Sakshi News home page
Advertisement

Top Stories

ప్రధాన వార్తలు

Watch Live AP CM YS Jagan Public Meeting At Chodavaram
Watch Live: చోడవరంలో సీఎం జగన్‌ ప్రచార సభ

Watch Live: చోడవరంలో సీఎం జగన్‌ ప్రచార సభ

Cricket New Zealand Announced T20 World Cup 2024 Squad
న్యూజిలాండ్‌ టీ20 వరల్డ్‌కప్‌ జట్టు ప్రకటన.. వినూత్న ప్రయోగం

యూఎస్‌ఏ, కరీబియన్‌ దీవులు వేదికగా ఈ ఏడాది జూన్‌ 1 నుంచి జరుగబోయే టీ20 వరల్డ్‌కప్‌ 2024 కోసం 15 మంది సభ్యుల న్యూజిలాండ్‌ జట్టును ఇవాళ (ఏప్రిల్‌ 29) ప్రకటించారు. స్టార్లతో నిండిన ఈ జట్టుకు కేన్‌ విలియమ్సన్‌ సారథ్యం వహించనున్నాడు. గాయపడిన ఆడమ్‌ మిల్నే స్థానంలో మ్యాట్‌ హెన్రీ వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. టిమ్‌ సౌథీ, ట్రెంట్‌ బౌల్ట్‌, లోకీ ఫెర్గూసన్‌లతో కలిసి హెన్రీ కొత్త బంతిని షేర్‌ చేసుకుంటాడు. బొటనవేలి గాయంతో బాధపడుతున్న డెవాన్‌ కాన్వేను సైతం న్యూజిలాండ్‌ సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ జట్టులో మరో వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ ఫిన్‌ అలెన్‌కు స్థానం లభించినప్పటికీ.. వరల్డ్‌కప్‌లో కాన్వేనే కీపింగ్‌ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వికెట్‌కీపర్‌ బ్యాటర్లైన టిమ్‌ సీఫర్ట్‌, టామ్‌ బ్లండెల్‌లకు వరల్డ్‌కప్‌ జట్టులో చోటు లభించలేదు. ఇటీవల పాక్‌తో సిరీస్‌ను (టీ20) డ్రా చేసుకున్న జట్టుకు సారధి అయిన మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ కూడా వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. జిమ్మీ నీషమ్‌, డారిల్‌ మిచెల్‌ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్ల కోటాలో ఎంపికయ్యారు. స్పెషలిస్ట్‌ స్పిన్నర్లుగా ఐష్‌ సోధి, మిచెల్‌ సాంట్నార్‌.. స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లుగా గ్లెన్‌ ఫిలిప్స్‌, రచిన్‌ రవీంద్ర, మార్క్‌ చాప్‌మన్‌ వ్యవహరించనున్నారు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో మూడు శతకాలతో విజృంభించిన రచిన్‌ తొలిసారి టీ20 వరల్డ్‌కప్‌ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ జట్టుకు బ్యాటింగ్‌ కోచ్‌గా లూక్‌ రాంచీ, బౌలింగ్‌ కోచ్‌గా జేకబ్‌ ఓరమ్‌, అసిస్టెంట్‌ కోచ్‌గా జేమ్స్‌ ఫోస్టర్‌ వ్యవహరించనున్నారు. హెడ్‌ కోచ్‌గా గ్యారీ స్టెడ్‌ కొనసాగనున్నాడు. వరల్డ్‌కప్‌ కోసం న్యూజిలాండ్‌ జట్టు మే 23న బయల్దేరనుంది. జూన్‌ 7న న్యూజిలాండ్‌ తమ తొలి మ్యాచ్‌ (ఆఫ్ఘనిస్తాన్‌) ఆడనుంది.న్యూజిలాండ్‌ టీ20 వరల్డ్‌కప్‌ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, ఐష్ సోధీ [ట్రావెలింగ్ రిజర్వ్-బెన్ సియర్స్ ]Join special guests Matilda and Angus at the squad announcement for the upcoming @t20worldcup in the West Indies and USA. #T20WorldCup pic.twitter.com/6lZbAsFlD5— BLACKCAPS (@BLACKCAPS) April 29, 2024 వరల్డ్‌కప్‌ జట్టును వినూత్నంగా ప్రకటించిన న్యూజిలాండ్‌ క్రికెట్‌న్యూజిలాండ్‌ క్రికెట్‌ తమ టీ20 వరల్డ్‌కప్‌ జట్టును వినూత్నంగా ప్రకటించింది. సెలక్టర్లు, న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రతినిథులు కాకుండా ఇద్దరు చిన్నారులు జట్టు సభ్యుల పేర్లను వెల్లడించారు. న్యూజిలాండ్‌ క్రికెట్‌ మటిల్డా, ఆంగస్‌ అనే ఇద్దరు చిన్నారులకు చీఫ్‌ గెస్ట్‌లుగా ఆహ్వానించింది. The team's kit for the 2024 @T20WorldCup 🏏Available at the NZC store from tomorrow. #T20WorldCup pic.twitter.com/T4Okjs2JIx— BLACKCAPS (@BLACKCAPS) April 29, 2024 న్యూజిలాండ్‌ క్రికెట్‌ చేసిన ఈ వినూత్న ప్రయోగం అందరినీ ఆకట్టుకుంది. వరల్డ్‌కప్‌ జట్టు ప్రకటన సందర్భంగా న్యూజిలాండ్‌ క్రికెట్‌ తమ వరల్డ్‌కప్‌ జెర్సీని కూడా రివీల్‌ చేసింది. మెగా టోర్నీలో న్యూజిలాండ్‌ క్రికెటర్లు తాము రెగ్యులర్‌గా ధరించే బ్లాక్‌ కిట్‌ కాకుండా వేరే కలర్‌లో ఉండే కిట్‌లను ధరించనున్నారు.  

Delhi Police Case Registered Over Amit Shah Fake Video
ఎన్నికల వేళ కలకలం.. సోషల్‌ మీడియాలో అమిత్‌ షా ఫేక్‌ వీడియో!

సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు సంబంధించిన ఫేక్‌ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించిన కామెంట్స్‌ ఉన్నాయి. దీంతో.. హోం మంత్రిత్వ శాఖ, బీజేపీల ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. దేశంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేయడం గురించి అమిత్ షా కామెంట్స్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్‌ షా మాట్లాడినట్టుగా ఉంది. అయితే, అసలు వీడియోలో తెలంగాణలో ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను తొలగించాలని మాత్రమే అమిత్ షా మాట్లాడినట్టు బీజేపీ స్పష్టం చేసింది. అలాగే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయడంపై అమిత్ షా ఏమీ మాట్లాడలేదని బీజేపీ తెలిపింది. .@INCTelangana is spreading an edited video, which is completely fake and has the potential to cause large scale violence.Home Minister Amit Shah spoke about removing the unconstitutional reservation given to Muslims, on the basis of religion, after reducing share of SCs/STs and… pic.twitter.com/5plMsEHCe3— Amit Malviya (मोदी का परिवार) (@amitmalviya) April 27, 2024 ఇక, వీడియోపై కాంగ్రెస్‌ స్పందించింది. రిజర్వేషన్‌ను అంతం చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోందని పేర్కొంటూ కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ల అధికారిక ఖాతాలతో సహా పలు సోషల్ మీడియా ఖాతాల్లో ఆ వీడియో షేర్ చేశారు. దీంతో బీజేపీ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వీడియోను పూర్తిగా ఎడిట్ చేశారని పిటిషన్‌లో పేర్కొంది. ఈ క్రమంలో దీనిపై కేసు నమోదు చేసినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు.ఈ వీడియోపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ ఫేక్‌ వీడియోపై బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవీయా ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా మాలవీయా.. కాంగ్రెస్ పార్టీ ఈ నకిలీ వీడియోను వ్యాప్తి చేస్తోంది. చట్టపరమైన చర్యలకు కాంగ్రెస్‌ నేతలు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఫేక్, ఎడిట్ చేసిన వీడియోలను ప్రచారం చేయడం సరికాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

IPL 2024 47th Match: KKR Take On Delhi Capitals In Home Ground
ఐపీఎల్‌లో నేటి (Apr 29) మ్యాచ్‌.. కేకేఆర్‌ను ఢీకొట్టనున్న ఢిల్లీ

ఐపీఎల్‌ 2024లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 29) జరుగబోయే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కేకేఆర్‌ను ఢీకొట్టనుంది. కేకేఆర్‌ హోం గ్రౌండ్‌ అయిన ఈడెన్‌ గార్డెన్స్‌లో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ సీజన్‌లో కేకేఆర్‌ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. ఇప్పుడిప్పుడే విజయాల బాటపట్టిన ఢిల్లీ 10 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో ఆరో స్థానంలో నిలిచింది. ఐపీఎల్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు 32 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. కేకేఆర్‌ 17, ఢిల్లీ 15 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్‌ అత్యంత కీలకంగా మారింది. కేకేఆర్‌ గత మ్యాచ్‌లో అతి భారీ స్కోర్‌ (261/6) చేసి కూడా పంజాబ్‌ చేతిలో భంగపడగా.. ఢిల్లీ తమ చివరి మ్యాచ్‌ల్లో నాలుగింట గెలిచి కేకేఆర్‌ కంటే ఎక్కువ ఉత్సాహంగా ఉంది. ఇరు జట్లు ఇదే సీజన్‌లో తలపడిన సందర్భంలో కేకేఆర్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోర్‌ నమోదు చేసింది. ఏప్రిల్‌3న విశాఖ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల అతి భారీ స్కోర్‌ చేసింది. భారీ లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ 166 పరుగులకే కుప్పకూలి 106 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో విధ్వంసకర ఆటగాడు, ఢిల్లీ ఓపెనర్‌ జేక్‌ ఫ్రేసర్‌పై అందరి కళ్లు ఉన్నాయి. ఫ్రేసర్‌ ముంబైతో ఆడిన గత మ్యాచ్‌లో మ్యాడ్‌ మ్యాన్‌లా రెచ్చిపోయి 27 బంతుల్లో 84 పరుగులు చేశాడు.తుది జట్లు (అంచనా)..కోల్‌కతా నైట్ రైడర్స్: సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, దుష్మంత చమీర, వరుణ్ చక్రవర్తి, వైభవ్‌ అరోరా (ఇంపాక్ట్‌ ప్లేయర్‌)ఢిల్లీ: జేక్ ఫ్రేసర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, కుమార్ కుషాగ్రా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్ట్జే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, రసిఖ్‌ సలాం​ (ఇంపాక్ట్‌ ప్లేయర్‌)

Banks will remain closed on THESE days in May 2024
బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్‌.. మే నెలలో 12 రోజులు బంద్‌!

Bank Holidays in May 2024: బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్యమైన సమచారం ఇది. మే నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. దేశవ్యాప్తంగా మే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు వచ్చాయి.దేశవ్యాప్తంగా బ్యాంకులకు మే నెలలో మొత్తం 12 రోజులు సెలవులు ఉండగా వీటిలో రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలతోపాటు పండుగలు, ప్రత్యేక సందర్భాలు కలిసి ఉన్నాయి. ఇవి రాష్ట్రాలను బట్టి మారే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారు ఏదో ఒక పని కోసం బ్యాంకులకు వెళ్లాల్సి వస్తుంది. ఆన్‌లైన్ లో ఎన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా కొన్ని పనులు బ్యాంకులకు వెళ్లి చేయాల్సి ఉంటుంది. అటువంటివారి కోసం బ్యాంకు సెలవుల సమాచారాన్ని ఇక్కడ ఇస్తున్నాం.మే నెలలో బ్యాంకు సెలవులు ఇవే..మే 1: మహారాష్ట్ర దినోత్సవం/ మే డే (కార్మిక దినోత్సవం) మే 5: ఆదివారం.మే 8: రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో బ్యాంకుల బంద్మే 10: బసవ జయంతి/ అక్షయ తృతీయమే 11: రెండో శనివారంమే 12: ఆదివారం.మే 16: సిక్కిం రాష్ట్ర దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవుమే 19: ఆదివారం.మే 20: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా బేలాపూర్, ముంబైలో బ్యాంకుల  మూతమే 23: బుద్ధ పూర్ణిమ మే 25: నాలుగో శనివారం. మే 26: ఆదివారం.

TDP MLA Gana Babu Intimidation Politics In Visakhapatnam
నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు...

నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు. ఈ ఎన్నికల్లో మీరు సపోర్ట్‌ చేయకపోతే నా గూండాయిజం మళ్లీ చూస్తారు. నా వెంట లేకపోతే మీ అంతు చూస్తా.. ఖబడ్దార్‌.. ఈ డైలాగ్‌లు ఏదో యాక్షన్‌ సినిమాలో వీధి రౌడీ చెప్పిన మాటలు కాదు.. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు రెండు పర్యాయాలు గుణవంతుడని ఎమ్మెల్యేగా ఎన్నుకున్న అక్రమాల గణబాబు హెచ్చరికలు. ఓటమి భయంతో.. టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాగైతే.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారో.. అదే తానుముక్కైన గణబాబు కూడా బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు.  సాక్షి, విశాఖపట్నం : ప్రచారం పేరుతో విశాఖ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గణబాబు వస్తున్నాడంటే వ్యాపారులు బెదిరిపోతున్నారు. చిన్న చిన్న దుకాణదారులు హడలిపోతున్నారు. బడా బంగారు వ్యాపారులు భయపడుతున్నారు. ఆర్‌పీ లు ఆందోళన చెందుతున్నారు. రోడ్డుపై తోపుడు బళ్లు వ్యాపారులు బిక్కుబిక్కుమంటున్నారు. ఎవరు కనిపించినా..  నవ్వుతూ పలకరిస్తూ.. ఆత్మీయ ఆలింగనం చేసుకుంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్‌కుమార్‌ ఓటర్లను అభ్యర్థిస్తుంటే.. టీడీపీ అభ్యర్థి గణబాబు మాత్రం బెదిరింపు రాజకీయాలతో బెదరగొడుతున్నారు.బెదిరింపులకు నాలుగు బ్యాచ్‌లు ఎన్నికల్లో తనకు సహకరించకపోతే భవిష్యత్‌లో సమస్యలు తప్పవని గణబాబు.. నియోజకవర్గంలోని వ్యాపారస్తులు, వ్యాపార సంస్థల యజమానులను బెదిరిస్తున్నారని కొందరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వ్యాపారులను బెదిరించేందుకు గణబాబు తన అనుచరులను నాలుగు బ్యాచ్‌లుగా విభజించి.. వస్త్ర వ్యాపారుల ను ఒక బ్యాచ్, బంగారు వ్యాపారులను మరో బ్యాచ్, కిరాణా దుకాణాలవైపు ఇంకో బ్యాచ్, మిగిలిన వాటిని కవర్‌ చేస్తూ మరో బ్యాచ్‌ పశ్చిమ నియోజకవర్గంలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆయా వర్తక సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను గణబాబు రప్పించుకొని వేలు చూపిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి వ్యక్తి గెలిస్తే నియోజకవర్గాన్ని గూండాల చేతిలో పెట్టేటట్లుగా ఉన్నారంటూ వ్యాపారులు హడలిపోతున్నారు.ఫిర్యాదులు చేస్తామని ఆర్పీలకు బెదిరింపు స్వయం సహాయక బృందాల్లో కీలకంగా వ్యవహరించే రిసోర్స్‌ పర్సన్స్‌(ఆర్పీ) ఏ ఒక్క పార్టీకి కొమ్ముకాయకుండా వ్యవహరిస్తున్నారు. అయితే.. వీరిపైనా గణబాబు బెదిరింపుల బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇటీవలే కొందరు ఆర్పీలను మభ్యపెట్టేందుకు కాసులపేర్లను బహూకరించారు. ఆర్పీలు తీసుకోమని చెప్పడంతో వారందర్నీ బెదిరించారు. దీంతో ఒకరిద్దరు గణబాబు గూండాయిజానికి భయపడి తీసుకున్నారు. మిగిలిన వారు మాత్రం తాము ఏ పార్టీకి సపోర్ట్‌ చేయమనీ.. స్వయం సహాయక బృందాల అభివృద్ధి కోసమే తమని ప్రభుత్వాలు నియమించాయని కరాఖండిగా చెప్పడంతో గణబాబు అహం దెబ్బతింది.దీంతో తనకు సహకరించని ఆర్పీలపై గణబాబు వర్గం ఎన్నికల సంఘానికి తప్పుడు ఫిర్యాదులు చేయడం ప్రారంభించింది. గతంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న ఫొటోల్ని సంపాదించి.. ఆ ఫొటోలతో బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేస్తున్నారని కొందరు ఆర్‌పీలు వాపోతున్నారు. పాత ఫొటోల ద్వారా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ముందుగా ఆర్పీలకు ఆ ఫొటోలు చూపించి.. మీరు తన తరఫున ప్రచారం చేయకపోతే.. ఈ ఫొటోలతో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాననీ.. అప్పుడు మీ ఉద్యోగాలు ఊడిపోతాయంటూ గణబాబు  బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. గణబాబు బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు పశ్చిమ నియోజకవర్గాన్ని కుదిపేస్తున్నాయి. దిగజారుడు బెదిరింపులతో చిల్లర రాజకీయాలు చేస్తున్న గణబాబు అరాచకాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధమవుతున్నారు.   

Bigg Boss 7 Telugu Priyanka Jain Boyfriend Buys Land In Hyderabad
హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న 'బిగ్ బాస్' ప్రియాంక

బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్‌తో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అంతకు ముందు పలు సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. ప్రస్తుతం షోలు, యూట్యూబ్ వీడియోలు చేస్తూ బిజీగా ఉంది. తన బాయ్ ఫ్రెండ్‌తో హైదరాబాద్‌లోనే కలిసి ఉంటున్న ప్రియాంక ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పింది. తాము ఇక్కడ భూమి కొనుగోలు చేసినట్లు శుభవార్త చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకుంటా.. ఆ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్)ప్రస్తుతం హైదరాబాద్‌లోని అద్దె ఫ్లాట్‌లో ఉంటున్న ప్రియాంక-శివ్.. తొలుత కొత్త ఫ్లాట్ తీసుకోవాలని అనుకున్నారు. టోకెన్ అమౌంట్ కూడా ఇచ్చేశారు. కానీ ఫ్లాట్ తీసుకోవడం తనకు ఇష్టం లేదని, ల్యాండ్ కొని ఇల్లు కట్టుకుంటే వచ్చే మజా వేరని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శివ్ అసలు విషయం చెప్పాడు. జనవరి నుంచి ల్యాండ్ కోసం తిరుగుతుండగా ఎప్పుడో ఓ సమస్య వచ్చేదని ప్రియాంక చెప్పుకొచ్చింది.ల్యాండ్ బాగుంటే రేటు నచ్చడం లేదని, అన్ని బాగుంటే పేపర్స్ సరిగా ఉండట్లేదని ప్రియాంక-శివ్ చెప్పారు. ఏప్రిల్ 10న ల్యాండ్ ఓకే చేసి, 23వ తేదీని రిజిస్టర్ చేసినట్లు చెప్పారు. ఆ విజువల్స్ కూడా చూపించారు. అయితే హైదరాబాద్‌లో ల్యాండ్ కొనడం అంత ఈజీ కాదని చెప్పాడు. మొత్తానికి తన కల నెరవేరిందని శివ్ చెప్పగా.. ప్రియాంక ఫుల్ హ్యాపీగా కనిపించింది. ప్రస్తుతానితి ముహుర్తాలు లేవని, త్వరలో ఇంటి అప్డేట్స్ చెబుతామని ప్రియాంక-శివ్ చెప్పారు.(ఇదీ చదవండి:కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్ ) 

CID Ready for Fayaz DNA test
Neha Hiremath murder: నేహా హత్య కేసు నిందితునికి డీఎన్‌ఏ పరీక్ష

హుబ్లీ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విద్యార్థిని నేహా హిరేమఠ హత్య కేసు నిందితుడు ఫయాజ్‌ రక్త నమూనాను సీఐడీ దర్యాప్తు అధికారులు న్యాయమూర్తి సమక్షంలో సేకరించారు. నిందితునిపై మరింత దర్యాప్తు, అతని డీఎన్‌ఏ పరీక్ష చేయడానికి అనుమతి కోరి సీఐడీ అధికారులు హుబ్లీ 1వ అదనపు సెషన్స్‌ కోర్టులో అర్జీ వేశారు. ఈ నేపథ్యంలో జడ్జి సమక్షంలో వైద్యులు ఫయాజ్‌ రక్త నమూనాలను సేకరించారు. హత్య జరిగిన స్థలం, హత్యకు వాడిన చాకుపై రెండు రక్తపు గ్రూప్‌లను కనుగొన్నారు. ఒక రక్త గ్రూప్‌ నేహాది అయితే, మరొకటి ఫయాజ్‌ది కావచ్చని, కత్తితో పొడిచేటప్పుడు అతనికి స్వల్ప గాయమై ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఐడీ దర్యాప్తు అధికారులు ఫయాజ్‌ డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించడానికి చర్యలు తీసుకున్నారు. కాగా ఫయాజ్‌ను సీఐడీ బృందం 6 రోజుల కస్టడీకి తీసుకున్న సంగతి విదితమే. సోమవారంతో కస్టడీ గడువు ముగియనుంది. అతన్ని మరింతగా విచారించడానికి కస్టడీ గడువును పొడిగించాలని సీఐడీ అధికారులు కోర్టును కోరే అవకాశం ఉంది.

Daily Horoscope Rasi Phalalu April 29-04-2024 Telugu
Horoscope Today: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.పంచమి ఉ.5.37 వరకు, తదుపరి షష్ఠి తె.4.27 వరకు (తెల్లవారితే మంగళవారం), నక్షత్రం: పూర్వాషాఢ రా.2.28 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: ప.12.22 నుండి 1.54 వరకు, దుర్ముహూర్తం: ప.12.23 నుండి 1.11 వరకు, తదుపరి ప.2.56 నుండి 3.44 వరకు, అమృతఘడియలు: రా.9.40 నుండి 11.32 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.40, సూర్యాస్తమయం: 6.14. మేషం: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. బంధువుల నుంచి సమస్యలు. పనులు వాయిదా. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు.వృషభం: కుటుంబసభ్యులతో అకారణ వైరం. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో గందరగోళం.మిథునం: పనుల్లో  విజయం. ఆర్థిక లాభాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. విందువినోదాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహం.కర్కాటకం: ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.సింహం: పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువిరోధాలు. దూరప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు.కన్య: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. పనులలో ఆటంకాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.తుల: కీలక నిర్ణయాలు. విద్యావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వివాదాల పరిష్కారం. వాహనయోగం. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు అధిగమిస్తారు.వృశ్చికం: పనులు మధ్యలో వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో కొన్ని ఆటంకాలు.ధనుస్సు: ఆర్థిక విషయాలలో పురోగతి. కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కారం. శుభవార్తలు వింటారు. ఉద్యోగాన్వేషణలో విజయం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో  అనుకూల పరిస్థితి.మకరం: ర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. వ్యాపార, ఉద్యోగాలు సాధారణస్థాయిలో కొనసాగుతాయి.కుంభం: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు.మీనం: కుటుంబసభ్యులతో సఖ్యత. విందువినోదాలు. బంధువుల కలయిక. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు. 

Chandrababu in Andhra Pradesh has put pensioners in trouble
అవ్వాతాతలకు బాబు బ్యాచ్‌ తెచ్చిన కష్టాలు

సాక్షి, అమరావతి: ఎన్నికల కోడ్‌ను అడ్డంపెట్టుకొని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు రాష్ట్రంలోని లక్షలాది అవ్వాతాతలు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. వీరికి జీవనాధారమైన ప్రభుత్వ పింఛను అందకుండా కుట్రలు పన్నుతున్నారు. సీఎం జగన్‌ వలంటీర్ల ద్వారా 65,49,864 మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, ఇతర పింఛను లబ్ధిదారులకు నెలనెలా ఠంఛనుగా ఒకటో తేదీనే వారున్న చోటునే పింఛను అందిస్తున్నారు. గత ఐదేళ్లుగా నిరి్వఘ్నంగా ఇంటి వద్దే పింఛను అందుతుండటం చంద్రబాబు నేతృత్వంలోని ఎల్లో బ్యాచ్‌కు కంటగింపయింది. దీంతో బాబు బ్యాచ్‌ ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదుల కారణంగా పింఛన్‌ లబ్ధిదారులు గత నెలలో సచివాలయాలకు వెళ్లి పింఛను డబ్బు తీసుకోవాల్సి వచ్చింది. అయినా చంద్రబాబు బ్యాచ్‌ పచ్చ కళ్లు చల్లబడకపోవడంతో వీరికి మరిన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. చంద్రబాబు హయాంలో పింఛను మంజూరవడమే గగనమైతే, ఆ వచ్చే కాస్త పింఛను కోసం అవ్వాతాతలు,  దివ్యాంగులను నానా అగచాట్లకు గురిచేసే వారు. అందులోనూ కమీషన్లు గుంజేవారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత అవ్వాతాతలు, దివ్యాంగులు, ఇతర పింఛన్‌దారుల అవస్థలకు చెల్లుచీటీ పాడారు. సంతృప్త స్థాయిలో అర్హులందరికీ ఎప్పటికప్పుడే కొత్త పింఛన్ల మంజూరు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.66 లక్షల మంది వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంఛనుగా పింఛను ఇంటి వద్దే అందించేవారు. సీఎం జగన్‌ చేపట్టిన ఈ అద్భుత కార్యక్రమంతో గత 58 నెలలుగా పింఛనుదారులు ఎటువంటి ఇబ్బందీలేకుండా వారి డబ్బులు అందుకున్నారు. ఇదే చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ లు, ఎల్లో బ్యాచ్, ఎల్లో మీడియాకు మింగుడుపడలేదు. ఎన్నికల కోడ్‌ నెపంతో వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్ల పంపిణీపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఉన్న రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమే‹Ùకుమార్‌ తదితరులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. దీంతో పింఛన్ల పంపిణీలో వలంటీర్లను పూర్తిగా దూరంగా ఉంచాలని నెల కిత్రమే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. డీబీటీ విధానంలో లేదంటే శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్ద పంపిణీ చేయాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో అధికారులు ఈ ఏప్రిల్‌ నెల పింఛను డబ్బును సచివాలయాల వద్ద పంపిణీ చేస్తూనే, విభిన్న దివ్యాంగులు, కదల్లేక మంచానికి లేదా వీల్‌చైర్‌కే పరిమితమైన వారికి, తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న యుద్ధవీరుల వృద్ధ వితంతువులకు వారి ఇంటి వద్దే పంపిణీ చేశారు. పింఛన్ల పంపిణీ ఈ నెల 3న మొదలుపెట్టి 8వ తేదీకల్లా పూర్తిచేశారు. సచివాలయాలకు వెళ్లి పింఛను డబ్బు తీసుకొనే క్రమంలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. చల్లారని పచ్చ కళ్లు ఏప్రిల్‌ నెలలో పింఛను లబ్ధిదారులను నానా అగచాట్లకు గురి చేసినప్పటికీ, పచ్చ కళ్లు చల్లబడలేదు. కేంద్ర ఎన్నికల సంఘానికి మళ్లీ ఫిర్యాదులు చేయడంతో పాటు రాష్ట్రంలో ఉన్నతాధికారులందరినీ బ్లాక్‌మెయిల్‌ చేస్తూ, వ్యక్తిగతంగా వారి ప్రతిష్ట దిగజార్చేలా టీడీపీ అనుకూల మీడియాలో పింఛన్ల పంపిణీపై రకరకాల తప్పుడు కథనాలు ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో పింఛన్ల పంపిణీపై పలు సూచనలు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికల సంఘం సూచనలకు అనుగుణంగా లబ్ధిదారులకు నేరుగా డబ్బుల పంపిణీకి బదులు బ్యాంకుల్లో జమ చేసేలా అధికారులు మళ్లీ మార్పులు చేయాల్సి వచి్చంది. 48,92,503 మంది అవ్వాతాతలు, ఇతరుల పింఛన్‌ డబ్బులు ఆధార్‌ నంబర్‌తో అనుసంధానమై ఉన్న వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతాయి. మే, జూన్‌ రెండు నెలల పాటు వీరు కుటుంబంలో లేదా తెలిసిన వారిలో ఎవరో ఒకరి వెంట బెట్టుకొని బ్యాంకుల దాకా వెళ్లి ఆ డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. గత నెలలో సచివాలయాల్లో డబ్బు తీసుకున్న వీరికి ఇప్పుడు బ్యాంకులకు వెళ్లాలంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా ఉంటుంది. సాధారణంగా అన్ని గ్రామాల్లో బ్యాంకులు ఉండవు. బ్యాంకులో పని ఉంటే సమీపంలోని పెద్ద పంచాయతీలకో, మండల కేంద్రాలు, లేదా పట్టణాల్లోని బ్యాంకులకు వెళ్లాలి. ఈ రెండు నెలలూ పింఛను కోసం అవ్వాతాతలకు  ఈ అవస్థలు తప్పవు. మండుటెండల్లో ఎవరో ఒకరిని వెంటబెట్టుకొని ఆటోలోనో, బస్సులోనో పక్క ఊరు లేదా పట్టణాల్లోని బ్యాంకులకు వెళ్లి డబ్బు తెచ్చుకోవాలి. దీని కోసం ఒక కుటుంబంలో ఇద్దరు ఒకట్రెండు రోజులు పనులు మానుకొని, డబ్బు ఖర్చు పెట్టుకొని వెళ్లిరావాల్సి ఉంటుంది. వీరు కాకుండా విభిన్న దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో పింఛను పొందే వారు, మంచం లేదా వీల్‌చైర్‌కు పరిమితమైన వారు, యుద్ధ వీరుల వృద్ధ వితంతువులతో పాటు బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం లేని వారు, అసలు బ్యాంకు ఖాతాలే లేని వారికి శాశ్వత ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2.66 లక్షల మంది వలంటీర్లు ఐదు రోజుల్లో నిర్వహించే కార్యక్రమాన్ని ఇప్పుడు అందుబాటులో ఉన్న శాశ్వత ఉద్యోగుల ద్వారా వారి ఎన్నికల విధులకు ఆటంకం కలగకుండా ఇంటి వద్దే పంపిణీ చేసేందుకు 20 రోజుల దాకా సమయం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి నిర్ణయం వల్ల ఒక గ్రామంలో రోజుకు కొందరికి అంది, మరికొందరికి అందకపోతే పింఛనుదారులలో అలజడి రేగే అవకాశమూ ఉందని అధికారులు అంటున్నారు. అయినప్పటికీ, సకాలంలో పింఛన్ల పంపిణీకి చర్యలు చేపట్టినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.గత చంద్రబాబు ప్రభుత్వంలో పింఛనుదారులకు అన్నీ కష్టాలే.. 2014 – 19 మధ్య రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో పింఛనుదారులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అవ్వాతాతలు, దివ్యాంగులు పింఛను మంజూరు కోసం ఆఫీసుల చుట్టూ ఏళ్ల తరబడి కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఉండేది. పింఛన్ల మంజూరు మొదలు, తొలగింపులు వంటి వాటిని కూడా జన్మభూమి కమిటీలకే చంద్రబాబు అప్పగించారు. ఆ జన్మభూమి కమిటీల్లో గ్రామాల్లో ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ నేతలే పూర్తిగా ఉండడంతో వాళ్లు టీడీపీకి ఓటు వేసిన వారికి లేదా లంచాలు ఇచి్చన వారికే కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు.ప్రత్యర్ధి పార్టీల సానుభూతిపరులకు పింఛన్లు మంజూరయ్యేవే కావు. ఒకవేళ అప్పటికే ఎవరికైనా మంజూరై ఉంటే నిర్దాక్షిణ్యంగా తొలగించారన్న ఆరోపణలున్నాయి. పింఛన్లు మంజూరైన వారు కూడా ఆ డబ్బు కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. ఊరిలో ఎప్పుడు పింఛను పంపిణీ జరుగుతుందో తెలియక ప్రతి రోజూ ఆఫీసు దాకా వచ్చి ఎండలో కూర్చొని ఊసూరుమంటూ తిరిగి వెళ్లే పరిస్థితి ఉండేది. 

తప్పక చదవండి

Advertisement
Advertisement
Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all
Advertisement
Advertisement
Advertisement