Sakshi News home page
Advertisement

Top Stories

ప్రధాన వార్తలు

Prabhudeva Premikudu Movie Release
ప్రభుదేవా హిట్‌ సినిమా 'ప్రేమికుడు' రీ-రిలీజ్‌

ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా సూపర్‌ హిట్‌ సినిమా ప్రేమికుడు రీ-రిలీజ్‌ కానుంది. మెగా ప్రొడ్యూసర్ కే. టి. కుంజుమోన్ నిర్మాతగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించారు. అందాల నటి నగ్మ ఇందులో హీరోయిన్‌గా నటించారు. ప్రస్తుతం ఈ సినిమాను నిర్మాతలు రమణ, మురళీధర్ రిలీజ్ చేస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ రీ- రిలీజ్ కి సంబంధించిన వేడుక తాజాగా చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుకలో నిర్మాతలు మురళీధర్ రెడ్డి, రమణ, ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీనివాస్, శోభారాణి పాల్గొన్నారు.ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా సూపర్‌ హిట్‌ సినిమా ప్రేమికుడు రీ-రిలీజ్‌ కానుంది. మెగా ప్రొడ్యూసర్ కే. టి. కుంజుమోన్ నిర్మాతగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించారు. అందాల నటి నగ్మ ఇందులో హీరోయిన్‌గా నటించారు. ప్రస్తుతం ఈ సినిమాను నిర్మాతలు రమణ, మురళీధర్ రిలీజ్ చేస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ రీ- రిలీజ్ కి సంబంధించిన వేడుక తాజాగా చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుకలో నిర్మాతలు మురళీధర్ రెడ్డి, రమణ, ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీనివాస్, శోభారాణి పాల్గొన్నారు.30 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రేమికుడు సినిమా మళ్లీ మే 1న 300కు పైగా థియేటర్లలో ఘనంగా రీ- రిలీజ్ అవుతోంది. బుకింగ్స్ ఓపెన్ అయి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఎస్. శంకర్ దర్శకత్వంలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా, నగ్మా జంటగా 30 సంవత్సరాల క్రితం వచ్చి యువతను ఆకట్టుకున్న సినిమా. ఇప్పటికి కూడా ఆ సినిమాలోని పాటలు యువతనే కాకుండా అందరినీ ఆకట్టుకుంటూనే ఉన్నాయి.ఈ సినిమాలో ప్రభుదేవా తండ్రిగా ఎస్. పి. బాలసుబ్రమణ్యం గారు నటించడం సినిమాకే పెద్ద ప్లస్ అయింది. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే పాటలో ప్రభుదేవాతో సమానంగా ఎస్. పి. బాలు గారు డాన్స్ చేయడం విశేషం. టేకిట్ ఈజీ పాలసీ, ఓ చెలియా నా ప్రియ సఖియా పాటలు ఇప్పటికీ ఎప్పటికీ నిలిచిపోయేలా సాంగ్స్ ఉన్నాయి. ఒక మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా అప్పటి రోజుల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. నిర్మాత మురళీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ : ప్రేమికుడు సినిమాని 30 సంవత్సరాల తర్వాత మళ్లీ సీ ఎం ఆర్ సంస్థ పైన మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాము. బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు కూడా మాకు ఎంత సపోర్ట్ చేస్తున్నారు వారికి మా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సినిమా రిలీజ్‌కు  అంగీకరించి మాకు సహకరిస్తున్న మా మెగా ప్రొడ్యూసర్ కొంచెం మోహన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అని అన్నారు.

Priyanka Chopra Opens Up On Lonely Time In Hollywood
నా జీవితంలో అవి చీకటి రోజులు : ప్రియాంక చోప్రా

బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా పేరు సంపాదించుకున్న ప్రియాంకా చోప్రా ఇప్పుడు హాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. హాలీవుడ్‌ నటుడు, గాయకుడు నిక్‌ జోనస్‌ని ఆమె వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఓ పాడ్‌ కాస్ట్‌ ఇంటర్వ్యూలో తొలి నాళ్లల్లో హాలీవుడ్‌లో తన ప్రయాణం గురించి ప్రియాంకా చోప్రా మాట్లాడుతూ – ‘‘హాలీవుడ్‌కి వెళ్లిన తర్వాత నా కెరీర్‌ మళ్లీ మొదట్నుంచి మొదలైందా? అనే భావన కలిగింది. హాలీవుడ్‌లో నాకు తెలిసిన వారు ఎవరూ లేరు. ఒంటరిగా ఫీలయ్యాను. చాలా భయం వేసింది. కొన్ని తిరస్కరణలూ ఎదురయ్యాయి.ఇలా హాలీవుడ్‌లో నా కెరీర్‌ తొలి రోజులు ఓ చీకటి అధ్యాయంలా గడిచాయి. ఇండియాలో నేనో స్టార్‌ హీరోయిన్‌ని అనే భావనను పక్కన పెట్టి హాలీవుడ్‌లో నా పని చేసుకుంటూ వెళ్లాను. అందుకే ఇప్పుడు హాలీవుడ్‌లో మంచి స్థాయిలో ఉండగలిగానని నా నమ్మకం’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్‌లో ‘హెడ్స్‌ ఆఫ్‌ స్టేట్‌’ ఫిల్మ్‌లో నటిస్తున్నారు.   

Samantha Ruth Prabhu Birthday Special And Interesting Facts
స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?

సమంత రుతు ప్రభు.. ఈ పేరు చెప్పగానే సినిమాలు, కాంట్రవర్సీలు, విమర్శలు, ట్రోల్స్ ఇలా చాలా గుర్తొస్తాయి. ఎందుకంటే ఈమె జీవితం సినిమాని మించిపోయేలా ఉంటుంది. హ్యాపీ మూమెంట్స్‌తో పాటు ట్రాజెడీ అనిపించే సంగతులు చాలానే వినిపిస్తాయి.  వీటి గురించి కొందరికి తెలిస్తే మరికొందరికి తెలియదు. ఇప్పుడు సమంత 37వ పుట్టినరోజు సందర్భంగా మరోసారి వాటిని అలా గుర్తుచేసుకుందాం.తమిళనాడులోని చెన్నైలో పుట్టి పెరిగిన సమంత.. అక్కడే చదువుకుంది. డిగ్రీ చివర్లో ఉండగానే మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. అయితే సినిమాల్లోకి రాకముందు పాకెట్ మనీ కోసం పార్టీలు, ఈవెంట్స్‌లో వెల్‌కమ్ గర్ల్‌గా పనిచేసింది. అలానే 'ఏ మాయ చేశావె'.. ఈమె తొలి సినిమా అని చాలామంది అనుకుంటారు. కానీ అంతకంటే ముందే తమిళంలో 'మాస్కోవిన్ కావేరి' అనే మూవీ చేసింది.(ఇదీ చదవండి: ప్రముఖ దేవాలయంలో స్టార్ హీరోయిన్ సంయుక్త.. కారణం అదేనా?)తెలుగులో రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్.. ఇలా స్టార్ హీరోలు అందరితోనూ సినిమాలు చేసింది. హిట్స్ కొట్టి స్టార్ హీరోయిన్ హోదా అనుభవించింది. 2010-19 వరకు దాదాపు పదేళ్ల పాటు ఇండస్ట్రీలో వరస చిత్రాలు చేసిన సమంత.. ఆ తర్వాత మాత్రం వరస ఫ్లాపుల దెబ్బకు డౌన్ అయిపోయింది. మధ్యలో ఈమెకు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి ఉన్నట్టు తెలియడంతో కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ కూడా ఇచ్చింది.సినిమాలతో పాటు ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత.. 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లో నెగిటివ్ షేడ్స్ ఉన్న ఉగ్రవాది తరహా పాత్రలో నటించి షాకిచ్చింది. అప్పటివరకు గ్లామరస్ రోల్స్‌లో సామ్‌ని చూసిన ఫ్యాన్స్.. ఈ సిరీస్‌లో సమంత డీ గ్లామర్ గెటప్, ఫైట్స్ చేయడం చూసి అవాక్కయ్యారు.(ఇదీ చదవండి: సీతగా సాయిపల్లవి.. ఎంత ముద్దుగా ఉందో? ఫొటోలు వైరల్)సమంతకు యశోద అనే మరోపేరు కూడా ఉంది. ఈ విషయం దాదాపు ఎవరికీ తెలియదు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఆమెని ఈ పేరుతో పిలుస్తారు. 'యశోద' పేరుతో సమంత ఓ సినిమా కూడా చేయడం విశేషం. అలానే 2012లో తెలుగు, తమిళంలో ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది. రేవతి తర్వాత ఈ ఘనత సాధించిన రెండో హీరోయిన్‌గా ఘనత సాధించింది.2013లో తనకు డయాబెటిస్ ఉన్నట్లు బయటపెట్టిన సమంత.. జిమ్, హెల్తీ ఫుడ్ తీసుకుని ఆ వ్యాధి నుంచి బయటపడింది. కానీ ఆ తర్వాత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడింది. 2022 అక్టోబరులో ఈ విషయాన్ని బయటపెట్టింది. దీని వల్ల దీర్ఘకాలిక కండరాల వాపు వస్తుంది. ప్రస్తుతం కొంతమేర దీన్నుంచి కోలుకుంది. పూర్తిగా నార్మల్ అవ్వాలంటే మాత్రం కొన్నేళ్లు పట్టొచ్చు!(ఇదీ చదవండి: 'ఫ్యామిలీ స్టార్' పరువు తీస్తున్న దోశ.. ఆ వార్నింగ్ సీన్ కూడా!)సినిమాల సంగతి పక్కనబెడితే సమంత వ్యక్తిగత జీవితం అంతకు మించి అనేలా ఉంటుంది. అక్కినేని హీరో నాగచైతన్యని ప్రేమించింది. 2017లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. కానీ ఏమైందో ఏమో గానీ 2021లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో అటు అభిమానులు, ఇటు ఇండస్ట్రీలో అందరూ షాకయ్యారు. కారణం ఏంటో తెలియకుండానే సమంతపై చాలా విమర్శలు చేశారు. పర్సనల్ స్టైలిష్ట్‌తో ఎఫైరే దీనికి కారణమని అన్నారు. అసలు ఏం జరిగిందనేది ఇప్పుటికీ సస్పెన్సే.సాధారణంగా హీరోయిన్లు పెద్దగా వివాదాలు జోలికి వెళ్లరు. కానీ సమంత మాత్రం ఈ విషయంలో కాస్త డిఫరెంట్. కోరి తెచ్చుకునేలా కొన్నింటిని నెత్తిన పెట్టుకునేది. ట్రోలింగ్‌కి గురయ్యేది. అయితే ఎన్ని కాంట్రవర్సీలు ఉన్నా సరే సమంతలో ఓ మంచి మనిషి కూడా ఉంది. పేద పిల్లలు, మహిళల సంక్షేమం కోసం 'ప్రత్యూష సపోర్ట్' అనే ఎన్జీవో స్థాపించి చాలామందికి సహాయపడుతోంది. ఇలా సమంత జీవితం చూసుకుంటే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని స్థాయి నుంచి మొదలై.. స్టార్ హీరోయిన్ హోదా అనుభవించి.. పెళ్లి జీవితంతో విమర్శలు ఎదుర్కొని.. పరిస్థితులు ఎదురు తిరిగిన నిలబడి గెలిచిన బ్యూటీ సామ్.(ఇదీ చదవండి: ఎక్కడెక్కడో టచ్ చేశారు.. వస్తావా అంటే తెలియక సరే అన్నాను: కీర్తి భట్)

hardik pandya comments loss against Delhi capitals
ఆ తప్పే మా కొంపముంచింది.. అతడు మాత్రం ఒక సంచలనం: హార్దిక్‌

ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియ‌న్స్ తీరు ఏ మాత్రం మార‌లేదు. ముంబై మ‌రో ఓట‌మి చ‌విచూసింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 10 ప‌రుగుల తేడాతో ముంబై ఇండియ‌న్స్ ఓట‌మి పాలైంది. ఈ మ్యాచ్‌లో ముంబై బౌలింగ్ పరంగా విఫలమైనప్పటికి బ్యాటింగ్‌లో మాత్రం అద్భుతంగా పోరాడింది. 258 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు మాత్రమే చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్‌ వర్మ(63), హార్దిక్‌ పాండ్యా(46), టిమ్‌ డేవిడ్‌(37) కీలక ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికి జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. ఈ ఏడాది సీజన్‌లో  ఇది ముంబైకు ఆరో ఓటమి కావడం గమనార్హం. దీంతో తమ ప్లే ఆఫ్ ఆశలను ముంబై సంక్లిష్టం చేసుకుంది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. "ఈ మ్యాచ్‌లో విజ‌యానికి ద‌గ్గరగా వ‌చ్చి ఓడిపోయాం. ఇంత‌కుముందు ఒకట్రెండు ఓవర్లు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసేవి. కానీ ఇప్పుడు ఒకట్రెండు బంతులు చాలు మ్యాచ్ ఫలితాన్ని మార్చడానికి. ఈ మ్యాచ్‌లో బౌలింగ్ పరంగా మేము దారుణంగా విఫలమయ్యాం. కాబట్టి మేము బ్యాటింగ్‌లో మెరుగ్గా రాణించడానికి ప్రయత్నించాం. కానీ మేము చిన్న చిన్న తప్పులు చేశాం.ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో పరుగులు సాధించలేకపోయాం. గేమ్ మిడిల్ ఒకటిరెండు ఓవర్లను టార్గెట్ చేసి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌ అక్షర్ పటేల్ బౌలింగ్ చేసేటప్పుడు మా ఎడమచేతి వాటం బ్యాటర్లు అతడి టార్గెట్ చేసి ఉంటే బాగుండేది. దురదృష్టవశాత్తు మేము అది చేయలేకపోయాం.ఇక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయంగానే భావిస్తున్నాను. మా ముందు ఒక లక్ష్యముంటే ఛేజ్ చేయడానికి ఈజీగా ఉంటుందని మేము అనుకున్నాము. కానీ  జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ మా అంచనాలను తారుమారు చేశాడు. అతడొక అద్బుతమైన ఆటగాడు. అతడు ఫియర్‌లెస్ క్రికెట్ ఆడాడు. ఏ బాల్‌ను ఎటాక్ చేయాలో అతడికి బాగా తెలుసు. అతను బ్యాటింగ్ చేసిన విధానం చాలా బాగుంది. మైదానం నలుమూలలగా షాట్లు ఆడాడని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హార్దిక్ పేర్కొన్నాడు.

Could Rishabh Pant be banned for next DC clash due to slow-over rate
రిషబ్‌ పంత్‌కు భారీ షాక్‌.. ఒక మ్యాచ్‌ నిషేధం

ఐపీఎల్‌-2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌ మరో అద్భుత విజయం సాధించింది. అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో ఢిల్లీ గెలుపొందింది. ఈ విజ‌యంతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ పాయింట్ల ప‌ట్టిక‌లో ఐదో స్ధానానికి చేరింది. దీంతో త‌మ ప్లే ఆఫ్ ఆశ‌ల‌ను ఢిల్లీ స‌జీవంగా నిలుపున్‌కుంది.ఇక ఇది ఇలా ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌కు బిగ్‌ షాక్‌ తగిలే అవకాశముంది. పంత్‌పై ఒక మ్యాచ్‌ నిషేధం ఐపీఎల్‌ మెన్‌జ్‌మెంట్‌ విధించే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి. శ‌నివారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లు నిర్ణీత సమయంలో కోటా ఓవర్లు పూర్తి చేయలేదు. కాగా ఢిల్లీ క్యాపిటిల్స్ స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేయడం ఇది మూడో సారి. అయితే ఐపీఎల్‌ నియమావళి ప్రకారం వ‌రుస‌గా మూడో సారి  స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేస్తే.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై 100 శాతం మ్యాచ్ ఫీజును జరిమానా విధించడంతోపాటు మ్యాచ్ రిఫరీ విచక్షణ మేరకు ఒక మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉంది. ఒక‌వేల అదే జ‌రిగితే పంత్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ద‌ప‌రి మ్యాచ్‌కు దూర‌మ‌య్యే ఛాన్స్ ఉంది. 

Prasanna Vadanam Trailer Out Now
సుహాస్ 'ప్రసన్న వదనం' ట్రైలర్‌ విడుదల

యంగ్ హీరో సుహాస్ నటించిన యూనిక్ సస్పెన్స్ థ్రిల్లర్ 'ప్రసన్న వదనం'. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్‌గా పని చేసిన అర్జున్ వై కె దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్స్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. మే3న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్ చేసింది. అందుకోసం ప్రీరిలీజ్‌ కార్యక్రమాన్ని మేకర్స్‌ నిర్వహించారు. అందుకు  స్టార్ డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. దర్శకులు బుచ్చిబాబు, కార్తిక్ దండు, శ్రీనివాస్ అవసరాల, రైటర్ ప్రసన్న ఈ వేడుకలో పాల్గొన్నారు.హీరో సుహాస్ మాట్లాడుతూ.. 'ప్రసన్న వదనం' మే 3న విడుదల అవుతుంది. కలర్ ఫోటో, రైటర్ పద్మ భూషణ్, అంబాజీ పేట.. ఈ సినిమాలన్నీ ప్రేక్షకులని అలరించాయి. ప్రసన్న వదనం కూడా ఖచ్చితంగా ఆడియన్స్ ని అలరిస్తుంది. ప్రేక్షకులు థియేటర్స్ దాక వస్తే చాలు.. అక్కడ మేము చూసుకుంటాం. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది.' అని ఆయన అన్నారు. 

Weekly Horoscope Telugu 28-04-2024 To 01-05-2024
Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది

మేషంమరింత ఉత్సాహవంతంగా ముందుకు సాగుతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులు ఎదురుచూస్తున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. మీ ఆలోచనలు కుటుంబసభ్యులతో పంచుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. మిత్రులతో కలహాలు. నీలం, ఆకుపచ్చరంగులు. దేవీస్తుతి మంచిది.వృషభంముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా ముగిస్తారు. సోదరులు, మిత్రులు మీకు వెన్నంటి ఉంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభాలు కలుగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. వివాహాది వేడుకల నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తారు. ముఖ్యమైన వ్యక్తులు పరిచయమవుతారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కళారంగం వారి సేవలకు గుర్తింపుతో పాటు, సన్మానాలు అందుకుంటారు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఆకుపచ్చ, పసుపు రంగులు. గణేశాష్టకం పఠించండి.మిథునంరుణవిముక్తికి చేసే యత్నాలు సఫలం. అనుకోని విధంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా పూర్తి చేయడంలో మిత్రులు సహకరిస్తారు. వేడుకల నిర్వహణలో భాగస్వాములు కాగలరు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు రాబడతారు. పెద్దల సలహాలు పాటిస్తూ ముందుకు సాగుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటాబయటా మరింత ప్రోత్సాహం. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో హోదాలు మరింత పెరుగుతాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వైరం. పసుపు, ఆకుపచ్చ రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.కర్కాటకంపట్టింది బంగారమే అన్న విధంగా ఉంటుంది. ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి కాగలదు. ఆర్థికంగా మరింత ప్రగతి ఉంటుంది. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. మీ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లా¿¶ సాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు సంభవం. రాజకీయవర్గాలకు కొత్త అవకాశాలు అందుతాయి. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. గులాబీ, ఎరుపు రంగులు.  విష్ణుధ్యానం చేయండి.సింహంమొదట్లో ఉన్న ఇబ్బందులు, సమస్యలు క్రమేపీ తీరి ఊపిరిపీల్చుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఉత్సాహంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగుల కృషి సఫలమవుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటి నిర్మాణాలు చేపడతారు. మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులు గౌర విస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది.  గులాబీ, నేరేడు రంగులు. కనకధారా స్తోత్రాలు పఠించండి.కన్యఅనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ, ప్రేమ పొందుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. సన్నిహితులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. శత్రువులను సైతం ఆదరిస్తారు. నిరుద్యోగులు పడిన శ్రమ ఫలిస్తుంది. మీ నిర్ణయాలపై సానుకూలత ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు రాగలదు. పారిశ్రామికవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. సన్మానాలు జరుగుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. మిత్రులతో మాటపట్టింపులు. నలుపు, లేత ఆకుపచ్చ రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.తులమీ యుక్తి, ప్రతిభను నిరూపించుకునేందుకు తగిన సమయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. అనుకున్న సమయానికి డబ్బు సమకూరి అవసరాలు తీరతాయి. బంధువుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి ఊహించని అవార్డులు, సన్మానాలు. వారం మధ్యలో ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. గులాబీ, ఆకుపచ్చ రంగులు. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.వృశ్చికంఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆలోచనలు కలసిరాక డీలా పడతారు. సోదరులు, మిత్రులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. ఇంటి బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి  చికాకులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఇతర వేడుకల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. బంధువులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని చికాకులు ఎదురుకావచ్చు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, లేత ఎరుపు రంగులు.  అన్నపూర్ణాష్టకం పఠించండి.ధనుస్సుపట్టుదలతో ముందుకు సాగండి, విజయాలు చేకూరతాయి. ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో విభేదాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో కదలికలు ఉంటాయి. వాహనాలు, భూములు సమకూర్చుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. మీసహాయం కోసం మిత్రులు ఎదురుచూస్తుంటారు. వ్యాపారాలు గతం కంటే అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో మీహోదాలు మరింత పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. దుర్గాదేవిని ఆరాధించండి.మకరంసన్నిహితుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. ప్రముఖులు పరిచయమవుతారు. మీ శక్తిసామర్థ్యాలను కుటుంబసభ్యులు గుర్తిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు దక్కుతాయి. మీ అంచనాలు కొన్ని నిజమవుతాయి. ఎంతటి వారినైనా వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. మద్యమధ్యలో కొంత అనారోగ్యం కలిగినా ఉపశమనం పొందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉంటాయి. కళారంగం వారికి మరింత ఉత్సాహం. వారం ప్రారంభంలో కుటుంబసమస్యలు. పనుల్లో ప్రతిబంధకాలు. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.కుంభంముఖ్యమైన వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఆత్మీయులు, బంధువులతో మనస్సులోని భావాలను పంచుకుంటారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు తొలగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. తీర్థయాత్రలు చేస్తారు. మీ ఊహలు నిజం చేసుకుంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలం. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు మరింత అనుకూలస్థితి. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వి¿ే దాలు. అనారోగ్యం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.మీనంనూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. కుటుంబంలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. అనుకున్న మేరకు డబ్బు సమకూరి అవసరాలు తీరతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు ఆందుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. శుభకార్యాలకు హాజరవుతారు. ఆస్తుల వ్యవహారాలలో మధ్యవర్తిత్వం వహిస్తారు. కొన్ని సమస్యలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామికవర్గాల కృషి ఫలిస్తుంది. వారం మధ్యలో అనారోగ్యం. బంధువిరోధాలు. శ్రమాధిక్యం. నీలం, నేరేడు రంగులు.  శ్రీకృష్ణ స్తోత్రాలు పఠించండి.

Film director producer Tammareddy Bharadwaja Exclusive Interview With Sakshi
జగన్‌ పథకాలు కాపీ కొడుతున్న టీడీపీ

జగన్‌ చేసిన పనులు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఆ విషయమే చెబుతుంటే నన్ను  వైఎస్సార్‌సీపీ సపోర్టర్‌ అంటున్నారు.వాస్తవానికి వైఎస్సార్‌సీపీ పథకాలన్నీ కాపీ చేస్తున్న టీడీపీ.. జగన్‌ను సమర్థిస్తున్నట్లే కదా!  - సినీ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మంచి ప్రయత్నాలు విద్య, వైద్య రంగంలో ప్రారంభమయ్యాయి. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం అంత పెద్ద ఆస్పత్రిని ఈ ప్రభుత్వ కట్టించింది. ఈ పని ఇంత కాలంగా ఎవ్వరూ చేయలేదు. పెద్ద సంఖ్యలో మెడికల్‌ కాలేజీలు వస్తున్నాయి. మరోవైపు నిన్న, మొన్నటి వరకూ ఎవరూ పట్టించుకోని గవర్నమెంట్‌ స్కూల్స్‌లో చాలా అద్భుతమైన మార్పులు తెచ్చారు. ఇంటింటికీ వచ్చి హెల్త్‌ చెకప్స్, మందులు పంపిణీ చేసే ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ కూడా నాకు చాలానచ్చింది. మొత్తంగా చూస్తే ప్రజలకు అత్యంత ప్రధానమైన ఈ రెండు రంగాలకు జగన్‌ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఎవ్వరైనా ఒప్పుకుని తీరాల్సిందే. లంచాలకు బ్రేక్‌ పడింది ఈ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వలంటీర్‌ వ్యవస్థ కూడా చాలా బాగుంది. ప్రజల ఇళ్ల దగ్గరకు వెళ్లి లబి్ధదారులకు పథకాలు అందించడం వినూత్న ప్రయత్నం. ఒకప్పుడు ప్రభుత్వ పథకాలు అందుకోవాలంటే చాలా కష్టమయ్యేది. లంచాలతో తప్ప పనయ్యేది కాదు. వలంటీర్‌ వ్యవస్థ అలాంటి సమస్యలకు పరిష్కారం చూపింది. గ్రామ సెక్రటేరియట్స్‌లోనూ చాలా వరకూ పనులు సులభంగా అవుతున్నాయంటున్నారు. అక్కడక్కడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయంటున్నా.. కొత్త వ్యవస్థ కాబట్టి బాలారిష్టాలు తప్పవు. అయితే వీటి ప్రభావం వల్ల ఇప్పటికే ఉన్న రెవెన్యూ, పంచాయతీ రాజ్‌ వ్యవస్థ లాంటివి వృథాగా మారకుండా చూడాల్సిన అవసరం ఉంది.  చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయారు మెడికల్‌ కాలేజీలు, బందరు పోర్ట్‌తో సహా నాలుగు పోర్ట్‌లు కడుతున్నారు. షిప్పింగ్‌ హార్బర్స్‌ నిర్మాణంలో ఉన్నాయి. ఇలాంటివన్నీ చెప్పుకోవడంలో ఈ ప్రభుత్వం వెనుకబడిందని నా అభిప్రాయం. ఇప్పుడు చెబుతున్నారు కానీ తాము చేసిన అభివృద్ధి గురించి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మొదటి నుంచీ చెప్పుకుని ఉండాల్సింది.  మద్యం రేట్లపై విపక్షాల హామీ దురదృష్టకరం మద్యపాన నిషేధంలో భాగంగా చాలా వరకూ బెల్ట్‌షాపులు తగ్గించారు. వినియోగం తగ్గించడానికి రేట్లు కూడా పెంచారు. ఈ చర్యలు తాగుబోతులకు నచ్చకపోవచ్చు. అందుకనే ఈ ఎన్నికలు తాగుబోతులకు నాన్‌ తాగుబోతులకు మధ్య అన్నట్టు మారాయి. ఎన్నికల ప్రచారంలో ‘నాణ్యమైన మద్యం ఇస్తాం... మ ద్యం రేట్లు తగ్గిస్తాం’ అంటూ ప్రతిపక్ష పారీ్టలు ప్రచా రం చేయడం చాలా దురదృష్టకరం. మద్యపాన నిషే« దం చేయలేదని విమర్శిస్తున్న వారు తాము చేస్తామని ధైర్యంగా చెప్పాలి గానీ... నాణ్యమైన మద్యం ఇస్తాం అనడం ఏమిటి? మొత్తంగా చూస్తే అత్యధిక సంఖ్యలో మహిళలు వైఎస్సార్‌సీపీ వైపే ఉన్నారు. తాగుబోతు భర్తల్ని మహిళలు అదుపు చేయగలిగితే మ రోసారి వైఎస్సార్‌సీపీ బంపర్‌ మెజారీ్టతో వస్తుంది. నవరత్నాలపై రాష్ట్ర నాశనం అన్నవారే ఫాలో అవుతున్నారు మొన్నటి దాకా నవరత్నాలు వృథా... అవి ఇవ్వడం వల్ల రాష్ట్రం నాశనం అయిపోతోంది అన్నారు. ఇప్పుడు పన్నెండున్నర రత్నాలు ఇస్తామంటున్నారు. వలంటీర్ల వల్ల నేరాలు ఘోరాలు అన్నారు. కానీ జీతాలు పెంచి మరీ  కొనసాగిస్తామంటున్నారు. వీళ్లు అవన్నీ అనేసి నాబోటి వాళ్లని వైఎస్సార్‌సీపీ సపోర్ట్‌ అంటున్నారు. నిజానికి నేను బాగుందని మాత్రమే అంటున్నా ‘జగన్‌ పథకాలన్నీ తిరిగి తెస్తాం, జీతాలు పెంచి మరీ వలంటీర్లను కొనసాగిస్తాం.. గ్రామ సెక్రటేరియట్, నాడు నేడు వంటివన్నీ మేమూ అమలు చేస్తాం’ అంటున్నారంటే తమకు కూడా ఈ పథకాలన్నీ నచ్చాయని చెబుతున్నట్టే కదా.. అంటే తెలుగుదేశం వాళ్లు కూడా వైఎస్సార్‌సీపీ మద్దతు దారులన్నట్టే కదా. పోలవరం పూర్తయితే బాగుంటుంది పోలవరం వచ్చే ఐదేళ్లలో పూర్తయితే బాగుంటుందని ఆశిస్తున్నా. అలాగే విభజన హామీలు కూ డా పూర్తిగా సాధించాల్సి ఉంది. మరోవైపు అధికార ప్రతిపక్షాలు ఇకనైనా వ్యక్తిగత దూషణలు వదిలేసి రాష్ట్రం, రాష్ట్ర ప్రజల అభివృద్ధి గురించి మాత్రమే ఎక్కువగా మాట్లాడితే బాగుంటుంది.    –సత్యార్థి

Andhra govt to provide 9 hrs free power supply to farm lands
చీకటి రాత్రులకు బ్రేక్‌

ప్రతి సర్వీసుకీ ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్‌  విద్యుత్‌ ప్రమాదాలు జరగడానికి, సరఫరా నష్టాలు రావడానికి ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లు బలంగా లేకపోవడం, ఓవర్‌ లోడ్‌ కావడమే ప్రధాన కారణం. ఈ సమస్యను తగ్గించడానికి కొత్త సబ్‌స్టేషన్లు నిర్మించడంతో పాటు పాత సబ్‌స్టేషన్లలో ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెరిగింది. ట్రాన్స్‌కో పరిధిలో ఉన్న 220కేవీ, 132 కేవీ లైన్లను పాతవి బాగుచేయడంతో పాటు కొత్తవి వేశారు.డిస్కంల పరిధిలోని 33 కేవీ, 11కేవీ లైన్లు మార్చారు. సబ్‌ స్టేషన్లలో పవర్‌ కెపాసిటర్లు ఏర్పాటు చేశారు.ప్రతి వ్యవసాయ సర్విసుకీ ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేసి విద్యుత్‌ ఇస్తున్నారు. ఫలితంగా ప్రస్తుతం రాష్ట్రంలో 19.92 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు నాణ్యమైన విద్యుత్‌ అందుతోంది.  ‘మా ప్రాంతంలో మొత్తం విద్యుత్‌పై ఆధారపడే వ్యవసాయం చేస్తారు. గత ప్రభుత్వంలో 7 గంటలు విద్యుత్‌ అని ప్రకటించినా అందులో ఒకటి రెండు గంటలపాటు కోతలు ఉండేవి. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పగటి పూట 9 గంటలు నిరంతరాయంగా విద్యుత్‌ అందిస్తున్నారు. దీనివల్ల కూలీలతో పనిచేయించుకొని, చేను మొత్తం తడపడానికి వీలవుతోంది.గతంతో హెచ్‌టీ, ఎల్‌టీ లైన్లు ఒకే స్తంభంపై ఉండేవి. దీనివల్ల కొద్దిపాటి గాలికే కలిపిపోయి ట్రాన్స్‌ఫార్మర్, మోటార్లు కాలిపోయేవి. ఇప్పుడా సమస్య లేదు. గతంలో రోజుకి ఏడు గంటలు రాత్రి సమయాల్లో సేద్యానికి విద్యుత్‌ ఇవ్వడం వల్ల పొలాల్లోనే ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ఒకే స్పెల్‌లో ఇవ్వడంతో చేను మొత్తం ఒకేసారి తడుస్తోంది’. – సూర్పని రామకృష్ణ, ఉద్యాన రైతు, కొమ్ముగూడెం సాక్షి, అమరావతి: ‘సేద్యానికి విద్యుత్‌ లోటు రాకూడదు. రైతులకు ఇచ్చే విద్యుత్‌కు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుంది. వ్యవసాయ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ దెబ్బతింటే 48 గంటల్లోనే బాగుచేయడం, లేదా కొత్తది ఇవ్వాలి. ఎలాంటి జాప్యం ఉండకూడదు. సర్విసు కూడా అడిగిన వెంటనే మంజూరు చేయాలి. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదు’.అంటూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాటలను ఈ ప్రభుత్వం అక్షర సత్యం చేసింది.పంటలకు నీటి కొరత లేకుండా చేసి రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అవసరమైన అన్ని చర్యలను ఆచరణలో పెట్టింది. పగటిపూట 9 గంటలు నిరంతరాయంగా ఉచిత విద్యుత్‌ అందించేందుకు ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా ముందుగా వ్యవసాయ విద్యుత్‌ ఫీడర్లను ఆధునీకరించి ఉచిత విద్యుత్‌ సరఫరాకు అనుకూలంగా మార్చింది.  గతమెంతో ‘హీనం’ రాష్ట్రంలో వ్యవసాయ ఫీడర్లు ఏడాదికి దాదాపు 15,700 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగంలో ఉండేవి. ఇది రాష్ట్రంలో ఏడాదికి జరిగే 64 వేల నుంచి 66 వేల మిలియన్‌ యూనిట్ల వినియోగంలో దాదాపు నాలుగింట ఒక వంతు. జూన్‌ 2019కి ముందు, ఏడు గంటల విద్యుత్‌ సరఫరాకే గ్యారెంటీ ఉండేది కాదు.అప్పుడు దాదాపు 18 లక్షల వ్యవసాయ సర్విసులకు ఒకేసారి విద్యుత్‌ ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. అయినప్పటికీ వాటికే సరిపెట్టలేక రాత్రి పూట సహా రెండు, మూడు విడతల్లో విద్యుత్‌ అందించేవారు. కానీ ప్రస్తుత ప్రభు త్వం పగటి పూట విద్యుత్‌ సరఫరా అందిస్తోంది. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు రచించి అమలు చేసింది. రెట్టింపైన ఫీడర్లు టీడీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 6,663 ఫీడర్లలో కేవలం 3,854 మాత్రమే వ్యవసాయ విద్యుత్‌ సరఫరా చేయడానికి అందుబాటులో ఉండేవి. దానిని మెరుగుపరచడం కోసం చంద్రబాబు ఏమాత్రం దృష్టి సారించలేదు. కానీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు రూ.1,700 కోట్లను కేటాయించింది.దీంతో ఏపీ ట్రాన్స్‌కో, ఆంధ్రప్రదేశ్‌ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు తమ తమ పరిధిలో ఫీడర్ల ఆధునికీకరణ చేపట్టాయి.  రూ.1200.20 కోట్లతో 32 ప్యాకేజీలలో మౌలిక సదుపాయాల పనులను పూర్తి చేశాయి. పెరిగిన 6,735 ఫీడర్లలో 6,605 ఫీడర్లకు పగటిపూట 9 గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేయగల సామర్థ్యం వచ్చింది.

JC Diwakar List of Irregularities: Andhra Pradesh
ఆ కుటుంబ నైజం.. కస్సుబుస్సు

వృత్తి: ట్రాన్స్‌పోర్టు బిజినెస్‌ప్రవృత్తి: హత్యా రాజకీయాలు.. నేరాలు.. ఘోరాలుపదవి: ఉమ్మడి అనంతపురం జిల్లాలో కీలక దేశం నేతఅరాచకాలు,కేసులు: చెప్పలేనన్నిఅతనో నియంత.. అతనికెదురెళ్తే టిప్పర్‌ లారీకి ఎదురెళ్లినట్లే.. తన దురన్యాయాలను ఎవరైనా ప్రశ్నిస్తే ఆ రోజుతో వారికి భూమ్మీద నూకలు చెల్లినట్లే.. ఊళ్లలో ఫ్యాక్షన్‌ మంటలను ఎగదోసి, వాటితో చలికాచుకునే దుర్మార్గ రాజకీయం తన సొంతం.. అదే తన హాబీ కూడా.. రౌడీషీట్‌ తెరిపించుకున్న ఘనత ఆయన సొంతం. ఆయన తనయుడూ తక్కువేమీ తినలేదు. ప్రస్తుతం ఇతను ‘దేశం’ తరఫున పోటీ చేస్తున్నారు.  సాక్షి, టాస్‌్కఫోర్స్‌ :  ట్రావెల్స్‌ ద్వారా కండిషన్‌ లేని బస్సులను నడిపి ఆ ‘దేశం’ నేత ప్రయాణికుల జీవితాలతో చెలగాటమాడారు. 2013 అక్టోబరు 30వ తేదీన మహబూబ్‌నగర్‌ సమీపంలో  పాలెం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు 45 మంది అగ్నికి  ఆహుతైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆ సీనియర్‌ నేత భార్యను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ లీజు అగ్రిమెంట్లు సృష్టించారని ఆ నేతపై సీఐడీ అభియోగాలను మోపింది.2017లో విజయవాడ వద్ద ట్రావెల్స్‌ బస్సు ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. కాంట్రాక్ట్‌ క్యారేజ్‌ పేరుతో పర్మిట్లు తీసుకుని స్టేట్‌ క్యారేజ్‌గా బస్సులు నడపడంపై అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. తప్పు చేసింది కాకుండా తన మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆ నేత హైదరాబాద్‌  ఆర్టీఓ కార్యాలయాన్ని తన అనుచరులతో కలిసి ముట్టడించే ప్రయత్నం చేశారు.   అక్రమాలకు పరాకాష్టగా బీఎస్‌ 3 వాహనాలు  ఆ నేత అక్రమాలకు పరాకాష్టగా బీఎస్‌–3 వాహనాల కుంభకోణం నిలిచింది. ఓ ప్రముఖ సంస్థ వద్ద స్క్రాప్‌ ద్వారా కొనుగోలు చేసిన 154 బీఎస్‌–3 లారీలను బీఎస్‌–4  వాహనాలుగా నకిలీ ఎన్‌ఓసీ, ఇన్సూరెన్స్‌తో నాగాలాండ్‌లో అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఈ వ్యవహారంలో రూ.కోట్లలో లబ్ధి పొందినట్లు ఆరోపణలున్నాయి. ఈ అక్రమాలపై సీబీఐ,ఈడీ దాడులు చేశాయి. 2020లో ఆ నేతతో పాటు ఆయన కుమారుడు,  అనుచరుడు,  మరికొందరిపై వివిధ పోలీసు స్టేషన్లలో 24 కేసులు నమోదయ్యాయి. బస్సులను సీజ్‌ చేయడంతోపాటు ఈ నేత, బినామీల పేరుపై ఉన్న రూ.22 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసి, పలు రికార్డులు స్వా«దీనం చేసుకోవడంతోపాటు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేసింది. ప్రభుత్వ నిధులూ స్వాహా...?తాడిపత్రి ఎమ్మెల్యే హోదాలో ప్రభుత్వ నిధులను పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. 2015æలో యాడికి మండలంలో గ్రామీణ సడక్‌ యోజన కింద రూ.2.40 కోట్లతో చేపట్టిన రోడ్డు పనులను కమీషన్ల కక్కుర్తితో నాసిరకంగా పూర్తి చేయించారు. రాయలచెరువులో నీరు–చెట్టు కింద పూడికతీత పనుల్లో రూ.2.5 కోట్లు దండుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.పెద్దవడుగూరు మండలంలో 2015లో  రూ.6.45 కోట్లతో నీరు–చెట్టు కింద చేపట్టిన పనుల్లో ఎక్కువ శాతం  చేయకుండానే పూర్తయినట్లు రికార్డుల్లో చూపించి నిధులు బొక్కేశారు.  పెద్దవడుగూరు మండలంలోని పెద్ద వంక వద్ద జంగిల్‌ క్లియరెన్స్‌ పేరుతో దాదాపు రూ.8 లక్షలు కాజేశారు. చిన్నవడుగూరులో కుంట, కాలువల్లో ముళ్ల పొదల తొలగింపునకు దాదాపు రూ.18 లక్షలు, పెద్దవంకలో రూ.7 లక్షలను పనులు చేయకుండానే పక్కదారి పట్టించారు.  కేసుల వివరాల► ఇప్పటికే రౌడీ షీట్‌ నమోదై ఉంది.   ► 1996లో జరిగిన టౌన్‌బ్యాంకు ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనల్లో టీడీపీకి చెందిన లక్ష్మీనారాయణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఆయన నిందితునిగా ఉన్నారు. ► మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికైన తర్వాత  వివిధ పోలీస్‌ స్టేషన్లలో మొత్తం 70కి పైగా కేసులు ఉన్నాయి. 1996 నుంచి 2024 వరకు తాడిపత్రి పట్టణ పోలీసు స్టేషన్‌లో 57 కేసులు, తాడిపత్రి అప్‌గ్రేడ్‌ రూరల్‌ పోలీసు స్టేషన్‌లో 5, పెద్దపప్పూరు పోలీసు స్టేషన్‌లో 6, యాడికిలో ఒక కేసు నమోదయ్యాయి.  ► 2020లో నకిలీ ఇన్సూరెన్స్‌ కుంభకోణంలో తాడిపత్రి పట్ట ణ, అప్‌గ్రేడ్‌ రూరల్‌ పోలీసు స్టేషన్లలో 28 చీటింగ్‌ కేసుల నమోదు. బీఎస్‌ 3 వాహనాలను బీఎస్‌ 4 వాహనాలుగా మార్చి నాగాలాండ్‌లో అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించడంతో ఆయనపై పోలీసులు ఒకేసారి 28 కేసులు నమోదు చేశారు.  (1). ఎఫ్‌ఐఆర్‌  నెం. 28/2020. ఐపీసీ 420, 467, 468, 471, 472, 120(బి), 201 రెడ్‌విత్‌ 34 ఐపీసీ సెక్షన్లు.   (2) ఎఫ్‌ఐఆర్‌ : 85/2020. ఐపీసీ 420, 467, 468, 471, 120–బి రెడ్‌విత్‌ 34 ఐపీసీ, 179, 182, 190 ఎం.వి.యాక్టు) మరో 27 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.  ► 2023లో పెద్దపప్పూరులోని ఇసుక రీచ్‌లో అక్రమాలు జరుగుతున్నాయంటూ అనుచరులతో కలిసి వెళ్లిన ఆయన అక్కడున్న టిప్పర్‌ డ్రైవర్‌ వీరాంజనేయులుని కులం పేరుతో దూషించిన ఘటనపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ► 1996 నుంచి 1999 వరకు జరిగిన పలు హింసాత్మక ఘటనల్లో ఆయన నిందితునిగా ఉన్నాడు. పీడీ యాక్ట్‌ ద్వారా పోలీసులు  కేసు నమోదు చేసి హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలించారు. తాడిపత్రి టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో 2014లో ఎఫ్‌ఐఆర్‌ నెం. 142/14, సెక్షన్‌ 151 సీఆర్‌పీసీ కింద పీడీ యాక్టు నమోదైంది.   అసెంబ్లీ పోటీలో ఉన్న తనయుడిపై కేసులు :  ► ఆయన తనయుడిపై 30 కేసులు నమోదయ్యాయి. నకిలీ పత్రాలను సృష్టించి వాహనాలను విక్రయాలు జరిపిన నేరంపై 2022లో ఐపీసీ 420, 467,468,471,120బి రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో తండ్రీకొడుకులు   కడప సెంట్రల్‌ జైలులో 50 రోజులు జ్యూడిíÙయల్‌ రిమాండ్‌లో ఉన్నారు.   ► బీఎస్‌–3 వాహనాల కుంభకోణంలో బైయిల్‌పై వస్తూ తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద సీఐ దేవేంద్ర కుమార్‌పై అనుచితంగా ప్రవర్తించినందుకు తండ్రితోపాటు తనయుడిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ కింద కేసు నమోదైంది. మనీ ల్యాండరింగ్‌పై తాడిపత్రిలోని నివాసంలో  ఈడీ అధికారులు దాడులు జరిపి ఆయన తనయుడిపై  రెండు కేసులు నమోదు చేశారు. ఇంకా వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేసిన పలు కేసుల్లో తనయుడిపై కేసులు నమోదయ్యాయి. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులూ నమోదయ్యాయి. డబ్బు కోసం దేనికైనా సై ► తాడిపత్రి మండలం హుస్సేన్‌పురం వద్ద  రెండు వేల ఎకరాల్లో ఏర్పాటు చేసిన గెర్దావ్‌ స్టీల్‌ ప్లాంట్‌పై కన్నేసిన ఆ నేత కంపెనీ యజమానులను బ్లాక్‌మెయిల్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సొంతంగా ట్రాన్స్‌పోర్టును ఏర్పాటు చేసి, స్టీల్‌ ప్లాంట్‌ ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులకు తన లారీలనే వినియోగించుకునేలా వారిపై ఒత్తిడి చేశారు. సరుకు రవాణాకు సంబంధించి ట్రాన్స్‌పోర్టు వే బిల్లులు కాకుండా తాడిపత్రి లారీ అసోసియేషన్‌ ద్వారా చేయించి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టారు. బినామీ లెక్కలతో రూ.300 కోట్లకు పైగా అక్రమంగా ఆర్జించినట్లు ఆరోపణలున్నాయి. ► స్టీల్‌ ప్లాంట్‌లో డ్రైస్లాగ్‌ ద్వారా నెలకు దాదాపు రూ.15 కోట్ల చొప్పున ఆయన ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్ల కాలంలో రూ.900 కోట్లు ఆర్జించారని సమాచారం.   ► గుత్తి నుంచి తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద ఉన్న వైఎస్సార్‌ జిల్లా సరిహద్దు వరకూ 63 కి.మీ. హైవే పనులకు రూ.275 కోట్ల అంచనా వ్యయంతో  నేషనల్‌ హైవే అధికారులు ఆహా్వనించిన టెండర్లను నాటి టీడీపీ ఎంపీకి చెందిన కన్‌స్ట్రక్షన్‌ కంపెనీతో పాటు మరో విదేశీ కంపెనీ 13 శాతం తక్కువకు కోట్‌ చేసి దక్కించుకున్నాయి. విదేశీ కంపెనీకి మన దేశంలో అనుమతుల్లేవంటూ అధికారులను బెదిరించి ఆ టెండర్‌ను రద్దు చేయించారు. అనంతరం ఎంపీకి చెందిన కంపెనీతోపాటు మరో కంపెనీతో కలసి 4.9 శాతం ఎక్కువకు టెండర్‌ కోట్‌ చేయించి దక్కించుకున్నారు.  ఈ అక్రమాలతో రూ.50 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు.    ► మున్సిపాలిటీ ఆ«దీనంలోని కాంప్లెక్స్‌లోని మొదటి అంతస్తును తన ముఖ్య అనుచరుడు ఏడాదికి రూ.7.36 లక్షలు అద్దె చెల్లించేలా ఆ నేత లీజుకు ఇచ్చి, గుడ్‌విల్‌ రూపంలోనే దాదాపు రూ.2.66 కోట్లు పక్కదారి పట్టించారన్న ఆరోపణలున్నాయి. ► ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఉన్న కాంప్లెక్స్‌లో 6, 67, 68, 72 రూములను తక్కువ మొత్తంతో అద్దెకు తీసుకుని సబ్‌ లీజులకు ఇచ్చి పెద్ద మొత్తంలో వెనకేసుకున్నట్లు సమాచారం. ► పెద్దపప్పూరు మండలం జూటూరు భూముల్లో ఆయన అనుచరులు రూ. కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. పెన్నా, చిత్రావతి నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాలోనే వారి అనుచరులు రూ.40 కోట్లకు పైగా కూడబెట్టారు.  ► తమ కుటుంబ సిమెంట్‌ ఫ్యాక్టరీకి సంబంధించి యాడికి మండలం కోనుప్పలపాడు సమీపంలోని గనుల్లో లైమ్‌స్టోన్‌ వెలికి తీసే క్రమంలో చారిత్రక గుహలు వెలుగు చూడకుండా తొక్కిపెట్టారు.  ►మట్కా డాన్‌గా పేరున్న ఓ వ్యక్తికి ఈ నేత పూర్తి అండదండలు ఉండేవి. అప్పట్లో కడప విజిలెన్స్‌ విభాగంలో పనిచేస్తున్న సీఐ, తన సిబ్బందితో కలసి మట్కా డాన్‌ ఇంట్లో తనిఖీలు నిర్వహించినప్పుడు తన అనుచరులను ఉసిగొల్పి  పోలీసులపై దాడులు చేయించి, పోలీసు వాహనాలకు నిప్పంటించారు.   

Advertisement
Advertisement
Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all
Advertisement
Advertisement
Advertisement