Sakshi News home page
Advertisement

Top Stories

ప్రధాన వార్తలు

Actor Sahil Khan Arrested In Mahadev Betting App Case
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్

మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్‌ని  ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇతడిని ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. అంతకుముందు సాహిల్ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ని బాంబే హైకోర్టు తిరస్కరించింది. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ బెట్టింగ్ కేసు ఏంటి? సాహిల్‌ని ఎందుకు అరెస్ట్ చేశారు?  బాలీవుడ్ నటుడిగా సాహిల్ ఖాన్ పరిచయమే. 'స్టైల్', 'ఎక్స్యూజ్ మీ' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఫిట్‌నెస్ ట్రైనర్‌, ఇన్ఫ్లూయెన్సర్‌గా చేస్తున్నాడు. కొన్నేళ్ల ముందు మహేదేవ్ బెట్టింగ్ యాప్‪‌ని ప్రమోట్ చేశాడు. అయితే ఈ యాప్ ద్వారా రూ.15,000 కోట్ల అవినీతి జరిగింది. దాదాపు 67 బెట్టింగ్ సైట్లు సృష్టించారు. ఈ విషయమై సామాజిక కార్యకర్త ప్రకాశ్ బంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2023 నవంబరులో మాతుంగ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా డిసెంబరులో దీన్ని ప్రమోట్ చేస్తున్న సాహిల్ ఖాన్‌కి నోటీసులు జారీ చేశారు.(ఇదీ చదవండి: కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్)అయితే విచారణకు హాజరు కాకుండా సాహిల్.. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టుని ఆశ్రయించాడు. సెలబ్రిటీగా తాను కేవలం ప్రమోట్ చేశానని చెప్పుకొచ్చాడు. యాప్‌లో జరిగే వాటితో తనకు సంబంధం లేదని పేర్కొన్నాడు. కానీ పోలీసులు మాత్రమే ఇతడిని బెట్టింగ్ యాప్ కో-ఓనర్ అని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు.అయితే ఈ బెట్టింగ్ యాప్ ద్వారా అవినీతి జరిగిన డబ్బంతా కూడా హవాలా ద్వారా విదేశాలకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. సాహిల్‌తో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలని కూడా పోలీసులు ఈ కేసులో విచారించే అవకాశాలు ఉన్నాయి.(ఇదీ చదవండి: ప్రముఖ దేవాలయంలో స్టార్ హీరోయిన్ సంయుక్త.. కారణం అదేనా?)

Guntur TDP MP Pemmasani Chandrasekhar said that he would remove the hand that hit him
నన్ను కొట్టిన వాడి చేయి తీసేస్తా ..

సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘కొట్టడం అనేది ఎగైనెస్ట్‌ ది లా... పొరపాటున ఎవడైనా చేస్తే ఏదో ఒక రోజు నాకు టైం వస్తుంది. కొట్టినవాడి చెయ్యి తీసేస్తా.. ఎవడైతే చేశాడో.. ఏదో ఒకరోజు ఐదేళ్లకో, పదేళ్లకో, పదిహేనేళ్లకో.. వాడు ఎంత చేస్తే అంతకు డబుల్‌ చేస్తా....’  ‘ఇదే అమెరికాలో అయితే కాల్చేస్తారు... ’ ‘వైఎస్సార్‌ సీపీ నాయకులు సద్దాం హుస్సేన్‌లా వ్యవహరిస్తున్నారు. సద్దాం హుస్సేన్‌ కూడా తన ఇష్టారీతిగా వ్యవహరించినందునే బంకర్‌లో దాగి ఉన్నా లాక్కొచ్చి కుక్కను కొట్టినట్లు కొట్టి చంపారు.’పై వ్యాఖ్యలు ఎవరో రౌడీనో, గుండానో, చదువుకోని వ్యక్తో చేసినవి కాదు. డాక్టర్‌ చదివి అమెరికాలో వ్యాపారాలు చేసి గుంటూరు తెలుగుదేశం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్‌ పలు సందర్భాలలో చేసినవి. రెండు రోజుల క్రితం ఒక పచ్చ మీడియా అధినేతతో జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక వేళ మీపై కేసులు పెడితే, కొడితే ఏం చేస్తారు అని ప్రశి్నస్తే తనను కొట్టడం చట్టానికి విరుద్దం అని చెబుతూనే తనను కొట్టిన వారిని మాత్రం చెయ్యి తీసేస్తానంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడటం గమనార్హం. దేశంలోనే అత్యంత ధనవంతుడిగా పార్లమెంట్‌ ఎన్నికల బరిలోకి దిగిన చంద్రశేఖర్‌ మొదటి నుంచి డబ్బుందన్న అహంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని సొంత పార్టీ నేతలే వాపోతున్నారు. చంద్రశేఖర్‌ అనాలోచితంగా చేస్తున్న వ్యాఖ్యలు పారీ్టకి చేటు తెస్తున్నాయని వారు అంటున్నారు.ఇప్పటికే ఆయన తీరుపై కాపు సామాజిక వర్గం నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఆయన గుంటూరు బరిలోకి దిగిన తర్వాత  ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క కాపు వర్గం నేతకు కూడా సీటు దక్కలేదు. అయినా పార్టీ కోసం పనిచేయడానికి వెళ్లిన వారికి ఛీత్కారాలే ఎదురయ్యాయి. తమ పారీ్టతో పాటు మిత్రపక్షాలలో ఉన్న కాపు నేతలు కూడా కూటమికి గుడ్‌బై చెప్పి వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నారు. ఇటీవల కాలంలో బీజేపీ ఇంటలెక్చువల్‌ సెల్‌ స్టేట్‌ కో–కనీ్వనర్‌ డాక్టర్‌ టి.వి.రావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందు సాంబశివరావు పార్టీని వీడారు. మరికొంత మంది పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు.  అమెరికాలో రూ.వందల కోట్లు సంపాదించి గుంటూరులో రాజకీయం చేయాలని డిసైడైన చంద్రశేఖర్‌ కనీసం నియోజకవర్గానికి ఏం చేస్తాడో కూడా చెప్పడం లేదు. తాను గెలిచిన తర్వాత అభివృద్ధి చేసి చూపిస్తానని చెబుతున్నాడు. 2014, 2019 ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్‌ టిక్కెట్‌ కోసం ప్రయత్నించిన చంద్రశేఖర్, అనుకోని పరిస్థితుల్లో 2024లో గుంటూరు పార్లమెంట్‌ నుంచి బరిలోకి దిగారు. గెలిస్తేనే ఇక్కడ ఉంటారని, ఓడిపోతే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోతారని తెలుగుదేశం నేతలు అభిప్రాయపడుతున్నారు. 2014, 2019లో చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన గల్లా జయదేవ్‌ను గెలిపిస్తే నియోజకవర్గానికి సేవ చేయకపోగా చివరి నాలుగు సంవత్సరాలు అసలు కనపడకుండా పోయాడు.వరసగా రెండుసార్లు గుంటూరు పార్లమెంట్‌ స్థానం నుంచి విజయం సాధించినా గల్లా   ప్రజలకు చేసిందేమి లేదనే చెప్పాలి. మొదటిసారి 2014లో ఇంటికో ఉద్యోగం వచ్చేలా చేస్తానని, 2019లో తన పరిశ్రమలను గుంటూరు చుట్టుపక్కల స్థాపించి ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీలు గుప్పించారు. హామీలు అమలు చేయకపోగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యాపారాలు చూసుకున్నారు. తన వద్ద డబ్బు ఉంది కాబట్టి డబ్బు కుమ్మరించి  గెలవగలననే ధీమా పెమ్మసాని వ్యక్తం చేస్తున్నారు. తనకు భారీ మెజారిటీ వస్తుందంటూ ప్రగల్భాలు పలుకుతుండటం, నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతుండటంతో అసలుకే ఎసరు వస్తుందన్న భయం తెలుగుదేశం నేతల్లో కనపడుతోంది.

Delhi Congress chief Arvinder Singh Lovely resigns over alliance with aap
కాంగ్రెస్‌కు షాక్‌.. ఢిల్లీ పీసీసీ చీఫ్‌ రాజీనామా

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు ఢిల్లీలో షాక్ తగిలింది.  ఢిల్లీ పీసీసీ అధ్యక్ష పదవికి అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా చేశారు. అవినీతి కేసులు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆప్‌ పార్టీతో పొత్తు పెట్టుకోవడంపై అసంతృప్తితో కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయాలకు భిన్నంగా పార్టీ అధిష్టానం ఆప్తో పెట్టుకోవడంపై నిరసనగా రాజీనామా చేశారు. అధిష్టానం తన అభిప్రాయాలను పట్టించుకోవడంలేదని కాంగ్రెస్‌కు రాసిన రాజీనామా లేఖ పేర్కొన్నారు. 

దినేశ్‌ కార్తిక్‌ (PC: IPL/BCCI)
T20 WC: డీకే అవసరమా?.. వాళ్లిద్దరు బెస్ట్‌!

టీ20 ప్రపంచకప్‌-2024 నేపథ్యంలో జట్ల ప్రకటనకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి మే 1ని డెడ్‌లైన్‌గా విధించింది. ఆలోపు మెగా ఈవెంట్లో పాల్గొనే ఆటగాళ్ల ఎంపికను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ఇప్పటికే జట్టు ఎంపికపై చర్చలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌, ప్రపంచకప్‌ విజేత యువరాజ్‌ సింగ్‌.. మెగా టోర్నీలో ఆడాల్సిన భారత వికెట్‌ కీపర్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.పోటీలో ఆ నలుగురు!కాగా ప్రపంచకప్‌ జట్టులో బెర్తు కోసం రిషభ్‌ పంత్‌, సంజూ శాంసన్‌, కేఎల్‌ రాహుల్‌, దినేశ్‌ కార్తిక్‌ మధ్య పోటీ నెలకొంది. ఈ నలుగురిలో డీకే ఐపీఎల్‌-2024లో ఆర్సీబీకి ఆడుతూ ఫినిషర్‌గా రాణిస్తున్నాడు.ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లలో ‍కలిపి 195.52 స్ట్రైక్‌రేటుతో 262 పరుగులు చేశాడు. మరోవైపు.. ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ దాదాపు 14 నెలల విరామం తర్వాత కాంపిటేటివ్‌ క్రికెట్‌లో అడుగుపెట్టినా.. ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చేశాడు.ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో మూడు హాఫ్‌ సెంచరీల సాయంతో 342 పరుగులు చేశాడు. ఇక సంజూ శాంసన్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌గా రాణిస్తూ.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గానూ రాణిస్తున్నాడు. ఇప్పటి దాకా 385 రన్స్‌తో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.డీకే అవసరమా?ఈ లిస్టులో సంజూ తర్వాత కేఎల్‌ రాహుల్‌ 378 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో యువీ ఐసీసీతో మాట్లాడుతూ.. ‘‘డీకే ప్రస్తుతం బాగానే బ్యాటింగ్‌ చేస్తున్నాడు. కానీ గతసారి(2022) టీ20 వరల్డ్‌కప్‌లో అతడు రాణించలేకపోయాడు.కాబట్టి ఈసారి జట్టుకు ఎంపిక చేసినా అతడికి తుదిజట్టులో చోటు దక్కకపోవచ్చు. నిజానికి రిషభ్‌ పంత్‌, సంజూ శాంసన్‌ రూపంలో ఇద్దరు యువ ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. 

Watch Live AP CM YS Jagan Public Meeting At Tadipatri
Watch Live: తాడిపత్రిలో సీఎం జగన్ బహిరంగ సభ

Watch Live: తాడిపత్రిలో సీఎం జగన్ బహిరంగ సభ 

కీలక మ్యాచ్‌లో పాక్‌ గెలుపు
Pak vs NZ: చావో రేవో.. గట్టెక్కిన పాకిస్తాన్‌! ఆఖరికి..

న్యూజిలాండ్‌తో ఆఖరి టీ20లో పాకిస్తాన్‌ గట్టెక్కింది. తొమ్మిది పరుగుల స్వల్ప తేడాతో గెలుపొంది సిరీస్‌ను సమం చేసుకుంది. కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం కివీస్‌ జట్టు పాక్‌ పర్యటనకు వెళ్లింది.బాబర్‌ ఆజం కెప్టెన్‌గా తిరిగి పగ్గాలు చేపట్టిన తర్వాత పాకిస్తాన్‌కు ఇదే తొలి సిరీస్‌. అది కూడా సొంతగడ్డపై జరుగుతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ క్రమంలో తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో ఆతిథ్య పాక్ విజయం సాధించింది. ఆ మరుసటి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసిన కివీస్‌.. నాలుగో టీ20లో 4 పరుగుల తేడాతో గెలిచి షాకిచ్చింది.  ఈ నేపథ్యంలో ఆతిథ్య జట్టు 1-2తో వెనుకబడింది. కివీస్‌ ద్వితీయ శ్రేణి జట్టు చేతిలో వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోవడంతో బాబర్‌ ఆజం బృందంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో చావోరేవో తేల్చుకోవాల్సిన ఆఖరి టీ20లో పాక్‌ గెలుపొందింది. తద్వారా సిరీస్‌ను 2-2తో సమం చేయగలిగింది.లాహోర్‌లో టాస్‌ ఓడిన పాక్‌.. న్యూజిలాండ్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసింది. బాబర్ ఆజం(44 బంతుల్లో 69), ఉస్మాన్‌ ఖాన్‌(24 బంతుల్లో 31), ఫఖర్‌ జమాన్‌(33 బంతుల్లో 43),  షాబాద్‌ ఖాన్‌(5 బంతుల్లో 15 నాటౌట్‌) రాణించారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్‌ ఐదు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కివీస్‌ తడబడింది. ఓపెనర్‌ టిమ్‌ సెఫార్ట్‌ (33 బంతుల్లో 52), జోష్‌ క్లార్క్‌సన్‌(26 బంతుల్లో 38 నాటౌట్‌) మాత్రమే మెరుగ్గా ఆడారు.మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో 19.2 ఓవర్లలో 169 పరుగులకే ఆలౌట్‌ అయింది. దీంతో తొమ్మిది పరుగుల తేడాతో పాక్‌ విజయం సాధించింది. నాలుగు వికెట్లతో రాణించిన షాహిన్‌ ఆఫ్రిదికి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డుతో పాటు.. ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు కూడా దక్కింది.  Scenes in Lahore following the fifth T20I as the series is squared 🏆🤝#PAKvNZ | #AaTenuMatchDikhawan pic.twitter.com/pBm4SmQi7j— Pakistan Cricket (@TheRealPCB) April 27, 2024

Jabardasth Comedian Gully Boy Bhaskar New House
కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్

మరో కమెడియన్ సొంతిల్లు కట్టుకున్నాడు. 'పటాస్' షోతో గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత పలు కామెడీ షోలతో గుర్తింపు తెచ్చుకున్న గల్లీ బాయ్ భాస్కర్ తాజాగా కొత్త ఇంట్లో అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఫైనల్లీ డ్రీమ్ హౌస్ కట్టుకున్నానని ఇన్ స్టాలో రాసుకొచ్చాడు. ఈ కార్యక్రమానికి తోటి కమెడియన్స్ వచ్చి విషెస్ చెప్పారు.(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?)'పటాస్' షోలో స్టాండప్ కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన భాస్కర్.. సద్దాం, యాదమ్మ రాజు తదితరులతో కలిసి స్కిట్స్ కూడా చేసేవాడు. ఆ తర్వాత అదిరింది, కామెడీ స్టార్స్, కామెడీ స్టాక్ ఎక్సేంజ్ లాంటి షోలు చేశాడు. ఇప్పుడు 'జబర్దస్త్'లో చేస్తున్నాడు. వీటితో పాటు ఈవెంట్స్ లో పాల్గొంటూ రెండు చేతులా సంపాదిస్తున్న భాస్కర్.. ఇప్పుడు మూడు అంతస్థుల ఇల్లు కట్టేసుకున్నారు. ఈ వీడియోని పోస్ట్ చేస్తూ.. తన డ్రీమ్ హౌస్ కట్టుకున్నానని ఎమోషనల్ అయ్యాడు.(ఇదీ చదవండి: ప్రముఖ దేవాలయంలో స్టార్ హీరోయిన్ సంయుక్త.. కారణం అదేనా?)     View this post on Instagram           A post shared by Bhaskar (@gully_boy_bhaskar)

Sakshi Editorial On CM Jagan Wefare Schemes Govt
ఆ పేరే.... ఒక నమ్మకం!

నలభై రెండు డిగ్రీలు దాటిన ఎండల్లో నడిరోడ్లపై గంటల తరబడి వేలాదిమంది ప్రజలు ఒక నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారంటే అర్థం ఏమిటి? వయోభేదం లేదు. కులమతాల పరిధులు లేవు. ఆడామగా తేడా లేదు. ఆబాల గోపాల జన తరంగం ఆ నాయకుడు కనిపించగానే కేరింతలు కొట్టడం దేనికి సంకేతం? ఆ నిరీక్షణలకు అర్థం అక్కడో ప్రభంజనం వీస్తున్న దని! ఒక వేవ్‌ పుట్టిందనడానికి సంకేతాలే అక్కడ కనిపించే పరవశాల కేరింతలు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 27 రోజులపాటు సాగించిన బస్సు యాత్ర సందర్భంగా అటువంటి ఒక ప్రభంజనం పెల్లుబికింది.నాన్నల భుజాల మీద నిలబడి నాయకుడు కనిపించగానే సంభ్రమంతో ‘జగన్‌ మామా’ అని ఎలుగెత్తే చిన్నారులు. ఓ చేత్తో చంటిబిడ్డనెత్తుకొని మరో చేత్తో మొబైల్‌ ఫోన్‌ ఎక్కుపెట్టి దగ్గరగా జగనన్న ఫోటోను తీసుకోవడానికి ఆరాటపడుతున్న ఆడపడుచులు. దూరంగా  బస్సు కనిపించగానే ‘అదిగో నా కొడుకొస్తున్నాడ’ని బోసినవ్వుతో భావప్రకటన చేసే అవ్వా తాతలు. నాయకుని వాహనం ముందూవెనుకా ఉరకలెత్తుతున్న యవ్వనోత్తేజాలు. రోడ్డు పక్కనున్న స్తంభాలను అధిరోహించి, చెట్ల కొమ్మలనాక్రమించి జయ జయధ్వానాలు చేసే చిట్టి తమ్ముళ్లు. ముఖాల మీద భద్రతా భావాన్ని, భరోసాను వేలాడ దీసుకొని రోడ్డు పక్క భవనాల మీద నిలబడి ఎదురు చూస్తున్న నడివయసు అన్నలూ అక్కలూ!ఆనందోద్వేగాల వ్యక్తీకరణలో ఎన్ని ఛాయలుంటాయి? అభినందనాభివ్యక్తిని ఎన్ని రంగుల్లో ప్రకటించవచ్చును? కృత జ్ఞతాపూర్వక అరుపుల్లో, కంటి మెరుపుల్లో కనిపించే సందేశ కావ్యాల్లో ఎన్ని రకాలుంటాయి? బస్సు యాత్రలో పాల్గొన్న జనప్రవాహం దృశ్యాలను ఫ్రేములుగా విడదీసి ఒక్కొక్కటే గమనించండి. లెక్కించలేనన్ని ఛాయలు. ఊహలకందని రంగులు. చదవలేనన్ని సందేశాలు కనిపిస్తాయి. ఒక నాయకుడు లక్షలాది మంది ప్రజలతో విడివిడిగా ముఖాముఖి సంబంధం ఏర్పరుచుకుంటే తప్ప ఇన్ని భావోద్వేగాలు ఉదయించవు. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడిగా కనిపిస్తాడట! జన సమ్మోహన నాయకుడు కూడా అంతే! నాయకుడి మీద ప్రజలకు బలమైన నమ్మకం ఏర్పడినప్పుడే ఈ ఆత్మీయ బంధం అల్లుకుంటుంది. డెబ్బయ్యో దశకంలో ఇందిరాగాంధీ దగ్గర ఈ మ్యాజిక్‌ ఉండేది. కోట్లాదిమంది భారతీయులు ఆమెను ‘అమ్మ’గా పిలుచుకునేవారు. ఎనభయ్యో దశకంలో ఎమ్‌జీ రామచంద్రన్, ఎన్టీరామారావు వారి రాష్ట్రాల్లోని ప్రజలతో ఆత్మీయ స్పర్శను అనుభవించగలిగారు. పేదల జీవితాల్లో మార్పులు తెస్తాడన్న నమ్మకంతో ఎమ్‌జీఆర్‌ను ‘పురట్చి తలైవర్‌’ (విప్లవ నాయకుడు)గా తమిళ ప్రజలు పిలుచుకున్నారు. పేదవాడి అన్నం గిన్నెగా మారిన ఎన్టీఆర్‌ను తెలుగు ప్రజలు ‘అన్న’గా సంబోధించారు. ఐదు పదుల వయసున్న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి తన ఐదేళ్ల పదవీ కాలంలో పేదల బతుకుల్లో విప్లవాత్మక మార్పులకు పునాదులు వేయడంతోపాటు కోట్లాది మంది నోట ఆప్యాయంగా ‘అన్నా’ అని పిలుచుకోగలుగు తున్నారు.ఎమ్‌జీఆర్, ఎన్టీఆర్‌ల సంగతి వేరు. వారు రాజకీయాల్లోకి రాకముందే అఖండ ప్రజాదరణ కలిగిన సినీ హీరోలు. సినిమాల్లో వారు ఎక్కువగా పోషించినవి కూడా ఉదాత్తమైన పాత్రలు. అందువల్ల వారి రాజకీయ ప్రవేశం తమకు మేలు చేస్తుందని ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. ప్రజల నమ్మకాన్ని వారు కూడా వమ్ము చేయలేదు. వారి సంగతి సరే! మరి జగన్‌మోహన్‌రెడ్డికి ఇంతటి జనాకర్షణ ఏర్పడటానికి కారణ మేమిటి? ప్రజలు ఆయన్ను ఇంతగా గుండెల్లో ఎందుకు పెట్టుకున్నారు? ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఆరేళ్లు పనిచేసిన అనంతరం 1989లో ఎన్నికలకు వెళ్లినప్పుడు పూర్వపు ఆదరణ కనిపించలేదు. ఆయన ప్రచార రథం వెంట జనం పరుగులు తీయలేదు. ఆయన రాక కోసం గంటల తరబడి నిరీక్షించడం కనిపించలేదు.జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పరిపాలన తర్వాత మొన్నటి బస్సు యాత్ర సందర్భంగా కనిపించిన దృశ్యాలు వేరు. ఎన్టీఆర్‌ తొలిరోజుల్లో సభావేదిక నెక్కి ‘నేల ఈనిందా... ఆకాశం చిల్లులు పడిందా’ అనగానే జన సముద్ర ఘోష దద్దరిల్లేది. ‘నా రక్తంలో రక్తమైన నా సోదరులారా’ అని ఎమ్‌జీఆర్‌ ప్రసంగం ప్రారంభించగానే జంఝామారుతంలా హర్షధ్వానాలు మార్మోగేవి. కానీ ఐదేళ్ల పాలన తర్వాత కూడా జగన్‌మోహన్‌రెడ్డికి అదే స్పందన. ప్రసంగానికి ముందు చేతిలోకి మైకు తీసుకుని వేళ్లతో దాని మీద తాళం వేయగానే వేల గొంతుకల్లో ఆ ప్రతిధ్వని మార్మోగుతున్నది. మాట మాటకూ చప్పట్ల కోరస్‌. మంత్రం వేసినట్టుగా ఆయన మాటతో మాట కలుపుతున్నారు. జనానికీ, జగన్‌కూ మధ్య ఏర్పడిన ఈ కమ్యూ నికేషన్‌ ఓ అధ్యయనాంశం.జగన్‌మోహన్‌రెడ్డి సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించు కొని పదమూడేళ్లయింది. ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా, ఐదేళ్లు ముఖ్య మంత్రిగా పనిచేసి మరోసారి అధికారం కోసం జనం ముందుకు వెళ్తున్నారు. మళ్లీ భారీ ఆధిక్యతతో అధికారంలోకి వస్తారని అంచనాలు వెలువడుతున్నాయి. ప్రజలతో ఆయన సంబంధం రోజురోజుకూ బలపడుతున్నది. పధ్నాలుగేళ్లు ముఖ్య మంత్రిగా, పదిహేనేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసిన సీనియర్‌ మోస్ట్‌ రాజ కీయవేత్త ప్రజాదరణలో జగన్‌మోహన్‌రెడ్డి దరిదాపుల్లోకి కూడా రాలేకపోతున్నారు. కారణం ఏమై ఉంటుంది?కారణం... ఆయన క్యారెక్టర్‌. మాట తప్పని, మడమ తిప్పని నైజం. ఎట్టి పరిస్థితుల్లో నోటి వెంట ఒక్క అబద్ధం కూడా చెప్పని తత్వం. పేదలకు, అసహాయులకు, రోగగ్రస్థులకు ప్రేమను పంచే స్వభావం. ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసమే ఉపయోగించాలన్న పొలిటికల్‌ ఫిలాసఫీ. అంబేడ్కర్, అబ్రహాం లింకన్‌ల ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఈ లక్షణాలన్నీ ఆయన్ను వర్తమాన రాజకీయ నేతల మధ్య ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఆయన స్వభావానికీ, ఫిలాసఫీకీ పూర్తి భిన్నమైన చిత్రీకరణతో ఆయన ఎదుర్కొన్నంత దుష్ప్రచారాన్ని దేశ రాజకీయ నాయకుల్లో ఎవరూ ఎదుర్కోలేదు. ఆయన మీద జరిగినన్ని కుట్రలు ఎవరి మీదా జరగలేదు. అయినా శిలాసదృశంగా నిలబడగలిగారంటే అందుకు కారణం ఆయన క్యారెక్టర్‌. నిజాయితీ. ఇదిగో ఈ నిజాయితీ జనంలోకి డైరెక్ట్‌గా కమ్యూని కేట్‌ అయింది. గోబెల్స్‌ గొలుసుల్ని తెంచుకొని, మీడియా గోడల్ని  బద్దలు కొట్టుకొని మరీ ఆయన క్యారెక్టర్‌ జనం గుండె ల్లోకి వెళ్లిపోయింది.జగన్‌మోహన్‌రెడ్డి మీద జరిగిన కుట్రల కమామిషు, ఆయన నాయకుడుగా ఎదిగిన కథాక్రమం తెలుగు ప్రజలు ఎరిగిన సంగతులే. చర్విత చర్వణం అనవసరం. ప్రజలిచ్చిన అధికారాన్ని అయిదేళ్లపాటు ప్రజా సాధికారత కోసమే ఆయన ఖర్చు చేశారు. అంతకు ముందు పది శాతమున్న పేదరికాన్ని నవరత్న పథకాల సాయంతో నాలుగు శాతానికి తగ్గించ గలిగారు. వచ్చే ఐదేళ్ల లోపల పేదరికాన్ని నిశ్శేషం చేయడం కోసం ఆ రత్నాలకు మరింత మెరుగుదిద్దినట్టు శనివారం ఆయన విడుదల చేసిన మేనిఫెస్టోలో వెల్లడైంది. మేనిఫెస్టో విడుదల సందర్భంగా చేసిన ప్రసంగం జగన్‌మోహన్‌రెడ్డి నిజాయితీకి అద్దం పట్టింది. ఆయన విజన్‌ను, తాత్వికతను మేనిఫెస్టో ఆవిష్కరించింది. ఒకపక్క ఆయన ప్రత్యర్థి అలవికాని వాగ్దానాలతో చెలరేగిపోతున్నారు. అరచేతిలో వైకుంఠాన్ని చూపెడుతున్నారు. బొందితో కైలాసానికి తీసుకెళ్తానన్న స్థాయిలో వాగ్దానాలు కురిపిస్తున్నారు. సూపర్‌ సిక్స్‌లు కొడతా నంటున్నారు. ప్రత్యర్థి చేస్తున్న ఈ ఊకదంపుడు... ముఖ్యమంత్రిపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఎందుకంటే, ఆయన పేరే ఒక నమ్మకంగా ప్రజల గుండెల్లో స్థిరపడిపోయింది.చంద్రబాబు బోగస్‌ హామీలను పూర్వపక్షం చేస్తూ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడిన తీరు లైవ్‌లో చూస్తున్న లక్షలాది మంది టీవీ వీక్షకులను ఆకట్టుకున్నది. సంపద సృష్టించి హామీలు అమలుచేస్తానని చెబుతున్న చంద్రబాబు వాదనలోని డొల్లతనాన్ని ఆయన బయటపెట్టారు. చంద్ర బాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన పధ్నాలుగేళ్లూ ప్రతిపాదించిన బడ్జెట్‌లన్నీ రెవెన్యూ లోటునే చూపెట్టాయనీ, ఇక సంపద సృష్టించిందెక్కడనీ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. పేదల సంక్షేమం సాధికారతల పట్ల తనకంటే చిత్తశుద్ధి ఉన్న వారెవరూ లేరని చెబుతూ ప్రజలకు ఎంత గరిష్ఠంగా మేలు చేయగలమో ఆ మేరకే హామీలివ్వగలం తప్ప అబద్ధాలు చెప్పలేనని ఆయన స్పష్టం చేశారు.విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పు లకు బాటలు పరుస్తూ, బలహీనవర్గాలు – మహిళల సాధికారత కోసం అడుగులు వేస్తూ సాగిన ఐదేళ్ల పాలన కొనసాగింపుగానే మరో ఐదేళ్ల పాలనకు సంబంధించిన మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. ఇది విప్లవ కర్తవ్యాల కొనసాగింపు. విద్యారంగంలో తాను ప్రవేశపెడుతున్న మార్పులు మరో పదిహేనేళ్లు కొనసాగితే పేదరికం ఆనవాళ్లు కూడా రాష్ట్రంలో కనిపించవని ఆయన నమ్ముతున్నారు. పేద విద్యార్థులందరూ సంపన్నుల బిడ్డలతో సమానంగా నాణ్యమైన విద్యను అభ్యసించగల పరిస్థితులను ప్రజలంతా స్వాగతించాలి. ప్రతి ఇంటినీ ఓ ఫ్యామిలీ డాక్టర్‌ సందర్శించగల అత్యున్నత స్థాయి వైద్య సేవల సమాజాన్ని నిండు మనసుతో ఆహ్వానించాలి. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో తరతరాలుగా వెనుకబడిన సమూహా లను, మహిళలను ముందడుగు వేయించే ప్రయత్నాలకు ప్రజ లందరూ భుజం కాయాలి. ఉన్నతస్థాయి సమాజ నిర్మాణం కోసం జరుగుతున్న ప్రయత్నాల వెన్నంటి నడవాలి. పేదల విముక్తికి అడ్డుగోడలా నిలబడుతున్న పెత్తందారీ శక్తులనూ, వారి రాజకీయ శిబిరాలనూ ఓడించాలి. లాంగ్‌ లివ్‌ ది రివల్యూషన్‌! ఇంక్విలాబ్‌ జిందాబాద్‌!!​​​​​​​వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Dimple Yadav Political History
డింపుల్‌ యాదవ్‌ సింపుల్‌ పొలిటీషియన్‌

డింపుల్‌ యాదవ్‌. సైనిక కుటుంబానికి చెందిన సాదాసీదా అమ్మాయి. అఖిలేశ్‌ యాదవ్‌ను పెళ్లాడి అనూహ్యంగా బడా రాజకీయ కుటుంబంలో అడుగు పెట్టారు. తొలుత తనను అంతగా ఇష్టపడని ములాయం సింగ్‌ యాదవ్‌కు ప్రియమైన కోడలిగా మారారు. తండ్రీ కొడుకుల రాజకీయ విభేదాలను పరిష్కరించే స్థాయికి ఎదిగారు. అంతే అనూహ్యంగా రాజకీయ అరంగేట్రమూ చేసినా స్వయంకృషితో ఎంపీగానూ రాణించారు. అలా ఇంటా బయటా ఫుల్‌ మార్కులు కొట్టేశారు.డింపుల్‌కు తొలుత రాజకీయాలు, కులాల గురించి అస్సలు అవగాహన లేదు. ఆమె పుట్టింది పూర్తి భిన్నమైన కుటుంబం కావడమే అందుకు కారణం. అలాంటిది పెళ్లి తర్వాత వాటిపై లోతుగా అవగాహన పెంచుకున్నారు. కుల సమీకరణాలకు పుట్టిల్లయిన యూపీ వంటి రాష్ట్రంలో బలమైన నాయకురాలిగా ఎదిగారు. స్వతహాగా మితభాషి అయినా వేదిక ఎక్కితే మాత్రం డింపుల్‌ అద్భుతమైన వక్త. యూపీలోని మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారీ అక్కడి నుంచే సమాజ్‌వాదీ అభ్యరి్థగా బరిలోకి దిగుతున్నారు.అనూహ్యంగా రాజకీయాల్లోకి... రాజకీయాల్లోకి రావాలని డింపుల్‌ ఎప్పుడూ అనుకోలేదు. భర్త అఖిలేశ్‌ యాదవ్‌ 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఫిరోజాబాద్, కన్నౌజ్‌ లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసి రెండింట్లోనూ విజయం సాధించారు. కన్నౌజ్‌ను అట్టిపెట్టుకోవడంతో ఫిరోజాబాద్‌కు ఉప ఎన్నిక జరిగింది. దాంతో అక్కడ డింపుల్‌ బరిలో దిగాల్సి వచి్చంది. కానీ బాలీవుడ్‌ నటుడు రాజ్‌బబ్బర్‌ చేతిలో ఓడిపోయారు. 2012లో అఖిలేశ్‌ యూపీ సీఎం కావడంతో కన్నౌజ్‌ లోక్‌సభ స్థానమూ ఖాళీ అయింది. అక్కడి నుంచి డింపుల్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కన్నౌజ్‌కు ప్రాతినిధ్యం వహించిన రెండో మహిళగా, యూపీ చరిత్రలో ఏకగ్రీవంగా ఎంపికైన తొలి మహిళా ఎంపీగా రికార్డు నెలకొల్పారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కన్నౌజ్‌ స్థానం నుంచి మళ్లీ గెలుపొందారు. 2019లో బీజేపీ నేత సుబ్రతా పాఠక్‌ చేతిలో ఓడిపోయారు. 2022లో మామ ములాయం సింగ్‌ యాదవ్‌ మరణంతో మెయిన్‌పురి లోక్‌సభ స్థానం ఖాళీ అయింది. ఉప ఎన్నికలో డింపుల్‌ భారీ విజయం సాధించారు. ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడని డింపుల్‌ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఒంటరిగా ప్రచారం చేశారు. భర్తకు మద్దతుగా 20 ర్యాలీల్లో ప్రసంగించారు. అంతకుముందు కుటుంబ కలహాల వేళ తండ్రీ కొడుకుల మధ్య సఖ్యత నెలకొల్పారు.ప్రేమ, పెళ్లి, పిల్లలు..  డింపుల్‌ మహారాష్ట్రలోని పుణెలో 1978 జనవరి 15న జని్మంచారు. తండ్రి ఆర్మీ కల్నల్‌ రామ్‌చంద్ర సింగ్‌ రావత్‌. వారిది ఉత్తరాఖండ్‌. తండ్రి ఉద్యోగరీత్యా పుణె, భటిండా, అండమాన్, నికోబార్‌ దీవుల్లోని ఆర్మీ పబ్లిక్‌ స్కూళ్లలో చదివారు డింపుల్‌. లక్నో యూనివర్సిటీ నుంచి కామర్స్‌ డిగ్రీ పొందారు. అఖిలేశ్‌ను తొలిసారి చూసినప్పుడు డింపుల్‌ ప్లస్‌ టూ చదువుతున్నారు. ఆమెకు 17 ఏళ్లు, అఖిలేశ్‌కు అప్పుడు 21 ఏళ్లు. ఇంజనీరింగ్‌ చేస్తున్నారు. కామన్‌ ఫ్రెండ్‌ పార్టీలో పరిచయమైంది. తొలి భేటీలోనే మంచి స్నేహితులయ్యారు. పై చదువులకు అఖిలేశ్‌ ఆ్రస్టేలియా వెళ్లారు. అప్పుడు ఇద్దరూ ఉత్తరాలు రాసుకునేవారు. అలా ప్రేమ చిగురించింది. తిరిగొచ్చాక అఖిలేశ్‌పై పెళ్లి ఒత్తిడి పెరగడంతో డింపుల్‌ గురించి అమ్మమ్మకు చెప్పారు. కుటుంబ నేపథ్యాలు వేర్వేరు కావడంతో వారు పెళ్లికి అంగీకరించలేదు. అఖిలేశ్‌ పట్టుదల చూసి తండ్రి ములాయం సింగ్‌ చివరికి పెళ్లికి అంగీకరించారు. అలా 1999న వారు ఒకటయ్యారు. వారికి ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయి అదితి. అర్జున్, టీనా కవలలు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడం, పెయింటింగ్‌ వేయడానికి ఇష్టపడతారు డింపుల్‌. ‘‘పిల్లలే దేశ భవిష్యత్తు. రాజకీయాలతోపాటు పిల్లలకు సమయమివ్వడానికి ఇష్టపడతా’’ అంటారు.  

AP Elections 2024 Political News In Telugu On April 28th Updates
April 28th: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌

April 28th AP Elections 2024 News Political Updates...9:00 AM, Apr 28, 2024జగన్‌ పథకాలు కాపీ కొడుతున్న టీడీపీఆయన పథకాలే వారి మేనిఫెస్టోలోనూ పెట్టారువలంటీర్ల వ్యవస్థ కొనసాగించి... ఎక్కువ వేతనం ఇస్తామంటున్నారుఅంటే అవన్నీ బాగున్నాయని చెబుతున్నట్టే కదాఈ ప్రభుత్వం తీసుకొచి్చన ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ బాగా నచ్చిందిమహిళలైతే ఎక్కువ మంది వైఎస్సార్‌సీపీ వైపేసాక్షి ఇంటర్వ్యూలో సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ 8:30 AM, Apr 28, 2024ఆ కుటుంబ నైజం.. కస్సుబుస్సుచెప్పలేనన్ని నేరాలు.. విప్పలేనన్ని కేసులు..!అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి సామ్రాజ్యం విస్తరణ  గ్రానైట్‌ మాఫియా, నిబంధనలకు పాతరతో ట్రావెల్స్‌ నిర్వహణ  పదుల సంఖ్యలో గాలిలో కలిసిన ప్రాణాలు..?బెట్టింగ్, మట్కా వంటి అసాంఘిక శక్తులకు ఊతంపరిశ్రమలపై ఆధిపత్యం, అక్రమ వసూళ్లు 8:00 AM, Apr 28, 2024సైకిల్‌ ఎక్కేదిలేదు... ప్రచారం చేసేదిలేదుమమ్మల్ని కుక్కలు కంటే హీనంగా చూస్తున్నారుగంగాధర నెల్లూరు టీడీపీ అభ్యర్థికి మేం మద్దతు ఇవ్వంజనసేన, బీజేపీ నేతల తీర్మానం7:30 AM, Apr 28, 2024మేనిఫెస్టో మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్‌: రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్సమరింత ప్రజోపయోగ, అభివృద్ధి కార్యక్రమాలతో 2024 మేనిఫెస్టోసంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగ కల్పనపై ప్రధాన దృష్టిప్రపంచంలో మేటి నగరంగా  విశాఖ అభివృద్ధిబాబులా అబద్దపు హామీలు ఇవ్వం7:00 AM, Apr 28, 2024ఏ సంపద సృష్టించావు బాబూ? సీఎం వైఎస్‌ జగన్‌14 ఏళ్లూ రెవెన్యూ లోటే ఉంటే బాబు సృష్టించిందేంటి?ఆయనకు ముందు, తర్వాత ‘మిగులు’ ఎలా వచ్చింది?ఆయనకు ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం వల్లే కదా!రాష్ట్రానికి ఎక్కువ అప్పులు తెచ్చింది కూడా చంద్రబాబేమూలధన వ్యయం ఎవరి హయాంలో ఎక్కువో తెలియదా?నాడు ఏటా రూ.15,227 కోట్లు ఖర్చుచేస్తే... ఇప్పుడది రూ.17,757 కోట్లుపోర్టులు, హార్బర్లు, మెడికల్‌ కాలేజీలు.. ‘నాడు–నేడు’ అన్నీ ఇప్పుడే..దేశ జీడీపీలో మన వాటా నాడు 4.47 శాతమైతే ఇప్పుతడు 4.83 శాతంఅడ్డంగా జనంపై పడి పన్నులు బాదేసింది కూడా బాబే..నాడు జీడీపీలో పన్నుల వాటా  6.57 శాతం... ఇప్పుడు 6.35 శాతమేగణాంకాలతో సహా వివరించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌6:30 AM, Apr 28, 2024అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్‌సాధ్యం కాదని తెలిసీ అబద్ధాలకు రెక్కలు: సీఎం జగన్‌2014లోనూ జనసేన, బీజేపీతో కూటమి కట్టి ఎడాపెడా వాగ్దానాలుఅధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కి ప్రజల జీవితాలతో చెలగాటమాడారుఇప్పుడు మళ్లీ అదే కూటమి కట్టి సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ టెన్‌ అంటున్నాడుఆ హామీలకు అయ్యే ఖర్చెంత? అమలు సాధ్యమేనా?ఇలా చేయడం దొంగతనం కన్నా దారుణం కాదా? 420.. చీటింగ్‌ కాదా?6:00 AM, Apr 28, 2024సీఎం జగన్‌ మలివిడత ప్రచారం నేటి నుంచే...తాడిపత్రి వైఎస్సార్‌ సర్కిల్‌లో ఉ.10 గంటలకు నిర్వహించే సభతో ప్రచార భేరిమధ్యాహ్నం 12.30 గంటలకు వెంకటగిరి త్రిభువని సర్కిల్‌లో..3 గంటలకు కందుకూరులో కేఎంసీ సర్కిల్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రచార సభలురోజూ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహణసిద్ధం సభలు, ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గ్రాండ్‌ సక్సెస్‌తో వైఎస్సార్‌సీపీలో జోష్‌   

తాజా వార్తలు

Advertisement
Advertisement
Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all
Advertisement
Advertisement
Advertisement