Sakshi News home page

తైన్హె–3.. సూపర్‌ డూపర్‌ కంప్యూటర్‌

Published Mon, Feb 20 2017 10:54 PM

తైన్హె–3.. సూపర్‌ డూపర్‌ కంప్యూటర్‌

బీజింగ్‌: ఒకటి పక్కన 18 సున్నాలు పెడితే ఆ సంఖ్య ఎంతో చెప్పడానికే మనకు కొంత సమయం పడుతుంది. అలాంటిది ఒక సెకన్లో అన్ని లెక్కలను చేసేస్తే.. సూపర్‌ డూపర్‌ అనక తప్పుతుందా! ఇదంతా ఎందుకంటే.. తైన్హె–3 పేరుతో చైనా ఓ కంప్యూటర్‌ను తయారు చేస్తుంది. ఇప్పటిదాకా అత్యంత వేగవంతమైన కంప్యూటర్‌ను మనం సూపర్‌ కంప్యూటర్‌గా పిలుచుకుంటున్నాం. మరి ఆ సూపర్‌ కంప్యూటర్‌ కంటే పదిరెట్లు వేగంగా లెక్కలు చేస్తుందనే తైన్హె–3 కంప్యూటర్‌ను సూపర్‌ డూపర్‌ కంప్యూటర్‌ అని పిలుస్తున్నారు.

అత్యంత శక్తిమంతంగా రూపొందిస్తున్న ఈ కంప్యూటర్‌ను చైనా ఈ ఏడాదిలోనే అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటిదాకా అత్యంత వేగవంతమైన కంప్యూటర్‌గా చెబుతున్న సన్‌వే తైహులిట్‌ కూడా చైనానే తయారు చేసింది. పైగా ఇది చైనా రూపొందించిన మొట్టమొదటి సూపర్‌ కంప్యూటర్‌. ఒక సెకన్లో 125 క్వాడ్రిలియన్‌ (ఒకటి పక్కన 15 సున్నాలు) లెక్కలను చేయడం దీని కెపాసిటీ. అయితే తైన్హె–3 దీనికి పదింతల స్పీడ్‌తో పనిచేస్తుందని చైనాకు చెందిన నేషనల్‌ సూపర్‌ కంప్యూటర్‌ తైంజిన్‌ సెంటర్‌ డైరెక్టర్‌ మెంగ్‌ జియాంగ్‌ఫీ తెలిపారు.

Advertisement

What’s your opinion

Advertisement