సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీ హవా | Sakshi
Sakshi News home page

సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీ హవా

Published Fri, Feb 21 2014 10:51 AM

సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీ హవా - Sakshi

* తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభంజనం
* ఇండియూ టుడే/సీఓటర్ సర్వే స్పష్టీకరణ
* సీమాంధ్రలో వై ఎస్సార్‌సీపీకి 18 ఎంపీ సీట్లు
* తెలంగాణలో 14 సీట్లు టీఆర్‌ఎస్‌వే..
న్యూఢిల్లీ: ‘ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌కు కంచు కోట అనేది ఇక చరిత్రకే పరిమితం కానుంది. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్), సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించనున్నారుు..’ అని ఇండియూ టు డే గ్రూపు/ సీఓటర్ తాజా సర్వే తేల్చింది. తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన నేపథ్యంలో.. అసెంబ్లీ ఎన్నికలు సైతం జరగనున్న ఈ ప్రాంతంలోని ఓటర్ల మనోగతంపై ఈ సర్వే నిర్వహించారు. దీని ప్రకారం.. ఈ ప్రాంతంలో జాతీయ పార్టీలు వెనుకబడిపోయి తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్‌ల్లో మాదిరి ప్రాంతీయ పార్టీలు ముందంజలో నిలువనున్నాయి.
 
సీమాంధ్ర ప్రాంతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలమైన రాజకీయ శక్తిగా అవతరించనుంది. 25 లోక్‌సభా స్థానాలకు గాను ఆ పార్టీ 18 చోట్ల విజయదుందుభి మోగించనుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సమైక్యాంధ్రప్రదేశ్ ప్రజల్లో అధికశాతం మంది ఇప్పటికీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డే తమకు ఇష్టమైన ముఖ్యమంత్రి అని చెప్పడం. వైఎస్ జీవించి ఉంటే తెలంగాణ ఏర్పడేది కాదని క్షేత్రస్థారుులో ప్రజలు భావిస్తుండటమే ఇందుకు కారణం కావచ్చు. సీమాంధ్రలో కంటే తెలంగాణ ప్రాంతంలో ఆయనకు ఎక్కువ ప్రజాదరణ ఉండటం మరింత ఆసక్తి కలిగించే అంశం. ఇక తెలంగాణలో కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని టీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తు లేకుండానే 17 సీట్లకు గాను 14 సీట్లలో విజయం సాధించనుంది.

Advertisement
Advertisement