అస్త్రాలూ– శస్త్రాలూ | Sakshi
Sakshi News home page

అస్త్రాలూ– శస్త్రాలూ

Published Tue, Jan 3 2017 1:27 AM

అస్త్రాలూ– శస్త్రాలూ

అస్త్రాలూ– శస్త్రాలూ

అగ్ని–5 క్షిపణి ప్రయోగం మరొకసారి విజయవం తమయింది. ఈ క్షిపణిని ప్రయోగిస్తే ఇది ఐదువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని తాకి దాడి చేయగలదట. మానవ జాతి, అస్త్ర శస్త్రాల నిర్మా ణంలో కూడా  సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి అనూహ్యమైన ప్రగతిని సాధిస్తున్నది.

మూడో ప్రపంచ యుద్ధం రాలేదు కానీ వస్తే మానవాళిని సర్వనాశనం చేసేందుకు సరిపడే అణ్వాయుధ శక్తి ఈ రోజు ప్రపంచ దేశాలకు ఉంది. ఈ మారణాస్త్రాలు యావత్తు మానవాళిని చావుదెబ్బ తీసి  మానవ నాగరికతను సర్వ నాశనం చేయగలవు. మరో ప్రపంచ యుద్ధం రాకుండా మానవాళిని డెబ్భై ఏళ్ళుగా కాపాడుకొస్తున్నది ఆ భయమే!

పురాణ పురుషులు కొందరికి ఉన్నాయని చెబు తున్న అసాధారణమైన శక్తులు ఇప్పుడిప్పుడే ఆధునిక విజ్ఞానం ద్వారా మానవ జాతికి మళ్ళీ సంక్రమిస్తున్నట్టుగా కనిపి స్తుంది. విమానయానం, గ్రహాం తర యానం, దూర శ్రవణం, దూర దర్శనం లాంటి శక్తులు పురాణా లలో  కనిపిస్తాయి. మళ్ళీ అత్యాధునిక కాలంలో కనిపిస్తున్నాయి. అలాగే అస్త్రాలూ శస్త్రాలూ కూడా.

మన పురాణాలలో మహా వీరులు శస్త్రాలతో పాటు అస్త్రాలు కూడా వాడే వారు. ఈ అస్త్రాలు సామాన్య యోధులకు తెలియవు. ఈ ‘టెక్నాలజీ’ తెలిసిన వాళ్ళు జగదేకవీరులుగా ప్రసిద్ధి పొందేవారు. ఎన్ని రకాల అస్త్రాలు తెలిస్తే అంత గొప్ప. అస్త్రవిద్య అందరికీ అంత తేలికగా అబ్బే విద్య కాదు. దాన్ని నేర్చుకొనేందుకు అస్త్ర విద్యావేత్తలయిన విశిష్ట గురు వుల దగ్గర శిక్షణ అవసరం అయ్యేది. రామ లక్ష్మ ణులను విశ్వామిత్రుడు యాగ రక్షణ నెపంతో తీసుకు వెళ్ళింది వాళ్లకు ముందుముందు దుష్ట శిక్షణకు అవసరమయ్యే విలువైన అస్త్రాలన్నింటినీ నేర్పిం చటం కోసమే. భీష్ముడు పరశురాముడి దగ్గర అస్త్ర విద్యలు నేర్చుకొని ఓటమి ఎరగని వీరుడయ్యాడు.

అర్జునుడు వనవాస సమయంలో ప్రత్యేకంగా తపస్సు చేసి సాక్షాత్తూ శివుడి నుంచి పాశుపతాస్త్ర ప్రయోగం  నేర్చుకొన్నాడు. ఆ నాటి బ్రహ్మాస్త్రం శత్రువులను ముల్లో కాలలో ఎక్కడికి వెళ్ళినా వెంటాడి బంధించేది. సమ్మో హనాస్త్రం యుద్ధ భూమిలో అందరినీ ఒక్క పెట్టున మూర్ఛలో ముంచేసేది. వరుణాస్త్రం వానలతో ముం చెత్తేది. ఆగ్నేయాస్త్రం నిప్పులు కురిపించేది. బ్రహ్మ శిరో నామాస్త్రం గర్భస్థ శిశువులను కూడా కాల్చి వేసి వంశ నాశనం చేయగలిగేది. ఈ అస్త్రాలు భౌతికమైన ఆయు ధాలు కాదు. గరికపోచను శాస్త్ర విజ్ఞానం ఉపయో గించి మంత్రించితే అదే క్షిపణిగా, అస్త్రంగా మారేది.

అప్పుడయినా ఇప్పుడయినా అస్త్రాలూ శస్త్రాలు ఆత్మరక్షణకు తప్పనిసరే అయినా, సర్వ మానవ సంక్షే  మానికి నిజంగా ఉపకరించేవి వివేకమూ, సర్వ మానవ సౌభ్రాతృత్వం మాత్రమే అని చరిత్ర చెప్తున్నది.
– ఎం. మారుతి శాస్త్రి

Advertisement
Advertisement