Sakshi News home page
Advertisement

Top Stories

ప్రధాన వార్తలు

Delhi Police Case Registered Over Amit Shah Fake Video
ఎన్నికల వేళ కలకలం.. సోషల్‌ మీడియాలో అమిత్‌ షా ఫేక్‌ వీడియో!

సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు సంబంధించిన ఫేక్‌ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించిన కామెంట్స్‌ ఉన్నాయి. దీంతో.. హోం మంత్రిత్వ శాఖ, బీజేపీల ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. దేశంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేయడం గురించి అమిత్ షా కామెంట్స్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్‌ షా మాట్లాడినట్టుగా ఉంది. అయితే, అసలు వీడియోలో తెలంగాణలో ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను తొలగించాలని మాత్రమే అమిత్ షా మాట్లాడినట్టు బీజేపీ స్పష్టం చేసింది. అలాగే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయడంపై అమిత్ షా ఏమీ మాట్లాడలేదని బీజేపీ తెలిపింది. .@INCTelangana is spreading an edited video, which is completely fake and has the potential to cause large scale violence.Home Minister Amit Shah spoke about removing the unconstitutional reservation given to Muslims, on the basis of religion, after reducing share of SCs/STs and… pic.twitter.com/5plMsEHCe3— Amit Malviya (मोदी का परिवार) (@amitmalviya) April 27, 2024 ఇక, వీడియోపై కాంగ్రెస్‌ స్పందించింది. రిజర్వేషన్‌ను అంతం చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోందని పేర్కొంటూ కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ల అధికారిక ఖాతాలతో సహా పలు సోషల్ మీడియా ఖాతాల్లో ఆ వీడియో షేర్ చేశారు. దీంతో బీజేపీ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వీడియోను పూర్తిగా ఎడిట్ చేశారని పిటిషన్‌లో పేర్కొంది. ఈ క్రమంలో దీనిపై కేసు నమోదు చేసినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు.ఈ వీడియోపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ ఫేక్‌ వీడియోపై బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవీయా ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా మాలవీయా.. కాంగ్రెస్ పార్టీ ఈ నకిలీ వీడియోను వ్యాప్తి చేస్తోంది. చట్టపరమైన చర్యలకు కాంగ్రెస్‌ నేతలు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఫేక్, ఎడిట్ చేసిన వీడియోలను ప్రచారం చేయడం సరికాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

IPL 2024 47th Match: KKR Take On Delhi Capitals In Home Ground
ఐపీఎల్‌లో నేటి (Apr 29) మ్యాచ్‌.. కేకేఆర్‌ను ఢీకొట్టనున్న ఢిల్లీ

ఐపీఎల్‌ 2024లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 29) జరుగబోయే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కేకేఆర్‌ను ఢీకొట్టనుంది. కేకేఆర్‌ హోం గ్రౌండ్‌ అయిన ఈడెన్‌ గార్డెన్స్‌లో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ సీజన్‌లో కేకేఆర్‌ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. ఇప్పుడిప్పుడే విజయాల బాటపట్టిన ఢిల్లీ 10 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో ఆరో స్థానంలో నిలిచింది. ఐపీఎల్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు 32 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. కేకేఆర్‌ 17, ఢిల్లీ 15 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్‌ అత్యంత కీలకంగా మారింది. కేకేఆర్‌ గత మ్యాచ్‌లో అతి భారీ స్కోర్‌ (261/6) చేసి కూడా పంజాబ్‌ చేతిలో భంగపడగా.. ఢిల్లీ తమ చివరి మ్యాచ్‌ల్లో నాలుగింట గెలిచి కేకేఆర్‌ కంటే ఎక్కువ ఉత్సాహంగా ఉంది. ఇరు జట్లు ఇదే సీజన్‌లో తలపడిన సందర్భంలో కేకేఆర్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోర్‌ నమోదు చేసింది. ఏప్రిల్‌3న విశాఖ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల అతి భారీ స్కోర్‌ చేసింది. భారీ లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ 166 పరుగులకే కుప్పకూలి 106 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో విధ్వంసకర ఆటగాడు, ఢిల్లీ ఓపెనర్‌ జేక్‌ ఫ్రేసర్‌పై అందరి కళ్లు ఉన్నాయి. ఫ్రేసర్‌ ముంబైతో ఆడిన గత మ్యాచ్‌లో మ్యాడ్‌ మ్యాన్‌లా రెచ్చిపోయి 27 బంతుల్లో 84 పరుగులు చేశాడు.తుది జట్లు (అంచనా)..కోల్‌కతా నైట్ రైడర్స్: సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, దుష్మంత చమీర, వరుణ్ చక్రవర్తి, వైభవ్‌ అరోరా (ఇంపాక్ట్‌ ప్లేయర్‌)ఢిల్లీ: జేక్ ఫ్రేసర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, కుమార్ కుషాగ్రా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్ట్జే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, రసిఖ్‌ సలాం​ (ఇంపాక్ట్‌ ప్లేయర్‌)

Banks will remain closed on THESE days in May 2024
బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్‌.. మే నెలలో 12 రోజులు బంద్‌!

Bank Holidays in May 2024: బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్యమైన సమచారం ఇది. మే నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. దేశవ్యాప్తంగా మే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు వచ్చాయి.దేశవ్యాప్తంగా బ్యాంకులకు మే నెలలో మొత్తం 12 రోజులు సెలవులు ఉండగా వీటిలో రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలతోపాటు పండుగలు, ప్రత్యేక సందర్భాలు కలిసి ఉన్నాయి. ఇవి రాష్ట్రాలను బట్టి మారే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారు ఏదో ఒక పని కోసం బ్యాంకులకు వెళ్లాల్సి వస్తుంది. ఆన్‌లైన్ లో ఎన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా కొన్ని పనులు బ్యాంకులకు వెళ్లి చేయాల్సి ఉంటుంది. అటువంటివారి కోసం బ్యాంకు సెలవుల సమాచారాన్ని ఇక్కడ ఇస్తున్నాం.మే నెలలో బ్యాంకు సెలవులు ఇవే..మే 1: మహారాష్ట్ర దినోత్సవం/ మే డే (కార్మిక దినోత్సవం) మే 5: ఆదివారం.మే 8: రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో బ్యాంకుల బంద్మే 10: బసవ జయంతి/ అక్షయ తృతీయమే 11: రెండో శనివారంమే 12: ఆదివారం.మే 16: సిక్కిం రాష్ట్ర దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవుమే 19: ఆదివారం.మే 20: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా బేలాపూర్, ముంబైలో బ్యాంకుల  మూతమే 23: బుద్ధ పూర్ణిమ మే 25: నాలుగో శనివారం. మే 26: ఆదివారం.

Bigg Boss 7 Telugu Priyanka Jain Boyfriend Buys Land In Hyderabad
హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న 'బిగ్ బాస్' ప్రియాంక

బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్‌తో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అంతకు ముందు పలు సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. ప్రస్తుతం షోలు, యూట్యూబ్ వీడియోలు చేస్తూ బిజీగా ఉంది. తన బాయ్ ఫ్రెండ్‌తో హైదరాబాద్‌లోనే కలిసి ఉంటున్న ప్రియాంక ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పింది. తాము ఇక్కడ భూమి కొనుగోలు చేసినట్లు శుభవార్త చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకుంటా.. ఆ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్)ప్రస్తుతం హైదరాబాద్‌లోని అద్దె ఫ్లాట్‌లో ఉంటున్న ప్రియాంక-శివ్.. తొలుత కొత్త ఫ్లాట్ తీసుకోవాలని అనుకున్నారు. టోకెన్ అమౌంట్ కూడా ఇచ్చేశారు. కానీ ఫ్లాట్ తీసుకోవడం తనకు ఇష్టం లేదని, ల్యాండ్ కొని ఇల్లు కట్టుకుంటే వచ్చే మజా వేరని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శివ్ అసలు విషయం చెప్పాడు. జనవరి నుంచి ల్యాండ్ కోసం తిరుగుతుండగా ఎప్పుడో ఓ సమస్య వచ్చేదని ప్రియాంక చెప్పుకొచ్చింది.ల్యాండ్ బాగుంటే రేటు నచ్చడం లేదని, అన్ని బాగుంటే పేపర్స్ సరిగా ఉండట్లేదని ప్రియాంక-శివ్ చెప్పారు. ఏప్రిల్ 10న ల్యాండ్ ఓకే చేసి, 23వ తేదీని రిజిస్టర్ చేసినట్లు చెప్పారు. ఆ విజువల్స్ కూడా చూపించారు. అయితే హైదరాబాద్‌లో ల్యాండ్ కొనడం అంత ఈజీ కాదని చెప్పాడు. మొత్తానికి తన కల నెరవేరిందని శివ్ చెప్పగా.. ప్రియాంక ఫుల్ హ్యాపీగా కనిపించింది. ప్రస్తుతానితి ముహుర్తాలు లేవని, త్వరలో ఇంటి అప్డేట్స్ చెబుతామని ప్రియాంక-శివ్ చెప్పారు.(ఇదీ చదవండి:కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్ ) 

CID Ready for Fayaz DNA test
Neha Hiremath murder: నేహా హత్య కేసు నిందితునికి డీఎన్‌ఏ పరీక్ష

హుబ్లీ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విద్యార్థిని నేహా హిరేమఠ హత్య కేసు నిందితుడు ఫయాజ్‌ రక్త నమూనాను సీఐడీ దర్యాప్తు అధికారులు న్యాయమూర్తి సమక్షంలో సేకరించారు. నిందితునిపై మరింత దర్యాప్తు, అతని డీఎన్‌ఏ పరీక్ష చేయడానికి అనుమతి కోరి సీఐడీ అధికారులు హుబ్లీ 1వ అదనపు సెషన్స్‌ కోర్టులో అర్జీ వేశారు. ఈ నేపథ్యంలో జడ్జి సమక్షంలో వైద్యులు ఫయాజ్‌ రక్త నమూనాలను సేకరించారు. హత్య జరిగిన స్థలం, హత్యకు వాడిన చాకుపై రెండు రక్తపు గ్రూప్‌లను కనుగొన్నారు. ఒక రక్త గ్రూప్‌ నేహాది అయితే, మరొకటి ఫయాజ్‌ది కావచ్చని, కత్తితో పొడిచేటప్పుడు అతనికి స్వల్ప గాయమై ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఐడీ దర్యాప్తు అధికారులు ఫయాజ్‌ డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించడానికి చర్యలు తీసుకున్నారు. కాగా ఫయాజ్‌ను సీఐడీ బృందం 6 రోజుల కస్టడీకి తీసుకున్న సంగతి విదితమే. సోమవారంతో కస్టడీ గడువు ముగియనుంది. అతన్ని మరింతగా విచారించడానికి కస్టడీ గడువును పొడిగించాలని సీఐడీ అధికారులు కోర్టును కోరే అవకాశం ఉంది.

Daily Horoscope Rasi Phalalu April 29-04-2024 Telugu
Horoscope Today: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.పంచమి ఉ.5.37 వరకు, తదుపరి షష్ఠి తె.4.27 వరకు (తెల్లవారితే మంగళవారం), నక్షత్రం: పూర్వాషాఢ రా.2.28 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: ప.12.22 నుండి 1.54 వరకు, దుర్ముహూర్తం: ప.12.23 నుండి 1.11 వరకు, తదుపరి ప.2.56 నుండి 3.44 వరకు, అమృతఘడియలు: రా.9.40 నుండి 11.32 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.40, సూర్యాస్తమయం: 6.14. మేషం: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. బంధువుల నుంచి సమస్యలు. పనులు వాయిదా. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు.వృషభం: కుటుంబసభ్యులతో అకారణ వైరం. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో గందరగోళం.మిథునం: పనుల్లో  విజయం. ఆర్థిక లాభాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. విందువినోదాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహం.కర్కాటకం: ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.సింహం: పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువిరోధాలు. దూరప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు.కన్య: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. పనులలో ఆటంకాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.తుల: కీలక నిర్ణయాలు. విద్యావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వివాదాల పరిష్కారం. వాహనయోగం. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు అధిగమిస్తారు.వృశ్చికం: పనులు మధ్యలో వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో కొన్ని ఆటంకాలు.ధనుస్సు: ఆర్థిక విషయాలలో పురోగతి. కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కారం. శుభవార్తలు వింటారు. ఉద్యోగాన్వేషణలో విజయం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో  అనుకూల పరిస్థితి.మకరం: ర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. వ్యాపార, ఉద్యోగాలు సాధారణస్థాయిలో కొనసాగుతాయి.కుంభం: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు.మీనం: కుటుంబసభ్యులతో సఖ్యత. విందువినోదాలు. బంధువుల కలయిక. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు. 

YS Jagan to visit Anakapalli District on April 29
చోడవరం బయల్దేరిన సీఎం జగన్‌

గుంటూరు,సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ మూడు నియోజకవర్గాల్లో పార్టీ నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇందులో భాగంగా.. తొలుత అనకాపల్లి జిల్లా చోడవరంలో జరిగే ప్రచార సభ కోసం తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరారు.సోమవారం ఉదయం అనకాపల్లి జిల్లా చోడవరంలోని కొత్తూరు జంక్షన్‌లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్‌ పాల్గొంటారు. ఇప్పటికే కొత్తూరు జంక్షన్‌ వద్ద వైఎస్సార్‌సీపీ జెండాలతో పార్టీ శ్రేణుల ఉత్సాహంతో సందడి వాతావరణాన్ని తలపిస్తోంది. ఈ సభ తర్వాత అమలాపురం పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలోని అంబాజీపేట బస్టాండ్‌ రోడ్డులో జరిగే సభలో పాల్గొంటారు. ఆపై గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని పొన్నూరు ఐలాండ్‌ సెంటర్‌లో జరిగే మూడో ప్రచార సభలో పాల్గొంటారు.

Chandrababu in Andhra Pradesh has put pensioners in trouble
అవ్వాతాతలకు బాబు బ్యాచ్‌ తెచ్చిన కష్టాలు

సాక్షి, అమరావతి: ఎన్నికల కోడ్‌ను అడ్డంపెట్టుకొని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు రాష్ట్రంలోని లక్షలాది అవ్వాతాతలు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. వీరికి జీవనాధారమైన ప్రభుత్వ పింఛను అందకుండా కుట్రలు పన్నుతున్నారు. సీఎం జగన్‌ వలంటీర్ల ద్వారా 65,49,864 మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, ఇతర పింఛను లబ్ధిదారులకు నెలనెలా ఠంఛనుగా ఒకటో తేదీనే వారున్న చోటునే పింఛను అందిస్తున్నారు. గత ఐదేళ్లుగా నిరి్వఘ్నంగా ఇంటి వద్దే పింఛను అందుతుండటం చంద్రబాబు నేతృత్వంలోని ఎల్లో బ్యాచ్‌కు కంటగింపయింది. దీంతో బాబు బ్యాచ్‌ ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదుల కారణంగా పింఛన్‌ లబ్ధిదారులు గత నెలలో సచివాలయాలకు వెళ్లి పింఛను డబ్బు తీసుకోవాల్సి వచ్చింది. అయినా చంద్రబాబు బ్యాచ్‌ పచ్చ కళ్లు చల్లబడకపోవడంతో వీరికి మరిన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. చంద్రబాబు హయాంలో పింఛను మంజూరవడమే గగనమైతే, ఆ వచ్చే కాస్త పింఛను కోసం అవ్వాతాతలు,  దివ్యాంగులను నానా అగచాట్లకు గురిచేసే వారు. అందులోనూ కమీషన్లు గుంజేవారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత అవ్వాతాతలు, దివ్యాంగులు, ఇతర పింఛన్‌దారుల అవస్థలకు చెల్లుచీటీ పాడారు. సంతృప్త స్థాయిలో అర్హులందరికీ ఎప్పటికప్పుడే కొత్త పింఛన్ల మంజూరు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.66 లక్షల మంది వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంఛనుగా పింఛను ఇంటి వద్దే అందించేవారు. సీఎం జగన్‌ చేపట్టిన ఈ అద్భుత కార్యక్రమంతో గత 58 నెలలుగా పింఛనుదారులు ఎటువంటి ఇబ్బందీలేకుండా వారి డబ్బులు అందుకున్నారు. ఇదే చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ లు, ఎల్లో బ్యాచ్, ఎల్లో మీడియాకు మింగుడుపడలేదు. ఎన్నికల కోడ్‌ నెపంతో వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్ల పంపిణీపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఉన్న రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమే‹Ùకుమార్‌ తదితరులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. దీంతో పింఛన్ల పంపిణీలో వలంటీర్లను పూర్తిగా దూరంగా ఉంచాలని నెల కిత్రమే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. డీబీటీ విధానంలో లేదంటే శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్ద పంపిణీ చేయాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో అధికారులు ఈ ఏప్రిల్‌ నెల పింఛను డబ్బును సచివాలయాల వద్ద పంపిణీ చేస్తూనే, విభిన్న దివ్యాంగులు, కదల్లేక మంచానికి లేదా వీల్‌చైర్‌కే పరిమితమైన వారికి, తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న యుద్ధవీరుల వృద్ధ వితంతువులకు వారి ఇంటి వద్దే పంపిణీ చేశారు. పింఛన్ల పంపిణీ ఈ నెల 3న మొదలుపెట్టి 8వ తేదీకల్లా పూర్తిచేశారు. సచివాలయాలకు వెళ్లి పింఛను డబ్బు తీసుకొనే క్రమంలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. చల్లారని పచ్చ కళ్లు ఏప్రిల్‌ నెలలో పింఛను లబ్ధిదారులను నానా అగచాట్లకు గురి చేసినప్పటికీ, పచ్చ కళ్లు చల్లబడలేదు. కేంద్ర ఎన్నికల సంఘానికి మళ్లీ ఫిర్యాదులు చేయడంతో పాటు రాష్ట్రంలో ఉన్నతాధికారులందరినీ బ్లాక్‌మెయిల్‌ చేస్తూ, వ్యక్తిగతంగా వారి ప్రతిష్ట దిగజార్చేలా టీడీపీ అనుకూల మీడియాలో పింఛన్ల పంపిణీపై రకరకాల తప్పుడు కథనాలు ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో పింఛన్ల పంపిణీపై పలు సూచనలు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికల సంఘం సూచనలకు అనుగుణంగా లబ్ధిదారులకు నేరుగా డబ్బుల పంపిణీకి బదులు బ్యాంకుల్లో జమ చేసేలా అధికారులు మళ్లీ మార్పులు చేయాల్సి వచి్చంది. 48,92,503 మంది అవ్వాతాతలు, ఇతరుల పింఛన్‌ డబ్బులు ఆధార్‌ నంబర్‌తో అనుసంధానమై ఉన్న వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతాయి. మే, జూన్‌ రెండు నెలల పాటు వీరు కుటుంబంలో లేదా తెలిసిన వారిలో ఎవరో ఒకరి వెంట బెట్టుకొని బ్యాంకుల దాకా వెళ్లి ఆ డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. గత నెలలో సచివాలయాల్లో డబ్బు తీసుకున్న వీరికి ఇప్పుడు బ్యాంకులకు వెళ్లాలంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా ఉంటుంది. సాధారణంగా అన్ని గ్రామాల్లో బ్యాంకులు ఉండవు. బ్యాంకులో పని ఉంటే సమీపంలోని పెద్ద పంచాయతీలకో, మండల కేంద్రాలు, లేదా పట్టణాల్లోని బ్యాంకులకు వెళ్లాలి. ఈ రెండు నెలలూ పింఛను కోసం అవ్వాతాతలకు  ఈ అవస్థలు తప్పవు. మండుటెండల్లో ఎవరో ఒకరిని వెంటబెట్టుకొని ఆటోలోనో, బస్సులోనో పక్క ఊరు లేదా పట్టణాల్లోని బ్యాంకులకు వెళ్లి డబ్బు తెచ్చుకోవాలి. దీని కోసం ఒక కుటుంబంలో ఇద్దరు ఒకట్రెండు రోజులు పనులు మానుకొని, డబ్బు ఖర్చు పెట్టుకొని వెళ్లిరావాల్సి ఉంటుంది. వీరు కాకుండా విభిన్న దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో పింఛను పొందే వారు, మంచం లేదా వీల్‌చైర్‌కు పరిమితమైన వారు, యుద్ధ వీరుల వృద్ధ వితంతువులతో పాటు బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం లేని వారు, అసలు బ్యాంకు ఖాతాలే లేని వారికి శాశ్వత ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2.66 లక్షల మంది వలంటీర్లు ఐదు రోజుల్లో నిర్వహించే కార్యక్రమాన్ని ఇప్పుడు అందుబాటులో ఉన్న శాశ్వత ఉద్యోగుల ద్వారా వారి ఎన్నికల విధులకు ఆటంకం కలగకుండా ఇంటి వద్దే పంపిణీ చేసేందుకు 20 రోజుల దాకా సమయం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి నిర్ణయం వల్ల ఒక గ్రామంలో రోజుకు కొందరికి అంది, మరికొందరికి అందకపోతే పింఛనుదారులలో అలజడి రేగే అవకాశమూ ఉందని అధికారులు అంటున్నారు. అయినప్పటికీ, సకాలంలో పింఛన్ల పంపిణీకి చర్యలు చేపట్టినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.గత చంద్రబాబు ప్రభుత్వంలో పింఛనుదారులకు అన్నీ కష్టాలే.. 2014 – 19 మధ్య రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో పింఛనుదారులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అవ్వాతాతలు, దివ్యాంగులు పింఛను మంజూరు కోసం ఆఫీసుల చుట్టూ ఏళ్ల తరబడి కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఉండేది. పింఛన్ల మంజూరు మొదలు, తొలగింపులు వంటి వాటిని కూడా జన్మభూమి కమిటీలకే చంద్రబాబు అప్పగించారు. ఆ జన్మభూమి కమిటీల్లో గ్రామాల్లో ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ నేతలే పూర్తిగా ఉండడంతో వాళ్లు టీడీపీకి ఓటు వేసిన వారికి లేదా లంచాలు ఇచి్చన వారికే కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు.ప్రత్యర్ధి పార్టీల సానుభూతిపరులకు పింఛన్లు మంజూరయ్యేవే కావు. ఒకవేళ అప్పటికే ఎవరికైనా మంజూరై ఉంటే నిర్దాక్షిణ్యంగా తొలగించారన్న ఆరోపణలున్నాయి. పింఛన్లు మంజూరైన వారు కూడా ఆ డబ్బు కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. ఊరిలో ఎప్పుడు పింఛను పంపిణీ జరుగుతుందో తెలియక ప్రతి రోజూ ఆఫీసు దాకా వచ్చి ఎండలో కూర్చొని ఊసూరుమంటూ తిరిగి వెళ్లే పరిస్థితి ఉండేది. 

Chandrababu Controversial comments On CM YS Jagan
సీఎం జగన్‌పై చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ను ఎదుర్కొనే సామర్థ్యం, ధైర్యంలేక కొట్టుమిట్టాడుతున్న చంద్రబాబుకు కళ్ల ముందే ఓటమి స్పష్టంగా కనిపించడంతో చేసేదిలేక తీవ్ర నిరాశ, నిస్పృహలతో బహిరంగ సభల్లో ఇష్టమొచ్చి­నట్లు నోరు పారేసుకోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్త­మవుతోంది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజక­వర్గం బుచ్చిరెడ్డిపాళెం సభలో.. ‘జగన్‌మోహన్‌రెడ్డి.. రేపు నిన్ను చంపితే ఏమవుతుంది’.. అంటూ ఆయన బరితెగించి చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలను ఆయన ఎటువైపు తీసుకెళ్తు­న్నారనే ఆందోళన సాధారణ ప్రజలు, మేథావులు, తటస్థులు వ్యక్తంచేస్తున్నారు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకే ఆయన్ను భౌతికంగా నిర్మూలించేందుకు చంద్రబాబు ఏదైనా కుతంత్రం పన్నుతున్నారే­మోనని అనుమానిస్తున్నారు. ఎందుకంటే.. ఇటీవలే తాడికొండలో జరిగిన సభలో ‘ఆ దున్నపోతును మనిషికి ఒక రాయి తీసుకుని, ఏది దొరికితే అది తీసుకుని కొట్టండి’.. అంటూ సీఎంపై దాడికి పురి­కొల్పేలా మాట్లాడారు. ఆ తర్వాతే విజయవాడ సింగ్‌నగర్‌లో బస్సుయాత్ర చేస్తున్న జగన్‌పై హత్యా­యత్నం జరిగింది. ముఖ్యమంత్రిని దున్నపోతు అంటూ సంభోదించడం, రాయిపెట్టి కొట్టాలనడం ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయికి తగునా అని మేధావులు సైతం ప్రశ్నిస్తున్నారు. మరో సభలో.. గాజు గ్లాసు తీసుకుని పొడవమంటూ ఆయన సైగల ద్వారా చెప్పడం చూసి రాష్ట్ర ప్రజలు నివ్వె­ర­పోయారు. ఇప్పుడు ఏకంగా జగన్‌ను నేరుగా ఉద్దే­శిస్తూ నిన్ను చంపితే ఏమవుతుంది అని మాట్లాడ­డంతో చంద్రబాబు మనసులో దురుద్దేశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆయన ఆ మాట అన్నా­రంటే జగన్‌పై ఎంత కసి, కక్ష ఉన్నాయో తెలుస్తోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర ముఖ్య­మంత్రిని చంపేయాలని ప్రతిపక్ష నేత మాట్లాడడం తగదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ విషయంలోనూ వైఎస్‌ జగన్‌ను దీటుగా ఎదుర్కో­లేని పరిస్థితుల్లో ఇలాంటి మాటలు మాట్లాడుతు­న్నట్లు స్పష్టమవుతోంది. సీఎంని పదేపదే వ్యక్తిగతంగా దూషించడం, దాడులకు ప్రోత్సహించేలా వ్యాఖ్యలు చేస్తుండడం, చివరికి ఇంకా దిగ­జారి చంపమని చెప్పడం బాబు మానసిక దౌర్భ­ల్యాన్ని సూచిస్తోందంటున్నారు. ఆయన ప్రతి సభ­లోనూ, ప్రతి సమావేశంలోనూ జగన్‌పై విద్వేషం వెళ్లగక్కు­తూనే ఉన్నారు. సీఎంను సైకో అంటూ దిగజా­రుడుగా సంభోదిస్తూ తన అక్కసు, కడుపుమంట చల్లార్చుకుంటున్నారు.బాబు తీరుతో టీడీపీ కేడర్‌లో ఆందోళన..అలాగే.. జగన్‌ తన పాలనలో మంచి జరిగిందను­కుంటేనే తనకు ఓటేయాలని కోరుతుంటే బాబు మాత్రం ‘చంపండి.. పొడవండి.. రాళ్లు విస­రండి.. గాలిలో వస్తాడు, గాలిలో పోతాడు’.. అంటూ మాట్లా­డడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేక­పోతు­న్నారు. వైఎస్‌ జగన్‌ తన పాలనలో తాను చేసిన పనులు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి చక్కగా చెబుతున్నారని, చంద్రబాబు వైఫల్యాలు ఆయన గతంలో విడుదల చేసిన మేనిఫెస్టోను చూపించి దాన్ని అమలుచేయలేదని చెబుతున్నారని వీటిపై మాట్లాడకుండా అదే పనిగా తిట్టడంవల్ల ఉపయోగం ఉండదని భావిస్తున్నారు. జగన్‌ తన మేనిఫెస్టోను, టీడీపీ మేనిఫెస్టోను పోల్చిచూపడం, అందులోని అంశాలను వివరించి చెప్పే విధానం ప్రజల్లోకి బాగా వెళ్తోందనే అభిప్రాయం టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. తమ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విషయాలను అమలుచేయలేదనే విష­యాన్ని చాలా సూటిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని, దీనికి కౌంటర్‌ ఇచ్చే పరిస్థితి తమ పార్టీకి లేకుండాపోయిందనే వాపోతున్నారు.టీడీపీని రద్దు చేయాలి: ఎమ్మెల్యే ప్రసన్నబుచ్చిరెడ్డిపాళెంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కోవూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. చంద్రబాబు తన పాలనా దక్షత కన్నా.. కుట్రలు, కుతంత్రాలు, హత్యలను నమ్ము­కుని రాజకీయం చేస్తున్నారంటూ మండిప­డ్డారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ సుమో­టోగా తీసుకుని చంద్రబాబుపై కేసు నమోదు చేసి, టీడీపీని రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. హైకోర్టు సుమోటోగా కేసు ఫైల్‌ చేయాలని కోరారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రాణాలకు హాని ఉందని చంద్రబాబు వ్యాఖ్యలతో అర్థమవుతోందన్నారు.వేమిరెడ్డీ.. బాబు వ్యాఖ్యలను సమర్థిస్తున్నావా?బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమ­యంలో ఎంపీ, ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున పోటీచేస్తున్న వేమి­రెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి దంపతులు పక్కనే ఉన్నప్పటికీ వారు వారించకుండా మౌనంగా ఉండిపోవడంపై నెల్లూరు జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నైతిక విలువ­లుంటే ఇలా­ంటి హత్యా రాజకీయాలను ప్రోత్సహి­స్తున్న బాబు పార్టీ నుంచి తప్పుకోవాలని, లేదంటే బహి­రంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తు­న్నా­రు.దారుణంగా పడిపోయిన చంద్రబాబు ఇమేజ్‌సీఎం జగన్‌ హుందాగా మాట్లాడుతుంటే.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఇంత నీచస్థాయికి దిగజారి మాట్లాడుతుండడం సాధారణ ప్రజా­నీకంలోనూ చర్చనీయాంశమైంది. ఇప్ప­టికే ప్రజల్లో, జాతీయ స్థాయి రాజకీయ పక్షాల దృష్టిలో నమ్మదగని నేతగా ముద్ర­పడిన చంద్రబాబు ఇమేజ్‌ దారుణంగా పడి­పోయింది. ప్రజలే కాదు.. ఏ రాజకీయ పక్షం ఆయన్ను నమ్మే పరిస్థితిలేదు. ప్రస్తుతం ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నా ఆయన్ను బీజేపీ పెద్దలు నమ్మ­డంలేదని టీడీపీ నేతలు వాపో­తున్నారు. చంద్రబాబు నిలకడలేని స్వభా­వం, అవకాశ­వాద వైఖరి, ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం ద్వారా తన స్థాయిని దిగజార్చుకున్నారు. ఈ వైఖరే ఆయన్ను ప్రజల్లో మోసగాడిగా నిలబెట్టింది.ఓటమి భయంతోనే ఇలా..బాబు తన పాలన, తన విధానాల గురించి కాకుండా కేవలం ఎదురుదాడి చేయడం, దూషించడంవల్ల ఉపయోగం ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.ఆయన ప్రసంగాలు ప్రజలకు నమ్మకాన్ని కలిగించేలా ఉండడంలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. హద్దులు దాటిపోయి చేస్తున్న ఆరోపణలు, దూషణలు చంద్రబాబులో ఉన్న అసహనం, భయాన్ని చూపుతున్నాయని, ఓటమి భయంతోనే ఆయన అలా మాట్లాడుతున్నారని తట­స్థులు సైతం చెబుతున్నారు. తాను చేసిందేమీ­లేక చెప్పుకోలేకపోవడం, ఏం చేస్తానో చెప్పలేక­పోవడం, ఆయన చెప్పే ఇతర విషయాలను జనం పట్టించుకోకపోవడంతో జీవిత చరమాంకంలో ఓటమి భయంతోనే ఇలా చేస్తున్నట్లు చెబు­­తున్నారు. అదే సమయంలో ఆయన విద్వే­ష­పూరిత ప్రసంగాలవల్ల రాష్ట్రంలో శాంతిభద్ర­తల సమస్య నెలకొనే పరిస్థితి ఏర్పడుతోంది. 

Bhuma Akhilapriya List of Irregularities: Andhra Pradesh
అక్రమాల ప్రియ

పేరేమో అందరికీ ‘ప్రియం’గా అనిపిస్తుంది.. వ్యవహార శైలి చూసినా, విన్నా అన్నీ అప్రియాలే...  టీడీపీ హయాంలో మంత్రిగా అవకాశం లభించేసరికి దోపిడీకి లైసెన్సు పొందినట్లయింది.ఈమె గారి పతి పేరులోనే దేవుడు...∗ లీలల్లో రావణుడే... ఈ సతీపతుల విచ్చలవిడి దోపిడీకినంద్యాల సమీపంలోని ఓ నియోజకవర్గం అడ్డాగా మారింది. నీరు–చెట్టు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు, తాగునీటి పేరిట వీరి అక్రమాలు లెక్కలేనన్ని ఉన్నాయి.  వీరి దోపిడీని లెక్కగడితే రూ.వంద కోట్లు దాటి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ దంపతుల కంటికి నదురుగా ఎవరి స్థలమైనా కనిపించినా.. లేదా.. స్థల వివాదాల్లో న్యాయం చేయాలని ఎవరైనా వీరి వద్దకు వచ్చినా.. పిట్టపోరు.. పిట్టపోరు.. పిల్లి తీర్చిందన్న చందంగా ఆ స్థలాలను కాజేసే దాకా వీరు నిద్రపోరు. ∗మాయ మాటలతో రైతులను వంచించడంలో ఈ దంపతులను మించిన వారు లేరని వీరిఅఘాయిత్యాలే చెబుతాయి..∗ఎవరైనా వీరి అన్యాయాలనుప్రశ్నించారో వారిపై విరుచుకుపడతారు. డబ్బుల కోసం ఏమైనా చేయడానికి వెనుకాడరనివీరి చరిత్ర చెబుతోంది. జైలుకెళ్లి వచ్చినా పద్ధతి మార్చుకోకపోవడం వీరికే చెల్లింది. సతి ఆదేశం.. పతి దౌర్జన్యం.. చింతకుంట గ్రామానికి చెందిన గూడా నరసింహుడు భార్య వెంకట లక్షమ్మకు ఆళ్లగడ్డ పట్టణ శివారులో 25 సెంట్ల స్థలముంది.  ఆ స్థలాన్ని మహమ్మద్‌హుసేన్, నూర్‌ అహమ్మద్‌ల నుంచి 1995 మార్చి 27న కొనుగోలు చేసి రిజి్రస్టేషన్‌ చేయించుకున్నారు. రూ.2 కోట్ల విలువ చేసే ఈ స్థలం ఖాళీగా ఉండటాన్ని గమనించిన ఈ దంపతులు ఓ సర్వేయర్, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ సిబ్బంది ద్వారా 1952లో అల్లిసా పేరిట రిజి్రస్టేషన్‌ డాక్యుమెంట్‌ను బయటకు తీశారు. అవుకు మండలం సంగపట్నంలో నివసించే వారి మనవడు నూర్‌బాషాకు నచ్చజెప్పి మూడు భాగాలుగా చేసి 2022 డిసెంబర్‌1న అనుచరుల పేరున రిజిస్ట్రేషన్‌ చేయించేశారు. ఇప్పుడు ‘గూడా’ దంపతులు లబోదిబోమంటున్నారు.  ఈ అరాచక దంపతుల దౌర్జన్యంలో ఇది  మరో కోణం. సాక్షి, టాస్‌్కఫోర్స్‌: గత ప్రభుత్వంలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన యువ మహిళా మంత్రి అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారారు. అక్రమాలను అవలీలగా చేసేశారు. ఇప్పుడామె అధికారంలో లేకున్నా... కబ్జాలకు కొదవలేదు. ఎదిరించేవారిపై దౌర్జన్యాలకూ వెనుకాడటం లేదు. ఆమెతోపాటు ఆమె రెండో భర్త చేసిన అరాచకాలు అన్నీఇన్నీకావు.  టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏ పనిచేసినా వారికి వాటాలు ముట్టజెప్పాల్సి వచ్చేది.కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ నియామకాల్లోనూ ఈ సతీపతుల వసూళ్ల దందా సాగింది. అభివృద్ధి పనుల్లోనూ ఆ దంపతులు రూ.కోట్లలో పర్సంటేజీలు మూటగట్టుకున్నారు. చివరకు పారిశుద్ధ్య కార్మికుల నియామకంలోనూ వసూళ్లు కొనసాగించారు. వివిధ పనుల్లో టెండర్లతో పని లేకుండా రూ.200 కోట్ల వరకూ స్వాహా చేశారు. అధికారం కోల్పోయినా తమ దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.  అభివృద్ధి పేరుతో అక్రమాలు... ఆమె టీడీపీ హయాంలో నియోజకవర్గంలో వివిధ పనుల కోసం కోట్లాది రూపాయలు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించుకుని వాటిని పక్కదారి పట్టించారు. అధికారులను బెదిరించి పనులు చేయకుండానే బిల్లులు చేయించుకున్నారు. నియోజకవర్గ పరిధిలో జరిగిన ప్రతి పనినీ తన అనుయాయులకే టెండర్‌తో ప్రమేయం లేకుండా కట్టబెట్టించి వారి వద్ద పర్సంటేజీలు నొక్కేశారు.  దౌర్జన్యాలకు నిదర్శనాలివిగో..  ∗ తాజాగా ఓ పంచాయితీ కోసం ఇంటికొచ్చిన ఓ ముస్లిం మైనార్టీ నాయకుడిని అందరూ చూస్తుండగానే మాజీ మంత్రి దంపతుల ఆదేశాల మేరకు అనుచరులు చితకబాది వారి వద్దనున్న రూ.1.30 కోట్లు దోచే యడం ఇప్పుడు సంచలనమైంది. ∗ జగత్‌ డెయిరీకి చెందిన అమాయక రైతుల పేర్లపై బ్యాంకు రుణాలు తీసుకుని మంత్రి తిరిగి చెల్లించకపోవడంతో ఆ రైతులు డిఫాల్టర్లుగా మారి పంట రుణాలూ పొందలేక అల్లాడిపోయారు.  ∗ మంత్రిగా ఉన్నప్పుడు కమీషన్లకు ఆశపడి మున్సిపల్‌ శానిటరీ, స్వీపర్‌ పోస్టులతోపాటు టూరిజం శాఖలో విద్యుత్‌ సబ్‌స్టేషన్లలో ఉద్యోగాలను అమ్ముకున్నారు.  ∗ నీరు చెట్టు పనుల్లో అడిగినంత కమీషన్‌ ఇవ్వలేదని భాచాపురం గ్రామ నాయకుడి చెక్‌బుక్‌ దొంగిలించి అతనిపై చెక్‌బౌన్స్‌ కేసు పెట్టి వేధించారు.  ∗ మాజీ మంత్రి ప్రస్తుత భర్త ద్వారా ఖాళీ స్థలాలపై కన్నేసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. భూ కబ్జాలకు పాల్పడి బాధితులను చంపుతామని బెదిరించారు. వ్యాపారవర్గాలను భయభ్రాంతులకు గురి చేశారు.  ∗ అవసరమైనప్పుడు అప్పులిచ్చి ఆదుకున్న స్నేహితులు, శ్రేయోభిలాషులను మోసం చేశారు. రుణాలు ఎగ్గొట్టారు. వారిని ఇంట్లోకీ రానివ్వకుండా అవమానించారు.∗ తండ్రి ఇంటిపేరును దుర్వినియోగం చేయడంతో విసిగిపోయిన బంధువులు ఆమెకు దూరమయ్యారు. ఆమెను, ఆమె భర్తను బహిష్కరించారు. ఎన్నికల్లో పోటీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ∗ నాలుగేళ్లుగా హైదరాబాద్‌కే పరిమితమైన మాజీ మంత్రి దంపతులు ఇప్పుడు ఎన్నికలు రావడంతో పదవి కోసం మళ్లీ నియోజకవర్గంలో తిష్టవేశారు. ∗ నంద్యాలకు ఆనుకుని ఉన్న నియోజకవర్గంలోని మూడు మండలాల గుండా ప్రవహించే వక్కిలేరులో అప్పటి టీడీపీ మంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దాదాపు మూడేళ్ల పాటు ఏటా నీరు–చెట్టు పేరిట పనులు చేస్తున్నట్లు హడావుడి చేశారు. ఒకటి రెండు కాదు.. ఏకంగా 350 పనులుగా దీన్ని విభజించి తన బంధువులైన  రామతీర్థ పుట్టాలమ్మ ఆలయ అప్పటి చైర్మన్‌ (ప్రస్తుత బీజేపీ నాయకుడు), అప్పటి సహకార సంఘం చైర్మన్, కోటకందుకూరు మాజీ సర్పంచికి అప్పగించారు.వారు వాగులో అరకొర పనులు చేసి ఏకంగా రూ.3 కోట్లకు పైగా నిధులు కొల్లగొట్టారు. ఇందులో నాటి మంత్రికి సగం ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి వర్క్‌ ఆర్డర్‌ లేకపోయినా అధికారులను బెదిరించి బిల్లులు చేయించుకున్నట్లు సమాచారం.  ∗ రుద్రవరం మండలం నాగులవరం సమీపంలోని టీజీపీ పంట కాలువలో పూడిక తీసినట్టు అధికారులు బిల్లులూ మంజూరు చేశారు. ఇదే గ్రామానికి చెందిన  నాటి మంత్రి అనుచరుడు ఇలాంటి పది పనులు సుమారు రూ.కోటితో చేసినట్లు తెలుస్తోంది. ఇందులో నాలుగు పనులు నాసిరకంగా చేపట్టగా, ఆరు పనులను అసలు చేయకుండానే బిల్లులు ఆమోదింపజేసుకుని రూ.60 లక్షలు మింగేశారని సమాచారం. ఇలా పైపై పనులు చేపట్టి దాదాపు రూ.130 కోట్ల మేర నాటి మంత్రి, జన్మభూమి కమిటీలు, వారి అనుచరులు బొక్కేశారు. రైతులకు ఉచితంగా ఇచ్చే శనగ విత్తనాల నుంచి మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నామని ఇతర రాష్ట్రాల నుంచి మినుములను రప్పించి ఇక్కడి రైతులవే అని చెప్పి కొల్లగొట్టేశారు. తాగునీటి సరఫరా పేరుతో దోపిడీ... చంద్రబాబు ఐదేళ్ల పాలనలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ సమస్యను తమకు అనుకూలంగా మార్చుకుని అప్పటి మంత్రిగా అడ్డంగా దోచేశారు. పట్టణంలో ట్యాంకరుకు రూ.500 నుంచి రూ.750 వరకు ప్రభుత్వం బిల్లులు చెల్లించింది. మంత్రి అనుచరులు ట్యాంకర్లను కొని మున్సిపాలిటీకి అద్దెకిచ్చారు. నీటిని వారు తరలించకుండానే కోట్లాది రూపాయలు దోపిడీ చేశారు. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ వేషంలో వెళ్లి కిడ్నాప్‌.. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలో 40 ఎకరాల భూమి ఆక్రమించుకునేందుకు మాజీ మంత్రి, ఆమె వర్గీయులు చేసిన కిడ్నాప్‌ సినిమాను తలపించింది. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఆఫీసర్ల వేషంలో వెళ్లి కిడ్నాప్‌ చేయడంతో అప్పట్లో సంచలనమైంది. అయితే తీరా కిడ్నాప్‌ చేసిన మనుషులు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బంధువులు కావడంతో కథ అడ్డం తిరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి కిడ్నాప్‌ చేసిన వ్యవహారంలో మాజీ మంత్రిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆమె ఏ1 నిందితురాలు. నెలల తరబడి జైలు జీవితం గడిపారు. కిడ్నాప్‌ కేసులో ఓ మహిళా మాజీ మంత్రి జైలుకు వెళ్లడం అదే తొలిసారి.

తప్పక చదవండి

Advertisement
Advertisement
Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all
Advertisement
Advertisement
Advertisement