-
Singham Again: 400 మంది డ్యాన్సర్లతో మాస్ డ్యాన్స్!
అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్‌లతో కలిసి మాస్ డ్యాన్స్ చేసేద్దాం అంటూ కరీనా కపూర్ సందడి చేస్తున్నా రట. అజయ్ దేవగన్, కరీనా కపూర్ జంటగా అక్షయ్ కుమార్, రణ్వీర్, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్, దీపికా పదుకోన్ కీలక పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘సింగమ్ ఎగైన్’. ‘సింగమ్ ఫ్రాంచైజీ చిత్రాలకు దర్శకత్వం వహించిన రోహిత్ శెట్టి ‘సింగమ్ ఎగైన్’కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని ముఖ్య తారాగణం పాల్గొనగా భారీ ఓ మాస్ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ నృత్యదర్శకుడు గణేశ్ ఆచార్య ఆధ్వర్యంలో ఈ పాట చిత్రీకరణ జరుగుతోందని టాక్. కీలక తారాగణంతో పాటు దాదాపు నాలుగు వందల మంది డ్యాన్సర్లు పాల్గొంటున్నారని భోగట్టా. కాగా ప్రస్తుతం దీపికా పదుకోన్ గర్భవతి కావడంతో ఆమె ఈ పాటలో కనిపించే చాన్స్ లేదని బాలీవుడ్ అంటోంది. -
Deepika Padukone: ఫైనల్లీ ఆ టాటూని తొలగించిన దీపికా పదుకొణె!
బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్లో దీపికొ పదుకొణె- రణ్వీర్ సింగ్ జంట ఒకటి. రామ్ లీలా సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన ఈ జంట.. 2018 నవంబర్ 14న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. త్వరలోనే ఈ బ్యూటీ ఓ బిడ్డకి జన్మనివ్వబోతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దీపికా గర్భం దాల్చిందనే విషయాన్ని రణ్వీర్ వెల్లడించాడు. తాజాగా ఈ భామ ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ ఫోటో చర్చనీయాంశంగా మారింది. శనివారం దీపికా తన ఇన్‌స్టా ఖాతాలో ఓ ఫోటోని షేర్ చేసింది.అందులో ఆమె మెడ కనిపించేలా వెనుక వైపు తిరిగి ఉంది. గతంలో ఆమె వీపు భాగంపై ఓ టాటూ ఉండేది. ఇప్పుడది కనిపించలేదు. ఆ హీరోతో పీకల్లోతు ప్రేమలో రణ్వీర్ సింగ్‌తో పెళ్లి కంటే ముందు దీపికా పదుకొణె మరో స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమాయణం కొనసాగించింది. ఈ ఇద్దరి ప్రేమ విషయం బాలీవుడ్ అంతా తెలుసు. పెళ్లి కూడా చేసుకుంటారని అంతా భావించారు. కానీ కారణం ఏంటో తెలియదు కానీ బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు రణ్‌బీర్‌తో స్నేహం ఏర్పడడం..అది కాస్త ప్రేమగా మారడంతో 2018లో పెళ్లి చేసుకున్నారు. అయితే రణ్‌బీర్‌తో ప్రేమలో ఉన్న సమయంలో దీపికా తన వీపుపై RK(రణ్‌బీర్ కపూర్ షార్ట్ కట్) అని టాటూ వేయించుకుంది. పెళ్లి తర్వాత కూడా ఆ టాటూని చెరిపేయలేదు. దీంతో అప్పట్లో ఈ టాటూపై బాలీవుడ్లో పెద్ద చర్చే జరిగింది. కానీ దీపికా మాత్రం ఆ టాటూపై స్పందించలేదు. ఇక తాజాగా షేర్ చేసిన ఫోటోలో ఆ టాటూ కనిపించకపోవడంతో.. ప్రెగ్నెంట్ అయిన తర్వాత దీపికా ఆ టాటూని తొలగించిందనే నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ సరసన కల్కీ 2898 ఏడీ చిత్రంలో నటిస్తోంది. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) -
గ్లామరస్ క్వీన్ దీపిక బ్యూటీ సీక్రెట్ ఇదే..!
బాలీవుడ్ గ్లామరస్ క్వీన్ దీపిక పదుకునే తన నటన, అభినయంతో మంచి ఫ్యాన్ పాలోయింగ్‌ని సంపాదించుకుంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మూవీ 'ఓం శాంతి ఓం'తో ఒక్కసారిగా రాత్రికే రాత్రే స్టార్ అయిపోయింది. ఇక అక్కడ నుంచి వెనుదిరిగి చూడకుండా వరుస సినిమాలతో విజయపథంలో దూసుకుపోతుంది. అంతేగాదు బాలీవుడ్లో అత్యధిక పారితోషం తీసుకుంటున్న హీరోయిన్ల సరసన నిలిచింది. ఇక దీపిక చందమామలాంటి ముఖంతో మంచి స్టన్నింగ్ లుక్‌తో ఇట్టే ప్రేకక్షులను కట్టిపడేస్తుంది. అందుకు ఆమె వన్నెతరగని అందమే కారణం. అసలు వాళ్లు అంతలా గ్లామర్‌ని ఎలా మెయింటెయిన్ చేస్తున్నారు? ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని కుతుహలంగా ఉంటుంది కదా!. మరీ దీపికా పదుకునే బ్యూటీ రహస్యం ఏంటో చూద్దామా..! దీపిక చర్మ సంరక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తన తల్లి నుంచే నేర్చుకున్నానని చెబుతోంది. తప్పనిసరిగా మేకప్‌ని తొలగించే.. నిద్రకు ఉపక్రమించే ముందు మేకప్‌ని తొలగించే పడుకుంటానని చెబుతోంది దీపిక. ఎంతటి బిజీ షెడ్యూల్ అయినా సరే ముఖాన్ని శుభ్రంగా కడుక్కోనిదే పడుకోనని అంటోంది. దీని వల్ల ముఖంపై మలినాలు, మొటిమలు, బ్లాక్‌హెడ్స్ వంటివి ఉండవని చెబుతోంది. సన్‌స్క్రీన్ తప్పనిసరి.. బయటకు వెళ్తే తప్పనిసరిగా సన్‌స్క్రీన్ లేకుండా వెళ్లనని అంటోంది. దీని వల్ల యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుకోగలం. అలాగే వృధాప్య ప్రమాదాన్ని నివారిస్తుంది. చర్మ క్యాన్సర్ సంభావ్యతను తగ్గిస్తుంది. ప్రకాశవంతమైనే మేని ఛాయను ప్రోత్సహిస్తుంది. వేసవి లేదా చలికాలంలో ఇంటి లోపల లేదా బయటతో సంబంధం లేకుండా తన దినచర్యలో భాగంగా ప్రతిరోజూ రెండుసార్లు తప్పనిసరి ముఖానికి సన్‌స్క్రీన్ రాసుకుంటానని చెబుతోంది. క్లోడ్ వాటర్ థెరపీ అలాగే ముఖానికి క్లోడ్ వాటర్ థెరఫీ కూడా ప్రతిరోజు తీసుకుంటానని అంటోంది. ఇది ముఖాన్ని ఫ్రెష్‌గా ఉండేలా చేస్తుందని అంటోంది. అలాగే ముఖం అంతా రక్త ప్రసరణ సాఫీగా జరిగి చర్మం ప్రకాశవంతంగా ఉండటంలో తోడ్పడుతుంది. హైడ్రేటెడ్‌గా ఉంచడం.. తన దినచర్యలో భాగంగా నూనె లేదా మాయిశ్చరైజర్ తప్పనిసరిగా ముఖానికి రాయడం విస్మరించదు. ఇది చర్మాన్ని డీ హైడ్రేషన్‌కి గురికాకుండా చేస్తుంది. ఇలా ముఖం తేమగా ఉండటం వల్ల ముకం ప్రకాశవంతంగా ఉంటుంది. కొబ్బరి నూనె.. శిరోజాలకు తప్పనిసరిగా కొబ్బిర నూనెనే ప్రివర్ చేస్తానని చెబుతోంది. ఇది చుండ్రుని నివారించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఫలితం జుట్టు మంచి షైనీగా మెరుస్తు ఉంటుంది. గ్లామర్ మెయింటెయిన్ చేయడంలో శిరోజాల అందం కూడా ముఖ్యమేనని అంటోంది. జీవనశైలి గ్లోయింగ్ స్కిన్ అనేది చర్మ సంరక్షణ ఉత్పత్తులపై మాత్రమే ఆధారపడి ఉండదని నొక్కి చెబుతోంది దీపిక. మంచి జీవనశైలి, చక్కటి వ్యాయామం, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండటం వంటి అలవాట్లే మనం అందాన్ని ఇనుమడింప చేస్తాయని చెబుతోంది. అవే మన ముఖాన్ని కాంతిమంతంగా ఉండేలా చేస్తుంది. పైగా ఆర్యోగకరమైన జీవితాన్ని పొందగలమని అన్నారు. (చదవండి: జుట్టు మృదువుగా నిగనిగలాడాలంటే గంజితో ఇలా చేయండి!) -
అనిషా పదుకోన్: మహిళల మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు..
పట్టణాలలో, నగరాలలో మానసిక సమస్యలకు వైద్యం అందుబాటులో ఉంటుంది. పల్లెల్లో ఎలా? ముఖ్యంగా మహిళలకు మానసిక సమస్యలు వస్తే? డిప్రెషన్‌తో బాధ పడ్డ నటి దీపికా పదుకోన్ గ్రామీణ మహిళల మానసిక ఆరోగ్యం కోసం ‘లివ్ లవ్ లాఫ్’ అనే సంస్థను స్థాపించింది. దాని బాధ్యతను చెల్లెలు అనిషా పదుకోన్‌కు అప్పజెప్పింది. అనిషా నిర్వహణలో ఆ సంస్థ ఆరు రాష్ట్రాలలో గ్రామీణ మహిళలకు ఆరోగ్య సేవలు అందిస్తోంది. చెన్నైకి గంటన్నర ప్రయాణ దూరంలో ఉండే తిరువళ్లూరులో శశికళ అనే మహిళకు మతి చలించింది. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమెను తీసుకొచ్చి చెన్నైలో చూపిస్తే మందులు వాడాలన్నారు. చెకప్‌ల కోసం, మందుల కోసం నెలకోసారి చెన్నై రావాలంటే డబ్బులు ఖర్చవుతాయి. ఆమె అంత డబ్బు ఖర్చు పెట్టలేని పేద మహిళ. మందులు మానేసింది. మానసిక స్థితి ఇంకా దెబ్బ తిని ఊళ్లో దిమ్మరిగా తిరగడం మొదలెట్టింది. గ్రామీణ స్త్రీల మానసిక ఆరోగ్యం కోసం పని చేస్తున్న ‘లివ్ లవ్ లాఫ్’ సంస్థ ప్రతినిధులకు ఈ సంగతి తెలిసింది. తమతో కలిసి పని చేస్తున్న చెన్నైకి చెందిన వసంతం ఫౌండేషన్‌కు ఈ సంగతి తెలియపరిచారు. ఆ ఫౌండేషన్ వారు ఆమెను తరచు వైద్యుల దగ్గరకు తీసుకెళ్లారు. కావలసిన మందులు కొనిచ్చారు. కేర్‌గివర్‌గా పని చేస్తున్న తల్లికి దారి ఖర్చులు సమకూర్చారు. శశికళకు పూర్తిగా నయమైంది. ఆ తర్వాత ఆమె చిన్న చిల్లరకొట్టు నడుపుకోవడానికి 5000 రూపాయల సహాయం అందించారు. శశికళ ఇప్పుడు తన పిల్లలను చూసుకుంటూ జీవిస్తోంది. ‘ఇలా సహాయం అందాల్సిన వారు మన దేశంలో చాలామంది ఉన్నారు’ అంటుంది అనిషా పదుకోన్. ఆమె ‘లివ్ లవ్ లాఫ్’ సంస్థకు సి.ఇ.ఓ. దీపిక స్థాపించిన సంస్థ తాను డిప్రెషన్‌తో బాధ పడుతున్నట్టు దీపికా పదుకోన్ 2015లో లోకానికి వెల్లడి చేసింది. స్త్రీల మానసిక ఆరోగ్యం గురించి అందరూ ఆలోచించాలని పిలుపునిచ్చింది. అంతే కాదు తన బాధ్యతగా 2016లో బెంగళూరు కేంద్రంగా స్త్రీల మానసిక ఆరోగ్యం కోసం ‘లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్’ను స్థాపించింది. దానికి తన చెల్లెలు అనిషా పదుకోన్‌ను సి.ఇ.ఓగా నియమించింది. అనిషా ఈ సంస్థ కోసం చురుగ్గా పని చేస్తోంది. ఇప్పటికి ఈ ఫౌండేషన్ సేవలను ఆరు రాష్ట్రాలకు విస్తరించింది. ఆ ఆరు రాష్ట్రాలలోని 13 జిల్లాల్లో ఈ సంస్థ వాలంటీర్లు పని చేస్తున్నారు. వీరివల్ల 15,000 మంది గ్రామీణ మహిళలు ఇప్పటి వరకూ మానసిక చికిత్స పొందారు. అంతే కాదు 26,000 మంది సంరక్షకులు, అంగన్వాడి కార్యకర్తలు మానసిక చికిత్సలో ప్రాథమిక అవగాహనకై ట్రయినింగ్ కూడా ఈ సంస్థ వల్ల పొందారు. గోల్ఫ్ ప్లేయర్ అనిషా పదుకోన్ తండ్రి ప్రకాష్ పదుకోన్ ప్రఖ్యాత బాడ్మింటన్ ప్లేయర్ కావడం వల్ల అనిషా స్పోర్ట్స్ పట్ల ఆసక్తి కనపరిచింది. ఆమె గోల్ఫ్ క్రీడను ప్రొఫెషనల్ స్థాయిలో నేర్చుకుని మన దేశం తరఫున అమెచ్యుర్ లెవల్లో ప్రాతినిధ్యం వహించింది. అయితే ఆ ఆటను కొనసాగించే సమయంలోనే దీపికా పడుకోన్ సూచన మేరకు ఫౌండేషన్ బాధ్యతలు తీసుకుంది. ‘ఇక్కడ పని చేయడం మొదలెట్టాక మానసిక సమస్యల తీవ్రత అర్థమైంది. మన దేశంలో 20 కోట్ల మంది మానసిక సమస్యలతో బాధ పడుతున్నారు. వీరిలో గ్రామీణ స్త్రీలు ఎక్కువ శాతం ఉన్నారు. వీరి కోసం మందులు, వైద్యం, పెన్షన్, సంరక్షకుల ఏర్పాటు, ఉపాధి... ఇవన్నీ సాధ్యం కావాలంటే పెద్ద ఎత్తున సాయం కూడా అందాలి. వాలంటీర్లు ముందుకు రావాలి. కలిసి పని చేయాలి’ అంటుంది అనిషా. స్త్రీలు వ్యాయామం చేయడంతో పాటు పోషకాహారం తీసుకుంటూ తగినంత నిద్ర పోవడం అవసరం అంటుందామె. మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అని పిలుపునిస్తోంది. ఇవి చదవండి: చదువు శక్తినిస్తుంది -
మరికొద్ది గంటల్లోనే ఫైటర్ వచ్చేస్తున్నాడు.. ఎక్కడో తెలుసా?
హృతిక్ రోషన్, దీపికా పదుకొణే జంటగా నటించిన చిత్రం ఫైటర్. యుద్ధ విమానాలతో కూడిన యాక్షన్, దేశభక్తి అంశాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో అనిల్ కపూర్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించారు. ఈ ఏడాది జనవరి 25న థియేటర్లలో సందడి చేసింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. దీంతో రెండు నెలల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది ఫైటర్. ఫైటర్ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది. ఈ రోజు అర్ధరాత్రి నుంచే అంటే ఈనెవ 21న స్ట్రీమింగ్ కానుందని తెలిపింది. ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. ఈ చిత్రం తమ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుందని ప్రకటించింది. మార్చి 21న అర్ధరాత్రి 12 గంటలకు ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. అయితే ఈ చిత్రం తెలుగు, తమిళం ఆడియోల్లోనూ స్ట్రీమింగ్కు వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం హిందీలో మాత్రమే అందుబాటులో ఉండునున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో యుద్ధ విమానాల విన్యాసాలు, వీఎఫ్ఎక్స్ ఈ మూవీలో ప్రత్యేకంగా నిలిచాయి. హృతిక్ రోషన్, దీపికా పదుకొణె, అనిల్ కపూర్.. ఎయిర్ ఫోర్స్ పైలట్లుగా ఈ మూవీలో నటించారు. కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్, రిషబ్ సాహ్నీ, సంజీద షేక్, అషుతోశ్ రానా, గీతా అగర్వాల్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. Ladies and Gentlemen, FIGHTER is all set for landing!! ✈️🔥 🤩 Fighter is releasing tonight at 12am on Netflix! pic.twitter.com/KYqnb3hKFL — Netflix India (@NetflixIndia) March 20, 2024
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
10న జిల్లాకు ప్రియాంక గాంధీ రాక
కాంగ్రెస్‌తోనే కుల వృత్తులకు మహర్దశ
అంతటా యజ్ఞ సహిత యోగా నిర్వహించాలి
ముగిసిన హోం ఓటింగ్
జిల్లా రద్దు అంశంపై ఫోకస్..
మల్లారంలో నేరడిగొండవాసి హత్య
ఎల్లారెడ్డి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌కు నోటీసులు?
హైదరాబాద్‌పై కుట్ర
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్‌పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్‌లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్‌రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్‌రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement