదలైంది. లాట్ మొబైల్స్ శనివారం లాంఛనంగా ఈ మోడల్‌ను ఆవిష్కరించింది. ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్‌ఫోన్ల విభాగంలో సరాసరి విక్రయ ధర అధికంగా కలిగి ఉన్నందునే ఈ కార్యక్రమాన్ని తమ చేతుల మీదుగా సామ్‌సంగ్ జరిపించిందని లాట్ తెలిపింది. 5.25 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్, ఆన్‌డ్రాయిడ్ 4.3 జెల్లీబీన్, క్వాల్‌కామ్ 1.2 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1.5 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 8 ఎంపీ కెమెరా, 1.9 ఎంపీ హెచ్‌డీ ఫ్రంట్ కెమెరా, మల్టీ విండో వంటి ఫీచర్లతో గెలాక్సీ గ్రాండ్ 2 రూపుదిద్దుకుంది. లాట్ మొబైల్స్‌లో దీని ధర రూ.22,500. అలాగే రూ.1,000 విలువైన యాక్సెసరీస్ ఉచితం.
 మార్చికల్లా 100 స్టోర్లు..
 లాట్ ఔట్‌లెట్లలో గెలాక్సీ గ్రాండ్ 2ను బుక్ చేసుకున్న 1,000 మంది కస్టమర్ల సమక్షంలో ఫోన్ ఆవిష్కరణ జరిగింది. ఈ స్థాయిలో ఆవిష్కరణ జరగడం దేశంలో ప్రథమమని లాట్ మొబైల్స్ జీఎం విజయానంద్ తెలిపారు. 2012లో లాట్ తన ప్రస్థానాన్ని ప్రారంభించిందని, 80 స్టోర్లతో స్మార్ట్‌ఫోన్ల విక్రయ రంగంలో సుస్థిర వాటా సాధించామని చెప్పారు. మార్చికల్లా తమ స్టోర్ల సంఖ్యను 100కు చేరుస్తామని ఆయన పేర్కొన్నారు. స్టోర్లలో లైవ్ డెమోతోపాటు దేశంలో తొలిసారిగా స్మార్ట్ అడ్వైజర్, వర్చువల్ రియాలిటీ వంటి అప్లికేషన్లను వినియోగిస్తున్నట్టు చెప్పారు.

Advertisement
Advertisement