వారసత్వ ఉద్యోగాలకు సింగరేణి ఓకే | Sakshi
Sakshi News home page

వారసత్వ ఉద్యోగాలకు సింగరేణి ఓకే

Published Fri, Nov 4 2016 9:13 PM

వారసత్వ ఉద్యోగాలకు సింగరేణి ఓకే

హైదరాబాద్: దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్) సంచలన నిర్ణయం తీసుకుంది. రెండు దశాబద్ధాలుగా నానుతోన్న వారసత్వం ఉద్యోగాల నియామకాలకు పచ్చజెండా ఊపింది. సింగరేణి బోర్డు  నుంచి ఆఫ్‌ డైరెక్టర్స్‌ శుక్రవారం జరిపిన సమావేశంలో వారసత్వ ఉద్యోగాలు పొందేందుకుగల అర్హతలు, ఇతర బెనిఫిట్స్‌పై కీలకనిర్ణయాలు తీసుకున్నారు.

సింగరేణిలో ప్రస్తుతం పనిచేస్తున్నవారిలో 48  నుంచి 58 సంవత్సరాల వయస్సుగల కార్మికులు రిటైర్మెంట్ తీసుకున్న పక్షంలో.. ఆ ఉద్యోగాలను వారి కొడుకులు, తమ్ముళ్లు లేదా అల్లుళ్లకు అప్పగిం 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలని హైదరాబాద్‌ సింగరేణి భవన్‌లో సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ అధ్యక్షతన శుక్రవారం జరగనున్న బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 1998లో పక్కనబెట్టిన వారసత్వ ఉద్యోగాల కల్పన చట్టం–1981ని పునరుద్ధరించడం ద్వారా న్యాయపరంగా సమస్యలు రావని అభిప్రాయపడిన తర్వాతే బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సింగరేణి వర్గాలు తెలిపాయి.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాలమేరకు సింగరేణి కాలరీస్ కంపెనీలో వారసత్వ ఉద్యోగాలకు అంగీకారం తెలిపామని, ఎంతోకాలంగా కార్మికులు కోరుతోన్న ఈ అంశంపై శుక్రవారం జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని సింగరేణి చైర్మన్, సీఎండీ ఎన్. శ్రీధర్ మీడికాకు తెలిపారు.

బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం..

  • సింగరేణిలో ప్రస్తుతం పనిచేస్తోన్న కార్మికుల్లో దసరాకు, అంటే 2016 అక్టోబర్ 11 నాటికి 48 నుంచి 59 సంవత్సరాల వయసు మధ్య గలవారు ఈ వారసత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
  • ఉద్యోగికి సంబంధించి కొడుకు లేదా అల్లుడు లేదా తమ్ముడు వారసత్వ ఉద్యోగం పొందేందుకు అర్హులు. వారి వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.


చారిత్రక నిర్ణయం
ఎన్నో ఏళ్లుగా వారసత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోన్న సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రకమని సంస్థ సీఎండీ శ్రీధర్ అభిప్రాయపడ్డారు. దీంతో అనేక మంది కార్మికుల పిల్లలు కొత్తగా ఉద్యోగాలు పొందే అవకాశం లభిస్తుందని, తద్వారా సింగరేణిలో యువ ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందని, బంగారు తెలంగాణ నిర్మాణంలో సంస్థ భాగస్వామ్యం మరింత పెరుగుందని సీఎండీ ప్రకటనలో పేర్కొన్నారు. వారసత్వ నియామకాలతోపాటు మణుగూరు ఓపెన్ కాస్ట్ లో ఓబీ తొలగింపు అనుమతి, బుల్ డోజర్ల కొనుగోళ్లు, హైవాల్ మైనింగ్, సత్తుపల్లి వాషరీల ఏర్పాటు తదితర అంశాలను కూడా బోర్డు చర్చించింది.

Advertisement
Advertisement