ఘనంగా టీఆర్‌ఎస్‌-యూఎస్‌ఏ నేషనల్ కాన్ఫరెన్స్ | Sakshi
Sakshi News home page

ఘనంగా టీఆర్‌ఎస్‌-యూఎస్‌ఏ నేషనల్ కాన్ఫరెన్స్

Published Mon, May 15 2017 5:21 PM

ఘనంగా టీఆర్‌ఎస్‌-యూఎస్‌ఏ నేషనల్ కాన్ఫరెన్స్

కాలిఫోర్నియా(యూఎస్‌ఏ) :
కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో టీఆర్‌ఎస్‌-యూఎస్‌ఏ బే ఏరియా శాఖ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ యూఎస్‌ఏ రెండవ జాతీయ సదస్సును ఘనంగా నిర్వహించారు. అమరులకు నివాళులు అర్పించి, ప్రొ. జయశంకర్, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ విద్యాసాగర్ రావుకి శ్రద్ధాంజలి ఘటించారు. తెలంగాణ రాష్ట్ర గీతం ఆలపించి సభను ప్రారంభించారు.

స్థానిక టీఆర్‌ఎస్‌ యూఎస్‌ఏ నాయకులు పూర్ణ బైరి సభకు అధ్యక్షత వహించారు. ఎంపీ. కల్వకుంట్ల కవిత చేతుల మీదగా టీఆర్‌ఎస్‌-యూఎస్‌ఏ ప్రారంభై, రెండవ నేషనల్ కాన్ఫరెన్స్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని పూర్ణ బైరి అన్నారు. టీఆర్‌ఎస్‌-యూఎస్‌ఏ వ్యవస్థాపకులు మహేష్ తన్నీరు, టీఆర్‌ఎస్‌ ఎన్నారై విభాగాల కోర్డినేటర్ బిగాల మహేష్ గుప్త, నాగేందర్ మహీపతిలు, రజినీకాంత్ కూసానం, నవీన్ కానుగంటి రూపొందించిన టీఆర్‌ఎస్‌-యూఎస్‌ఏ లోగో, తక్కళ్లపల్లి అరవింద్ రూపొందించిన ఫేస్ బుక్ పేజీను ఆవిష్కరించారు. భారీగా హాజరైన సభికులను ఉద్దేశించి వ్యవస్థాపకులు తన్నీరు మహేష్ ప్రసంగించారు. ప్రభుత్వం అమలుపరుస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్‌-యూఎస్‌ఏ ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ కేసీఆర్‌ నాయకత్వంలో ప్రగతిబాటలో పురోగమిస్తూ, వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. అనంతరం గులాభి కండువా కప్పి పలువురు ఎన్నారైలను టీఆర్‌ఎస్‌ అమెరికా శాఖలోకి ఆహ్వానించారు.
 
టీఆర్‌ఎస్‌ ఎన్నారై కోఆర్డినేటర్ బీగాల మహేష్ గుప్త మాట్లాడుతూ.. ప్రస్తుతమున్న డెన్మార్క్, లండన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ ఎన్నారై శాఖలను వీలైనన్ని ఎక్కువ దేశాల్లో విస్తరించాల్సిన ఆవశ్యకత, సామాజిక మాధ్యమాల వినియోగం గురించి వివరించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నేతన్నలకు పూర్వ వైభవాన్ని తేవడానికి చేస్తున్న ప్రయత్నానికి సంఘీభావంగా కార్యకర్తలందరు చేనేత వస్త్రాలు ధరించి సభలో పాల్గొన్నారు.

ప్రభుత్వం అమలుపరుస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి వక్తలు చందు తాళ్ల, వెంగల్ జలగం, సక్రు నాయక్, బిందు చీడెల్ల, నరసింహ నగలవాంచ, మహేష్ పొగాకు, టోనీ జాన్, మోహన్ గోలి, కృష్ణ బొమ్మిడి తదితరులు ప్రసంగించారు. కేసీఆర్‌ నాయకత్వాన్ని, ప్రభుత్వం ప్రారంభించిన వివిధ పథకాలను అభినందిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాలను బలపరుస్తూ ఆమోదించారు. బే ఏరియా ప్రతినిధులు నవీన్ జలగం, రజనీకాంత్ కొసనం, భాస్కర్ మద్ది, అభిలాష్ రంగినేని, శ్రీనివాస్ పొన్నాల, శశి దొంతినేని, రుషికేశ్ రెడ్డి, యశ్వంత్, అజయ్ సాగి, మహేష్ తన్నీరు, మహేష్ బిగాలలు
సభ విజయవంతం చేయడంలో తమ వంతు కృషి చేశారు.
http://img.sakshi.net/images/cms/2017-05/51494849375_Unknown.jpg

Advertisement
Advertisement