Sakshi News home page
Advertisement

Top Stories

ప్రధాన వార్తలు

IPL 2024 GT VS RCB: Green Takes Incredible Catch Of Shubman Gill In Maxwell Bowling
గ్రీన్‌ సూపర్‌ క్యాచ్‌.. గిల్‌ను బుట్టలో వేసుకున్న మ్యాక్సీ

ఆర్సీబీ ఆల్‌రౌండర్‌ మ్యాక్స్‌వెల్‌ రీఎంట్రీలో అదరగొడుతున్నాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో తాను వేసిన తొలి ఓవర్‌లోనే ఆ జట్టు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ను (19 బంతుల్లో 16; ఫోర్‌) బుట్టలో వేసుకున్నాడు. ఏడో ఓవర్‌ నాలుగో బంతికి కెమరూన్‌ గ్రీన్‌ అద్భుతమైన రన్నింగ్‌ క్యాచ్‌ అందుకోవడంతో గిల్‌ పెవిలియన్‌కు చేరాడు. ఫలితంగా గుజరాత్‌ 47 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. WHAT A CATCH BY CAMERON GREEN. 🤯- He's just Incredible on the field. 🔥 pic.twitter.com/xPQgYsyBUI— Tanuj Singh (@ImTanujSingh) April 28, 2024 ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టాస్‌ ఓడి ఆర్సీబీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌​కు దిగింది. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే స్వప్నిల్‌ సింగ్‌ గుజరాత్‌ను దెబ్బ కొట్టాడు. తొలి ఓవర్‌ ఆఖరి బంతికి స్వప్నిల్‌ సాహాను (5) బోల్తా కొట్టించాడు. కర్ణ్‌ శర్మ క్యాచ్‌ పట్టడంతో సాహా పెవిలియన్‌ బాట పట్టాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ బ్యాటింగ్‌ నత్త నడకను తలపిస్తుంది. 9 ఓవర్ల అనంతరం ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 72 పరగులు చేసింది. సాయి సుదర్శన్‌ (31), షారుఖ్‌ ఖాన్‌ (15) క్రీజ్‌లో ఉన్నారు. తుది జట్లు..గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(వికెట్‌కీపర్‌), శుభ్‌మన్ గిల్(కెప్టెన్‌), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్‌), విల్ జాక్స్, రజత్ పాటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్(వికెట్‌కీపర్‌), స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్ 

Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu
ఎగ్గొట్టేందుకే చంద్రబాబు అడ్డగోలు హామీలు: సజ్జల

సాక్షి, తాడేపల్లి: తమ మేనిఫెస్టో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించేదిలా ఉండదని.. ప్రజలకు ఏం చేస్తామో అదే చెప్పామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తాయిళాలు ప్రకటించి ఓట్లు వేయించుకునే ఆలోచనలు తమకు ఉండవని.. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి రాష్ట్రాన్ని నాశనం చేశారని సజ్జల మండిపడ్డారు‘‘2014-19 మధ్య చంద్రబాబు తన విశ్వరూపం చూపించారు. చంద్రబాబువి సభ్యసమాజంలో ఉండగలిగే వ్యక్తి మాటలులాగా లేవు. రాళ్ల దాడి చేయమని గతంలో చంద్రబాబు అన్నాడు.. అన్నట్టుగానే రాళ్లతో దాడి చేయించాడు. మేనిఫెస్టో అంటే విశ్వసనీయత ఉండాలి. మీ కుటుంబంలో మంచి జరిగితేనే ఓటు వేయమని జగన్ అంటున్నారు. ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటేనే అలా అడగగలరు. అలా చంద్రబాబు ఎందుకు ఓటు అడగలేకపోతున్నారు. సంక్షేమ పథకాలతో లక్షలాది కుటుంబాల్లో మేలు జరిగింది. ఈ పథకాలతో రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారా? అని ప్రశ్నించిన చంద్రబాబు ఇప్పుడు అంతకంటే ఎక్కువ పథకాలు తెస్తానని ఎలా చెప్తున్నారు’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.‘‘అమలు చేసే వారెవరూ అడ్డగోలు హామీలు ఇవ్వరు. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం ఉన్న వారే చేయగలిగిన హామీలు ఇస్తారు. చంద్రబాబు వలన వాలంటీర్ల వ్యవస్థ ఆగిపోయింది. పెన్షన్ల పంపిణీకి ఆటంకం కలిగించారు. ఇప్పుడు మళ్లీ ఇంటింటికీ ఉద్యోగులను పంపించి పెన్షన్లు ఇవ్వమంటున్నారు. పేదలంతా తమ కాళ్ల మీద తాము నిలపడేలా చూడాలన్నది జగన్ ఇద్దేశం. 70 వేల కోట్లతో జగన్ తన సంక్షేమాన్ని అమలు చేస్తుంటే చంద్రబాబు మాత్రం ఏకంగా లక్షన్నర కోట్లు చేస్తానంటూ మాట్లాడుతున్నారు. రాష్ట్ర బడ్జెట్‌తో సంబంధం లేకుండా చంద్రబాబు అబద్ధాల హామీలు ఇస్తున్నారు’’ అని  సజ్జల మండిపడ్డారు.‘‘ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా జగన్ మేనిఫెస్టో ప్రకటించారు. చంద్రబాబు లాగా ఇష్టం వచ్చినట్లు హామీలు ఇవ్వమని కొంతమంది మాతో కూడా అన్నారు.కానీ జగన్ ఎప్పుడూ చేయలేని పని చెప్పరు. ఇచ్చిన హామీ నుంచి వెనక్కి పోరు. ఎగ్గొట్టాలనుకునే చంద్రబాబు అడ్డమైన హామీలు ఇస్తున్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే ఉన్న వ్యవస్థలన్నీ నాశనం అవుతాయి. జన్మభూమి కమిటీలు మళ్లీ వస్తాయి. చంద్రబాబుకు ఎవరైనా ఓటేస్తే తమ ఓటును తాము వృథా చేసుకున్నట్టే. చంద్రబాబు తన పాలనలో ఏం చేశారో ఇప్పటికీ ఎందుకు చెప్పలేకపోతున్నారు?’’ అంటూ సజ్జల నిలదీశారు.‘‘జగన్ పాలనలో ఏం జరిగిందో ఎవరైనా చెప్పగలరు. కుప్పంతో సహా ఎక్కడైనా చెక్ చేసేందుకు సిద్దమే. చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఇరవై ఇళ్లకు వెళ్లి అడిగే ధైర్యం ఉందా?. పోలవరం పాపం చంద్రబాబుదే. లోకేష్ ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. ఎందుకు ప్రజలకు కనపడటం లేదు?. పవన్ కళ్యాణ్ చంద్రబాబు దత్తపుత్రుడు. చంద్రబాబు మాటలే పవన్ కూడా మాట్లాడతారు. సెక్రటేరియట్ ని కూడా తాకట్టు పెట్టామని కూడా పవన్ అన్నారు. రాజధానిలోని పొలాలను తాకట్టు పెట్టిందే చంద్రబాబు’’ అంటూ సజ్జల దుయ్యబట్టారు. 

Cm Jagan Speech On Venkatagiri Public Meeting
చంద్రబాబుకు ఓటేస్తే.. మళ్లీ మోసపోవడమే: సీఎం జగన్‌

సాక్షి, నెల్లూరు జిల్లా: బాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టడమేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. జగన్‌కు ఓటు వేస్తే.. పథకాలన్నీ కొనసాగింపు.. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే.. పథకాలకు ముగింపేనన్నారు. ఆదివారం మధ్యాహ్నం వెంకటగిరి త్రిభువని సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ, ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కాదు. ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్లలో భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు అన్నారు.‘‘ఎన్నికల యుద్ధానికి మీరు సిద్ధమా?. చంద్రబాబుకు ఓటేస్తే.. మళ్లీ మోసపోవడమే. రూ.3 వేల పెన్షన్‌ అంటే గుర్తుకొచ్చేది జగన్‌. అమ్మఒడి అంటే గుర్తుకొచ్చేది జగన్‌. కాపు నేస్తం, ఈబీసీ నేస్తం అంటూ గుర్తుకొచ్చేది జగన్‌. 31 లక్షల ఇళ్ల పట్టాలంటే గుర్తుకొచ్చేది జగన్‌. మహిళా సాధికారిత అంటే గుర్తుకొచ్చేది జగన్‌. సంక్షేమ పథకాలంటే పేదవాడికి గుర్తుకొచ్చేది జగన్‌. రైతన్నల చేయిపట్టుకుని నడిపించేది ఎవరంటే గుర్తుకొచ్చేది జగన్‌. నాడు-నేడుతో స్కూళ్ల రూపురేఖలను మార్చాం. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే స్కీమ్‌ ఉందా?’’ అంటూ సీఎం జగన్‌ దుయ్యబట్టారు.’’బాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపడమే. చంద్రబాబును నమ్మడమంటే పసుపుపతిని ఇంటికి తీసుకురావడమే. ముఖ్యమైన హామీలతో చంద్రబాబు సంతకం పెట్టి.. ఇదే కూటమి గతంలో ప్రజలను మోసం చేసింది. చంద్రబాబు హామీలను ఎల్లో మీడియా ఊదరగొట్టింది. రుణమాఫీ అంటూ చంద్రబాబు రైతులను మోసం చేశారు. డ్వాక్రా రుణాల పేరుతోనూ చంద్రబాబు మోసం చేశారు. ఒక్క రూపాయి కూడా డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదు. ఇంటికో ఉద్యోగం పేరుతో నిరుద్యోగులను మోసం చేశారు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారు. అర్హులైన వారికి మూడు సెంట్ల స్థలం ఇస్తామని మోసం చేశారు’’ అంటూ చంద్రబాబుపై సీఎం జగన్‌ నిప్పులు చెరిగారు

IPL 2024: Gautam Gambhir On RCB Virat kohli Strike Rate
కోహ్లి స్ట్రైక్‌రేటుపై గంభీర్‌ వ్యాఖ్యలు.. వైరల్‌

టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లితో తనకు ఎలాంటి విభేదాలు లేవని భారత మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ స్పష్టం చేశాడు. మీడియా అత్యుత్సాహం వల్లే తమ గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చెందిందని పేర్కొన్నాడు.అదే విధంగా ఐపీఎల్‌-2024లో ఆర్సీబీ ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న కోహ్లి స్ట్రైక్‌రేటు గురించి కూడా గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా గతేడాది రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు- లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య మ్యాచ్‌ సందర్భంగా కోహ్లి- అప్పటి లక్నో మెంటార్‌ గంభీర్‌ మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో వీరిద్దరి ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, తాజా సీజన్‌లో కేకేఆర్‌ మెంటార్‌గా అవతారమెత్తిన గంభీర్‌.. ఇటీవలి మ్యాచ్‌ సందర్భంగా కోహ్లిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. ఇద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు.గొడవ పడితే చూడాలనిఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. ఈ క్రమంలో ఓ షోలో విరాట్‌ కోహ్లి మాట్లాడుతూ.. ‘‘మేము ఇద్దరం గొడవ పడితే చూడాలని అనుకునే వాళ్లే ఎక్కువగా ఉంటారు. వాళ్లను ఈ వీడియోలు నిరాశపరిచి ఉంటాయి’’ అని చమత్కరించాడు.ఈ విషయంపై తాజాగా స్పందించిన గౌతం గంభీర్‌ కోహ్లి వ్యాఖ్యలతో ఏకీభవించాడు. టీఆర్‌పీ రేటింగ్‌ల కోసమే మీడియా ఇలాంటివి ఎక్కువగా ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను, విరాట్‌ కోహ్లి ఎలాంటి వాళ్లమో, తమ మధ్య అనుబంధం ఎలా ఉంటుందో వారికి తెలియదన్న గౌతీ.. వీలైతే పాజిటివిటీని పెంచే అంశాలను చూపించాలన్నాడు.ఎవరికి వారే ప్రత్యేకంతాను, కోహ్లి పరిణతి చెందిన వ్యక్తులం కాబట్టి ఇలాంటి వాటి గురించి ఎక్కువగా పట్టించుకోమని గంభీర్‌ చెప్పుకొచ్చాడు. ఇక కోహ్లి స్ట్రైక్‌రేటు గురించి జరుగుతున్న చర్చలపై స్పందిస్తూ.. ‘‘ప్రతి ఒక్క ఆటగాడు భిన్నంగా ఉంటాడు.మాక్స్‌వెల్‌ ఆడినట్లు కోహ్లి ఆడకపోవచ్చు. కోహ్లి తీరుగా మాక్స్‌వెల్‌ షాట్లు బాదలేకపోవచ్చు. పదకొండు మంది సభ్యులున్న జట్టులో ఎవరికి వారే ప్రత్యేకం. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో 1- 8 వరకు విధ్వంసకర బ్యాటర్లు అందుబాటులో ఉంటే స్కోరు 300 కావొచ్చు లేదంటే 30 పరుగులకే ఆలౌట్‌ కావచ్చు.జట్టును గెలిపించినపుడు స్ట్రైక్‌రేటు 100 ఉన్నా బాగానే అనిపిస్తుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం 180 స్ట్రైక్‌రేటు కూడా మన కంటికి కనిపించదు. మ్యాచ్‌ జరిగే వేదిక, పిచ్‌ పరిస్థితి, ప్రత్యర్థి జట్టు.. ఇలా భిన్న అంశాలపై స్ట్రైక్‌రేటు ఆధారపడి ఉంటుందన్న విషయం మర్చిపోకూడదు’’ అంటూ విరాట్‌ కోహ్లికి గంభీర్‌ మద్దుతుగా నిలిచాడు. కాగా ఈ సీజన్‌లో కోహ్లి ఆడిన 9 మ్యాచ్‌లలో కలిపి 145.76 స్ట్రైక్‌రేటుతో 430 పరుగులు సాధించి టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. 

 IPL 2024: RCB Won The Toss And Choose To Field, Maxwell Returns
IPL 2024: గుజరాత్‌-ఆర్సీబీ మ్యాచ్‌.. విధ్వంసకర బ్యాటర్‌ రీఎంట్రీ

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 28 మధ్యాహ్నం) జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో ఆర్సీబీ విధ్వంసకర బ్యాటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ రీఎంట్రీ ఇచ్చాడు. మ్యాక్సీ కొన్ని మ్యాచ్‌లకు ముందు ఫామ్‌ లేమి కారణంగా స్వతహాగా జట్టు నుంచి తప్పుకున్నాడు. మూడు మ్యాచ్‌ల విరామం అనంతరం మ్యాక్సీ తిరిగి జట్టులోకి వచ్చాడు. మ్యాక్సీ జట్టులోకి రావడంతో ఫెర్గూసన్‌పై వేటు పడింది. ఈ ఒక్క మార్పుతో ఆర్సీబీ నేటి మ్యాచ్‌లో బరిలోకి దిగుతుంది. మరోవైపు గుజరాత్‌ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. ఈ మ్యాచ్‌ గుజరాత్‌ హోం గ్రౌండ్‌ అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనుంది.పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండగా.. గుజరాత్‌ 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో ఏడో స్థానంలో నిలిచింది. గుజరాత్‌కు ఈ మ్యాచ్‌ చాలా కీలకం కానుంది. ప్లే ఆఫ్స్‌ రేసులో నిలబడాలంటే గుజరాత్‌ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. మరోవైపు ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన ఆర్సీబీకి ఈ మ్యాచ్ నామమాత్రంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా ఆర్సీబీకి పెద్ద ఫరక్‌ పడదు.హెడ్‌ టు హెడ్‌ ఫైట్స్‌ విషయానికొస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు మూడు సందర్భాల్లో ఎదురెదురుపడగా.. గుజరాత్‌ 2, ఆర్సీబీ ఒక మ్యాచ్‌లో గెలుపొందాయి.తుది జట్లు..గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(వికెట్‌కీపర్‌), శుభ్‌మన్ గిల్(కెప్టెన్‌), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్‌), విల్ జాక్స్, రజత్ పాటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్(w), స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్

Today Gold and Silver Price 28 April 2024
స్థిరంగా బంగారం, వెండి.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?

ఏప్రిల్ ప్రారంభం నుంచి భారీగా పెరిగిన బంగారం ధరలు గత కొన్ని రోజులుగా పడుతూ లేస్తూ ఉన్నాయి. ఈ రోజు మాత్రం ఉలుకూ.. పలుకూ లేకుండా అన్నట్లు పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలో ఈ రోజు గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడలలో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.66850 (22 క్యారెట్స్), రూ.72930 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్న రూ. 200 నుంచి రూ. 200 వరకు పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరల్లో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 67000 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 73080 రూపాయల వద్దే ఉంది. నిన్న రూ.200, రూ.220 వరకు పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు ఏ మాత్రం పెరగలేదు. కాబట్టి నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగుతాయి.దేశంలోని ఇతర నగరాలలో మాదిరిగానే చెన్నైలో కూడా పసిడి ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 67700 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 72760 రూపాయల వద్ద ఉంది.వెండి ధరలుబంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరల్లో కూడా ఈ రోజు ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఈ రోజు (ఏప్రిల్ 28) ఒక కేజీ వెండి ధర 84000 రూపాయల వద్ద నిలిచింది. చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో కూడా వెండి ధరల్లో ఎటువంటి మార్పులు లేదు.

India Secured One Of Its Biggest Wins In Archery As The Mens Recurve Team Stunned Reigning Olympic Champion South Korea
సంచలనం సృష్టించిన భారత ఆర్చరీ జట్టు.. ఒలింపిక్ ఛాంపియన్లకు షాక్‌

భారత ఆర్చరీ జట్టు సంచలనం సృష్టించింది. చైనా వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్‌ స్టేజ్‌ 1 పోటీల్లో డిఫెండింగ్‌ ఒలింపిక్‌ ఛాంపియన్‌ సౌత్‌ కొరియాకు ఊహించని షాకిచ్చింది.  🚨 India secured one of its biggest wins in archery as the men's recurve team stunned reigning Olympic champion South Korea to win the gold medal at the ongoing World Cup Stage 1. 🇮🇳🥇👏 pic.twitter.com/hZkHdOicqo— Indian Tech & Infra (@IndianTechGuide) April 28, 2024 ధీరజ్‌ బొమ్మదేవర, తరుణ్‌దీప్‌ రాయ్‌, ప్రవీణ్‌ జాదవ్‌లతో కూడిన భారత పురుషుల రికర్వ్‌ జట్టు.. దక్షిణ కొరియాపై 5-1 తేడాతో చారిత్రక విజయం సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. అర్చరీ వరల్డ్‌కప్‌లో 14 ఏళ్ల తర్వాత భారత్‌కు లభించిన తొలి స్వర్ణ పతకం ఇది. ఈ విజయంతో భారత్‌ పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తు ఖరారయ్యే అవకాశాలు మెరుగుపడ్డాయి.   

The Green Children Of Woolpit Village Mistory Story Of England
మిస్టరీ.. దగ్గరకు వెళ్లేకొద్దీ.. అస్పష్టంగా పిల్లల స్వరం వినిపించసాగింది..

అది 12వ శతాబ్దం. వారసత్వ సంక్షోభంతో ఇంగ్లండ్‌ సింహాసనం కోసం అంతర్యుద్ధం జరుగుతున్న కాలమది. దాన్ని చరిత్రలో ‘ది అనార్కీ’ అని పిలుస్తారు. ఆ అరాచక పరిస్థితుల్లో జరిగిన ఓ వింత.. నేటికీ మిస్టరీయే!సఫెక్‌లోని వూల్‌పిట్‌ అనే గ్రామంలో కొందరు పొలం పనులు చేసుకుంటున్నారు. అప్పుడే ఉన్నట్టుండి, సమీపంలో తోడేళ్ల కోసం తవ్విన గుంతలో ఎండుటాకుల అలికిడి బాగా పెరిగింది. ‘అబ్బ.. తోడేళ్లు పడినట్లు ఉన్నాయి. ఈ రోజుకి మన పంట పండింది’ అనుకున్నారు. వారంతా నెమ్మదిగా తోడేళ్ల గుంత వైపు నడిచారు. దగ్గరకు వెళ్లేకొద్దీ.. అస్పష్టంగా పిల్లల స్వరం వినిపించసాగింది. ఆ అస్పష్టతకు కారణం స్వరం కాదు, భాష. ఆ పిల్లలు ఏం మాట్లాడుతున్నారో అక్కడున్నవారెవ్వరికీ అర్థంకాలేదు.దగ్గరకు వెళ్లి పరిశీలనగా చూస్తే ఆ గుంతలో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. చూస్తుంటే వారిద్దరూ అక్కా, తమ్ముడు అని అర్థమవుతోంది. కానీ ఇద్దరూ ఆకుపచ్చ చర్మంతో ఉన్నారు. వారి ఒంటి మీద దుస్తులు అసాధారణంగా, వింతగా కనిపించాయి. మానవులు కాదనే అనుమానం ఓ వైపు.. పసివాళ్లు అనే జాలి మరోవైపు.. పెనుగులాడుతుంటే.. చివరికి జాలే గెలిచింది. ఆ పిల్లల్ని జాగ్రత్తగా పైకి తీసి, ‘రిచర్డ్‌ డి కాల్నే’ అనే ఊరిపెద్ద ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడే పిల్లలకు ఆవాసం ఏర్పాటు చేశారు. అయితే తినడానికి ఏం పెట్టినా పిల్లలు వద్దన్నారు. వాళ్లు చెప్పిన మాటలు పిల్లలకు అర్థం కాలేదు. పిల్లల అవసరం పెద్దలకు బోధపడలేదు.ఆకుపచ్చ రంగులో ఉన్న ఆ ఇద్దరు చిన్నారులు.. చాలారోజుల పాటు తిండి తినలేదట. అయితే కొంత కాలానికి.. ‘కాల్నే’ తోటలో పెరుగుతున్న బఠాణీ మొక్కల నుంచి బఠాణీలను తెంపుకుని తినడం మొదలుపెట్టారు. అలా కొన్ని నెలల పాటు వాటి మీదే బతకారు వాళ్లు.  దాంతో ఆ పిల్లలు వేరే లోకం నుంచి వచ్చి పడ్డారన్న వాదన స్థానికుల్లో బలపడింది. తర్వాత కొంత కాలానికి.. ‘కాల్నే’ ఇంట్లో కాల్చిన రొట్టెలను తినడం మొదలుపెట్టారా పిల్లలు. దానివల్ల క్రమంగా వారి చర్మం రంగు మారుతూ వచ్చింది. పిల్లలు స్థానిక భాషను నేర్చుకుని.. మాట్లాడటం ప్రారంభించారు. అలా నెమ్మదిగా వాళ్లు సాధారణ మనుషులుగా మారుతున్న తరుణంలో.. ఉన్నట్టుండి పిల్లాడు చనిపోయాడు.తమ్ముడి మరణంతో ఆ పాప చాలా కుంగిపోయింది. తేరుకోవడానికి నెలలు పట్టింది. ఆ బాధలో చుట్టుపక్కలవారితో అనుబంధం పెరిగి.. అమ్మాయి మాటల్లో స్పష్టత వచ్చింది. ఆమె ఇంగ్లిష్‌ మాట్లాడటం నేర్చుకుంది. భాష పూర్తిగా నేర్చుకున్న తర్వాత.. ఆ అమ్మాయి మాటలు మరింత ఆసక్తిని రేకెత్తించాయి. ‘నేను, నా సోదరుడు గతంలో ఉన్న చోటకి.. ఇప్పుడు ఉంటున్న చోటికి చాలా తేడా ఉంది. అది వేరే గ్రహంలా అనిపిస్తోంది.మేము ఇక్కడికి ఎలా వచ్చామో మాకు తెలియదు. మేము తోడేళ్ల గుంతలో పడకముందు వరకూ మా నాన్నతోనే ఉన్నాం. ఉన్నట్టుండి పెద్ద గంటల మోత వినిపించింది. మేము ఆ సమీపంలో పెద్ద నదిని కూడా చూశాం. ఆ క్షణంలో మాకేమైందో తెలియదు. కళ్లు తెరిచేసరికి మీ ముందు ఉన్నాం’ అని చెప్పుకొచ్చింది ఆ అమ్మాయి. ఆ పిల్ల అంత చెప్పుకొచ్చినా ఆ అక్క, తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చారనేది అక్కడున్న ఎవరికీ అర్థం కాలేదు.అలా ‘కాల్నే’ ఇంట్లోనే పెరిగిన ఆ అమ్మాయికి.. ‘ఆగ్నెస్‌ బారే’ అనే పేరుపెట్టారు. దగ్గర్లోని కింగ్స్‌ లిన్‌ పట్టణానికి చెందిన ‘ఆర్చ్‌డీకన్‌ రిచర్డ్‌’ని పెళ్లి చేసుకుంది. నివేదికల ప్రకారం ఆమెకు పిల్లలు కూడా పుట్టారు. అయితే  ఆమె వంశస్థుల గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో.. ఆమెకు పుట్టిన పిల్లలు ఆకుపచ్చరంగులో పుట్టారని, వారు తిరిగి తమ పూర్వీకులను వెతుక్కుంటూ వెళ్లిపోయారంటూ ఎన్నో కథలు పుట్టుకొచ్చాయి. ఆనాడు ఆ పిల్లల్ని చూసిన కొందరు చిత్రకారులు.. కొన్ని చిత్రాలను గీసి భద్రపరచారట.అయితే తర్వాత కాలంలో .. ఈ అక్కా తమ్ముళ్లిద్దరూ బెల్జియంలోని ఫ్లాండర్స్‌కి చెందిన ఫ్లెమిష్‌ వలసదారుల పిల్లలు కావచ్చు అనే ఓ వాదన పుట్టుకొచ్చింది. 12వ శతాబ్దంలో అనేక మంది ఫ్లెమిష్‌ వలసదారులు.. వూల్‌పిట్‌ సమీపంలోని ఫోర్న్‌హామ్‌ సెయింట్‌ మార్టిన్‌ పట్టణానికి చేరుకున్నారనే ఆధారాలూ దొరికాయి. ఫోర్న్‌హామ్‌ను, పూల్‌పిట్‌లను.. లార్క్‌ నది వేరు చేస్తుంది. ఆ పాప చెప్పిన నది అదే కావచ్చని అంచనా వేశారు.కింగ్‌ హెన్రీ ఐఐ పాలనలో, ఫోర్న్‌హామ్‌ యుద్ధంలో చాలామంది ఫ్లెమిష్‌ వలసదారులు ప్రాణాలు కోల్పోయారు. ఆ యుద్ధం కారణంగా ఆ అక్కాతమ్ముళ్లిద్దరూ తమ వాళ్లను కోల్పోయి అనాథలుగా మారి ఉండొచ్చు. పాప విన్న పెద్ద గంటల చప్పుడు .. యుద్ధానికి సంబంధించిందే అయ్యుండొచ్చు. అలా అనాథలైన ఈ పిల్లలు.. అడవి బాటలో పడి పోషకాహారం కరవై అనారోగ్యానికి గురై ఉండొచ్చని, పిల్లల్ని కాపాడినవారికి వీరి డచ్‌ భాష అర్థమై ఉండకపోవచ్చని అంచనా వేశారు.ఈ అంచనా నిజమైతే.. పిల్లల చర్మం ఎందుకు ఆకుపచ్చగా ఉంది? అనే ప్రశ్న.. మరింత లోతుగా ఆలోచించేలా చేసింది. పోషకాహారం అందకుంటే చర్మం ఆకుపచ్చ రంగులోకి మారే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. అందుకే సమతుల ఆహారం తీసుకున్నా కొద్ది రోజులకే వాళ్ల చర్మం తిరిగి పూర్వ స్థితికి చేరిందని గుర్తుచేస్తూ.. పై వాదనకు బలాన్నిచ్చారు  నిపుణులు.ఇదిలా ఉండగా..  ఆర్సెనిక్‌ పాయిజనింగ్‌ వల్ల కూడా చర్మం ఆకుపచ్చగా మారుతుందనే మరో వాదన వచ్చి షాక్‌నిచ్చింది అందరికీ! పిల్లలపై ఆ విషప్రయోగం జరిగి ఉంటుందా? కావాలనే పిల్లలకు ఈ విషం ఇచ్చి.. అడవిలో వదిలేసి వెళ్లారా? అనే ప్రశ్నలు ఈ కథను ఉత్కంఠగా మార్చాయి.అయితే ఆ ప్రశ్నలకు కూడా సరైన సమాధానాలు దొరకలేదు. ఆ దిశలో అన్వేషణ కొనసాగుతుండగానే.. ఆ పిల్లలు ఏలియ¯Œ ్స అని కొందరు నమ్మసాగారు. పిల్లలు దొరకడం నిజమే. కానీ ఎలా దొరికారు? ఎక్కడి నుంచి వచ్చారు? అనే ఊహాజనితమైన ఈ కథనాన్ని ప్రేరణగా తీసుకుని.. ఎన్నో నవలలు, పద్యాలు, నాటకాలు, సినిమాలు, డ్రామాలు పుట్టుకొచ్చాయి. దాదాపు ఎనిమిది శతాబ్దాలకు పైగా ఈస్టోరీ మిస్టరీగా కొనసాగుతునే ఉంది. — సంహిత నిమ్మనఇవి చదవండి: Funday Story: చిన్నమ్మ!! ‘ఏరా ఎప్పుడూ ఆ దస్తాలేనా, పుస్తకాలు తియ్యవా’?

IPL 2024: RCB To Take On Gujarat And CSK Fight With SRH On Big Sunday
ఐపీఎల్‌లో ఇవాళ (Apr 28) రెండు మ్యాచ్‌లు.. రెండూ భారీ సమరాలే..!

ఐపీఎల్‌లో ఇవాళ (ఏప్రిల్‌ 28) రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం (3:30 గంటలకు) మ్యాచ్‌లో గుజరాత్‌, ఆర్సీబీ.. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌, సీఎస్‌కే జట్లు తలపడనున్నాయి. ఆదివారం కావడంతో ఐపీఎల్‌ ఇవాళ రెండూ భారీ మ్యాచ్‌లనే షెడ్యూల్‌ చేసింది.మధ్యాహ్నం మ్యాచ్‌ విషయానికొస్తే..పేపర్‌పై పటిష్టంగా కనిపించే ఆర్సీబీ.. అడపాదడపా ప్రదర్శనలతో నెట్టుకొస్తున్న గుజరాత్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌ గుజరాత్‌ హోం గ్రౌండ్‌ అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనుంది.పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండగా.. గుజరాత్‌ 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో ఏడో స్థానంలో నిలిచింది. గుజరాత్‌కు ఈ మ్యాచ్‌ చాలా కీలకంగా మారింది. ప్లే ఆఫ్స్‌ రేసులో నిలబడాలంటే గుజరాత్‌ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. మరోవైపు ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన ఆర్సీబీకి ఈ మ్యాచ్ నామమాత్రం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా ఆర్సీబీకి పెద్ద ఫరక్‌ పడదు.హెడ్‌ టు హెడ్‌ ఫైట్స్‌ విషయానికొస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు మూడు సందర్భాల్లో ఎదురెదురుపడగా.. గుజరాత్‌ 2, ఆర్సీబీ ఒక మ్యాచ్‌లో గెలుపొందాయి. తుది జట్లు (అంచనా)..గుజరాత్‌: వృద్ధిమాన్ సాహా (వికెట్‌కీపర్‌), శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్‌ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్‌), విల్ జాక్స్, రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్‌కీపర్‌), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, లోకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్రాత్రి మ్యాచ్‌ విషయానికొస్తే.. సీఎస్‌కే తమ సొంత మైదానమైన చెపాక్‌లో పటిష్టమైన సన్‌రైజర్స్‌ను ఢీకొట్టనుంది. ఈ సీజన్‌లోనే ఇది బిగ్‌ ఫైట్‌గా చెప్పవచ్చు. ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్‌ మూడో స్థానంలో.. సీఎస్‌కే ఆరో స్థానంలో ఉన్నాయి. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ చాలా కీలకంగా మారింది.హెడ్‌ టు హెడ్‌ రికార్డ్‌ విషయానికొస్తే.. ఐపీఎల్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు 20 మ్యాచ్‌ల్లో తలపడగా.. సీఎస్‌కే 14, సన్‌రైజర్స్‌ 6 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.తుది జట్లు (అంచనా)..సన్‌రైజర్స్‌: అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్, ఎయిడెన్ మార్క్రమ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్ [ఇంపాక్ట్‌ సబ్: టి నటరాజన్]సీఎస్‌కే: రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, ఎంఎస్‌ ధోని, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహ్మాన్, మతీషా పతిరణ [ఇంపాక్ట్‌ సబ్: శార్దూల్ ఠాకూర్]

Actor Sahil Khan Arrested In Mahadev Betting App Case
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్

మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్‌ని  ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇతడిని ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. అంతకుముందు సాహిల్ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ని బాంబే హైకోర్టు తిరస్కరించింది. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ బెట్టింగ్ కేసు ఏంటి? సాహిల్‌ని ఎందుకు అరెస్ట్ చేశారు?  బాలీవుడ్ నటుడిగా సాహిల్ ఖాన్ పరిచయమే. 'స్టైల్', 'ఎక్స్యూజ్ మీ' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఫిట్‌నెస్ ట్రైనర్‌, ఇన్ఫ్లూయెన్సర్‌గా చేస్తున్నాడు. కొన్నేళ్ల ముందు మహేదేవ్ బెట్టింగ్ యాప్‪‌ని ప్రమోట్ చేశాడు. అయితే ఈ యాప్ ద్వారా రూ.15,000 కోట్ల అవినీతి జరిగింది. దాదాపు 67 బెట్టింగ్ సైట్లు సృష్టించారు. ఈ విషయమై సామాజిక కార్యకర్త ప్రకాశ్ బంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2023 నవంబరులో మాతుంగ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా డిసెంబరులో దీన్ని ప్రమోట్ చేస్తున్న సాహిల్ ఖాన్‌కి నోటీసులు జారీ చేశారు.(ఇదీ చదవండి: కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్)అయితే విచారణకు హాజరు కాకుండా సాహిల్.. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టుని ఆశ్రయించాడు. సెలబ్రిటీగా తాను కేవలం ప్రమోట్ చేశానని చెప్పుకొచ్చాడు. యాప్‌లో జరిగే వాటితో తనకు సంబంధం లేదని పేర్కొన్నాడు. కానీ పోలీసులు మాత్రమే ఇతడిని బెట్టింగ్ యాప్ కో-ఓనర్ అని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు.అయితే ఈ బెట్టింగ్ యాప్ ద్వారా అవినీతి జరిగిన డబ్బంతా కూడా హవాలా ద్వారా విదేశాలకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. సాహిల్‌తో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలని కూడా పోలీసులు ఈ కేసులో విచారించే అవకాశాలు ఉన్నాయి.(ఇదీ చదవండి: ప్రముఖ దేవాలయంలో స్టార్ హీరోయిన్ సంయుక్త.. కారణం అదేనా?)

తప్పక చదవండి

Advertisement
Advertisement
Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all
Advertisement
Advertisement
Advertisement