-
దంచికొట్టిన రొమారియో షెపర్డ్.. ప్రిటోరియస్ ఆల్‌రౌండ్ షో
కరీబియన్ ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా సెయింట్ కిట్స్ నెవిస్ అండ్ పేట్రియాట్స్‌తో నిన్న (సెప్టెంబర్ 2) జరిగిన మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ 98 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గయానా.. సైమ్ అయూబ్ (13 బంతుల్లో 21; 3 ఫోర్లు, సిక్స్), షిమ్రోన్ హెట్‌మైర్ (22 బంతుల్లో 36; ఫోర్, 3 సిక్సర్లు), కీమో పాల్ (31 బంతుల్లో 41 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు), ప్రిటోరియస్ (20 బంతుల్లో 27; 2 ఫోర్లు, సిక్స్), రొమారియో షెపర్డ్ (7 బంతుల్లో 26 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. పేట్రియాట్స్ బౌలర్లలో ఒషేన్ థామస్ 3 వికెట్లు పడగొట్టగా.. కోర్బిన్ బోష్, జార్జ్ లిండే, డొమినిక్ డ్రేక్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పేట్రియాట్స్.. ప్రిటోరియస్ (3-0-17-3), గుడకేశ్ మోటీ (4-0-15-2), రొమారియో షెపర్డ్ (1/19), జూనియర్ సింక్లెయిర్ (1/10), సైమ్ అయూబ్ (1/2) ధాటికి 17.1 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. పేట్రియాట్స్ ఇన్నింగ్స్‌లో అందరూ దారుణంగా విఫలమయ్యారు. కోర్బిన్ బోష్ (27), జార్జ్ లిండే (13), ఆండ్రీ ఫ్లెచర్ (11), యాన్నిక్ కారియా (13) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతావారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ ఓటమితో ప్రస్తుత ఎడిషన్‌లో పేట్రియాట్స్ పరాజయాల సంఖ్య 5కు చేరింది. ఆ జట్టు ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లోనూ గెలువలేదు. 2 మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. -
'ఏం చెప్పినా గుడ్డిగా నమ్మడమేనా.. నీ తెలివి ఏమైంది పంత్?!'
ఐపీఎల్ 2022లో లక్నోసూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విలువైన రివ్యూను అనవసరంగా వృథా చేసుకుంది. ఏ మ్యాచ్‌లో అయినా రివ్యూకు వెళ్లడానికి ముందు కీపర్‌ను అడుగుతుంటారు. ఎందుకంటే బ్యాట్స్‌మన్ ఔటా కాదా అనేది కీపర్‌కు స్పష్టంగా తెలుస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ పంత్ ఇందుకు భిన్నంగా ప్రవర్తించాడు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 11వ ఓవర్ లలిత్ యాదవ్ వేశాడు. ఓవర్ నాలుగో బంతిని లలిత్ యాదవ్ ఎవిన్ లుయీస్కు గుడ్‌లెంగ్త్‌తో వేశాడు. స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో లూయిస్ బంతిని మిస్ చేయగా.. అది లెగ్ స్టంప్ మీదుగా వెళ్లింది. అంతే పంత్ సహా ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు ఔట్ అంటూ గట్టిగా అరిచారు. అయితే అంపైర్ మాత్రం నాటౌట్ అని చెప్పి లెగ్‌బై ఇచ్చాడు. పంత్ ఔటా కాదా చెప్పాల్సింది పోయి వార్నర్ సహా మిగతా ఆటగాళ్లను అడిగాడు. వాళ్లు బంతి క్లోజ్‌గా వెళ్లింది కాబట్టి ఔట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొనడంతో పంత్ ఏం ఆలోచించకుండా రివ్యూకు వెళ్లిపోయాడు. అల్ట్రాఎడ్జ్‌లో బంతి లెగ్ స్టంప్ పక్కనుంచి దూరంగా వెళుతున్నట్లు క్లియర్‌గా కనిపించింది. అలా ఢిల్లీ క్యాపిటల్స్ తమకున్న రెండు రివ్యూలను వృథా చేసుకుంది. దీంతో అభిమానులు పంత్‌ను.. ''ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మడమేనా.. నీ తెలివి ఏమైంది'' అంటూ ట్రోల్ చేశారు. చదవండి: David Warner: ముందు అవకాశం లేకుండే.. తర్వాత ఆడతాడనుకుంటే! IPL 2022: షాబాజ్ అహ్మద్.. సివిల్ ఇంజనీర్ నుంచి క్రికెటర్ దాకా -
లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ షాక్.. విధ్వంసకర ఆటగాడు దూరం!
ఐపీఎల్-2022లో వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్న లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు విధ్వంసకర ఆటగాడు ఏవిన్ లూయిస్ గాయం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్-2022లో భాగంగా సోమవారం(ఏప్రిల్4)న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో.. రాహుల్ త్రిపాఠి కొట్టిన బంతిని ఆపే క్రమంలో లూయిస్ గాయపడ్డాడు. దీంతో గురువారం(ఏప్రిల్7) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగబోయే మ్యాచ్‌కు అతడి అందుబాటుపై సందేహాం నెలకొంది. ఒక వేళ అతడు మ్యాచ్‌కు దూరమైతే అతడి స్థానంలో మరో కరీబియన్ ఆటగాడు కైల్ మైయర్స్ తుది జట్టులోకి అవకాశం ఉంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన లూయిస్ 66 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఒక అర్థసెంచరీ కూడా ఉంది. తుది జట్లు (అంచనా) లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), మనీష్ పాండే, కైల్ మైయర్స్, దీపక్ హుడా, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, ఆండ్రూ టై/దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్. ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మన్దీప్ సింగ్, రిషబ్ పంత్ (కెప్టెన్), లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ముస్తాఫిజుర్ రెహమాన్ చదవండి: KKR Vs MI: అస్సలు ఊహించలేదు.. జీర్ణించుకోవడం కష్టమే.. కానీ: రోహిత్ శర్మ -
సుందర్- ఎవిన్ లూయిస్ చిత్రమైన యుద్దం.. చివరికి
ఐపీఎల్ 2022లో భాగంగా ఎస్ఆర్హెచ్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఎస్ఆర్హెచ్ బౌలర్ వాషింగ్టన్ సుందర్, లక్నో బ్యాట్స్‌మన్ ఎవిన్ లూయిస్ మధ్య చిత్రమైన యుద్దం జరిగింది. టాస్ ఓడిన లక్నో బ్యాటింగ్‌కు దిగింది. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే స్పిన్నర్ సుందర్‌ను బరిలోకి దించాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ సుందర్ లక్నోకు ఆదిలోనే షాక్ ఇచ్చాడు. ఒక్క పరుగు చేసిన డికాక్‌ను క్యాచ్ ఔట్ చేశాడు. ఈ దశలో క్రీజులోకి ఎవిన్ లూయిస్ వచ్చాడు. స్పిన్‌ను సరిగా ఆడడనే అపవాదు లూయిస్‌కు ఉంది. దానికి అనుగుణంగానే సుందర్ లూయిస్‌ను ముప్పతిప్పలు పెట్టాడు. సుందర్ తన తొలి స్పెల్‌లో మూడు బంతులను ఒకే రకంగా వేశాడు. ఎవిన్ లూయిస్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. తొలిసారి బంతి ప్యాడ్లను తాకడంతో సుందర్ అప్పీల్ చేశాడు. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో ఎస్ఆర్హెచ్ రివ్యూకు వెళ్లింది. కానీ అల్ట్రా ఎడ్జ్‌లో లూయిస్ తొలిసారి బతికిపోయాడు. ఇక రెండోసారి దాదాపు అదే రకమైన బంతి రావడం.. ఈసారి కూడా లూయిస్ స్వీప్ షాట్ ఆడేందుకు యత్నించాడు. కానీ బంతి ప్యాడ్లను తాకి వెళ్లింది. సుందర్ అప్పీల్ చేసినప్పటికీ ఎస్ఆర్హెచ్ రివ్యూకు వెళ్లలేదు. ముచ్చటగా మూడోసారి మాత్రం సుందర్ పైచేయి సాధించాడు. స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో లూయిస్ ప్యాడ్లను బంతి తాకింది. ఈసారి మాత్రం ఔట్ అన్న కాన్ఫిడెంట్‌తో సుందర్ గట్టిగా అప్పీల్ చేశాడు. అంపైర్ కూడా తన వేలును పైకెత్తి ఔట్ సింబల్ చూపించాడు. అలా ఎట్టకేలకు సుందర్ మూడోసారి లూయిస్‌పై గెలిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IPL 2022: ఆ ఆటగాడిని వెనక్కి పిలవండి.. లేదంటే సీఎస్కే పని అంతే! సుందర్-ఎవిన్ లూయిస్ వీడియో కోసం క్లిక్ చేయండి -
T20 Format: ఆ జట్టు కెప్టెన్‌గా ధోని.. ఓపెనర్‌గా రోహిత్!
Evin Lewis picks his all time T20I playing XI: రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ ఎవిన్ లూయిస్ తన ఆల్-టైమ్ టీ20 ఫ్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ ట్విటర్లో పోస్ట్ చేసింది. తను ప్రకటించిన జట్టుకు టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనిని కెప్టెన్‌గా లూయిస్ ఎంచుకున్నాడు. అదే విధంగా.. యూనివర్స్‌ల్ బాస్ క్రిస్ గేల్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు ఓపెనర్లుగా అవకాశం ఇచ్చాడు. ఇక రన్ మిషన్ విరాట్ కోహ్లికు మూడో స్ధానంలో, సౌతాఫ్రికా దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌కు నాలుగో స్ధానంలో చోటు దక్కింది. జట్టులో ఐదో స్థానంలో వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్‌కు అవకాశం ఇచ్చాడు ఎవిన్ లూయిస్. భారత్‌కు 2007లో టీ20 ప్రపంచకప్ అందించిన ధోనీని తన టీమ్‌కి వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా లూయిస్ ఎంచుకున్నాడు. ఆల్‌రౌండర్ కోటాలో ఆండ్రీ రస్సెల్, రవీంద్ర జడేజాకు చోటు కల్పించాడు. తన జట్టులో ఏకైక స్పిన్నర్‌గా రషీద్ ఖాన్‌ను లూయిస్ ఎంపిక చేశాడు. ఫాస్ట్ బౌలర్ల కోటాలో జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ స్టార్క్‌కు తన జట్టులో లూయిస్ స్థానం కల్పించాడు. చదవండి: Virat Kohli: మంచు కొంప ముంచుతోంది.. ఒక్కటి మినహా టీమిండియా మ్యాచ్‌లన్నీ అక్కడే.. టాస్ ఓడితే ఇక అంతేనా? ఎవిన్ లూయిస్ ఆల్-టైమ్ టీ20 XI: క్రిస్ గేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, కీరన్ పొలార్డ్, ఎంస్ ధోని (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రవీంద్ర జడేజా, రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ స్టార్క్. చదవండి: T20 World Cup 2021: టాస్ గెలిస్తేనే విజయం.. శ్రీలంక లాంటి జట్లకు నష్టం: జయవర్ధనే var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1981407197.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్‌మన్ గిల్‌కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్‌కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement