Sakshi News home page
Advertisement

Top Stories

ప్రధాన వార్తలు

PAK VS NZ 5th T20: Full Stretch Dive From Tim Seifert During Batting
న్యూజిలాండ్‌ బ్యాటర్‌ భారీ విన్యాసం.. వైరల్‌ వీడియో

పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ మధ్య నిన్న (ఏప్రిల్‌ 27) జరిగిన టీ20 మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. న్యూజిలాండ్‌ బ్యాటర్ టిమ్‌ సిఫర్ట్‌ వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతిని ఆడేందుకు భారీ విన్యాసం చేశాడు. మొహమ్మద్‌ ఆమిర్‌ బౌలింగ్‌లో వైడ్‌గా వెళ్తున్న బంతిని ఆడేందుకు సీఫర్ట్‌ భారీ డైవ్‌ కొట్టాడు. సహజంగా ఇలాంటి విన్యాసాలను ఫీల్డింగ్‌ చేసేప్పుడు చూస్తాం. కానీ సీఫర్ట్‌ మాత్రం బ్యాటింగ్‌లో డైవింగ్‌ షాట్‌ ఆడే ప్రయత్నం చేసి హైలైటయ్యాడు. సీఫర్ట్‌ డైవిండ్‌ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో నిన్నటి నుంచి నెట్టింట చక్కర్లు కొడుతుంది. Full stretch dive from Tim Seifert during the batting. 😂👌 pic.twitter.com/fV5n0Mh0y7— Tanuj Singh (@ImTanujSingh) April 27, 2024 మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో పాక్‌ న్యూజిలాండ్‌ను 9 పరుగుల తేడాతో ఓడించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్‌ 19.2 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. పాక్‌ ఇన్నింగ్స్‌లో బాబర్‌ ఆజమ్‌ (69) అర్దసెంచరీతో రాణించగా.. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో డైవింగ్‌ షాట్‌ హీరో సీఫర్ట్‌ (52) మెరుపు అర్దశతకంతో ఆకట్టుకున్నాడు. కివీస్‌ ఇన్నింగ్స్‌లో సీఫర్ట్‌ మినహా ఎవరూ రాణించకపోవడంతో పర్యాటక జట్టుకు ఓటమి తప్పలేదు. పాక్‌ బౌలర్లలో షాహీన్‌ అఫ్రిది 4 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్‌ పతనాన్ని శాశించాడు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో పాక్‌.. మూడు, నాలుగు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌.. నిన్న జరిగిన ఆఖరి మ్యాచ్‌లో పాక్‌ గెలుపొందాయి.  

CM YS Jagan Full Speech At Tadipatri Public Meeting
బాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్రలేపడమే: సీఎం జగన్‌

సాక్షి, తాడిపత్రి: టీడీపీ అధినేత చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టినట్టేనని గుర్తు పెట్టుకోవాలన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. అలాగే, చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్రలేపినట్టేనని సీఎం జగన్‌ వ్యాఖ్యలు చేశారు.కాగా, సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడిపత్రి సభలో మాట్లాడుతూ.. ఎన్నికల యుద్ధానికి మీరు సిద్ధమేనా? తాడిపత్రి సిద్ధమేనా?. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేవి కాదు. ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్ల భవిష్యత​్‌ను నిర్ణయించే ఎన్నికలు. జెండాలు జతకట్టుకుని వారంతా వస్తున్నారు. చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టినట్టేనని గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపినట్టే. జగన్‌కు ఓటు వేస్తే.. పథకాలన్నీ కొనసాగింపు.పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే.. పథకాలకు ముగింపే. చంద్రబాబు సాధ్యం కానీ హామీలిస్తున్నారు.నా మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశాను. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావించాం. రూ.2.70 లక్షల కోట్లు నేరుగా మీ ఖాతాల్లో జమ చేశాం. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. 58 నెలల కాలంలో 2.31లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. పౌరసేవల్లో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం​. వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం. ప్రతీ గ్రామం, పట్టణంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. రైతు భరోసా కేంద్రం.. గ్రామాల్లోనే కనిపిస్తుంది. ఇంటి వద్దకే రేషన్‌ వస్తోంది. పెన్షన్లు నేరుగా మీ ఇంటి వద్దకే వస్తున్నాయి. మీ బిడ్డ పాలనలో ఇంటి వద్దకే వైద్య సేవలు అందుతున్నాయి. మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వమే వస్తే మీ జీవితాలు ఎంతగా బాగుపడతాయో ఊహించండి. నాడు-నేడుతో స్కూళ్ల రూపరేఖలను మార్చాం. టాప్‌ యూనివర్సిటీలతో మన డిగ్రీ కాలేజీలను అనుసంధానం చేశాం. ప్రభుత్వ స్కూల్స్‌లో హక్కుగా ఇంగ్లీష్‌ మీడియం చదువుతున్నారు. మరో 10, 15 ఏళ్లలో ఇలాంటి పాలనే ఉంటే ప్రజల జీవితాలు ఎంతగా బాగుపడతాయో ఊహించండి. గతంలో ఎప్పుడైనా మహిళా సాధికారత చూశారా?. చట్టం చేసి 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసి నామినేటెడ్‌ పదవులు ఇచ్చాం. గతంలో ఎప్పుడైనా 31 లక్షల ఇళ్ల పట్టాలు చూశారా?.రైతు భరోసా పథకాన్ని ఎప్పుడైనా చూశారా?.80 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల్లో సగం స్థానాలు కేటాయించాం. మోసాలు, కుట్రలను నమ్ముకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే ఒక్క స్కీమ్‌ అయినా ఉందా?. ముఖ్యమైన హామీలతో చంద్రబాబు సంతకం పెట్టి ఇదే కూటమి గతంలో ప్రజలను మోసం చేసింది.రుణమాఫీ అంటూ చంద్రబాబు రైతులను మోసం చేశారు. డ్వాక్రా రుణాల పేరుతోనూ చంద్రబాబు మోసం చేశాడు. ఒక్క రూపాయి కూడా డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదు.  ఆడపిల్ల పుట్టగానే బ్యాంకుల్లో రూ.25వేలు డిపాజిట్‌ చేస్తానన్న చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారా?. అర్హుందరికీ మూడు సెంట్ల స్థలం, పక్కా ఇళ్లు అన్న చంద్రబాబు ఎవరికైనా ఇచ్చారా?. ఇప్పుడు సూపర్ సిక్స్ హామీల పేరుతో మరో డ్రామా ఆడుతున్నారుసంక్షేమ పాలన కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలితాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి అనంతపురం ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణను అఖండ మెజారిటీతో గెలిపించాలిహామీలు నెరవేర్చి మీ బిడ్డ మీ ఆశీస్సులు కోరతున్నాడు. ప్రజలకు మంచి చేశాకే మీ బిడ్డ మీ దీవెనలు కోరుతున్నాడు అని కామెంట్స్‌ చేశారు. 

IPL 2024: RCB To Take On Gujarat And CSK Fight With SRH On Big Sunday
ఐపీఎల్‌లో ఇవాళ (Apr 28) రెండు మ్యాచ్‌లు.. రెండూ భారీ సమరాలే..!

ఐపీఎల్‌లో ఇవాళ (ఏప్రిల్‌ 28) రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం (3:30 గంటలకు) మ్యాచ్‌లో గుజరాత్‌, ఆర్సీబీ.. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌, సీఎస్‌కే జట్లు తలపడనున్నాయి. ఆదివారం కావడంతో ఐపీఎల్‌ ఇవాళ రెండూ భారీ మ్యాచ్‌లనే షెడ్యూల్‌ చేసింది.మధ్యాహ్నం మ్యాచ్‌ విషయానికొస్తే..పేపర్‌పై పటిష్టంగా కనిపించే ఆర్సీబీ.. అడపాదడపా ప్రదర్శనలతో నెట్టుకొస్తున్న గుజరాత్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌ గుజరాత్‌ హోం గ్రౌండ్‌ అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనుంది.పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండగా.. గుజరాత్‌ 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో ఏడో స్థానంలో నిలిచింది. గుజరాత్‌కు ఈ మ్యాచ్‌ చాలా కీలకంగా మారింది. ప్లే ఆఫ్స్‌ రేసులో నిలబడాలంటే గుజరాత్‌ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. మరోవైపు ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన ఆర్సీబీకి ఈ మ్యాచ్ నామమాత్రం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా ఆర్సీబీకి పెద్ద ఫరక్‌ పడదు.హెడ్‌ టు హెడ్‌ ఫైట్స్‌ విషయానికొస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు మూడు సందర్భాల్లో ఎదురెదురుపడగా.. గుజరాత్‌ 2, ఆర్సీబీ ఒక మ్యాచ్‌లో గెలుపొందాయి. తుది జట్లు (అంచనా)..గుజరాత్‌: వృద్ధిమాన్ సాహా (వికెట్‌కీపర్‌), శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్‌ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్‌), విల్ జాక్స్, రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్‌కీపర్‌), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, లోకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్రాత్రి మ్యాచ్‌ విషయానికొస్తే.. సీఎస్‌కే తమ సొంత మైదానమైన చెపాక్‌లో పటిష్టమైన సన్‌రైజర్స్‌ను ఢీకొట్టనుంది. ఈ సీజన్‌లోనే ఇది బిగ్‌ ఫైట్‌గా చెప్పవచ్చు. ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్‌ మూడో స్థానంలో.. సీఎస్‌కే ఆరో స్థానంలో ఉన్నాయి. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ చాలా కీలకంగా మారింది.హెడ్‌ టు హెడ్‌ రికార్డ్‌ విషయానికొస్తే.. ఐపీఎల్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు 20 మ్యాచ్‌ల్లో తలపడగా.. సీఎస్‌కే 14, సన్‌రైజర్స్‌ 6 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.తుది జట్లు (అంచనా)..సన్‌రైజర్స్‌: అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్, ఎయిడెన్ మార్క్రమ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్ [ఇంపాక్ట్‌ సబ్: టి నటరాజన్]సీఎస్‌కే: రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, ఎంఎస్‌ ధోని, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహ్మాన్, మతీషా పతిరణ [ఇంపాక్ట్‌ సబ్: శార్దూల్ ఠాకూర్]

Actor Sahil Khan Arrested In Mahadev Betting App Case
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్

మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్‌ని  ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇతడిని ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. అంతకుముందు సాహిల్ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ని బాంబే హైకోర్టు తిరస్కరించింది. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ బెట్టింగ్ కేసు ఏంటి? సాహిల్‌ని ఎందుకు అరెస్ట్ చేశారు?  బాలీవుడ్ నటుడిగా సాహిల్ ఖాన్ పరిచయమే. 'స్టైల్', 'ఎక్స్యూజ్ మీ' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఫిట్‌నెస్ ట్రైనర్‌, ఇన్ఫ్లూయెన్సర్‌గా చేస్తున్నాడు. కొన్నేళ్ల ముందు మహేదేవ్ బెట్టింగ్ యాప్‪‌ని ప్రమోట్ చేశాడు. అయితే ఈ యాప్ ద్వారా రూ.15,000 కోట్ల అవినీతి జరిగింది. దాదాపు 67 బెట్టింగ్ సైట్లు సృష్టించారు. ఈ విషయమై సామాజిక కార్యకర్త ప్రకాశ్ బంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2023 నవంబరులో మాతుంగ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా డిసెంబరులో దీన్ని ప్రమోట్ చేస్తున్న సాహిల్ ఖాన్‌కి నోటీసులు జారీ చేశారు.(ఇదీ చదవండి: కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్)అయితే విచారణకు హాజరు కాకుండా సాహిల్.. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టుని ఆశ్రయించాడు. సెలబ్రిటీగా తాను కేవలం ప్రమోట్ చేశానని చెప్పుకొచ్చాడు. యాప్‌లో జరిగే వాటితో తనకు సంబంధం లేదని పేర్కొన్నాడు. కానీ పోలీసులు మాత్రమే ఇతడిని బెట్టింగ్ యాప్ కో-ఓనర్ అని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు.అయితే ఈ బెట్టింగ్ యాప్ ద్వారా అవినీతి జరిగిన డబ్బంతా కూడా హవాలా ద్వారా విదేశాలకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. సాహిల్‌తో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలని కూడా పోలీసులు ఈ కేసులో విచారించే అవకాశాలు ఉన్నాయి.(ఇదీ చదవండి: ప్రముఖ దేవాలయంలో స్టార్ హీరోయిన్ సంయుక్త.. కారణం అదేనా?)

Guntur TDP MP Pemmasani Chandrasekhar said that he would remove the hand that hit him
నన్ను కొట్టిన వాడి చేయి తీసేస్తా..

సాక్షి, గుంటూరు: ‘కొట్టడం అనేది ఎగైనెస్ట్‌ ది లా... పొరపాటున ఎవడైనా చేస్తే ఏదో ఒక రోజు నాకు టైం వస్తుంది. కొట్టినవాడి చెయ్యి తీసేస్తా.. ఎవడైతే చేశాడో.. ఏదో ఒకరోజు ఐదేళ్లకో, పదేళ్లకో, పదిహేనేళ్లకో.. వాడు ఎంత చేస్తే అంతకు డబుల్‌ చేస్తా....’  ‘ఇదే అమెరికాలో అయితే కాల్చేస్తారు... ’ ‘వైఎస్సార్‌ సీపీ నాయకులు సద్దాం హుస్సేన్‌లా వ్యవహరిస్తున్నారు. సద్దాం హుస్సేన్‌ కూడా తన ఇష్టారీతిగా వ్యవహరించినందునే బంకర్‌లో దాగి ఉన్నా లాక్కొచ్చి కుక్కను కొట్టినట్లు కొట్టి చంపారు.’పై వ్యాఖ్యలు ఎవరో రౌడీనో, గుండానో, చదువుకోని వ్యక్తో చేసినవి కాదు. డాక్టర్‌ చదివి అమెరికాలో వ్యాపారాలు చేసి గుంటూరు తెలుగుదేశం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్‌ పలు సందర్భాలలో చేసినవి. రెండు రోజుల క్రితం ఒక పచ్చ మీడియా అధినేతతో జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక వేళ మీపై కేసులు పెడితే, కొడితే ఏం చేస్తారు అని ప్రశి్నస్తే తనను కొట్టడం చట్టానికి విరుద్దం అని చెబుతూనే తనను కొట్టిన వారిని మాత్రం చెయ్యి తీసేస్తానంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడటం గమనార్హం. దేశంలోనే అత్యంత ధనవంతుడిగా పార్లమెంట్‌ ఎన్నికల బరిలోకి దిగిన చంద్రశేఖర్‌ మొదటి నుంచి డబ్బుందన్న అహంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని సొంత పార్టీ నేతలే వాపోతున్నారు. చంద్రశేఖర్‌ అనాలోచితంగా చేస్తున్న వ్యాఖ్యలు పారీ్టకి చేటు తెస్తున్నాయని వారు అంటున్నారు.ఇప్పటికే ఆయన తీరుపై కాపు సామాజిక వర్గం నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఆయన గుంటూరు బరిలోకి దిగిన తర్వాత  ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క కాపు వర్గం నేతకు కూడా సీటు దక్కలేదు. అయినా పార్టీ కోసం పనిచేయడానికి వెళ్లిన వారికి ఛీత్కారాలే ఎదురయ్యాయి. తమ పారీ్టతో పాటు మిత్రపక్షాలలో ఉన్న కాపు నేతలు కూడా కూటమికి గుడ్‌బై చెప్పి వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నారు. ఇటీవల కాలంలో బీజేపీ ఇంటలెక్చువల్‌ సెల్‌ స్టేట్‌ కో–కనీ్వనర్‌ డాక్టర్‌ టి.వి.రావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందు సాంబశివరావు పార్టీని వీడారు. మరికొంత మంది పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు.  అమెరికాలో రూ.వందల కోట్లు సంపాదించి గుంటూరులో రాజకీయం చేయాలని డిసైడైన చంద్రశేఖర్‌ కనీసం నియోజకవర్గానికి ఏం చేస్తాడో కూడా చెప్పడం లేదు. తాను గెలిచిన తర్వాత అభివృద్ధి చేసి చూపిస్తానని చెబుతున్నాడు. 2014, 2019 ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్‌ టిక్కెట్‌ కోసం ప్రయత్నించిన చంద్రశేఖర్, అనుకోని పరిస్థితుల్లో 2024లో గుంటూరు పార్లమెంట్‌ నుంచి బరిలోకి దిగారు. గెలిస్తేనే ఇక్కడ ఉంటారని, ఓడిపోతే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోతారని తెలుగుదేశం నేతలు అభిప్రాయపడుతున్నారు. 2014, 2019లో చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన గల్లా జయదేవ్‌ను గెలిపిస్తే నియోజకవర్గానికి సేవ చేయకపోగా చివరి నాలుగు సంవత్సరాలు అసలు కనపడకుండా పోయాడు.వరసగా రెండుసార్లు గుంటూరు పార్లమెంట్‌ స్థానం నుంచి విజయం సాధించినా గల్లా   ప్రజలకు చేసిందేమి లేదనే చెప్పాలి. మొదటిసారి 2014లో ఇంటికో ఉద్యోగం వచ్చేలా చేస్తానని, 2019లో తన పరిశ్రమలను గుంటూరు చుట్టుపక్కల స్థాపించి ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీలు గుప్పించారు. హామీలు అమలు చేయకపోగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యాపారాలు చూసుకున్నారు. తన వద్ద డబ్బు ఉంది కాబట్టి డబ్బు కుమ్మరించి  గెలవగలననే ధీమా పెమ్మసాని వ్యక్తం చేస్తున్నారు. తనకు భారీ మెజారిటీ వస్తుందంటూ ప్రగల్భాలు పలుకుతుండటం, నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతుండటంతో అసలుకే ఎసరు వస్తుందన్న భయం తెలుగుదేశం నేతల్లో కనపడుతోంది.

Delhi Congress chief Arvinder Singh Lovely resigns over alliance with aap
కాంగ్రెస్‌కు షాక్‌.. ఢిల్లీ పీసీసీ చీఫ్‌ రాజీనామా

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు ఢిల్లీలో షాక్ తగిలింది.  ఢిల్లీ పీసీసీ అధ్యక్ష పదవికి అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా చేశారు. అవినీతి కేసులు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆప్‌ పార్టీతో పొత్తు పెట్టుకోవడంపై అసంతృప్తితో కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయాలకు భిన్నంగా పార్టీ అధిష్టానం ఆప్తో పెట్టుకోవడంపై నిరసనగా రాజీనామా చేశారు. అధిష్టానం తన అభిప్రాయాలను పట్టించుకోవడంలేదని కాంగ్రెస్‌కు రాసిన రాజీనామా లేఖ పేర్కొన్నారు. Arvinder Singh Lovely resigns from the position of Delhi Congress president."The Delhi Congress Unit was against an alliance with a Party which was formed on the sole basis of leveling false, fabricated and malafide corruption charges against the Congress Party. Despite that,… https://t.co/Y1A360fuut pic.twitter.com/hLP9RtnzUE— ANI (@ANI) April 28, 2024

దినేశ్‌ కార్తిక్‌ (PC: IPL/BCCI)
T20 WC: డీకే అవసరమా?.. వాళ్లిద్దరు బెస్ట్‌!

టీ20 ప్రపంచకప్‌-2024 నేపథ్యంలో జట్ల ప్రకటనకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి మే 1ని డెడ్‌లైన్‌గా విధించింది. ఆలోపు మెగా ఈవెంట్లో పాల్గొనే ఆటగాళ్ల ఎంపికను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ఇప్పటికే జట్టు ఎంపికపై చర్చలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌, ప్రపంచకప్‌ విజేత యువరాజ్‌ సింగ్‌.. మెగా టోర్నీలో ఆడాల్సిన భారత వికెట్‌ కీపర్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.పోటీలో ఆ నలుగురు!కాగా ప్రపంచకప్‌ జట్టులో బెర్తు కోసం రిషభ్‌ పంత్‌, సంజూ శాంసన్‌, కేఎల్‌ రాహుల్‌, దినేశ్‌ కార్తిక్‌ మధ్య పోటీ నెలకొంది. ఈ నలుగురిలో డీకే ఐపీఎల్‌-2024లో ఆర్సీబీకి ఆడుతూ ఫినిషర్‌గా రాణిస్తున్నాడు.ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లలో ‍కలిపి 195.52 స్ట్రైక్‌రేటుతో 262 పరుగులు చేశాడు. మరోవైపు.. ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ దాదాపు 14 నెలల విరామం తర్వాత కాంపిటేటివ్‌ క్రికెట్‌లో అడుగుపెట్టినా.. ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చేశాడు.ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో మూడు హాఫ్‌ సెంచరీల సాయంతో 342 పరుగులు చేశాడు. ఇక సంజూ శాంసన్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌గా రాణిస్తూ.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గానూ రాణిస్తున్నాడు. ఇప్పటి దాకా 385 రన్స్‌తో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.డీకే అవసరమా?ఈ లిస్టులో సంజూ తర్వాత కేఎల్‌ రాహుల్‌ 378 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో యువీ ఐసీసీతో మాట్లాడుతూ.. ‘‘డీకే ప్రస్తుతం బాగానే బ్యాటింగ్‌ చేస్తున్నాడు. కానీ గతసారి(2022) టీ20 వరల్డ్‌కప్‌లో అతడు రాణించలేకపోయాడు.కాబట్టి ఈసారి జట్టుకు ఎంపిక చేసినా అతడికి తుదిజట్టులో చోటు దక్కకపోవచ్చు. నిజానికి రిషభ్‌ పంత్‌, సంజూ శాంసన్‌ రూపంలో ఇద్దరు యువ ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. 

Watch Live AP CM YS Jagan Public Meeting At Tadipatri
Watch Live: తాడిపత్రిలో సీఎం జగన్ బహిరంగ సభ

Watch Live: తాడిపత్రిలో సీఎం జగన్ బహిరంగ సభ 

కీలక మ్యాచ్‌లో పాక్‌ గెలుపు
Pak vs NZ: చావో రేవో.. గట్టెక్కిన పాకిస్తాన్‌! ఆఖరికి..

న్యూజిలాండ్‌తో ఆఖరి టీ20లో పాకిస్తాన్‌ గట్టెక్కింది. తొమ్మిది పరుగుల స్వల్ప తేడాతో గెలుపొంది సిరీస్‌ను సమం చేసుకుంది. కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం కివీస్‌ జట్టు పాక్‌ పర్యటనకు వెళ్లింది.బాబర్‌ ఆజం కెప్టెన్‌గా తిరిగి పగ్గాలు చేపట్టిన తర్వాత పాకిస్తాన్‌కు ఇదే తొలి సిరీస్‌. అది కూడా సొంతగడ్డపై జరుగుతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ క్రమంలో తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో ఆతిథ్య పాక్ విజయం సాధించింది. ఆ మరుసటి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసిన కివీస్‌.. నాలుగో టీ20లో 4 పరుగుల తేడాతో గెలిచి షాకిచ్చింది.  ఈ నేపథ్యంలో ఆతిథ్య జట్టు 1-2తో వెనుకబడింది. కివీస్‌ ద్వితీయ శ్రేణి జట్టు చేతిలో వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోవడంతో బాబర్‌ ఆజం బృందంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో చావోరేవో తేల్చుకోవాల్సిన ఆఖరి టీ20లో పాక్‌ గెలుపొందింది. తద్వారా సిరీస్‌ను 2-2తో సమం చేయగలిగింది.లాహోర్‌లో టాస్‌ ఓడిన పాక్‌.. న్యూజిలాండ్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసింది. బాబర్ ఆజం(44 బంతుల్లో 69), ఉస్మాన్‌ ఖాన్‌(24 బంతుల్లో 31), ఫఖర్‌ జమాన్‌(33 బంతుల్లో 43),  షాబాద్‌ ఖాన్‌(5 బంతుల్లో 15 నాటౌట్‌) రాణించారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్‌ ఐదు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కివీస్‌ తడబడింది. ఓపెనర్‌ టిమ్‌ సెఫార్ట్‌ (33 బంతుల్లో 52), జోష్‌ క్లార్క్‌సన్‌(26 బంతుల్లో 38 నాటౌట్‌) మాత్రమే మెరుగ్గా ఆడారు.మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో 19.2 ఓవర్లలో 169 పరుగులకే ఆలౌట్‌ అయింది. దీంతో తొమ్మిది పరుగుల తేడాతో పాక్‌ విజయం సాధించింది. నాలుగు వికెట్లతో రాణించిన షాహిన్‌ ఆఫ్రిదికి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డుతో పాటు.. ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు కూడా దక్కింది.  Scenes in Lahore following the fifth T20I as the series is squared 🏆🤝#PAKvNZ | #AaTenuMatchDikhawan pic.twitter.com/pBm4SmQi7j— Pakistan Cricket (@TheRealPCB) April 27, 2024

తాజా వార్తలు

Advertisement
Advertisement
Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all
Advertisement
Advertisement
Advertisement