శోభా డే -సుష్మ ఓ సలహా.. రిటార్ట్ | Sakshi
Sakshi News home page

శోభా డే - సుష్మ ఓ సలహా.. రిటార్ట్

Published Sat, Jan 14 2017 12:49 PM

శోభా డే -సుష్మ ఓ సలహా.. రిటార్ట్ - Sakshi

న్యూఢిల్లీ:  ప్రముఖ రచయిత్రి  శోభాడే కి మరోసారి భంగపాటు తప్పలేదు. ఇటీవల రియో ​​ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు, పతకాలపై వ్యాఖ్యానించి విమర్శల పాలైన ఈమె  మరోసారి ట్విట్టర్ జనాల ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నుద్దేశించి చేసిన ట్విట్ పై  పలువురు  మండిపడుతున్నారు.  

నూతన సంవత్సరంగా సందర్బంగా... ట్వీట్స్ ఆపేసి..ప్రశాంతంగా ఉండాలనే  నిర్ణయం తీసుకోవాలంటూ  శుక్రవారం వివాదాస్పద సలహా ఇచ్చారు. దీంతో ట్విట్టరటీలు విరుచుకుపడ్డారు. నిజానికి ఆ పని చేయాల్సింది మీరేనంటూ పలువురు ట్విట్టర్ వినియోగదారులు  శోభాడేకి రిటార్ట్ ఇచ్చారు.  సుష్మ ట్విట్టర్లో చాలా చురుకుగా ఉంటూ.. విదేశాలలో ఇబ్బందులు పడుతున్న భారతీయులకు సహాయపడుతున్నారని  కొనియాడారు. ఇలాంటి సలహాలు సమాజానికి ఏమాత్రం పనికిరావంటూ ఫైర్ అయ్యారు. ఆమెనుచూసి  అసూయ పడకుండా...సుష్మను గౌరవించాలంటూ  మరికొంత మంది సూచించారు.

కాగా  కేంద్రమంత్రి సుష్మ ఇటీవల కిడ్నీ  ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్  తరువాత  కూడా ట్విట్టర్  చురుగ్గా ఉంటూ..విదేశాల్లో ఉంటున్న భారతీయుల వీసా సమస్యలపై స్పందిస్తున్నారు. అలాగే  అమెజాన్  డోర్మాట్ల  వ్యవహారంలో సీరియస్ గా స్పందించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement