Sakshi News home page

రాత్ కీ బండీ..

Published Thu, Aug 14 2014 1:39 AM

రాత్ కీ బండీ..

ఆ బండి దగ్గరకు వెళ్లాక వేడి వేడి టిఫిన్ల పరిమళాలు ఎటువంటి కాలుష్యానికి లోనవకుండా నా ముక్కుపుటాలను చేరారుు. విచిత్రమేమిటంటే... అప్పటికే ఆ బండి దగ్గర నాలాంటి లేట్‌నైట్ జీవులు అనుకుంటా... బోలెడంత మంది గుమికూడారు.
 
 సిటీలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకానే కాదు... 24 గంటలూ పనిచేసే కంపెనీలు అనేకం వచ్చేశారుు. థ్యాంక్స్ టు ఐటీ రెవల్యూషన్. హైదరాబాద్‌కి రాత్రి జీవితాన్నిచ్చినందుకు. రామ్ బండి ని పరిచయం చేసినందుకు. కాల్ సెంటర్స్, బీపీవో... తదితర ఉద్యోగాలు చేసేవారు తెలతెల వారుతుండగా విధులకు వీడ్కోలు పలుకుతూ ఇంటి దారి పడతారు. వెళుతున్నపుడు వేడివేడిగా ఏమైనా తింటే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటి వారి కోసం తెల్లవారుఝామున 3 గంటల నుంచి ఉదయం 8 గంటల దాకా మాత్రమే పనిచేసే రామ్‌కీ బండి ఓ స్పెషల్ స్ట్రీట్ ఫుడ్ జాయింట్.
 
 రాత్రి విధులు అలవాటే కాబట్టి... తెల్లవారుఝామున 5 గంటల ప్రాంతంలో ఫుడ్ కోసం నాంపల్లిలోని, మొజంజాహీ మార్కెట్ సమీపంలో, కరాచీ బేకరీ ఎదురుగా ఉన్న రామ్ కీ బండి దగ్గర ఆగాం. విపరీతమైన రద్దీతో ఉండే  ఏరియా ఆ సమయంలో ఎంత ప్రశాంతంగా ఉందంటే... ఆ బండి దగ్గరకు వెళ్లాక వేడి వేడి టిఫిన్ల పరిమళాలు ఎటువంటి కాలుష్యానికి లోనవకుండా నా ముక్కుపుటాలను చేరారుు. విచిత్రమేమిటంటే... అప్పటికే ఆ బండి దగ్గర నాలాంటి లేట్‌నైట్ జీవులు అనుకుంటా... బోలెడంత మంది గుమికూడారు. సిటీలో పాపులర్ రెస్టారెంట్స్, ఫుడ్ జాయింట్స్ ఉన్నా... రామ్‌కీ బండికి అంత పేరెందుకు వచ్చిందో... అక్కడ దోసె రుచి చూశాక నాకూ తెలిసింది.
 
అక్కడి గుంపులో కొందరేమో పెద్ద గొంతుతో మసాలా దోసె, ఇడ్లీ అంటూ ఆర్డర్లు ఇస్తుంటే మరికొందరు నుంచునే తింటూ ముచ్చట్లతో పాటు ఫుడ్‌ని ఆస్వాదిస్తున్నారు. చీజ్ దోసెలు, ఇడ్లీలు, ఉప్మా కమ్ దోసె... వంటివి అక్కడ బాగా ఫేమస్ అని నాకు వాటి డిమాండ్ చూశాక అర్థమైంది. చుట్టూ ఉన్న పరిసరాలు అంత గొప్పగా లేకపోయినా... చీజ్ దోసెను నాకు శుభ్రమైన ప్లేట్లలో సర్వ్ చేస్తూ... ‘క్వాలిటీ, టేస్ట్... ఈ రెండింటికే ప్రాధాన్యమిస్తూ బండి నడిపిస్తున్నా’ అన్నాడు రామ్. మా ఫ్రెండ్సందరం అక్కడున్న అరడజను రకాల దోసెలు తిన్నాం. చాలా టేస్టీగా ఉన్నారుు. వాటిలో కలుపుతున్న ముడిసరుకు నాణ్యమైంది. చట్నీలు కూడా దోసెలకు చాలా చక్కగా నప్పాయి. ఇకపై మొజంజాహీ మార్కెట్ వైపు వెళితే... రామ్‌కీ బండి దగ్గర నా బైక్ ఆటోమేటిగ్గా ఆగిపోతుంది.
 -  శిరీష చల్లపల్లి

Advertisement

What’s your opinion

Advertisement