Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

AP Elections 2024: CM YS Jagan Speech At Repalle Road Show
చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్‌

బాపట్ల, సాక్షి: పద్నాలుగేళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు నాయుడి పేరు చెబితే ఒక్క పథకం, చేసిన మంచి గుర్తుకు రాదని.. 58 నెలల పాలనలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులెన్నో తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం రేపల్లెలో నిర్వహించిన ఎన్నికల ప్రచార భేరీలో ఆయన పాల్గొని ప్రసంగించారు.రేపల్లె సిద్ధమేనా? మండుటెండను లెక్క చేయకుండా వచ్చిన మీ అభిమానానికి కృతజ్ఞతలు. మీ అందరి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతల మధ్య మీ బిడ్డ ఇక్కడకు వచ్చిన ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకి, ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితునికీ ..మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు మీ జగన్‌ రెండు చేతులు జోడించి , హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.మరో వారం రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు. చంద్రబాబును నమ్మడం అంటే.. మళ్లీ మోసపోటం. చంద్రముఖిని నిద్ర లేపడమే. చంద్రబాబును మళ్లీ నమ్మడం అంటే.. కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడం. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. సాధ్యం కాని ఆయన మేనిఫెస్టోలకు ఇదే అర్థం. ప్రతీ ఒక్కరూ గుర్తు పెట్టుకోండి.దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో గతంలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకువచ్చాడు. గతంలో ఎప్పుడూ జరగని విప్లవాలను మీ బిడ్డ తీసుకురాగలిగాడు. ఆలోచన చేయండి. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రూ.2లక్షల 70 వేల కోట్ల రూపాయిలు బటన్ నొక్కడం...నేరుగా నా అక్కచెల్లమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అయ్యాయి. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు.. నేరుగా వారి ఖాతాల్లోకే డబ్బులు వెళ్లిపోయాయి. మీ బిడ్డ పాలన కంటే ముందు ఈ మాదిరిగా బటన్లునొక్కడం అన్నది, ఈ మాదిరిగా డబ్బులు నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇన్ని పథకాల ద్వారా వారి చేతికే రావడం అన్నది  గతంలో ఇంతకు ముందు ఎప్పుడైనా చూశారా?గతంలో ఎప్పుడూ చూడని విధంగా.. 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేసిన ప్రభుత్వం ఇది. మీ బిడ్డ పాలనలోనే ఈ మార్పు అంతా.ఇప్పుడు నేను గడగడా కొన్ని పథకాల పేర్లు మచ్చుకు చెబుతాను. ఈ పథకాలన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఈ పథకాలన్నీ మీకు అందాయా అని మీరే ఆలోచించండి. గవర్నమెంట్‌ బడి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, బైలింగువల్‌ టెక్స్ట్‌ బుక్స్‌, బడులు తెరిచేసరికే విద్యాకానుక, బడుల్లో గోరుముద్ద, పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి.. గతంలో ఉన్నాయా? గతంలో జరిగిందా?. పూర్తి ఫీజులతో...ఏ అక్కా...ఏ చెల్లెమ్మా తన పిల్లల చదువుల కోసం అప్పులపాలు అవ్వకూడదని, పూర్తి ఫీజులతో ఒక జగనన్న విద్యాదీవెన, ఓ జగనన్న వసతి దీవెన.. చదువుల కోసం తెచ్చిన ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా చూసారా?..అక్కచెల్లెమ్మలను వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడాలని తోడుగా ఉంటూ..  ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వారిపేరిట రిజిస్ట్రేషన్ చేయించే కార్యక్రమంతో పాటు  అందులో 22 లక్షల ఇళ్లు కడుతున్న కార్యక్రమం కూడా చేపట్టాం. అక్కచెల్లెమ్మల స్వాలంబన, సాధికారత కోసం ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎక్కడైనా ఉందా?అవ్వాతాతలకు ఇంటికే రూ.3000 పెన్షన్‌ కానుక. ఇంటి వద్దకే పౌర సేవలు, పథకాలు.. ఇవన్నీ ఇంటికే వచ్చే పాలనగానీ, పథకాలుగానీ గతంలో ఎప్పుడైనా చూశారా?.  రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా రైతుభరోసా, రైతన్నలకు ఓ ఉచిత పంటలబీమా, సీజన్ ముగిసేలోగా ఇన్‌పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గం.ల ఉచిత విద్యుత్, ఒక ఆర్బీకే వ్యవస్థ...ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడుగుతున్నాను.స్వయం ఉపాధికి అండగా తోడుగా ఉంటూ సొంత ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవరన్నలకు ఓ వాహన మిత్ర,  నేతన్నలకో నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసాతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లకు, పక్కనే తోపుడు బళ్లలో ఉన్నవాళ్లకు, ఇడ్లీ కొట్టు పెట్టుకున్న వాళ్లకు, శ్రమజీవులకు తోడుగా ఉంటూ ఓ చేదోడు, ఓ తోడు అనే పథకం అందిస్తున్నాం. లాయర్లకు ఒక లా నేస్తం. ఇలా స్వయం ఉపాధి రంగంలో ఇంత మందికి తోడుగా ఉంటున్న పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగాయా?పేదవాడు ఆరోగ్యం కోసం అప్పులు పాలవ్వకూడదని... పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు. ఏకంగా ఆరోగ్యశ్రీని విస్తరించాం. రూ.25 లక్షల దాకా ఉచితంగా వైద్యం. పేదవాడికి ఆరోగ్య ఆసరా. గ్రామంలోనే విలేజ్‌ క్లినిక్‌. గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్‌. ఇంటికే ఆరోగ్య సురక్ష. ఇన్ని విప్లవాత్మక మార్పులు పేదవాడి ఆరోగ్యం కోసం ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా చేసిందా అని అడుగుతున్నాను.గ్రామ సచివాలయ వ్యవస్ధతో సమూల మార్పులు. గ్రామంలో అడుగు పెడుతూనే ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది. ఏకంగా 600 రకాల సేవలు అదే గ్రామంలో అక్కడి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 60-70 ఇళ్లకు ఒక వలంటీర్ వ్యవస్థ. పథకాలు నేరుగా ఇంటికి వచ్చే కార్యక్రమం. పెన్షన్లు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమం. పౌరసేవలు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమాలు. రేషన్ బియ్యం నేరుగా ఇంటి వద్దకు వచ్చే కార్యక్రమాలు. గతంలో ఎప్పుడైనా జరిగిందా ? అని అడుగుతున్నాను.గ్రామంలోకి అడుగుపెడుతూనే ఒక సచివాలయ వ్యవస్థ. ఆ సచివాలయ వ్యవస్థ నుంచి నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ ఓ ఆర్బీకే. మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ప్రతి పేదవాడికీ వైద్యంపరంగా అండగా ఉంటూ విలేజ్ క్లినిక్‌. ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో నాడు-నేడు ద్వారా బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం బడి. గ్రామానికే ఫైబర్ గ్రిడ్, గ్రామంలోనే డిజిటల్ లైబ్రరరీ. ఇవన్నీ కాక గ్రామంలోనే నా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం ఓ మహిళా పోలీస్. అక్కచెల్లెమ్మల ఫోన్‌లో దిశ యాప్. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడుగుతున్నాను.మరో పక్క 14 ఏళ్లు సీఎంగా చేసానంటాడు చంద్రబాబు. 3 సార్లు సీఎం అంటాడు. చంద్రబాబు పేరు చెబితే ఏ ఆయన చేసిన మంచి ఒక్కటైనా గుర్తుకు వస్తుందా అని నా అవ్వాతాతలను, అక్కాచెల్లెమ్మలను అడుగుతున్నాను. చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకైనా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్‌ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతున్నాను. మరి ఇలాంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చంద్రముఖి. ఆయన మాయలు, ఆయన మోసాలు ఎలా ఉంటాయో...ఒక్కసారి మీ అందరికీ చూపిస్తాను.మన రాష్ట్రం ఒక పంట పొలం అనుకుంటే.. ఆ పొలాన్ని సాగు చేసే బాధ్యతను జగన్‌ అనే ఒక రైతుకి ఇచ్చారనుకోండి. ఆ జగన్‌ అనే మీ బిడ్డ.. మీ అన్న ఈ ఐదేళ్లలో రాష్ట్రమనేఘీ పొలంలో గడగడా చెప్పిన స్కీమ్‌లు, చేసిన మార్పులు, విప్లవాత్మకమార్పులు.. వీటినే విత్తనాలుగా ఇంటింటా అభివృద్ధి, సంక్షేమం, మంచి భవిష్యత్తు అనే మొక్కల్ని నాటాడు మీ బిడ్డ. ఇవాళ్టికి ఐదు సంవత్సరాలు అయ్యింది. ప్రతీ గ్రామం, పట్టణం, సామాజిక వర్గంలో నాటిన మొక్కలు ఐదేళ్లుగా పెరుగుతూ వచ్చాయి. మరో పదిహేనేళ్లలో ఇవి వృక్షాలు అవుతాయి. పిల్లలు క్వాలిటీ చదువులతో బయటకు వస్తారు. బతుకులు, తలరాతలు మారుతాయి. పేదరికం మటుమాయమైపోతుంది. ఈ బిడ్డ ప్రతీ ఆలోచన పేదవాడి బతుకు ఎలా మార్చాలనే.  మరో వంక చంద్రబాబుని చూస్తే 14 ఏళ్లు పని చేసిన ఈ పెద్దమనిషి పేరు చెబితే.. తాను ఫలానా మంచి చేశాను, స్కీమ్‌ ఇచ్చానని చెప్పుకోలేని స్థితి. ఆయన మోసాలు గమనించాలి. చంద్రబాబు అధికారం వస్తే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో 2014లో ఇచ్చిన ఈ పాంప్‌లెంట్‌ చూస్తే అర్థమవుతుంది.ఇది గుర్తుందా? (2014 టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ).. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే ముగ్గురితో కలిసి కూటమిగా ఏర్పడి ఈ పాంప్లెట్‌ మీద చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి.. ప్రధాన హామీల పేరుతో సంతకం పెట్టిన ఈ పాంప్లెట్‌ను మీ ప్రతి ఇంటికీ పంపించాడు. మరి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అన్నది నేను మిమ్మల్ని అడుగుతాను మీరే సమాధానం చెప్పండి.రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా?రెండో ముఖ్యమైన హామీ.. పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. అక్కాచెల్లెమ్మల పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు,  ఏకంగా రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. ఇందులో ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా?.మూడో ముఖ్యమైన హామీ.. అక్కా మూడో ముఖ్యమైన హామీ.. ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. నేను అడుగుతున్నాను.. రూ.25 వేల కథ దేవుడెరుగు ఒక్కరి ఖాతాలో అయినా కనీసం ఒక్క రూపాయి అయినా డిపాజిట్ వేశాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.ముఖ్యమైన హామీల్లోనాలుగోది.. ఇంటింటికీ ఉద్యోగం. ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ప్రతి నెలా అన్నాడు. ఐదేళ్లు అంటే 60 నెలలు, నెలకు రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికీ రూ.1,20,000 ఇచ్చాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.ఐదో హామీ.. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నారు.  ఇన్ని వేల మంది ఇక్కడున్నారు కదా. చంద్రబాబు హయాంలో చంద్రబాబు మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చారా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.రూ.10,000 కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌, చేనేత పవర్‌ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు.. అయ్యిందా?. విమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్సు ఏర్పాటు చేస్తామన్నాడు.. చేశాడా?.  సింగపూరుకు మించి అభివృద్ధి చేస్తామన్నాడు.. చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్‌ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా? మన రేపల్లెలో ఏమైనా కనిపిస్తోందా? మరి ఆలోచన చేయమని అడుగుతున్నా. కనీసం ఒక్కటంటే ఒక్కటైనా అయిందా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. నేను అడుగుతున్నా పోనీ ప్రత్యేక హోదా అయినా ఇచ్చాడా? దాన్నీ అమ్మేశాడు. మరి నేను అడుగుతున్నా. ఇలాంటి వాళ్లను నమ్మొచ్చా?..ఇప్పుడు మళ్లీ ఇదే ముగ్గురూ కూటమిగా ఏర్పడ్డారు. ఇదే చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ అంట నమ్ముతారా?, సూపర్‌ సెవెన్‌ అంట నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తారంట నమ్ముతారా? ఇంటింటికీ బెంజికారు కొనిస్తారట నమ్ముతారా? ఆలోచన చేయమని మీ అందరినీ కోరుతున్నాను.ఇలాంటి మోసగాళ్లతో, వ్యక్తులతో మనం యుద్ధం చేస్తున్నాం. మళ్లీ వలంటీర్లు ఇంటికే రావాలన్నా.. పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా.. మన వ్యవసాయమూ, హాస్పిటల్‌ మెరుగుపడాలన్నా.. ఇవన్నీ జరగగాలంటే ఏం చేయాలి? ఫ్యాన్‌ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. నొక్కితే 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు.. సిద్ధమేనా?.ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడూ మన గుర్తు ఫ్యాన్, అక్కా మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అక్కడ అవ్వ మన గుర్తు ఫ్యాన్ మర్చిపోకూడదు, చెల్లెమ్మా మన గుర్తు ఫ్యాన్, అక్కడ చెల్లెమ్మలు మన గుర్తు ఫ్యాన్.. అన్నా తమ్ముడు మన గుర్తు ఫ్యాన్. మంచి చేసిన ఈ ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి.మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈవూరు గణేష్, ఎంపీ అభ్యర్థిగా నందిగాం సురేష్‌లపై‌పై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు వారిపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతున్నాను అని చెబుతూ సీఎం జగన్ తన ప్రసంగం ముగించారు.

ధోనిపై విమర్శలు (PC: BCCI)
ధోని జట్టులో అవసరమా?: ‘తలా’పై సంచలన వ్యాఖ్యలు

ఐపీఎల్‌-2024లో పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ మహేంద్ర సింగ్‌ ధోని విషయంలో చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. తొమ్మిదో స్థానంలో అతడు బ్యాటింగ్‌కు వచ్చిన నేపథ్యంలో మేనేజ్‌మెంట్‌తో పాటు ధోని నిర్ణయాన్ని విశ్లేషకులు తప్పుబడుతున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్‌ దిగ్గజం హర్భజన్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధోని బ్యాటింగ్‌ చేయడానికి సుముఖంగా లేనపుడు తుదిజట్టు నుంచి కూడా తప్పుకోవాలంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా తన టీ20 కెరీర్‌లో ధోని తొలిసారి తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు.పంజాబ్‌ కింగ్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు మిచెల్‌ సాంట్నర్, శార్దూల్‌ ఠాకూర్‌ వరుసగా ఏడు, ఎనిమిదో స్థానాల్లో బరిలోకి దిగగా.. వారి తర్వాత వచ్చిన ధోని గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు.తుదిజట్టులో ధోని అవసరమా?పంజాబ్‌ పేసర్‌ హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయి పెవిలియన్‌ చేరాడు. ఈ నేపథ్యంలో హర్భజన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘ఎంఎస్‌ ధోని ఒకవేళ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌ చేయాలనుకుంటే.. అతడు అసలు ఆడనేకూడదు.అలాంటపుడు ధోని బదులు తుదిజట్టులో మరో అదనపు ఫాస్ట్‌ బౌలర్‌ను తీసుకోవడం మంచిది. నిజానికి ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేయాలన్నది ధోని స్వతహాగా తీసుకున్న నిర్ణయమే అయి ఉంటుంది.అలా చేయడం ద్వారా తన జట్టును ప్రమాదంలోకి నెట్టాడు. ధోని కంటే ముందు శార్దూల్‌ ఠాకూర్‌ బ్యాటింగ్‌ రావడం ఏమిటి? ఠాకూర్‌ ఎప్పుడైనా హిట్టింగ్‌ ఆడాడా?ధోని కావాలనే చేశాడు.. నాకైతే నచ్చలేదుధోని అనుమతి లేకుండా జట్టులో ఏమీ జరుగదు. కానీ ధోని ఈరోజు ఎందుకు ఇలాంటి తప్పు చేశాడో అర్థం కావడం లేదు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌ చేయాలన్న ధోని నిర్ణయం నాకైతే అస్సలు నచ్చలేదు’’ అని భజ్జీ కుండబద్దలు కొట్టాడు.డెత్‌ ఓవర్లలో సీఎస్‌కే ఎక్కువ పరుగులు రాబట్టాలనుకుంటే ధోని కచ్చితంగా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తేనే బాగుంటుందని హర్భజన్‌ సింగ్‌ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.రవీంద్రుడి మాయాజాలం కాగా ధర్మశాల వేదికగా పంజాబ్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌ సీఎస్‌కే 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా(26 బంతుల్లో 43 పరుగులు, 3/20) వల్లే ఈ గెలుపు సాధ్యమైంది.‌‌‌‌ ఇక ఫినిషింగ్‌ స్టార్‌ ధోని ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి 110 పరుగులు చేశాడు.చదవండి: అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్‌ కామెంట్స్‌.. వసీం అక్రం కౌంటర్‌The reactions say it all! #IPLonJioCinema #TATAIPL #PBKSvCSK pic.twitter.com/owCucgYN8d— JioCinema (@JioCinema) May 5, 2024

KSR Comment On Amit Shah AP Election Campaign Speeches
అందుకేనా అమిత్‌ షా అలా మాట్లాడింది!

ఇది చాలా ఆసక్తికరమైన విషయం. మన రాజకీయ నేతలు ఎంతటి గొప్ప నటులో అర్ధం చేసుకునే సన్నివేశం అని చెప్పాలి. ఈ మధ్య కేంద్ర హోం మంత్రి అమిత్ షా రిజర్వేషన్ లు రద్దు చేస్తారంటూ చెప్పిన నకిలీ వీడియో ఒకటి బయటకు వచ్చింది. వెంటనే పోలీసులు స్పందించి కొంతమందిని అరెస్టు చేశారు. అందులో కాంగ్రెస్ పార్టీకి చెందినవారు  ఉన్నారు. ఇది మంచి విషయమే.తప్పుడు వీడియోలు, ఆడియోలు సృష్టించి ప్రజలను భయభ్రాంతులను చేయడం ద్వారా ఎన్నికలలో గెలవాలని దష్ట తలంపుతో ఉన్నవారికి ఇది గుణపాఠమే అవుతుంది. ఇంతవరకు ఓకే. కానీ.. అదే కేంద్ర మంత్రి పక్కన అలాంటి కేసులో ఉన్న ఒక వ్యక్తి నిలబడితే.. ఆ వ్యక్తిని ఆ మంత్రి పొగుడుతుంటే ఏమని అనాలి? ఎలా చూడాలి? ఇది ప్రజాస్వామ్య లోపమా? లేక వ్యక్తులలో నిజాయితీ,నిబద్దత లేనితనమా ?అంటే ఏమి చెబుదాం. ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఒక ఐవీఆర్ఎస్ ద్వారా లక్షల మందికి తప్పుడు సమాచారాన్ని పంపించిన కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాన నిందితుడుగా సీఐడీ కేసు నమోదు చేసింది. ఆయన తనయుడు లోకేష్ రెండో నిందితుడుగా ఉన్నారు. వీరిద్దరూ కాకుండా ఇంకో పది మందిపై కూడా కేసు నమోదైంది. ఇది ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీఐడీ పెట్టిన కేసే. హోం మంత్రి అమిత్ షా పై తప్పుడు వీడియో సృష్టిస్తే  దేశవ్యాప్తంగా  హడావుడి చేసి కొందరిని ఇప్పటికే అరెస్టు చేస్తే, మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై తప్పుడు ఫోన్ కాల్ సృష్టించి ప్రచారం చేసినట్లు  అభియోగాలు ఎదుర్కుంటున్న చంద్రబాబు నాయుడు కేంద్ర  హోం మంత్రి పక్కన ఎలా ప్రచారంలో పాల్గొనగలుగుతారు. ఆ తదుపరి సాయంత్రానికే ఏపీ డీజీపీని బదిలీ చేయడం జరిగింది. అంటే.. ఏమిటి అర్ధం?.అమిత్ షా మార్ఫింగ్ వీడియోలు తయారు చేసినవారు జైలకు వెళతారు. అదే ఏపీ ముఖ్యమంత్రి పై తప్పుడు ఆడియోలు సృష్టిస్తే ,నిందితులపై కేసు నమోదు చేస్తే.. ఏకంగా డీజీపీనే బదిలీ అవుతారు.  కూటమి నేతలు చంద్రబాబు,పురందేశ్వరి, పవన్ కల్యాణ్ వంటివారు చేసే ఒత్తిడికి లొంగే వారు డీజీపీని బదిలీ చేశారని జనం అనుకోరా?. ఇది డబుల్ స్టాండర్స్ కాదా? అంటే ఏమి చెబుతాం.విశేషం ఏమిటంటే ఆ చంద్రబాబు నాయుడుకు అమిత్ షా సర్టిఫికెట్ ఇవ్వడం. ఆయన వచ్చి జగన్ పై విమర్శలు చేయడం. 2019 ఎన్నికలకు ముందు తిరుపతిలో టీడీపీ కార్యకర్తలు అమిత్ షాపై రాళ్లదాడి చేసి అవమానించారు. దేశ ప్రధాని మోదీని ఏకంగా టెర్రరిస్టు, మంచివాడు కాదు.. అసలు మోడీ దేశంలో ఉండడానికే తగడు అని దూషించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు వారిద్దరి సరసన దర్జాగా కూర్చోగలుగుతున్నారు. ఈ ఘట్టాలలో ఎవరు కరెక్టు అనుకోవాలి?. చంద్రబాబు ఏమైనా తన ప్రకటనలను ఉపసంహరించుకున్నట్లు ,క్షమాపణ కోరినట్లు తెలిపారా?.. అంటే అదేమీ లేదు. మరి దేనికి చంద్రబాబు వారి వద్దకు వెళ్లి బతిమలాడుకున్నారు. బీజేపీవారు ఎందుకు లొంగిపోయారు అంటే.. అదే బ్రహ్మ రహస్యం.  పోలవరం ప్రాజెక్టు గురించి అమిత్ షా మాట్లాడారు. చంద్రబాబు రాష్ట్రంలో, కేంద్రంలో మోదీ వస్తే రెండేళ్లలో పూర్తి చేస్తామని చెబుతున్నారు.అంటే వేరే వారు వస్తే పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వబోమని బెదిరిస్తున్నారా? ఏపీలో గూండాగిరిని అంతం చేసేందుకే టీడీపీతో జతకట్టామని అమిత్ షా చెబితే నమ్మడానికి ఎవరూ చెవిలో పూలు పెట్టుకుని లేరు. 2019 ఎన్నికల ముందు ఆ తర్వాత ఎన్ని రకాలుగా చంద్రబాబును బీజేపీ నేతలు విమర్శించారో  తెలియదా?. ఇప్పుడు వచ్చి కొత్త కబుర్లు చెబితే ఎవరు నమ్ముతారు?.  గత ఐదేళ్లలో ఏపీలో ఉన్న ప్రశాంతత మరెక్కడైనా ఉందా?. కేవలం టీడీపీ, ఆ పార్టీని మోస్తున్న మీడియానే ఏ చిన్న ఘటన జరిగినా.. చిలవలు, పలవలు చేసి ప్రచారం చేయడం మినహాయించి మరేయితర ఘటనలు ఏమీ జరగలేదని చెప్పాలి. అమరావతి రాజధాని చేయడానికి కూటమి కట్టామని అంటున్నారు. అప్పట్లో ఈ అమరావతి , పోలవరం ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడుకు ఏటీఎంలు అయ్యాయని, ప్రధాని సహా పలువురు బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు బహుశా అమిత్ షా మర్చిపోయి ఉండొచ్చు. ధర్మవరంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. అదేదో తెలుగుదేశం పార్టీవారు రాసిచ్చిన స్క్రిప్ట్ ను అమిత్ షా చదివినిట్లు  ఉంది తప్ప.. బీజేపీ భావజాలానికి తగ్గట్లుగా మాట్లాడినట్లు అనిపించదు.  కీలకమైన విశాఖ నగరానికి వ్యతిరేకంగా అమిత్ షాతో కూడా మాట్లాడించినట్లు అనుకోవాలా?.జగన్ పై ఏదో అవినీతి ఆరోపణలు చేయాలి కనుక చేసినట్లు ఉంది తప్ప, ఎన్నికల కోసం.. టీడీపీని సంతృప్తిపరచడం కోసం ఉపన్యసించినట్లు ఉంది తప్ప, అమిత్ షా సొంత ఆలోచనలకు తగ్గట్లు మాట్లాడలేదు. ఏపీలో అవినీతి గురించి మాట్లాడడానికి ముందు అమిత్ షా కొన్నింటికి సమాధానాలు చెప్పవలసి ఉంటుంది.  2019 లో టీడీపీ ఓటమి తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆదాయపన్ను శాఖ చంద్రబాబు పీఎస్‌ ఇంటిలో సోదాలు చేసి రెండువేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు కనుకొన్నట్లు సీబీటీడీ ప్రకటించిందా?లేదా?.. ఆ కేసు ఇంతవరకు అతీగతి లేకుండా పోయిందేమిటి?.. మోదీని, అమిత్ షా ను సంతోషపెడితే ఎంతటి కేసు అయినా హుష్ కాకి అవుతుందా?ఆదాయపన్ను శాఖ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చి మనీలాండరింగ్ తదితర ఆరోపణలపై ప్రశ్నలు వేస్తే చంద్రబాబు ఏదో దాటవేత జవాబులు ఇస్తూ తప్పించుకుంటుంటే.. కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఎందుకు కూర్చుంది?.స్కిల్ స్కామ్ తో సహా పలు కుంభకోణాలలో చంద్రబాబు పాత్ర  ఉందని కేసులు నమోదు అయితే.. అలాంటి వ్యక్తి నాయకత్వంలోని తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని అమిత్ షా జనానికి సుద్దులు చెబుతున్నారు. చంద్రబాబు చాలా అభివృద్ది చేశారట. జగన్ వచ్చాక జరగలేదట. ఇదే మాట గతంలో ఎన్నడూ ఎందుకు చెప్పలేదు?. అప్పట్లో చంద్రబాబు రాష్ట్రాన్ని అదోగతి పాలు చేశారని బీజేపీ నేతలు విమర్శలు చేశారే. అప్పటి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏకంగా వంద లేఖలు రాసి చంద్రబాబు అవినీతిని ప్రశ్నించారే. అవన్నీ మర్చిపోయారా?..ఇవన్నీ ఎందుకు.. బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసిన మాజీ ఎంపీ సుజనా చౌదరి బిజెపి పక్షాన ఎమ్మెల్యేగా విజయవాడ పశ్చిమం నుంచి పోటీచేస్తున్నారు.  వందల కోట్లకు ఎగనామం పెట్టడమే కాకుండా కొన్ని చీటింగ్ కేసులలో కూడా ఉన్న మరో మాజీ ఎంపీ సీఎం రమేష్ అనకాపల్లి నుంచి లోక్ సభకు పోటీచేస్తున్నారు. అంతకుముందు వీళ్లు టీడీపీలో ఉన్నారు. బీజెపీలో చేరగానే వాషింగ్ మెషిన్ వేసి శుద్ది చేసేశారని సోషల్ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యానాలు వచ్చాయి.  దేశం అంతటా ఇదే కథ నడుపుతున్న బీజేపీ పెద్దలు చంద్రబాబు నాయుడుకు సర్టిఫికెట్ ఇవ్వడం చూస్తుంటే నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అన్న నానుడి గుర్తుకు వస్తుంది.శ్రీవెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడతాం అని కూడా షా చెప్పారు. అహా ఎంత గొప్ప మాట అండి.ఇప్పుడు తిరుమల పవిత్రతకు ఏమీ భంగం రాలేదు. బీజేపీ వాళ్లు వచ్చి ఏ చిచ్చు పెట్టకుండా ఉంటే చాలు.తెలంగాణలో రెచ్చిపోయి ముస్లిం రిజర్వేషన్  లు రద్దు చేస్తామని ప్రసంగించే అమిత్ షా.. ఏపీలో మాత్రం ఆ ఊసే ఎత్తినట్లులేరు. ఏమిటి దీని భావం. ఏపీలో తెలుగుదేశం కూటమిలో ఉన్నందున ముస్లింలను మోసం చేయడానికి ఇక్కడ ఆ ప్రస్తావన రాకుండా జాగ్రత్తపడ్డారా?. ఇదేనా మీ నిబద్దత. ఇది ప్రజలను వంచించడం కాదా?తెలంగాణలోనే కాదు.. ఏపీలో కూడా ముస్లింలు  రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి కదా?. వాటి గురించి నోరు ఎత్తకుండా వెళ్లిపోవడంలో ఆంతర్యాన్ని ప్రజలు గుర్తించకపోరు.ఏది ఏమైనా చంద్రబాబుతో పొత్తు ఇష్టం లేకపోయినా, ఏదో బలమైన  ఒత్తిడి కారణంగా బీజేపీ ఈ కూటమిలో కలవడానికి అంగీకరించినట్లు అనిపిస్తుంది. అందుకే ఏదో  మొక్కుబడిగా నాలుగుముక్కలు మాట్లాడి అమిత్  షా వెళ్ళినట్లు భావించవచ్చా?!.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Mudragada Padmanabham Serious Comments On Pawan Kalyan
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ

సాక్షి, కాకినాడ: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై సీరియస్‌ అయ్యారు వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభం. పవన్‌ మీ నటన సినిమాల్లో చూపించండి.. రాజకీయాల్లో కాదు అని హితవు పలికారు. అలాగే, పైకి తనపైన ప్రేమ ఉన్నట్టు నటించాల్సిన అవసరంలేదని చురకలంటించారు.కాగా, ముద్రగడ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నేను ఏనాడూ చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ గురించి మాట్లాడలేదు. ఇంట్లో ఉన్న నన్ను పవన్‌ రోడ్డు మీదకు లాగాడు. హైదరాబాద్‌ నుంచి వచ్చి నా కుటుంబంలో చిచ్చుపెట్టాడు. ముద్రగడ కూతురు అని నా కుమార్తెను అందరికీ పరిచయం చేశాడు. మీరు వదిలేసిన మీ ఇద్దరు భార్యలను.. ఇప్పుడు కలిసున్న మూడో భార్యను అందరికీ ఎందుకు పరిచయం చేయలేదు?.అలాగే, మీ కుటుంబంలో డ్రగ్స్‌ సేవించి పట్టుబడిన అమ్మాయిని ఎందుకు పరిచయం చేయలేదు. ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన మరో అమ్మాయిని ఎందుకు పరిచయం చేయడం లేదు. పైకి నా మీద ప్రేమ ఉన్నట్లు పవన్ నటిస్తున్నాడు. పవన్ మీ నటన సినిమాల్లో చూపించండి.. రాజకీయాలలో కాదు. నాకూ నా కుమార్తెకు బంధాలు తెగిపోయాయి అని ఆమె భర్త.. మామకు చెబుతున్నాను. వీలైతే ఆమెను టీవీ డిబెట్లు.. జనసేన ఎన్నికల ప్రచారాలకు తిప్పాలని వారిని కోరుతున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు. 

Delhi Liquor Case: BRS MLC Kavitha Bail Rejected
కల్వకుంట్ల కవితకు బిగ్‌ షాక్‌

న్యూఢిల్లీ, సాక్షి: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ.. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో అరెస్టైన కల్వకుంట్ల కవితకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో బెయిల్‌ కోరుతూ ఆమె వేసిన రెండు పిటిషన్లను ట్రయల్‌ కోర్టు  కొట్టేసింది.ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ, సీబీఐ అరెస్టులను సవాల్‌ చేస్తూ కవిత విడివిడిగా బెయిల్‌పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై మూడు రోజులపాటు విచారణ జరిగింది. రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా.. ఈ బెయిల్‌ పిటిషన్లపై వాదనలు విన్నారు. చివరకు బెయిల్‌ నిరాకరిస్తూ ఇవాళ(సోమవారం) తీర్పు ఇచ్చారు.లిక్కర్‌ స్కాం కేసులో మార్చి 15వ తేదీన హైదరాబాద్‌లోని తన నివాసంలో కవితను ఈడీ అరెస్ట్‌ చేసింది. ఆపై జ్యూడీషియల్‌ రిమాండ్‌ కింద తీహార్ జైల్లో ఉన్న కవితను.. సీబీఐ కూడా అరెస్ట్‌ చేసింది.  ఢిల్లీ మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా తయారుచేయించి  అక్రమార్జన  చేశారని కవితపై అభియోగాలు నమోదు చేశాయి ఇరు దర్యాప్తు సంస్థలు. మద్యం విధానాన్ని అనుకూలంగా రూపొందించినందుకుగానూ ఆమ్‌ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్ల రూపాయల లంచం కవిత ఇచ్చారని, ఆ వంద కోట్లను సౌత్‌ గ్రూప్‌ సిండికేట్‌ నుంచి వసూలు చేశారని ఈడీ, సీబీఐలు ఆరోపించాయి. అంతేకాదు.. ఈ వ్యవహారంలో పైసా పెట్టుబడి లేకుండానే కవిత ఇండోస్పిరిట్ లో 33% వాటా కవిత దక్కించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.  వాదనలు ఇలా.. ఈ కేసులో కవితే ప్రధాన కుట్రదారు అని, ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని ఇటు ఈడీ, అటు సీబీఐ వాదించాయి. ఆమె బయటకు వస్తే సాక్షాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, సాక్షులను బెదిరించే అవకాశం ఉందని వాదనలు వినిపించాయి.అయితే కేవలం రాజకీయ కక్షతో ఈ కేసు పెట్టారని, కేవలం అప్రూవర్ల స్టేట్‌మెంట్లను ఆధారంగా చేసుకుని కవితను అరెస్ట్‌ చేశారని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. అంతేకాదు ఈ కేసులో కవితకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్షాలు లేవని వాదనలు వినిపించారు. ఇదీ చదవండి: కవిత అరెస్టు అక్రమం కాదు! వాదనలు విన్న న్యాయమూర్తి కావేరీ బవేజా.. ఈడీ, సీబీఐ వాదనలతో ఏకీభవిస్తూ కవిత పిటిషన్లను డిస్మిస్‌ చేశారు.రేపటితో కవిత జ్యుడీషియల్‌ కస్టడీ ముగియనుంది. బెయిల్‌ నిరాకరిస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ హైకోర్టును ఆమె ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Why Do Not Drink Water From Coconut Directly
సమ్మర్‌లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?

ఎండలు చుర్రుమంటున్నాయి. ఒక్కటే దాహం, దాహం అ‍న్నంతగా భగభగమంటోంది వాతావరణం. దీంతో శరీరం హైడ్రేట్‌గా ఉంచేందుకు చల్లటి పానీయాలు, పళ్ల రసాలు వెంట పరిగెడతారు అందరూ. ఐతే చాలామంది కొబ్బరినీళ్లు మంచివని. వాటికే ప్రాధాన్యత ఇస్తారు. అందులోనూ కొబ్బరి నీళ్లు రుచిగా ఉండటమేగాక తక్షణ శక్తిని అందిస్తాయి. అందువల్ల కొబ్బరి బోండాలను తాగేందుకు ఇష్టపడుతుంటారు. అయితే వేసవిలో కొబ్బరి బోండాలను కొనగానే నేరుగా తాగేస్తాం. అలా అస్సలు చేయకూడాదట. నేరుగా కొబ్బరి బొండం నుంచి నీళ్లు తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణలు. అదేంటీ..?నిజానికి ఎండ వేడిలో వస్తూ రోడ్డుపై కొబ్బరి బోండాలు కనిపించగానే హమ్మయ్యా అనుకుని వెంటనే కొబ్బరి బోండాలు కొని నేరుగా తాగేస్తాం. అలా అస్సలు చేయకూడదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. బయటి వాతావరణం వేడిగా ఉంది. ఇక ఈ బోండాలు కూడా ఎంతసేపు ఈ వేడిలోనే ఉన్నాయన్నది తెలియదు. అందువల్ల అలా అస్సలు చెయ్యొద్దని చెబుతున్నారు. ఎందుకంటే వాటిని కుప్పలుగా వేసి విక్రయిస్తుంటారు. అలా చాలా రోజుల నుంచి లేదా చాల సేపటి నుంచి ఎండలో ఉండిపోవడంతో దానిలో ఒక రకమైన ఆకుపచ్చని ఫంగస్‌ వస్తుందట. అందువల్ల కొబ్బరి బోండాన్ని కొన్న వెంటనే నేరుగా స్ట్రా వేసుకుని తాగేయ్యకుండా..ఓ పారదర్శకమైన గాజు గ్లాస్‌లో వేయించుకుని తాగాలని అంటున్నారు. అందులో నీరు స్పష్టంగా, ఎలాంటి చెడు వాసన లేదని నిర్థారించుకుని తాగడం అనేది ముఖ్యం అంది. ఎందుకంటే ఈ ఎండల ధాటికి ఎలాంటివైనా తొందరగా పాడైపోతాయి. నిల్వ చేయడం కష్టంగా ఉంటుంది. అందువల్ల దాహం అంటూ ఆత్రతగా కొబ్బరి నీళ్లు తాగేయొద్దని సూచిస్తున్నారు. ఈ ఫంగస్‌ ఎలా వ్యాపిస్తుందంటే..ఆకు పచ్చని ఫంగస్‌ ఆహార పదార్థాల ఉపరితలాలపై వస్తుంది. అది ఆహార పదార్థాన్ని కుళ్లిపోయేలా చేయడం ద్వారా పోషకాలు పొందుతుంది. ఇది ఎగురుతూ ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తుంది. చాలా కఠినమైన వాతావరణంలో చాలా వేగంగా వృద్ధి చెందుతుంది. తగినంత నీరు, సేంద్రియ పదార్థాలలో ఉన్న పదార్థాలపై ఇది పెరగడం ప్రారంభించి, నెమ్మదిగా మొత్తం వ్యాప్తి చెందుతుంది. ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు..తీవ్రమైన అలెర్జీ, తుమ్ములు, ఎరుపు లేదా నీటి కళ్లు, చర్మంపై దద్దుర్లు, ముక్కులో దురద, కళ్ల నుంచి నీళ్లు రావడం. దగ్గు, శ్వాస ఆడకపోవడం, తదితర లక్షణాలు ఉంటాయి. ఈ ఫంగస్‌లో హానికరమైన మైకోటాక్సిన్‌లతో నిండి ఉంటాయి. ఇది తీవ్రమైన విషాన్ని కలిగిస్తుంది. కడుపు, మూత్రపిండం, కాలేయం వంటి వాటిల్లో అనేక సమస్యలకు దారితీస్తుంది. ఒక్కోసారి హార్మోన్ల  అసమతుల్యతకు దారితీసి క్యాన్సర్‌ ప్రమాదానికి దారితీస్తుంది. నివారణ..ఆహార పదార్థాలను సరైన విధంగా నిల్వ చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అరికట్టవచ్చు. తాజా పండ్లు, కూరగాయాలను మాత్రమే తీసుకుంటే ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చుచెడిపోయే వస్తువులను ఫ్రిజ్‌లో అస్సలు ఉంచకండిగాలి చొరబడని కంటైనర్లలో ఆహార పదార్థాల్ని నిల్వ చేయాలి.కొన్ని రకాల ఆహార పదార్థాలు ఎంత కాలం సురక్షితంగా ఉంటాయో తెలుసుకుని నిల్వ ఉంచడానికి యత్నించాలి.(చదవండి: నటుడు శ్రేయాస్‌ తల్పాడేకి గుండెపోటు..ఆ వ్యాక్సినే కారణమా..?) 

Patas Faima About Breakup Rumours with Praveen
ప్ర‌వీణ్‌తో బ్రేక‌ప్‌.. తొలిసారి స్పందించిన ఫైమా

తెలుగు బుల్లితెర షోల‌లో ఒక‌ప్పుడు మేల్ క‌మెడియ‌న్ల‌దే ఆధిప‌త్యం ఉండేది. రానురానూ ప‌రిస్థితిలో మార్పు వ‌చ్చింది. లేడీస్ తాము కూడా కామెడీ పండించ‌‌గ‌ల‌మ‌ని నిరూపించుకున్నారు. కామెడీ క్వీన్స్‌గా పేరు తెచ్చుకుంటున్నారు. అలా ప‌టాస్‌, జ‌బ‌ర్ద‌స్త్ షోల‌లో ఫ‌టాఫ‌ట్ పంచ్‌లు పేలుస్తూ అంద‌రికీ ద‌గ్గ‌రైంది ఫైమా. ప్ర‌వీణ్‌తో ల‌వ్‌!అదే షోలోని మ‌రో క‌మెడియ‌న్ ప్ర‌వీణ్‌తో ఫైమా ప్రేమాయ‌ణం న‌డుపుతుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. వీరిద్ద‌రూ క‌లిసి రీల్స్ చేయ‌డం, గిఫ్టులు ఇచ్చిపుచ్చుకోవ‌డం చూసి ఇదంతా నిజ‌మే అని జ‌నాలు ఫిక్స‌యిపోయారు. కానీ అంత‌లోనే బ్రేక‌ప్ జ‌రిగిందంటూ రూమ‌ర్స్ వ‌చ్చాయి. ఆ మ‌ధ్య ప్ర‌వీణ్ త‌న ప్రేమ‌ను ఫైమా రిజెక్ట్ చేసింద‌ని వెల్ల‌డించాడు. ఆ ఫేమ్ వాడుకున్నాంతాజా ఇంట‌ర్వ్యూలో ఫైమా ఈ విష‌యం గురించి మాట్లాడింది. 'టీవీ షోల‌లో క‌నిపించే జోడీలేవీ నిజం కాదు. అవి నిజ‌మ‌ని న‌మ్మొద్దు. ప్ర‌వీణ్‌, న‌న్ను ఆన్‌స్క్రీన్‌లో జోడీగా చూపించారు. మా జంట‌ను ఆద‌రించారు. దాన్ని వాడుకుంటూ యూట్యూబ్‌లో వీడియోలు చేశాం. ప్ర‌వీణ్‌కు, నాకు మ‌ధ్య కొన్ని వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లున్నాయి. అవి చెప్పుకోలేం.. అందుకే దూరం కావాల్సి వ‌చ్చింది. మాట్లాడుకోవ‌ట్లేదు కూడా!వ్య‌క్తిగ‌త విష‌యాల వ‌ల్లేమాకు గొడ‌వ జ‌రిగిన‌ప్పుడు దాన్ని ప‌క్క‌న‌పెట్టేయాలే త‌ప్ప‌ దాన్ని అంద‌రి ముందూ చెప్పుకుని గొడ‌వ‌ను పెద్ద‌ది చెయ్య‌డం నాకిష్టం లేదు. అంత‌కుముందు మా రిలేష‌న్, అండ‌ర్‌స్టాండింగ్ అంతా బాగుండేది. వ్య‌క్తిగ‌త విష‌యాల వ‌ల్ల మేము దూర‌మ‌య్యాం. అలాంట‌ప్పుడు ప‌ర్స‌న‌ల్‌గా నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి మాట్లాడాలి. సింప‌థీకానీ త‌న‌కు పేరెంట్స్ లేక‌పోవ‌డంతో అత‌డు మీడియా ముందు మాట్లాడే మాట‌లు సింప‌థీకి దారి తీస్తున్నాయి. త‌న మీద నేను నింద వేయ‌డం లేదు. కానీ త‌న మీద సింప‌థీతో అత‌డు ఏం చెప్పినా జ‌నాలు న‌న్ను నెగెటివ్ చేస్తున్నారు. ద‌య‌చేసి మా రిలేష‌న్‌కు ఏ పేరూ పెట్టకండి' అని ఫైమా చెప్పుకొచ్చింది.చ‌ద‌వండి: ఒక్క పొర‌పాటుతో జాత‌క‌మే మారిపోయింది! అస‌లు పేరేంటంటే?

Russia President Vladimir Putin orders nuclear drills amid Ukraine war
న్యూక్లియర్‌ డ్రిల్స్‌కు ఆదేశించిన పుతిన్‌

ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న తరుణంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌కు సమీపంలో రష్యన్‌ మిలటరీ, నేవి ఆధ్వర్యంలో​ అణ్వాయుధాల డ్రిల్స్‌ నిర్వహించాలని అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆదేశించినట్లు ఆ దేశ రక్షణ శాఖ సోమవారం ప్రకటించింది. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అణుయుద్ధానికి సంబంధించి పుతిన్‌ పలుసార్లు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే.న్యూక్లియర్ డ్రిల్స్‌ చేస్తున్న సమయంలో నాన్‌ స్ట్రాటజిక్‌ న్యూక్లియర్‌ ఆయుధాలను ఉపయోగించటంపై శిక్షణ తీసుకోనున్నట్లు రక్షణ శాఖ తెలిపింది. నాన్‌ స్ట్రాటిజిక్‌ న్యూక్లియర్‌ ఆయుధాలను టెక్నికల్‌ వెపన్స్‌ అంటారు. యుద్ధ క్షేత్రాల్లో ఉపయోగించే మిసైల్స్‌ గుండా వీటిని ప్రయోగిస్తారు.కొన్ని పశ్చాత్య దేశాల నుంచి తమ దేశానికి పొంచి ఉన్న ముప్పును  దృష్టిలో పెట్టుకొని సమీప భవిష్యత్తులో న్యూక్లియర్‌ డ్రిల్స్‌ చేపడతామని రష్యా రక్షణ శాఖ తెలిపింది. అక్రమిత ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో సైనిక బలగాలతో పాటు.. వైమానిక, నౌకా దళాలు న్యూక్లియర్‌ డ్రిల్స్‌ పాల్గొంటాయని పేర్కొంది. అమెరికాతో గతంలో చేసుకున్న ‘న్యూ స్టార్ట్‌ ఒప్పందం’నుంచి తాత్కాలికంగా తప్పుకొంటున్నామని గతేడాది రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే.

Delhi Police seized 15 tones of spurious spices arrest three individuals
15 టన్నుల కల్తీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్టు

ఈశాన్య దిల్లీలోని కరవాల్ నగర్ ప్రాంతంలో కల్తీ మసాలా దినుసుల తయారీకి సంబంధించిన భారీ రాకెట్‌ను పోలీసులు కనుగొన్నారు. రెండు కర్మాగారాలపై దాడులు నిర్వహించి 15 టన్నుల నకిలీ మసాలా దినుసులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కల్తీకి కారణమైన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసుకు సంబంధించి డీసీపీ పవేరియా మాట్లాడుతూ..‘మసాలా దినుసుల్లో కల్తీ జరుగుతోందనే సమాచారం మేరకు ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేశాం. దిల్లీ పరిసర ప్రాంతాల్లో సెర్చ్‌ నిర్వహించాం. ఆపరేషన్ సమయంలో దిలీప్ సింగ్ (46) అనే వ్యక్తికి చెందిన ఒక ప్రాసెసింగ్ యూనిట్‌లో పాడైపోయిన ఆకులు, నిషేధిత పదార్థాలను ఉపయోగించి కల్తీ పసుపును ఉత్పత్తి చేయడం గుర్తించాం. బియ్యం, మినుములు, కలప పొట్టు, మిరపకాయలు, ఆమ్లాలు, నూనెలను కలిపి వీటిని తయారుచేస్తున్నట్లు కనుగొన్నాం. సెర్చ్‌ సమయంలో సింగ్‌తోపాటు అక్కడే ఉన్న సర్ఫరాజ్(32) పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని వెంటనే అదుపులోకి తీసుకుని విచారించాం. ఈ కల్తీ మసాలా దినుసులు మార్కెటింగ్‌ చేసేది ఖుర్సీద్ మాలిక్ (42) అనే మరోవ్యక్తి అని తేలింది. దాంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నాం. సర్ఫరాజ్‌కు కరవాల్ నగర్‌లోని కాలీ ఖాతా రోడ్‌లో మరో ప్రాసెసింగ్ యూనిట్‌ ఉంది. ఈ ముఠా 2019 నుంచి కల్తీ మసాలా దినుసుల వ్యాపారం చేస్తున్నారు. ఈ రెండు యూనిట్లలో నిలువ ఉన్న సుమారు 15 టన్నుల కల్తీ మసాలా దినుసులను సీజ్‌ చేశాం. చట్ట ప్రకారం సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం’ అని వివరించారు.సీజ్‌చేసిన వాటిలో పసుపు, గరం మసాలా, దనియా పొడి కలిపి 7,105 కిలోలు ఉంది. కలపపొడి, బియ్యం, మినుములు, మిరపకాయలు, సిట్రిక్‌ యాసిడ్‌.. వంటి పదార్థాలు 7,215 కిలోలు ఉన్నాయి.ఇదీ చదవండి: మసాలాలో పురుగుమందులు.. నివేదికలను తోసిపుచ్చిన ప్రభుత్వ సంస్థభారత బ్రాండ్లైన ఎవరెస్ట్‌, ఎండీహెచ్‌ ఉత్పత్తుల్లో ఇథిలీన్ ఆక్సైడ్ అనే క్యాన్సర్ కారకం ఉందని యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ఈఎఫ్‌ఎస్‌ఏ) గుర్తించిన సంగతి తెలిసిందే. దాంతో హాంకాంగ్, సింగపూర్‌ల్లో వాటి ఉత్పత్తులపై నిషేధం విధించినట్లు వార్తలు వచ్చాయి. అయితే 2020 సెప్టెంబర్‌ నుంచి 2024 ఏప్రిల్‌ మధ్యకాలంలో ఇండియాలో తయారైన దాదాపు 527 ఆహార ఉత్పత్తుల్లో క్యాన్సర్‌కు దారితేసే కారకాలు ఉన్నట్లు రాపిడ్ అలర్ట్ సిస్టమ్ ఫర్ ఫుడ్ అండ్ ఫీడ్ (ఆర్‌ఏఎస్‌ఎఫ్‌ఎఫ్‌) డేటా ప్రకారం నిర్ధారణ అయినట్లు ఈఎఫ్‌ఎస్‌ఏ అధికారులు ఇటీవల తెలిపారు.

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన,  భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది  అద్భుతమైన మరియు వైవిధ్యమైన  శ్రేణి సమకాలీన,  రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు,  కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా,  ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్,  ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం  వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్  18కేరట్  మరియు 22కేరట్  బంగారంలో విస్తృతమైన శ్రేణి  డిజైన్‌లతో,  నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని  సంపూర్ణం  చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన  సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను  అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా  కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all