స్వల్ప నష్టాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్లు | Sakshi
Sakshi News home page

స్వల్ప నష్టాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్లు

Published Tue, Sep 20 2016 10:13 AM

Sensex down 72 pts in early trade on weak Asian cues

ముంబై: ఆసియా మార్కెట్ల  బలహీనతతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప నష్టాలతో మొదలయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 72 పాయింట్ల నష్టంతో 28,561 దగ్గర,  నిఫ్టీ 25 పాయింట్లు తగ్గి 8,781 వద్ద ట్రేడవుతోంది. అన్ని రంగాల సూచీలు  స్తబ్దుగానే ఉన్నాయి. ప్రధానంగా రియల్టీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌  సెక్టార్ లాభపడుతుండగా, ఎఫ్‌ఎంసీజీ, మెటల్స్‌, ఐటీ  రంగం నష్టాలను నమోదు చేస్తోంది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సెక్టార్ లో ప్రాఫిట్ బుకింగ్  కనిపిస్తోంది.  రాబోయే అమెరికా ఫెడ్, జపాన్ కేంద్ర బ్యాంక్  పాలసీ సమావేశాల నేపథ్యంలో మదుపర్లు  వేచి చూసి ధోరణిని అవలంబిస్తున్నారని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు.

అటు కరెన్సీమార్కెట్ లో 0.06 పైసల నష్టంతో 67.03 వద్ద ఉంది.ఎంసీఎక్స్ మార్కెట్ లో 10  గ్రా. పుత్తడి 66 రూపాయల లాభంతో 30, 969  దగ్గర ఉంది.
 

Advertisement
Advertisement