Top Stories
ప్రధాన వార్తలు
Pak vs NZ: చావో రేవో.. గట్టెక్కిన పాకిస్తాన్! ఆఖరికి..
న్యూజిలాండ్‌తో ఆఖరి టీ20లో పాకిస్తాన్ గట్టెక్కింది. తొమ్మిది పరుగుల స్వల్ప తేడాతో గెలుపొంది సిరీస్‌ను సమం చేసుకుంది. కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం కివీస్ జట్టు పాక్ పర్యటనకు వెళ్లింది.బాబర్ ఆజం కెప్టెన్‌గా తిరిగి పగ్గాలు చేపట్టిన తర్వాత పాకిస్తాన్‌కు ఇదే తొలి సిరీస్. అది కూడా సొంతగడ్డపై జరుగుతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ క్రమంలో తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో ఆతిథ్య పాక్ విజయం సాధించింది. ఆ మరుసటి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసిన కివీస్.. నాలుగో టీ20లో 4 పరుగుల తేడాతో గెలిచి షాకిచ్చింది. ఈ నేపథ్యంలో ఆతిథ్య జట్టు 1-2తో వెనుకబడింది. కివీస్ ద్వితీయ శ్రేణి జట్టు చేతిలో వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోవడంతో బాబర్ ఆజం బృందంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో చావోరేవో తేల్చుకోవాల్సిన ఆఖరి టీ20లో పాక్ గెలుపొందింది. తద్వారా సిరీస్‌ను 2-2తో సమం చేయగలిగింది.లాహోర్‌లో టాస్ ఓడిన పాక్.. న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. బాబర్ ఆజం(44 బంతుల్లో 69), ఉస్మాన్ ఖాన్(24 బంతుల్లో 31), ఫఖర్ జమాన్(33 బంతుల్లో 43), షాబాద్ ఖాన్(5 బంతుల్లో 15 నాటౌట్) రాణించారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ ఐదు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కివీస్ తడబడింది. ఓపెనర్ టిమ్ సెఫార్ట్ (33 బంతుల్లో 52), జోష్ క్లార్క్సన్(26 బంతుల్లో 38 నాటౌట్) మాత్రమే మెరుగ్గా ఆడారు.మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో 19.2 ఓవర్లలో 169 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తొమ్మిది పరుగుల తేడాతో పాక్ విజయం సాధించింది. నాలుగు వికెట్లతో రాణించిన షాహిన్ ఆఫ్రిదికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది. Scenes in Lahore following the fifth T20I as the series is squared 🏆🤝#PAKvNZ | #AaTenuMatchDikhawan pic.twitter.com/pBm4SmQi7j— Pakistan Cricket (@TheRealPCB) April 27, 2024
కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్
మరో కమెడియన్ సొంతిల్లు కట్టుకున్నాడు. 'పటాస్' షోతో గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత పలు కామెడీ షోలతో గుర్తింపు తెచ్చుకున్న గల్లీ బాయ్ భాస్కర్ తాజాగా కొత్త ఇంట్లో అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఫైనల్లీ డ్రీమ్ హౌస్ కట్టుకున్నానని ఇన్ స్టాలో రాసుకొచ్చాడు. ఈ కార్యక్రమానికి తోటి కమెడియన్స్ వచ్చి విషెస్ చెప్పారు.(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?)'పటాస్' షోలో స్టాండప్ కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన భాస్కర్.. సద్దాం, యాదమ్మ రాజు తదితరులతో కలిసి స్కిట్స్ కూడా చేసేవాడు. ఆ తర్వాత అదిరింది, కామెడీ స్టార్స్, కామెడీ స్టాక్ ఎక్సేంజ్ లాంటి షోలు చేశాడు. ఇప్పుడు 'జబర్దస్త్'లో చేస్తున్నాడు. వీటితో పాటు ఈవెంట్స్ లో పాల్గొంటూ రెండు చేతులా సంపాదిస్తున్న భాస్కర్.. ఇప్పుడు మూడు అంతస్థుల ఇల్లు కట్టేసుకున్నారు. ఈ వీడియోని పోస్ట్ చేస్తూ.. తన డ్రీమ్ హౌస్ కట్టుకున్నానని ఎమోషనల్ అయ్యాడు.(ఇదీ చదవండి: ప్రముఖ దేవాలయంలో స్టార్ హీరోయిన్ సంయుక్త.. కారణం అదేనా?) View this post on Instagram A post shared by Bhaskar (@gully_boy_bhaskar)
ఆ పేరే.... ఒక నమ్మకం!
నలభై రెండు డిగ్రీలు దాటిన ఎండల్లో నడిరోడ్లపై గంటల తరబడి వేలాదిమంది ప్రజలు ఒక నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారంటే అర్థం ఏమిటి? వయోభేదం లేదు. కులమతాల పరిధులు లేవు. ఆడామగా తేడా లేదు. ఆబాల గోపాల జన తరంగం ఆ నాయకుడు కనిపించగానే కేరింతలు కొట్టడం దేనికి సంకేతం? ఆ నిరీక్షణలకు అర్థం అక్కడో ప్రభంజనం వీస్తున్న దని! ఒక వేవ్ పుట్టిందనడానికి సంకేతాలే అక్కడ కనిపించే పరవశాల కేరింతలు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 27 రోజులపాటు సాగించిన బస్సు యాత్ర సందర్భంగా అటువంటి ఒక ప్రభంజనం పెల్లుబికింది.నాన్నల భుజాల మీద నిలబడి నాయకుడు కనిపించగానే సంభ్రమంతో ‘జగన్ మామా’ అని ఎలుగెత్తే చిన్నారులు. ఓ చేత్తో చంటిబిడ్డనెత్తుకొని మరో చేత్తో మొబైల్ ఫోన్ ఎక్కుపెట్టి దగ్గరగా జగనన్న ఫోటోను తీసుకోవడానికి ఆరాటపడుతున్న ఆడపడుచులు. దూరంగా బస్సు కనిపించగానే ‘అదిగో నా కొడుకొస్తున్నాడ’ని బోసినవ్వుతో భావప్రకటన చేసే అవ్వా తాతలు. నాయకుని వాహనం ముందూవెనుకా ఉరకలెత్తుతున్న యవ్వనోత్తేజాలు. రోడ్డు పక్కనున్న స్తంభాలను అధిరోహించి, చెట్ల కొమ్మలనాక్రమించి జయ జయధ్వానాలు చేసే చిట్టి తమ్ముళ్లు. ముఖాల మీద భద్రతా భావాన్ని, భరోసాను వేలాడ దీసుకొని రోడ్డు పక్క భవనాల మీద నిలబడి ఎదురు చూస్తున్న నడివయసు అన్నలూ అక్కలూ!ఆనందోద్వేగాల వ్యక్తీకరణలో ఎన్ని ఛాయలుంటాయి? అభినందనాభివ్యక్తిని ఎన్ని రంగుల్లో ప్రకటించవచ్చును? కృత జ్ఞతాపూర్వక అరుపుల్లో, కంటి మెరుపుల్లో కనిపించే సందేశ కావ్యాల్లో ఎన్ని రకాలుంటాయి? బస్సు యాత్రలో పాల్గొన్న జనప్రవాహం దృశ్యాలను ఫ్రేములుగా విడదీసి ఒక్కొక్కటే గమనించండి. లెక్కించలేనన్ని ఛాయలు. ఊహలకందని రంగులు. చదవలేనన్ని సందేశాలు కనిపిస్తాయి. ఒక నాయకుడు లక్షలాది మంది ప్రజలతో విడివిడిగా ముఖాముఖి సంబంధం ఏర్పరుచుకుంటే తప్ప ఇన్ని భావోద్వేగాలు ఉదయించవు. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడిగా కనిపిస్తాడట! జన సమ్మోహన నాయకుడు కూడా అంతే! నాయకుడి మీద ప్రజలకు బలమైన నమ్మకం ఏర్పడినప్పుడే ఈ ఆత్మీయ బంధం అల్లుకుంటుంది. డెబ్బయ్యో దశకంలో ఇందిరాగాంధీ దగ్గర ఈ మ్యాజిక్ ఉండేది. కోట్లాదిమంది భారతీయులు ఆమెను ‘అమ్మ’గా పిలుచుకునేవారు. ఎనభయ్యో దశకంలో ఎమ్జీ రామచంద్రన్, ఎన్టీరామారావు వారి రాష్ట్రాల్లోని ప్రజలతో ఆత్మీయ స్పర్శను అనుభవించగలిగారు. పేదల జీవితాల్లో మార్పులు తెస్తాడన్న నమ్మకంతో ఎమ్జీఆర్ను ‘పురట్చి తలైవర్’ (విప్లవ నాయకుడు)గా తమిళ ప్రజలు పిలుచుకున్నారు. పేదవాడి అన్నం గిన్నెగా మారిన ఎన్టీఆర్‌ను తెలుగు ప్రజలు ‘అన్న’గా సంబోధించారు. ఐదు పదుల వయసున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి తన ఐదేళ్ల పదవీ కాలంలో పేదల బతుకుల్లో విప్లవాత్మక మార్పులకు పునాదులు వేయడంతోపాటు కోట్లాది మంది నోట ఆప్యాయంగా ‘అన్నా’ అని పిలుచుకోగలుగు తున్నారు.ఎమ్జీఆర్, ఎన్టీఆర్‌ల సంగతి వేరు. వారు రాజకీయాల్లోకి రాకముందే అఖండ ప్రజాదరణ కలిగిన సినీ హీరోలు. సినిమాల్లో వారు ఎక్కువగా పోషించినవి కూడా ఉదాత్తమైన పాత్రలు. అందువల్ల వారి రాజకీయ ప్రవేశం తమకు మేలు చేస్తుందని ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. ప్రజల నమ్మకాన్ని వారు కూడా వమ్ము చేయలేదు. వారి సంగతి సరే! మరి జగన్మోహన్రెడ్డికి ఇంతటి జనాకర్షణ ఏర్పడటానికి కారణ మేమిటి? ప్రజలు ఆయన్ను ఇంతగా గుండెల్లో ఎందుకు పెట్టుకున్నారు? ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఆరేళ్లు పనిచేసిన అనంతరం 1989లో ఎన్నికలకు వెళ్లినప్పుడు పూర్వపు ఆదరణ కనిపించలేదు. ఆయన ప్రచార రథం వెంట జనం పరుగులు తీయలేదు. ఆయన రాక కోసం గంటల తరబడి నిరీక్షించడం కనిపించలేదు.జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పరిపాలన తర్వాత మొన్నటి బస్సు యాత్ర సందర్భంగా కనిపించిన దృశ్యాలు వేరు. ఎన్టీఆర్ తొలిరోజుల్లో సభావేదిక నెక్కి ‘నేల ఈనిందా... ఆకాశం చిల్లులు పడిందా’ అనగానే జన సముద్ర ఘోష దద్దరిల్లేది. ‘నా రక్తంలో రక్తమైన నా సోదరులారా’ అని ఎమ్జీఆర్ ప్రసంగం ప్రారంభించగానే జంఝామారుతంలా హర్షధ్వానాలు మార్మోగేవి. కానీ ఐదేళ్ల పాలన తర్వాత కూడా జగన్మోహన్రెడ్డికి అదే స్పందన. ప్రసంగానికి ముందు చేతిలోకి మైకు తీసుకుని వేళ్లతో దాని మీద తాళం వేయగానే వేల గొంతుకల్లో ఆ ప్రతిధ్వని మార్మోగుతున్నది. మాట మాటకూ చప్పట్ల కోరస్. మంత్రం వేసినట్టుగా ఆయన మాటతో మాట కలుపుతున్నారు. జనానికీ, జగన్‌కూ మధ్య ఏర్పడిన ఈ కమ్యూ నికేషన్ ఓ అధ్యయనాంశం.జగన్మోహన్రెడ్డి సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించు కొని పదమూడేళ్లయింది. ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా, ఐదేళ్లు ముఖ్య మంత్రిగా పనిచేసి మరోసారి అధికారం కోసం జనం ముందుకు వెళ్తున్నారు. మళ్లీ భారీ ఆధిక్యతతో అధికారంలోకి వస్తారని అంచనాలు వెలువడుతున్నాయి. ప్రజలతో ఆయన సంబంధం రోజురోజుకూ బలపడుతున్నది. పధ్నాలుగేళ్లు ముఖ్య మంత్రిగా, పదిహేనేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసిన సీనియర్ మోస్ట్ రాజ కీయవేత్త ప్రజాదరణలో జగన్మోహన్రెడ్డి దరిదాపుల్లోకి కూడా రాలేకపోతున్నారు. కారణం ఏమై ఉంటుంది?కారణం... ఆయన క్యారెక్టర్. మాట తప్పని, మడమ తిప్పని నైజం. ఎట్టి పరిస్థితుల్లో నోటి వెంట ఒక్క అబద్ధం కూడా చెప్పని తత్వం. పేదలకు, అసహాయులకు, రోగగ్రస్థులకు ప్రేమను పంచే స్వభావం. ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసమే ఉపయోగించాలన్న పొలిటికల్ ఫిలాసఫీ. అంబేడ్కర్, అబ్రహాం లింకన్ల ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఈ లక్షణాలన్నీ ఆయన్ను వర్తమాన రాజకీయ నేతల మధ్య ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఆయన స్వభావానికీ, ఫిలాసఫీకీ పూర్తి భిన్నమైన చిత్రీకరణతో ఆయన ఎదుర్కొన్నంత దుష్ప్రచారాన్ని దేశ రాజకీయ నాయకుల్లో ఎవరూ ఎదుర్కోలేదు. ఆయన మీద జరిగినన్ని కుట్రలు ఎవరి మీదా జరగలేదు. అయినా శిలాసదృశంగా నిలబడగలిగారంటే అందుకు కారణం ఆయన క్యారెక్టర్. నిజాయితీ. ఇదిగో ఈ నిజాయితీ జనంలోకి డైరెక్ట్‌గా కమ్యూని కేట్ అయింది. గోబెల్స్ గొలుసుల్ని తెంచుకొని, మీడియా గోడల్ని బద్దలు కొట్టుకొని మరీ ఆయన క్యారెక్టర్ జనం గుండె ల్లోకి వెళ్లిపోయింది.జగన్మోహన్రెడ్డి మీద జరిగిన కుట్రల కమామిషు, ఆయన నాయకుడుగా ఎదిగిన కథాక్రమం తెలుగు ప్రజలు ఎరిగిన సంగతులే. చర్విత చర్వణం అనవసరం. ప్రజలిచ్చిన అధికారాన్ని అయిదేళ్లపాటు ప్రజా సాధికారత కోసమే ఆయన ఖర్చు చేశారు. అంతకు ముందు పది శాతమున్న పేదరికాన్ని నవరత్న పథకాల సాయంతో నాలుగు శాతానికి తగ్గించ గలిగారు. వచ్చే ఐదేళ్ల లోపల పేదరికాన్ని నిశ్శేషం చేయడం కోసం ఆ రత్నాలకు మరింత మెరుగుదిద్దినట్టు శనివారం ఆయన విడుదల చేసిన మేనిఫెస్టోలో వెల్లడైంది. మేనిఫెస్టో విడుదల సందర్భంగా చేసిన ప్రసంగం జగన్మోహన్రెడ్డి నిజాయితీకి అద్దం పట్టింది. ఆయన విజన్‌ను, తాత్వికతను మేనిఫెస్టో ఆవిష్కరించింది. ఒకపక్క ఆయన ప్రత్యర్థి అలవికాని వాగ్దానాలతో చెలరేగిపోతున్నారు. అరచేతిలో వైకుంఠాన్ని చూపెడుతున్నారు. బొందితో కైలాసానికి తీసుకెళ్తానన్న స్థాయిలో వాగ్దానాలు కురిపిస్తున్నారు. సూపర్ సిక్స్‌లు కొడతా నంటున్నారు. ప్రత్యర్థి చేస్తున్న ఈ ఊకదంపుడు... ముఖ్యమంత్రిపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఎందుకంటే, ఆయన పేరే ఒక నమ్మకంగా ప్రజల గుండెల్లో స్థిరపడిపోయింది.చంద్రబాబు బోగస్ హామీలను పూర్వపక్షం చేస్తూ జగన్మోహన్రెడ్డి మాట్లాడిన తీరు లైవ్‌లో చూస్తున్న లక్షలాది మంది టీవీ వీక్షకులను ఆకట్టుకున్నది. సంపద సృష్టించి హామీలు అమలుచేస్తానని చెబుతున్న చంద్రబాబు వాదనలోని డొల్లతనాన్ని ఆయన బయటపెట్టారు. చంద్ర బాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన పధ్నాలుగేళ్లూ ప్రతిపాదించిన బడ్జెట్లన్నీ రెవెన్యూ లోటునే చూపెట్టాయనీ, ఇక సంపద సృష్టించిందెక్కడనీ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. పేదల సంక్షేమం సాధికారతల పట్ల తనకంటే చిత్తశుద్ధి ఉన్న వారెవరూ లేరని చెబుతూ ప్రజలకు ఎంత గరిష్ఠంగా మేలు చేయగలమో ఆ మేరకే హామీలివ్వగలం తప్ప అబద్ధాలు చెప్పలేనని ఆయన స్పష్టం చేశారు.విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పు లకు బాటలు పరుస్తూ, బలహీనవర్గాలు – మహిళల సాధికారత కోసం అడుగులు వేస్తూ సాగిన ఐదేళ్ల పాలన కొనసాగింపుగానే మరో ఐదేళ్ల పాలనకు సంబంధించిన మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. ఇది విప్లవ కర్తవ్యాల కొనసాగింపు. విద్యారంగంలో తాను ప్రవేశపెడుతున్న మార్పులు మరో పదిహేనేళ్లు కొనసాగితే పేదరికం ఆనవాళ్లు కూడా రాష్ట్రంలో కనిపించవని ఆయన నమ్ముతున్నారు. పేద విద్యార్థులందరూ సంపన్నుల బిడ్డలతో సమానంగా నాణ్యమైన విద్యను అభ్యసించగల పరిస్థితులను ప్రజలంతా స్వాగతించాలి. ప్రతి ఇంటినీ ఓ ఫ్యామిలీ డాక్టర్ సందర్శించగల అత్యున్నత స్థాయి వైద్య సేవల సమాజాన్ని నిండు మనసుతో ఆహ్వానించాలి. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో తరతరాలుగా వెనుకబడిన సమూహా లను, మహిళలను ముందడుగు వేయించే ప్రయత్నాలకు ప్రజ లందరూ భుజం కాయాలి. ఉన్నతస్థాయి సమాజ నిర్మాణం కోసం జరుగుతున్న ప్రయత్నాల వెన్నంటి నడవాలి. పేదల విముక్తికి అడ్డుగోడలా నిలబడుతున్న పెత్తందారీ శక్తులనూ, వారి రాజకీయ శిబిరాలనూ ఓడించాలి. లాంగ్ లివ్ ది రివల్యూషన్! ఇంక్విలాబ్ జిందాబాద్!!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com
డింపుల్ యాదవ్ సింపుల్ పొలిటీషియన్
డింపుల్ యాదవ్. సైనిక కుటుంబానికి చెందిన సాదాసీదా అమ్మాయి. అఖిలేశ్ యాదవ్‌ను పెళ్లాడి అనూహ్యంగా బడా రాజకీయ కుటుంబంలో అడుగు పెట్టారు. తొలుత తనను అంతగా ఇష్టపడని ములాయం సింగ్ యాదవ్‌కు ప్రియమైన కోడలిగా మారారు. తండ్రీ కొడుకుల రాజకీయ విభేదాలను పరిష్కరించే స్థాయికి ఎదిగారు. అంతే అనూహ్యంగా రాజకీయ అరంగేట్రమూ చేసినా స్వయంకృషితో ఎంపీగానూ రాణించారు. అలా ఇంటా బయటా ఫుల్ మార్కులు కొట్టేశారు.డింపుల్‌కు తొలుత రాజకీయాలు, కులాల గురించి అస్సలు అవగాహన లేదు. ఆమె పుట్టింది పూర్తి భిన్నమైన కుటుంబం కావడమే అందుకు కారణం. అలాంటిది పెళ్లి తర్వాత వాటిపై లోతుగా అవగాహన పెంచుకున్నారు. కుల సమీకరణాలకు పుట్టిల్లయిన యూపీ వంటి రాష్ట్రంలో బలమైన నాయకురాలిగా ఎదిగారు. స్వతహాగా మితభాషి అయినా వేదిక ఎక్కితే మాత్రం డింపుల్ అద్భుతమైన వక్త. యూపీలోని మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారీ అక్కడి నుంచే సమాజ్‌వాదీ అభ్యరి్థగా బరిలోకి దిగుతున్నారు.అనూహ్యంగా రాజకీయాల్లోకి... రాజకీయాల్లోకి రావాలని డింపుల్ ఎప్పుడూ అనుకోలేదు. భర్త అఖిలేశ్ యాదవ్ 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఫిరోజాబాద్, కన్నౌజ్ లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసి రెండింట్లోనూ విజయం సాధించారు. కన్నౌజ్ను అట్టిపెట్టుకోవడంతో ఫిరోజాబాద్‌కు ఉప ఎన్నిక జరిగింది. దాంతో అక్కడ డింపుల్ బరిలో దిగాల్సి వచి్చంది. కానీ బాలీవుడ్ నటుడు రాజ్‌బబ్బర్ చేతిలో ఓడిపోయారు. 2012లో అఖిలేశ్ యూపీ సీఎం కావడంతో కన్నౌజ్ లోక్‌సభ స్థానమూ ఖాళీ అయింది. అక్కడి నుంచి డింపుల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కన్నౌజ్‌కు ప్రాతినిధ్యం వహించిన రెండో మహిళగా, యూపీ చరిత్రలో ఏకగ్రీవంగా ఎంపికైన తొలి మహిళా ఎంపీగా రికార్డు నెలకొల్పారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కన్నౌజ్ స్థానం నుంచి మళ్లీ గెలుపొందారు. 2019లో బీజేపీ నేత సుబ్రతా పాఠక్ చేతిలో ఓడిపోయారు. 2022లో మామ ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్‌పురి లోక్‌సభ స్థానం ఖాళీ అయింది. ఉప ఎన్నికలో డింపుల్ భారీ విజయం సాధించారు. ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడని డింపుల్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఒంటరిగా ప్రచారం చేశారు. భర్తకు మద్దతుగా 20 ర్యాలీల్లో ప్రసంగించారు. అంతకుముందు కుటుంబ కలహాల వేళ తండ్రీ కొడుకుల మధ్య సఖ్యత నెలకొల్పారు.ప్రేమ, పెళ్లి, పిల్లలు.. డింపుల్ మహారాష్ట్రలోని పుణెలో 1978 జనవరి 15న జని్మంచారు. తండ్రి ఆర్మీ కల్నల్ రామ్‌చంద్ర సింగ్ రావత్. వారిది ఉత్తరాఖండ్. తండ్రి ఉద్యోగరీత్యా పుణె, భటిండా, అండమాన్, నికోబార్ దీవుల్లోని ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో చదివారు డింపుల్. లక్నో యూనివర్సిటీ నుంచి కామర్స్ డిగ్రీ పొందారు. అఖిలేశ్‌ను తొలిసారి చూసినప్పుడు డింపుల్ ప్లస్ టూ చదువుతున్నారు. ఆమెకు 17 ఏళ్లు, అఖిలేశ్‌కు అప్పుడు 21 ఏళ్లు. ఇంజనీరింగ్ చేస్తున్నారు. కామన్ ఫ్రెండ్ పార్టీలో పరిచయమైంది. తొలి భేటీలోనే మంచి స్నేహితులయ్యారు. పై చదువులకు అఖిలేశ్ ఆ్రస్టేలియా వెళ్లారు. అప్పుడు ఇద్దరూ ఉత్తరాలు రాసుకునేవారు. అలా ప్రేమ చిగురించింది. తిరిగొచ్చాక అఖిలేశ్‌పై పెళ్లి ఒత్తిడి పెరగడంతో డింపుల్ గురించి అమ్మమ్మకు చెప్పారు. కుటుంబ నేపథ్యాలు వేర్వేరు కావడంతో వారు పెళ్లికి అంగీకరించలేదు. అఖిలేశ్ పట్టుదల చూసి తండ్రి ములాయం సింగ్ చివరికి పెళ్లికి అంగీకరించారు. అలా 1999న వారు ఒకటయ్యారు. వారికి ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయి అదితి. అర్జున్, టీనా కవలలు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడం, పెయింటింగ్ వేయడానికి ఇష్టపడతారు డింపుల్. ‘‘పిల్లలే దేశ భవిష్యత్తు. రాజకీయాలతోపాటు పిల్లలకు సమయమివ్వడానికి ఇష్టపడతా’’ అంటారు.
April 28th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
April 28th AP Elections 2024 News Political Updates...9:00 AM, Apr 28, 2024జగన్ పథకాలు కాపీ కొడుతున్న టీడీపీఆయన పథకాలే వారి మేనిఫెస్టోలోనూ పెట్టారువలంటీర్ల వ్యవస్థ కొనసాగించి... ఎక్కువ వేతనం ఇస్తామంటున్నారుఅంటే అవన్నీ బాగున్నాయని చెబుతున్నట్టే కదాఈ ప్రభుత్వం తీసుకొచి్చన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ బాగా నచ్చిందిమహిళలైతే ఎక్కువ మంది వైఎస్సార్సీపీ వైపేసాక్షి ఇంటర్వ్యూలో సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ 8:30 AM, Apr 28, 2024ఆ కుటుంబ నైజం.. కస్సుబుస్సుచెప్పలేనన్ని నేరాలు.. విప్పలేనన్ని కేసులు..!అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి సామ్రాజ్యం విస్తరణ గ్రానైట్ మాఫియా, నిబంధనలకు పాతరతో ట్రావెల్స్ నిర్వహణ పదుల సంఖ్యలో గాలిలో కలిసిన ప్రాణాలు..?బెట్టింగ్, మట్కా వంటి అసాంఘిక శక్తులకు ఊతంపరిశ్రమలపై ఆధిపత్యం, అక్రమ వసూళ్లు 8:00 AM, Apr 28, 2024సైకిల్ ఎక్కేదిలేదు... ప్రచారం చేసేదిలేదుమమ్మల్ని కుక్కలు కంటే హీనంగా చూస్తున్నారుగంగాధర నెల్లూరు టీడీపీ అభ్యర్థికి మేం మద్దతు ఇవ్వంజనసేన, బీజేపీ నేతల తీర్మానం7:30 AM, Apr 28, 2024మేనిఫెస్టో మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్: రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్సమరింత ప్రజోపయోగ, అభివృద్ధి కార్యక్రమాలతో 2024 మేనిఫెస్టోసంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగ కల్పనపై ప్రధాన దృష్టిప్రపంచంలో మేటి నగరంగా విశాఖ అభివృద్ధిబాబులా అబద్దపు హామీలు ఇవ్వం7:00 AM, Apr 28, 2024ఏ సంపద సృష్టించావు బాబూ? సీఎం వైఎస్ జగన్14 ఏళ్లూ రెవెన్యూ లోటే ఉంటే బాబు సృష్టించిందేంటి?ఆయనకు ముందు, తర్వాత ‘మిగులు’ ఎలా వచ్చింది?ఆయనకు ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం వల్లే కదా!రాష్ట్రానికి ఎక్కువ అప్పులు తెచ్చింది కూడా చంద్రబాబేమూలధన వ్యయం ఎవరి హయాంలో ఎక్కువో తెలియదా?నాడు ఏటా రూ.15,227 కోట్లు ఖర్చుచేస్తే... ఇప్పుడది రూ.17,757 కోట్లుపోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు.. ‘నాడు–నేడు’ అన్నీ ఇప్పుడే..దేశ జీడీపీలో మన వాటా నాడు 4.47 శాతమైతే ఇప్పుతడు 4.83 శాతంఅడ్డంగా జనంపై పడి పన్నులు బాదేసింది కూడా బాబే..నాడు జీడీపీలో పన్నుల వాటా 6.57 శాతం... ఇప్పుడు 6.35 శాతమేగణాంకాలతో సహా వివరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్6:30 AM, Apr 28, 2024అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్‌సాధ్యం కాదని తెలిసీ అబద్ధాలకు రెక్కలు: సీఎం జగన్2014లోనూ జనసేన, బీజేపీతో కూటమి కట్టి ఎడాపెడా వాగ్దానాలుఅధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కి ప్రజల జీవితాలతో చెలగాటమాడారుఇప్పుడు మళ్లీ అదే కూటమి కట్టి సూపర్ సిక్స్.. సూపర్ టెన్ అంటున్నాడుఆ హామీలకు అయ్యే ఖర్చెంత? అమలు సాధ్యమేనా?ఇలా చేయడం దొంగతనం కన్నా దారుణం కాదా? 420.. చీటింగ్ కాదా?6:00 AM, Apr 28, 2024సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...తాడిపత్రి వైఎస్సార్ సర్కిల్లో ఉ.10 గంటలకు నిర్వహించే సభతో ప్రచార భేరిమధ్యాహ్నం 12.30 గంటలకు వెంకటగిరి త్రిభువని సర్కిల్లో..3 గంటలకు కందుకూరులో కేఎంసీ సర్కిల్లో సీఎం వైఎస్ జగన్ ప్రచార సభలురోజూ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహణసిద్ధం సభలు, ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గ్రాండ్ సక్సెస్‌తో వైఎస్సార్సీపీలో జోష్
కాసేపట్లో ఎన్నికల ప్రచారంలోకి సీఎం జగన్
Live Updates.. కాసేపట్లో తాడిపత్రికి చేరుకోనున్న సీఎం జగన్తాడిపత్రి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్నేటి నుంచి మలివిడత ఎన్నికల ప్రచార సభలలో పాల్గొననున్న సీఎం జగన్నేడు తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న సీఎం జగన్⇒పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు.. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మలివిడత ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు.⇒రాష్ట్రంలో 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వైఎస్సార్ సర్కిల్లో ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహించే బహిరంగసభతో ఈ ప్రచార భేరి మోగించనున్నారు.⇒అనంతరం.. మ.12.30కు తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని వెంకటగిరిలోని త్రిభువని సర్కిల్లో నిర్వహించే బహిరంగసభలోనూ.. అలాగే, మధ్యాహ్నం మూడు గంటలకు నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని కందుకూరు కేఎంసీ సర్కిల్లో జరిగే సభలోనూ సీఎం జగన్ పాల్గొంటారు.⇒సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి భీమిలి (ఉత్తరాంధ్ర), దెందులూరు (ఉత్తర కోస్తా), రాప్తాడు (రాయలసీమ), మేదరమెట్ల (దక్షిణ కోస్తా)లలో ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్వహించిన సిద్ధం సభలకు జనం సునామీలా పోటెత్తారు. రాప్తాడు, మేదరమెట్ల సభలు ఉమ్మడి, తెలుగు రాష్ట్రాల చరిత్రలో అతిపెద్ద ప్రజాసభలుగా నిలిచాయి. వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నయాజోష్.. ⇒ఇక సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ కావడం.. బస్సుయాత్ర చరిత్ర సృష్టించడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు, సానుభూతిపరులు రెట్టించిన ఉత్సాహంతో కదం తొక్కుతున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సీఎం జగన్ ఎన్నికల మలివిడత ప్రచారానికి శ్రీకారం చుడుతుండటంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నయాజోష్ నెలకొంది.
Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
30, డిసెంబర్ 2002.. ఘోర రోడ్డు ప్రమాదం.. చావుకు సమీపంగా వెళ్లి అదృష్టవశాత్తు ప్రాణాలు దక్కించుకున్న రోజు.. 23 మార్చి, 2024.. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున కెప్టెన్‌గా బరిలోకి దిగిన రోజు.. ఈ రెండు ఘటనల మధ్య దాదాపు 15 నెలల సమయం ఉంది. ఈ మధ్య కాలంలో బాధ, వేదన ఉంది. జీవితంతో పోరాడిన సంఘర్షణ ఉంది. బతికితే చాలు.. ఆట గురించి అసలు ఆలోచనేరాని క్షణం నుంచి వేలాది మంది సమక్షంలో మళ్లీ క్రికెట్ ఆడగలిగే అవకాశం రావడం వరకు ఒక అసాధ్యాన్ని సాధ్యం చేసిన అద్భుతం ఉంది. అన్నింటికి మించి ఆ మనిషి నరనరాల్లో పట్టుదల ఉంది.అదే పట్టుదల, అదే పంతం అతడిని మళ్లీ నిలబెట్టింది. అసలు ఆడగలడా అనుకున్న సగటు భారత క్రికెట్ అభిమానులంతా అతడిని గ్రౌండ్లో చూస్తూ సంతోషంగా ఆహ్వానించిన క్షణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ యువకుడే 26 ఏళ్ల రిషభ్ పంత్. భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్. అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్న దశలో జరిగిన కారు ప్రమాదం పంత్ కెరీర్‌కు చిన్న కామా పెట్టింది. కానీ అతను ఈ సవాల్‌ను స్వీకరించి మళ్లీ అగ్రశ్రేణి మ్యాచ్‌లు ఆడే వరకు రావడం అసాధారణం. అతని పునరాగమనం స్ఫూర్తిదాయకం. భారత క్రికెట్లో రిషభ్ పంత్ ఒక సంచలనం. దూకుడైన ఎడమ చేతి వాటం బ్యాటర్ కమ్ వికెట్ కీపర్‌గా 2016 అండర్–19 ప్రపంచకప్‌లో సత్తా చాటడంతో అతనేంటో అందరికీ తెలిసింది. వేగవంతమైన అర్ధ సెంచరీ, సెంచరీలతో అతను చెలరేగాడు. భారత్ టైటిల్ గెలుచుకోకపోయినా మనకు దక్కిన సానుకూల ఫలితాల్లో పంత్ వెలుగులోకి రావడం ఒకటి. అతని ప్రదర్శన ఊరికే పోలేదు. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ అతడిని తమ జట్టులోకి తీసుకుంది. మరో వైపు ఢిల్లీ రంజీ టీమ్‌లో కూడా రెగ్యులర్ సభ్యుడిగా మారిన అతను కెప్టెన్సీ బాధ్యతలనూ తీసుకున్నాడు.ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో 32 బంతుల్లో పంత్ కొట్టిన రికార్డు సెంచరీ అతని స్థాయిని పెంచింది. ఆ జోరు చూసిన ఢిల్లీ ఐపీఎల్ టీమ్ మరే ఆలోచన లేకుండా అతణ్ణి జట్టులో కొనసాగించింది. ఇన్ని సీజన్లు ముగిసినా అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను అదే జట్టుతో ఉండటం విశేషం. 2017లో ఐపీఎల్ జరుగుతున్న సమయంలో తండ్రి ఆకస్మిక మరణం 20 ఏళ్ల ఆ కుర్రాడిని కుంగదీసింది. అయితే అంత్యక్రియలు ముగిసిన 48 గంటల్లోనే తిరిగి వచ్చి మళ్లీ ఐపీఎల్లో తన మెరుపులను ప్రదర్శిస్తూ 57 పరుగులు చేశాడు. తర్వాతి సీజన్లో సన్‌రైజర్స్‌పై చెలరేగి పంత్ కొట్టిన సెంచరీ లీగ్‌లో బెస్ట్ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచిపోయింది.ఒకే ఒక లక్ష్యంతో..పంత్ సాధారణ నేపథ్యం నుంచి వచ్చాడు. తండ్రి రాజేందర్ ఒక ప్రైవేట్ స్కూల్‌ను నడిపేవాడు. ఉత్తరాఖండ్‌లోని రూర్కీ స్వస్థలం కాగా క్రికెట్ అవకాశాల కోసం ఢిల్లీ వైపు చూడాల్సి వచ్చింది. రూర్కీ నుంచి ఢిల్లీ ఆరున్నర గంటల ప్రయాణం. చిన్నప్పటి నుంచి అన్ని చోట్లకు అతని తల్లి సరోజ్ తోడుగా వచ్చేది. ఢిల్లీలోని ప్రముఖ కోచ్ తారక్ సిన్హాకు చెందిన సానెట్ అకాడమీలో అతను శిక్షణ తీసుకున్నాడు. 12 ఏళ్ల వయసులో జరిగిన ఒక ఘటన పంత్‌లో ఆటకు సంబంధించి పట్టుదలను పెంచింది.సెలక్షన్స్, కోచింగ్ కోసం 45 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే వసతి కోసం డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో స్థానికంగా మోతీబాగ్‌లోని ఒక గురుద్వారాలోనే తల్లి, కొడుకులు ఉన్నారు. ఆ సమయంలోనే తాను భారత్‌కు ఆడాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు అతను చెప్పుకున్నాడు. ఐపీఎల్లో అవకాశం దక్కినా.. టీమిండియా ప్లేయర్‌గా వచ్చే గుర్తింపు కోసం అతను శ్రమించాడు. కొన్నాళ్లకే అతని కల నెరవేరింది. భారత జట్టులో అవకాశం దక్కించుకున్న అతను కొన్ని చిరస్మరణీయ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.మన గిల్లీ..అంతర్జాతీయ క్రికెట్లో ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను పంత్ గుర్తుకు తెచ్చాడు. తన మూడో టెస్టులోనే ఇంగ్లండ్ గడ్డపై అద్భుత సెంచరీతో అతను ఆకట్టుకున్నాడు. తర్వాతి ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై సిడ్నీలో 159 పరుగులతో తన బ్యాటింగ్ పదును చూపించాడు. భారత జట్టు ఆస్ట్రేలియాలో తొలి సిరీస్ గెలిచేందుకు ఇది ఉపకరించింది. తర్వాతి ఏడాది సిడ్నీలోనే 97 పరుగులతో రాణించిన అతను ఈ మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే అసలు ఘనత తర్వాతి టెస్టులోనే బ్రిస్బేన్‌లో వచ్చింది. భారత్‌కు ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో అజేయంగా 89 పరుగులతో అతను జట్టును గెలిపించిన తీరు ఈ సిరీస్ విజయాన్ని చిరస్మరణీయంగా మార్చింది. అంతకు ముందే రంజీ ట్రోఫీలో పంత్ చేసిన ట్రిపుల్ సెంచరీ అతను పైస్థాయికి చేరగలడనే నమ్మకాన్ని కలిగించింది.మూడు దశల ప్రణాళికతో..రిషభ్ పంత్‌కు ఎదురైన ప్రమాద తీవ్రత చూస్తే పరిస్థితి చాలా ఘోరంగా ఉండింది. చావు నుంచి తప్పించుకోవడం మాత్రమే ఊరట కలిగించే అంశం. మిగతా అన్నీ ప్రతికూల అంశాలే. ఆట సంగతేమో కానీ ముందు సాధారణ జీవితమైతే గడపగలగాలి కదా! చాలారోజుల వరకు ఆస్పత్రిలోనే ఉన్నాడు. శస్త్ర చికిత్సలు, స్కానింగ్, పరీక్షలు, రిపోర్టులతోనే సాగిపోయింది.2022 డిసెంబర్లో పంత్కి జరిగిన రోడ్డు ప్రమాదంఅలాంటి స్థితిలో పంత్ తన కోసం తాను ఒక కొత్త ప్రణాళికను రూపొందించుకోవాల్సి వచ్చింది. ప్రమాదం నుంచి మైదానం వరకు అతను తన పురోగతిని మూడు రకాలుగా విభజించుకొని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ముందుగా ఆరోగ్యపరంగా సాధారణ స్థితికి రావడం. ఆటగాడి కోణంలో కాకుండా ఒక సామాన్యుడు ప్రమాదం బారిన పడితే వైద్యుల పర్యవేక్షణలో ఏం చేస్తాడో పంత్ కూడా అదే చేశాడు. ముందుగా కోలుకోవడం, ఇతరుల సహాయం లేకుండా నడక, తన పనులు తాను సొంతంగా చేసుకోవడంపై దృష్టి పెట్టాడు. రెండో క్రమంలో జనరల్ ఫిట్‌నెస్‌పై శ్రద్ధ తీసుకున్నాడు.తేలికపాటి ఎక్సర్సైజ్లు, యోగావంటి వాటితో తన ఆరోగ్యాన్ని కాపాడుకున్నాడు. ఆపై మూడో దశకు వచ్చే సరికి క్రికెటర్ మ్యాచ్ ఫిట్నెస్ కోసం శ్రమించాడు. ఈ విషయంలో బీసీసీఐకి చెందిన జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) ఎంతో సహాయం అందించింది. డైట్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్, ఫిజియో ఏర్పాటు.. ఇలా అన్ని రకాలుగా ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ పంత్ సిద్ధమయ్యాడు.గాయాల నుంచి కోలుకుంటూలీగ్లో సత్తా చాటి..‘నేను మళ్లీ క్రికెట్లో అరంగేట్రం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. నాకు ఎదురైన దురదృష్టకర ఘటనలను దాటి మళ్లీ క్రికెట్ ఆడటం అంటే కొత్త జన్మ ఎత్తినట్లు’ అని తొలి మ్యాచ్‌కు ముందు పంత్ స్వయంగా చెప్పుకున్నాడు. ఐపీఎల్లో 2024లో పంత్ మ్యాచ్‌లు చూసినవారికి పంత్ పురోగతి ఆశ్చర్యం కలిగించింది. అసలు ఎప్పుడూ ఏ ప్రమాదం జరగనట్లుగా, కొంత విరామం తర్వాత మాత్రమే అతను ఆటలోకి వచ్చినట్లుగా కనిపిస్తున్నాడు.బ్యాటింగ్‌లో పదును, వికెట్ కీపింగ్‌లో చురుకుదనం, మైదానంలో అతని కదలికలు, కెప్టెన్సీ నైపుణ్యం కొత్త పంత్‌ను చూపిస్తున్నాయి. మరో సందేహం లేకుండా పూర్తి ఫిట్నెస్ స్థాయిని అతను ప్రదర్శించాడు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో గతంలోలాగే ర్యాంప్ షాట్లు, స్విచ్ హిట్లు, ఒంటి చేత్తో సిక్సర్లు, ఏ బౌలర్‌నూ వదలకుండా అతను ఆధిపత్యం చూపించడం సగటు క్రికెట్ అభిమానిని సంతృప్తిపరచాయి. ఎందుకంటే లీగ్‌లో ఎవరికి ఆడినా అతను భారత క్రికెట్ భవిష్యత్తు అనే విషయం అందరికీ తెలుసు.ఇంత తక్కువ సమయంలో కోలుకోవడంలో అతని వయసు కూడా కీలక పాత్ర పోషించడం వాస్తవమే అయినా.. అన్ని రకాల ప్రతికూలతలను దాటి అతను సగర్వంగా నిలిచాడు. అతని పోరాటానికి హ్యాట్సాఫ్ చెబుతూ మున్ముందు భారత్‌కు పంత్ మరిన్ని విజయాలు అందించాలని ఆశిద్దాం! — మొహమ్మద్ అబ్దుల్ హాది
తెరపైకి తెలుగు కాంగ్రెస్!
సాక్షి ప్రతినిధి, కడప: సార్వత్రిక ఎన్నికల పర్వంలో రాజకీయ పక్షాల అపవిత్ర కలయికలు తెరపైకి వస్తున్నాయి. తాము గెలవడం కంటే తమ ప్రత్యర్థిని ఇబ్బందిపెట్టడమే లక్ష్యంగా రాజకీయ పార్టీల మధ్య అవగాహన కుదురుతోంది. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య కొనసాగుతున్న మైత్రి ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. తాము ఎటూ గెలవలేం, వైఎస్సార్సీపీని నియంత్రించడమే లక్ష్యం కావాలనే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. అందివచ్చిన అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ సద్వినియోగం చేసుకుంటోంది. వెరసి తెలుగు కాంగ్రెస్ రాజకీయాలు జోరుగా నడుస్తున్నాయి.ప్రజల ముంగిట్లోకి పాలన తీసుకువచ్చాం. క్షేత్రస్థాయిలో ఎంతో అభివృద్ధి చేశాం.. రాజకీయాలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాం. మరోమారు అవకాశం ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లను అభ్యర్థిస్తోంది. తమ పాలనలో లబ్ధి చేకూరి ఉంటేనే ఆశీర్వదించండని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం కోరుతున్నారు. చరిత్రలో తన వల్ల మేలు చేకూరి ఉంటే ఓట్లు వేయండనే రాజకీయ నేత ఇంతవరకూ ఎవరూ లేరని ప్రజలు కొనియాడుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే కుట్రలు, కుయుక్తులతో లబ్ధి పొందాలనే వైఖరిని తెలుగుదేశం పార్టీ అవలంబిస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీకి గణనీయంగా పట్టు ఉన్న ఓటర్లలో చీలికలు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రధానంగా మైనార్టీ ఓట్లు చీల్చడమే ధ్యేయంగా పావులు కదుపుతున్నారు.వ్యూహాత్మకంగానే అఫ్జల్ఖాన్ అభ్యర్థిత్వంజిల్లాలో వైఎస్ కుటుంబం అన్నా, వైఎస్సార్సీపీ అన్నా పార్టీలకు అతీతంగా ముస్లిం మైనారీ్టలు అండగా నిలుస్తూ వస్తున్నారు. గతంలో అనేక ఎన్నికల్లో ఆ విషయం తేటతెల్లమైంది. ఇప్పటికే కడపలో రెండు పర్యాయాలు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఎస్బి అంజద్‌బాషా విజయకేతనం ఎగురవేశారు. ప్రస్తుతం మరోమారు తలపడుతున్నారు. ఈమారు వైఎస్సార్సీపీని ఎన్నికల్లో ఎలాగైనా నియంత్రించాలనే లక్ష్యంతో టీడీపీ కుయుక్తులు పన్నుతోంది. ఓవైపు విద్వేషాలు రెచ్చగొడుతూ కుట్ర రాజకీయాలు చేస్తుండగా, మరోవైపు కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్న ముస్లిం మైనారీ్టల ఓట్లు చీల్చేందుకు శతవిధాలా ప్రయతి్నస్తోంది. ఆమేరకే కడపలో అఫ్జల్‌ఖాన్‌ను కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీలో దించారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. అఫ్జల్ఖాన్ అభ్యర్థిత్వం ఎంచుకోవడం వెనుక కూడా కారణం లేకపోలేదు. ముస్లిం మైనార్టీలలో పఠాన్ తెగకు చెందిన వారిని తమ వైపు మరల్చుకోవాలనే భావనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఆమేరకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఆర్థిక సహకారం అందించేందుకు రహస్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. కడప శివార్లలోని జయరాజ్ గార్డెన్లో తెలుగు కాంగ్రెస్ నేతలు సమావేశమై అఫ్జల్ఖాన్ అభ్యరి్థత్వాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.కడప, ప్రొద్దుటూరు, రాయచోటిలలో ఎందుకంటే... దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లిం మైనారిలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించడంతో ముస్లిం కుటుంబాలకు ఎంతో లబ్ధి చేకూరింది. తద్వారా వైఎస్ కుటుంబానికి అండగా ఉంటున్నారు. కడపలో ముస్లిం మైనార్టీ ఓటర్లు దాదాపు 90వేలు ఉన్నారు. వీరి మద్దతు ఏకపక్షంగా వైఎస్సార్సీపీకి కొనసాగుతోంది. మరోవైపు బీజేపీ, జనసేనతో పొత్తు కారణంగా కూడా టీడీపీకి వ్యతిరేకంగా నిలవనున్నట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వారి ఓట్లలో చీలిక తీసుకువస్తే ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందనే దిశగా టీడీపీ నాయకులు అడుగులు వేశారు. ఆ మేరకు కాంగ్రెస్ పారీ్టతో చేతులు కలిపి కడపలో అఫ్జల్‌ఖాన్‌ను కాంగ్రెస్అభ్యర్థిగా ఎంపిక చేయించారు. ప్రొద్దుటూరు, రాయచోటి నియోజకవర్గాల్లో కూడా ఇదే పంథాను కొనసాగించారు. ప్రొద్దుటూరులో దాదాపు 45వేలు ముస్లిం ఓటర్లు ఉన్నారు. వీరిలో భారీగా చీలికలు తీసుకురావాలనే ఉద్దేశంతో మహమ్మద్ నజీర్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అలాగే రాయచోటిలో కూడా అల్లాబ„Š ఎంపిక వెనుక కూడా టీడీపీకి లబ్ధి చేకూర్చడమే అసలు లక్ష్యమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. జిల్లాలో ఇలా అవసరమైన మేరకు సహకరించేందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితో నిత్యం పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఫోన్లో టచ్‌లో ఉన్నట్లు కూడా పలువురు చెప్పుకొస్తున్నారు. మొత్తానికి జిల్లాలో తెలుగు కాంగ్రెస్ రాజకీయాలు తెర ముందుకు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ప్రభుదేవా హిట్ సినిమా 'ప్రేమికుడు' రీ-రిలీజ్
ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా సూపర్ హిట్ సినిమా ప్రేమికుడు రీ-రిలీజ్ కానుంది. మెగా ప్రొడ్యూసర్ కే. టి. కుంజుమోన్ నిర్మాతగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించారు. అందాల నటి నగ్మ ఇందులో హీరోయిన్గా నటించారు. ప్రస్తుతం ఈ సినిమాను నిర్మాతలు రమణ, మురళీధర్ రిలీజ్ చేస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ రీ- రిలీజ్ కి సంబంధించిన వేడుక తాజాగా చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుకలో నిర్మాతలు మురళీధర్ రెడ్డి, రమణ, ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీనివాస్, శోభారాణి పాల్గొన్నారు.ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా సూపర్ హిట్ సినిమా ప్రేమికుడు రీ-రిలీజ్ కానుంది. మెగా ప్రొడ్యూసర్ కే. టి. కుంజుమోన్ నిర్మాతగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించారు. అందాల నటి నగ్మ ఇందులో హీరోయిన్గా నటించారు. ప్రస్తుతం ఈ సినిమాను నిర్మాతలు రమణ, మురళీధర్ రిలీజ్ చేస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ రీ- రిలీజ్ కి సంబంధించిన వేడుక తాజాగా చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుకలో నిర్మాతలు మురళీధర్ రెడ్డి, రమణ, ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీనివాస్, శోభారాణి పాల్గొన్నారు.30 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రేమికుడు సినిమా మళ్లీ మే 1న 300కు పైగా థియేటర్లలో ఘనంగా రీ- రిలీజ్ అవుతోంది. బుకింగ్స్ ఓపెన్ అయి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఎస్. శంకర్ దర్శకత్వంలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా, నగ్మా జంటగా 30 సంవత్సరాల క్రితం వచ్చి యువతను ఆకట్టుకున్న సినిమా. ఇప్పటికి కూడా ఆ సినిమాలోని పాటలు యువతనే కాకుండా అందరినీ ఆకట్టుకుంటూనే ఉన్నాయి.ఈ సినిమాలో ప్రభుదేవా తండ్రిగా ఎస్. పి. బాలసుబ్రమణ్యం గారు నటించడం సినిమాకే పెద్ద ప్లస్ అయింది. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే పాటలో ప్రభుదేవాతో సమానంగా ఎస్. పి. బాలు గారు డాన్స్ చేయడం విశేషం. టేకిట్ ఈజీ పాలసీ, ఓ చెలియా నా ప్రియ సఖియా పాటలు ఇప్పటికీ ఎప్పటికీ నిలిచిపోయేలా సాంగ్స్ ఉన్నాయి. ఒక మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా అప్పటి రోజుల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. నిర్మాత మురళీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ : ప్రేమికుడు సినిమాని 30 సంవత్సరాల తర్వాత మళ్లీ సీ ఎం ఆర్ సంస్థ పైన మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాము. బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు కూడా మాకు ఎంత సపోర్ట్ చేస్తున్నారు వారికి మా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సినిమా రిలీజ్‌కు అంగీకరించి మాకు సహకరిస్తున్న మా మెగా ప్రొడ్యూసర్ కొంచెం మోహన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అని అన్నారు.
నా జీవితంలో అవి చీకటి రోజులు : ప్రియాంక చోప్రా
బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న ప్రియాంకా చోప్రా ఇప్పుడు హాలీవుడ్లో సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. హాలీవుడ్ నటుడు, గాయకుడు నిక్ జోనస్‌ని ఆమె వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో తొలి నాళ్లల్లో హాలీవుడ్లో తన ప్రయాణం గురించి ప్రియాంకా చోప్రా మాట్లాడుతూ – ‘‘హాలీవుడ్‌కి వెళ్లిన తర్వాత నా కెరీర్ మళ్లీ మొదట్నుంచి మొదలైందా? అనే భావన కలిగింది. హాలీవుడ్లో నాకు తెలిసిన వారు ఎవరూ లేరు. ఒంటరిగా ఫీలయ్యాను. చాలా భయం వేసింది. కొన్ని తిరస్కరణలూ ఎదురయ్యాయి.ఇలా హాలీవుడ్లో నా కెరీర్ తొలి రోజులు ఓ చీకటి అధ్యాయంలా గడిచాయి. ఇండియాలో నేనో స్టార్ హీరోయిన్ని అనే భావనను పక్కన పెట్టి హాలీవుడ్లో నా పని చేసుకుంటూ వెళ్లాను. అందుకే ఇప్పుడు హాలీవుడ్లో మంచి స్థాయిలో ఉండగలిగానని నా నమ్మకం’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్లో ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ ఫిల్మ్‌లో నటిస్తున్నారు.
తప్పక చదవండి
- కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్
- హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- ఆ పేరే... ఒక నమ్మకం!
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
సినిమా
ఆ రోజే హరోం హర
సూపర్ స్టార్ కృష్ణ జయంతి మే 31న. కృష్ణ అల్లుడు, హీరో సుధీర్‌బాబు నటించిన ‘హరోం హర’ చిత్రం ఆ రోజే ధియేటర్లలోకి రానుంది. 1989లో చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే పీరియాడికల్ ఫిల్మ్‌గా ‘హరోం హర’ రూపొందింది. ఈ చిత్రాన్ని మే 31న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం శనివారం ప్రకటించింది.జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుమంత్ జి. నాయుడు నిర్మించిన ఈ చిత్రంలో మాళవికా శర్మ కథానాయికగా నటించగా, సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘‘ఈ సినిమా కోసం సుధీర్ బాగా మేకోవర్ అయ్యారు. కథానుసారం కుప్పం స్లాంగ్‌లో డైలాగులు చె΄్పారు. ఈ వేసవి సెలవుల్లో మంచి యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం అన్ని వర్గాలవారినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు.
సీతగా సాయిపల్లవి.. ఎంత ముద్దుగా ఉందో? ఫొటోలు వైరల్
పాన్ ఇండియా భారీ బడ్జెట్ 'రామాయణ్' షూటింగ్ మొదలైపోయింది. ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండానే షూటింగ్ మొదలుపెట్టేసినట్లు ఉన్నారు. సాయిపల్లవి సీతగా, రణ్‌బీర్ కపూర్ రాముడి గెటప్‌లో ఉన్న పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని చూసి నెటిజన్స్ తెగ మురిసిపోతున్నారు. మరీ ముఖ్యంగా సాయిపల్లవి అందానికి ఫిదా అయిపోతున్నారు.ప్రతిష్టాత్మక రామాయణం ఆధారంగా ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. దాదాపుగా ఇవన్నీ కూడా ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. గతేడాది రిలీజైన 'ఆదిపురుష్' మాత్రం ఘోరమైన ట్రోలింగ్కి గురైంది. తాజాగా బాలీవుడ్లో రామాయాణాన్ని సినిమాగా తీస్తున్నారు. గతంలో న్యూస్ వచ్చినప్పటికీ దీన్ని ఎవరూ నిర్ధారించలేదు.శ్రీరామ నవమికి అయినా సరే అధికారిక ప్రకటన వస్తుందనుకున్నారు. కానీ అలాంటిదేం రాలేదు. కానీ ఇప్పుడు సెట్స్ నుంచి రాముడు, సీత పాత్రలకు సంబంధించిన కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఇవి సర్క్యూలేట్ అవుతున్నాయి. లుక్స్ బాగానే ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాని మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నారట. ఇందులో రావణుడిగా 'కేజీఎఫ్' ఫేమ్ యష్ కనిపించబోతున్నాడు.
ఒక్క హిట్టు.. 12 సినిమాలకు సంతకం చేశా.. చివరికి!
ఫెయిల్యూర్ వస్తే ఎవరూ పట్టించుకోరు.. అదే సక్సెస్ వస్తే వారి పేర్లు మార్మోగిపోతాయి. అవకాశాలు క్యూ కడతాయి. కానీ ఆ ఫేమ్ సరిగా వాడుకుంటేనే ఇండస్ట్రీలో రాణించగలరు. ఏమాత్రం తప్పటడుగులు వేసినా మొదటికే మోసం వస్తుంది. బాలీవుడ్ నటుడు అధ్యాయన్ సుమన్ విషయంలో ఇదే జరిగింది. నటుడు శేఖర్ సుమన్ తనయుడిగా 'హాల్ ఇ దిల్' అనే సినిమాతో 2008లో వెండితెరపై అడుగుపెట్టాడు. రెండో చిత్రం రాజ్ 2తో సక్సెస్ కొట్టాడు.ఒకేసారి 12 సినిమాలకు సంతకంసక్సెస్ రావడంతో బోలెడన్ని ఆఫర్లు రాగా అన్నింటికీ ఓకే చెప్పాడట. దాని గురించి అధ్యాయన్ మాట్లాడుతూ.. 'రాజ్ 2 తర్వాత నేను ఒకేసారి 12 సినిమాలకు సంతకం చేశాను. ఇండస్ట్రీలోకి ఎంటరయ్యాను, మంచి పేరొచ్చేసిందని ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఫీలయ్యాను. ఓ వార్తా పత్రిక సైతం టాప్ 5 న్యూకమర్స్ అంటూ రణ్‌బీర్ కపూర్, ఇమ్రాన్ ఖాన్ సరసన నా ఫోటో కూడా పబ్లిష్ చేసింది. ఇది కదా అసలైన మజా అనుకున్నాను. అప్పుడే నా లైఫ్ యూటర్న్ తీసుకుంది. నా మూడో సినిమా జష్న్ బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు.మంచి సినిమా.. కానీ!దీంతో నేను సంతకం చేసిన 12 సినిమాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. నిజానికి అది చాలా మంచి సినిమా.. కానీ ఎందుకో ఆడలేదు. నటుడిగా నాకు పేరు తెచ్చినప్పటికీ తర్వాతి సినిమాలన్నీ ఆపేయడంతో అవి దేనికీ పనికిరాకుండా పోయాయి. నాతో పాటు వచ్చినవాళ్లకు ఫ్లాప్స్ వచ్చినా సినిమాలు చేసుకుంటూ పోయారు. నేను మాత్రం ఒక్క హిట్టు, ఒక్క ఫ్లాప్ అందుకుని అక్కడే ఆగిపోయాను.నాకే ఎందుకిలా..నాకే ఎందుకిలా జరిగిందని కొన్నేళ్లపాటు ఆలోచించాను. చివరకు ఇలా ఆలోచిస్తూ దిగులుగా కూర్చునేకన్నా జీవితంలో ఏది వచ్చినా ముందుకు సాగిపోవడమే మంచిదని నిర్ణయించుకున్నాను' అని చెప్పుకొచ్చాడు. కాగా అధ్యాయన్ సుమన్, తండ్రి శేఖర్ సుమన్ ప్రస్తుతం 'హీరామండి: ది డైమండ్ బజార్' అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో మే 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది.చదవండి: లావైపోయా.. సడన్‌గా అన్నీ మారిపోయాయి.. బాధేసింది!
32 కిలోలు పెరిగా.. లైఫ్ ఒక్కసారిగా ఛేంజ్: హీరోయిన్
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సందర్భాల్లో బరువు పెరగడం ఖాయం. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ఉన్నట్లుండి బరువు పెరుగుతారు. కొందరు డెలివరీ తర్వాత మామూలైపోయినప్పటికీ మరికొందరు మాత్రం మరింత లావైపోతారు. తన విషయంలోనూ ఇదే జరిగిందంటోంది బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్. సోనమ్- అహుజా దంపతులు 2022 ఆగస్టులో వాయు అనే కుమారుడికి జన్మనిచ్చారు.32 కిలోలు పెరిగాఆ సమయంలో తాను ఉన్నట్లుండి లావైపోయానంటోంది సోనమ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ప్రెగ్నెన్సీ తర్వాత నేను 32 కిలోలు పెరిగాను. నిజంగా చాలా బాధేసింది. కానీ ఆ టైంలో బిడ్డగురించే ఆలోచిస్తామే తప్ప సరైన ఫుడ్ తీసుకోవాలని, వర్కవుట్ చేయాలనే ఆలోచించం. మళ్లీ మామూలవడానికి ఏడాదిన్నర పట్టింది. సడన్‌గా అన్నీ ఛేంజ్కానీ అప్పటికే లైఫ్ మారిపోతుంది. భర్తతోనే కాదు మనతో మనకున్న అనుబంధం కూడా చేంజ్ అవుతుంది. సడన్‌గా అన్నీ మారిపోయి కొత్తగా అనిపిస్తాయి. మునుపటిలా మన శరీరం గురించి ఆలోచించలేము అని చెప్పుకొచ్చింది. కాగా ఈ ఏడాది ప్రారంభంలో సోనమ్ వర్కవుట్స్‌పై ఎక్కువ ఫోకస్ చేసింది. తన జిమ్ వీడియోలను షేర్ చేస్తూ వావ్.. 20 కిలోలు తగ్గాను.. ఇంకా ఆరు తగ్గాలి అని రాసుకొచ్చింది. ఆ ఆరు కూడా ఎప్పుడో తగ్గేసి స్లిమ్‌గా మారిపోయింది సోనమ్.చదవండి: ఇద్దరు స్టార్ హీరోయిన్లతో విజయ్ రొమాన్స్.. చివరి చిత్రమిదేనా?
ఫొటోలు
బిజినెస్
రూ.20 వేల కోట్ల సెటిల్మెంట్కు వారెన్ బఫ్ఫెట్
వారెన్ బఫ్ఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాత్వే యాజమాన్యంలోని రియల్ ఎస్టేట్ కంపెనీ ‘హోమ్ సర్వీసెస్ ఆఫ్ అమెరికా’ అమెరికా దేశవ్యాప్తంగా వ్యాజ్యాలను పరిష్కరించుకునేందుకు 250 మిలియన్ డాలర్లు (సుమారు రూ.20 వేల కోట్లు) చెల్లించడానికి అంగీకరించింది.రియల్ బ్రోకరేజీలు తమ నుంచి అధికంగా బ్రోకర్ కమీషన్లు వసూలు చేశాయంటూ అమెరికాలోని గృహ యజమానులు ఈ వ్యాజ్యాలు దాఖలు చేశారు. ప్రతిపాదిత సెటిల్మెంట్ ద్వారా తమ 51 బ్రాండ్లు, దాదాపు 70,000 రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, 300 ఫ్రాంఛైజీలకు ఈ వ్యాజ్యాల నుంచి విముక్తి లభిస్తుందని హోమ్ సర్వీసెస్ ఆఫ్ అమెరికా తెలిపింది.కెల్లర్ విలియమ్స్ రియాల్టీ, రీ/మ్యాక్స్, కంపాస్, ఎనీవేర్ రియల్ ఎస్టేట్‌తో సహా అనేక ఇతర పెద్ద బ్రోకరేజ్ సంస్థలు ఇదివరకే సెటిల్మెంట్కు సిద్ధమైన నేపథ్యంలో ‘హోమ్ సర్వీసెస్ ఆఫ్ అమెరికా’ కంపెనీ కూడా సెటిల్మెంట్ సిద్ధమైంది. గత నెలలో, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ 418 మిలియన్ డాలర్లు చెల్లించడానికి అంగీకరించింది.
విప్రో ఈ ఏడాది వేరియబుల్ పే ఎంతంటే..??
ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం విప్రో ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.రెండు త్రైమాసికంలో (క్యూ1,క్యూ2) సిబ్బందికి 80 శాతం వేరియబుల్ పే చెల్లించగా.. మూడో త్రైమాసికంలో (క్యూ3) సమయానికి ఆ మొత్తాన్ని పెంచి 85 శాతం చెల్లించినట్లు తెలుస్తోంది. ఆర్ధిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికంలో విప్రో సంస్థ ఉద్యోగులకు వేరియబుల్పే 80 శాతం, 81 శాతం చెల్లించింది. అదే సంస్థకు చెందిన క్లౌడ్ విభాగం ‘విప్రో ఫుల్ స్ట్రైడ్ క్లౌడ్’ నివేదిక ఆధారంగా.. విప్రో క్యూ3లో గడించిన ఆదాయం ప్రాతిపదికన 80వేల మంది ఉద్యోగులకు సగటున ఒక్కొక్కరికి వేరియబుల్ పే 100శాతం అందిచగా..డిసెంబర్ క్యూ4లో 89.74శాతం చెల్లించినట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు విప్రో మెయిల్ వేరియబుల్ పే చెల్లింపులు ఎలా ఉంటాయనే అంశంపై విప్రో సంస్థ ఉద్యోగులకు ఇంటర్నల్ మెయిల్ పంపింది. అందులో రెవెన్యూ (40శాతం), గ్రాస్ మార్జిన్ (30శాతం), మొత్తం కాంట్రాక్ట్ వ్యాల్యూ (30శాతం) ఆధారంగా ఉంటుందని స్పష్టం చేసింది. శాలరీ పెంచిందివిప్రోలో కాస్ట్, ఖర్చులను తీసివేయగా వచ్చే ఆదాయం పరంగా ఉద్యోగులకు శాలరీ చెల్లింపులు ఉంటాయి.అయితే ఈ ఆదాయాలు క్యూ2, క్యూ3లో ఆశించిన మేర లేకపోవడంతో విప్రో యాజమాన్యం ఉద్యోగుల జీతాల పెంపును తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ తర్వాత మార్కెట్లో డిమాండ్, పెరిగిన ఆదాయంతో కొద్ది నెలల తర్వాత విప్రో ఉద్యోగుల వేతనాన్ని ఏడాదికి 6-8 శాతం పెంచింది. ఈ పెరిగిన జీతం డిసెంబర్1,2023 నుంచి అమల్లోకి వచ్చింది. వేరియబుల్ పే అంటే ఏమిటి? అభివృద్ధి, సాధించిన విజయాలకు అనుగుణంగా ఆయా సంస్థలు ఉద్యోగులకు నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరానికి వేరియబుల్ పేని చెల్లిస్తుంటాయి. వేరియబుల్ పే ‘పెర్ఫార్మెన్స్-లింక్డ్ పే’గా ప్రసిద్ధి చెందింది. ఇది సాధారణంగా కాంట్రిబ్యూషన్, బోనస్ లేదా కమీషన్ రూపంలో చెల్లిస్తాయి సంస్థలు
‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్న జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్’
‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’.. ఈ మాటను తు.చ తప్పకుండా పాటిస్తారు సినీతారలు. అవకాశాలు అన్నప్పుడు, స్టార్డమ్ సంపాదించినప్పుడే నాలుగు రాళ్లు వెనకేస్తారు. ఇప్పుడు ఈ కోవలోకే ప్రముఖ వ్యాపార వేత్తలు వచ్చి చేరుతున్నారు. వ్యాపారం బాగా జరిగినప్పుడే నాలుగు రాళ్లు వెనకేస్తున్నారు. భవిష్యత్‌పై ఆర్ధిక భరోసా నిచ్చే రంగాల్లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారు. తాజాగా ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ న్యూఢిల్లీలోని మెహ్రౌలీ అనే ప్రాంతంలో పక్క పక్కనే ఉన్న రెండు ప్రాంతాల్లో 5 ఎకరాల భూముని కొనుగోలు చేశారు. ఆ భూమి విలువ సుమారు రూ.79కోట్లు. వేర్వేరు యజమానుల నుంచి కొనుగోలు చేసిన ఆ భూమికి మొత్తం స్టాంప్ డ్యూటీ రూ.5.24 కోట్లు చెల్లించినట్లు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల గురించి అవగాహన ఉన్న సీఆర్‌ఈమ్యాటిక్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ తెలిపింది. గత ఏడాది మార్చి 28న తొలి సారి 2.5 ఎకరాల భూమిని Luxalon Building Private Limited నుంచి కొనుగోలు చేశారు. దాని విలువ రూ.29 కోట్లు కాగా.. స్టాంప్ డ్యూటీ కింద రూ.1.74 కోట్లు చెల్లించారు. రెండో సారి స్టెప్టెంబర్ 1, 2023న రవి కపూర్ అనే యజమాని నుంచి 2.53 ఎకరాల ల్యాండ్‌ను కొనుగోలు చేశారు. దీనికి రూ.50 వెచ్చించారు. స్టాంప్ డ్యూటీ కింద రూ.3.50 కోట్లు కట్టారు. పలు నివేదికల ప్రకారం.. రెండు ప్లాట్లు ఛతర్పూర్ ప్రాంతంలోని డేరా మండి అనే గ్రామంలో ఉన్నాయి. రెండు లావాదేవీల రిజిస్ట్రేషన్ హౌజ్ ఖాస్‌లో జరిగింది ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫారమ్ మేక్మైట్రిప్ గ్రూప్ సీఈఓ రాజేష్ మాగో గురుగ్రామ్‌లోని డిఎల్ఎఫ్ మాగ్నోలియాస్‌లో 6,428 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను రూ. 33 కోట్లకు కొనుగోలు చేశారు. జెన్పాక్ట్ సిహెచ్ఆర్ఓ పీయూష్ మెహతా అదే ప్రాపర్టీలో రూ.32.60 కోట్లతో 6,462 చదరపు అడుగుల ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు.
ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి ధరలు
రోజు రోజుకి బంగారం ధరలు ఆకాశామే హద్దుగా పెరిగిపోతున్నాయి. తాజాగా, శుక్రవారం పసిడి ధరలు పెరిగాయి. ఏప్రిల్ 26న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.400.. 24 క్యారెట్ల బంగారంపై రూ.440 పెరిగింది. కొన్ని నగరాల్లో ఇంకాస్త పెరగడం బంగారం కొనుగోలు దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరగడం, కరెన్సీ విలువ పడిపోవడంతో..ఇన్వెస్టర్లు అనిశ్చితి సమయాల్లో లాభాల్లో తెచ్చి పెట్టే బంగారంపై పెట్టుబడులు పెడుతుండడంతో పసిడి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఫలితంగా ఓ రోజు బంగారం ధరలు భారీగా పెరిగితే మరో రోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,650గా ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,710గా ఉందివిజయవాడలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,650గా ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,710గా ఉందిగుంటూరులో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,650గా ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,710గా ఉందివైజాగ్‌లో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,650గా ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,710గా ఉందిముంబైలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,650గా ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,710గా ఉందిఢిల్లీలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,800గా ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,860గా ఉందిబెంగళూరులో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,650గా ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,710గా ఉందిచెన్నైలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,550గా ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,690గా ఉంది
వీడియోలు
సీఎం వైఎస్ జగన్ విడుదల చేసిన మేనిఫెస్టో పై మంత్రి రోజా హర్షం
ఇవాళ్టి నుంచే సీఎం వైఎస్ జగన్ ప్రచార భేరి
నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం సీఎం జగన్
తాడిపత్రిలో ఎగిరేది మన జెండానే
పవన్ కళ్యాణ్ ని వదిలి 1000 మంది వైఎస్ఆర్ సీపీలోకి జనసేన నాయకులు
ABN కి బాలినేని స్ట్రాంగ్ కౌంటర్
నవరత్నాలు 2.0..ఇదే మన మేనిఫెస్టో 2024..
జోరుగా హుషారుగా వైఎస్ఆర్ సీపీ నేతల ఎన్నికల ప్రచారం
YSRCP మేనిఫెస్టోపై ముఖ్య నేతల కామెంట్స్
సీఎం జగన్ రికార్డ్