దక్షిణకొరియా అసెంబ్లీ సంచలన నిర్ణయం | Sakshi
Sakshi News home page

దక్షిణకొరియా అసెంబ్లీ సంచలన నిర్ణయం

Published Fri, Dec 9 2016 1:38 PM

దక్షిణకొరియా అసెంబ్లీ సంచలన నిర్ణయం

సియోల్‌: అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దక్షిణకొరియా అధ్యక్షురాలు పార్క్‌ గియున్‌ హై అభిశంసనకు గురయ్యారు. శుక్రవారం దక్షిణ కొరియా జాతీయ అసెంబ్లీలో ఆమెపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం ఆమోదం పొందింది.

ఓ కుంభకోణంలో పార్క్‌ గియున్‌కు ప్రమేయముందని ఆరోపణలు రావడంతో దక్షిణకొరియాలో తీవ్ర ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో జాతీయ అసెంబ్లీలో ఆమెపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. పార్క్‌ గియున్‌కు గల అధికారాలన్నింటినీ తొలగించి ప్రధాన మంత్రికి బదిలీ చేస్తూ జాతీయ అసెంబ్లీలో నిర్ణయించారు. కాగా పదవి నుంచి పార్క్‌ను పూర్తిగా తొలగించాలా వద్దా అనే విషయాన్ని రాజ్యంగ కోర్టు నిర్ణయించనుంది. అప్పటి వరకు ఆమె పదవిలో కొనసాగుతారు.

Advertisement
Advertisement