-
ఇద్దరు మాజీ భార్యలతో స్టార్ డైరెక్టర్, ఫొటో వైరల్
బాలీవుడ్లో బాయ్‌కాట్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ల సినిమా వస్తుందంటే చాలు చూసేదే లేదని తెగేసి చెప్తున్నారు హిందీ ఆడియన్స్. ప్రేక్షకుల దెబ్బకు కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమా బడ్జెట్లో కనీసం పావు వంతైనా రాబట్టకపోవడంతో నిర్మాతలు అల్లాడిపోతున్నారు. త్వరలో తాప్సీ- అనురాగ్ కశ్యప్‌ల నుంచి కొత్త సినిమా రాబోతోంది. వీరి కాంబినేషన్లో వచ్చిన దొబారా ఆగస్టు 19న విడుదల కాబోతోంది. అయితే తమ సినిమాను కూడా బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్ చేయాలని, అప్పుడే తమ చిత్రం అందరికీ రీచ్ అవుతుందని వింతగా స్పందించారు తాప్సీ, అనురాగ్. ఇక మరోవైపు తాప్సీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలపాలయ్యాడీ డైరెక్టర్. ఇదిలా ఉంటే తాజాగా తన మాజీ భార్యలతో కలిసి ఫొటోలను పోజిచ్చాడు. దొబారా సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న ఆయన తన మాజీ భార్యలు కల్కి కొచ్లిన్, ఆర్తి బజాజ్‌లతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. వీరిద్దరూ తన రెండు పిల్లర్లు అని రాసుకొచ్చాడు. ఈ ఫొట నెట్టింట వైరల్ అవగా అనురాగ్- ఆర్తిల కూతురు ఆలియా కశ్యప్ ఐకానిక్ అంటూ ఈ పోస్ట్‌పై కామెంట్ చేసింది. కాగా అనురాగ్ కశ్యప్- ఆర్తి బజాజ్ 1997లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కూతురు ఆలియా జన్మించింది. ఆ తర్వాత 2009లో వీరు విడిపోయారు. అనంతరం అనురాగ్ 2011లో నటి కల్కి కొచ్లిన్ను పెళ్లాడగా 2015లో విడాకులు తీసుకున్నాడు. View this post on Instagram A post shared by Anurag Kashyap (@anuragkashyap10) View this post on Instagram A post shared by Anurag Kashyap (@anuragkashyap10) చదవండి: తాప్సీపై డైరెక్టర్ వల్గర్ కామెంట్స్, దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు -
హీరోయిన్ కొడుకుగా నటించి చివరకు ఆమెనే పెళ్లాడిన నటుడు!
ఈ శీర్షిక కింద మీరు చదువుతున్నవి గాలి కబుర్లు కావు. గాసిప్స్లాంటి నిజాలు. కాలక్షేపానికి పనికొచ్చే సంగతులు! నమ్మాల్సిందే! ఆమె ముత్తాతే... పారిస్‌లోని ఈఫిల్ టవర్ నిర్మాణానికి బాలీవుడ్ నటి.. కల్కి కొచ్లిన్ ముత్తాత మోరిస్ కొచ్లిన్ చీఫ్ ఇంజినీర్ అట. న్యూయార్క్‌లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ సహా చాలా చారిత్రక కట్టడాలకు పనిచేశాడట ఆయన. గొంతు బాలేదని.. గబ్బర్ సింగ్ తెలుసు కదా.. పవన్ కళ్యాణ్ కాదు, ‘షోలే’ గబ్బర్ సింగ్.. అమ్జద్ ఖాన్! ఆ సినిమాలో ఆ పాత్రకు అమ్జద్ ఖాన్‌ను ఎంపిక చేసినా, స్క్రిప్ట్ రైటర్ జావేద్ అఖ్తర్‌కు నచ్చలేదుట. గబ్బర్ సింగ్ రోల్‌కు సరిపడా స్వరం అమ్జద్‌కు లేదని, గొంతు పీలగా ఉందని పెదవి విరిచాడట. అతని అసంతృప్తిని భరించలేక రమేశ్ సిప్పీ దాదాపుగా అమ్జద్‌ను ఆ సినిమా నుంచి తొలగించే నిర్ణయం తీసేసుకున్నాడు. నిజానికి ఆ పాత్రకు ముందు డానీ డెన్జోంగ్పాను అనుకున్నారట. అతను సరిపోడని.. అమ్జద్‌ను తీసుకున్నారు. అమ్జద్ మీదా అసంతృప్తి రావడంతో.. రమేశ్ సిప్పీ ఇరకాటంలో పడ్డారట. ఏమైతేనేం ఫైనల్‌గా అమ్జదే ఖరారయ్యాడు. న భూతో న భవిష్యతి అన్నంతగా గబ్బర్ సింగ్ పాత్రను రక్తి కట్టించాడు. గ్యారేజ్‌లో కాపురం.. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తెలుసు కదా. సినిమా అవకాశాలు కాస్త పెరగడం మొదలయ్యాక అతని కుటుంబాన్ని ముంబైకి తీసుకొచ్చాడు. అప్పుడు వాళ్లెక్కడ ఉన్నారో తెలుసా? రాజ్ కపూర్ వాళ్లింటి కారు గ్యారేజ్‌లో. తర్వాత ఆర్థికంగా కాస్త కుదుటపడ్డాక ముంబైలోని మధ్యతరగతి వాళ్లుండే ప్రాంతంలోని ఒక గది అద్దెకు తీసుకుని అందులోకి మారారుట. నోట్లోంచి మాట రాలేదు.. రాజ్ కపూర్, నర్గిస్ ప్రేమ ఎంత ప్రాచుర్యం పొందిందో నర్గిస్ మీద సునీల్ దత్కున్న ప్రేమా అంతే ఆరాధ్యనీయమైంది. సినిమాల్లోకి రాకముందు సునీల్ దత్ సిలోన్ రేడియోలో ఆర్జేగా పనిచేశాడు. ఆ సమయంలో నర్గిస్ దత్ టాప్ మోస్ట్ హీరోయిన్. ఆమెను ఇంటర్వ్యూ చేయాలని తహతహలాడాడు సునీల్ దత్. తీరా ఆ అవకాశం వచ్చి.. నర్గిస్ అతని ముందు కూర్చునేటప్పటికి నోట్లోంచి మాట పెగలక తత్తరపడ్డాడట. దాంతో ఆ ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయిపోయింది. ఆ పాజ్‌ను చాలా ఏళ్ల తర్వాత కనెక్ట్ చేస్తే సునీల్ దత్ సినిమాల్లోకి వచ్చాడు. ‘మదర్ ఇండియా’లో నర్గిస్‌కు కొడుకుగా నటించాడు. తర్వాత ఆమె జీవిత భాగస్వామి కూడా అయ్యాడు. సైఫ్ అలీ ఖాన్‌కు రావాల్సింది.. దిల్వాలే దుల్హనియా లేజాయేంగే.. సినిమా ఎంత హిట్టో చెప్పడానికి ఇక్కడ ప్రత్యేకంగా విశేషణాలు పేర్చాల్సిన పనిలేదు. అయితే అందులోని రాజ్ మల్హోత్రా (హీరో) పాత్రకు ముందుగా సైఫ్ అలీ ఖాన్‌ను ఎంపిక చేశారట. ఒకానొక దశలో హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్‌ను కూడా అడిగారని వార్త. ఏమైందో తెలియదు స్క్రీన్ మీద మాత్రం షారుఖ్ ఖాన్ కనబడ్డాడు. చదవండి: అలాంటి పాత్రను నేనెందుకు చేయలేకపోయానా అని అసూయపడ్డా సండే ఫ్లాష్‌బ్యాక్: పాత సినిమాకెళ్తాం నాన్నా! -
మీ టూ: అనురాగ్‌కు మాజీ భార్య మద్దతు
ముంబై: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శక-నిర్మాత అనురాగ్ కశ్యప్‌కు పలువురు బాలీవుడ్ నటులు మద్దుతగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాజీ భార్య నటి కల్కి కోచ్లిన్ కూడా ఆయనకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో కల్కి... ‘ప్రియమైన అనురాగ్ సోషల్ మీడియాల్లో వస్తున్న పుకార్లను మీరు పట్టించుకోకండి. మీ స్కిప్ట్‌లో మహిళల స్వేచ్చ కోరే వ్యక్తి. వ్యక్తిగతంగా కూడా పరిశ్రమలో మహిళల సమగ్రతను సమర్థిస్తారు. దానికి నేనే సాక్ష్యం. వ్యక్తిగతంగా, వృత్తిపరమంగా నన్ను ఎప్పుడూ మీతో సమానంగా చుశారు. మన విడాకుల తర్వాత కూడా నా చిత్తశుద్ధి కోసం నిలబడ్డారు. నేను నా వర్క్ ప్లేస్‌లో అసౌకర్యం, అసురక్షితకు లోనైనప్పుడు మీరు నాకు మద్దతుగా నిలిచారు’ అంటూ కల్కి రాసుకొచ్చారు. (చదవండి: అనురాగ్ నన్ను ఇబ్బందిపెట్టాడు) అంతేగాక ‘‘ఈ సమయం చాలా ప్రమాదకరమైనది. నిజానిజాలు తెలుసుకోకుండా ప్రతి ఒక్కరూ విమర్శించడం, తప్పుడు వాదనలు చేస్తారు. ఇది స్నేహితులను, బంధువులను, కుటుంబాలను నాశనం చేస్తుంది. అలాగే అవసరమైన సమయంలో ప్రేమ పంచే మనుషులే కాకుండా.. చూట్టు ఎవరూ లేనప్పుడు దయ, చూపే వ్యక్తులు కూడా ఉంటారు. అది మీకు కూడా తెలుసు. అయితే అలాంటి గౌరవానికే మీరు కట్టుబడి ఉండండి. ధైర్యంగా ఉండండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి’’ అంటూ ఆమె ప్రకటన విడుదల చేశారు. అయితే దర్శకుడు అనురాగ్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని నటి పాయల్ శనివారం ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పందిస్తూ.. వెంటనే అనురాగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం బాలీవువడ్లో ఇలాంటివి సర్వసాధరమని, ఇకనైన ఇలాంటి ఘటనపై స్పందించాలన్నారు. అనురాగ్ వంటివి వాళ్లను అరెస్టు చేసి మరోసారి ఇలాంటివి జరగకుండా అడ్డుకట్ట వేయాలని మండిపడ్డారు. (చదవండి: నేనెప్పుడూ అలా ప్రవర్తించలేదు: అనురాగ్) View this post on Instagram @anuragkashyap10 A post shared by Kalki (@kalkikanmani) on Sep 20, 2020 at 11:13pm PDT -
చిన్నప్పుడు
ఇది వినకూడని సంగతైతే కాదు కానీ, తెలుసుకుంటే పోయేదేమీ లేని విషయమే. కల్కీ కోక్లాన్ పేరు కొత్తగా ఉన్నట్లే.. ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి కూడా కొత్తగానే ఉంది. కల్కి ఫ్రెంచి సంతతి భారతీయ నటి. బాలీవుడ్లో ఆమె మంచి సినిమాలే చేస్తున్నారు. వాటిల్లో ఒక మంచి సినిమా ‘జిందగి న మిలేగి దొబారా’. చిన్నప్పుడు స్కూల్లో ‘వెరీ నాటీ’ ఉండేదట కల్కి. ‘‘టీచర్ అలా బయటికి వెళ్లగానే ఇలా బాయ్స్‌ని కిస్ చేసేదాన్ని. అప్పుడు వాళ్లు చికాగ్గా బుగ్గలు తుడుచుకుంటుంటే నాకు భలే సరదాగా ఉండేది. యు నో.. ఆ ఏజ్‌లో మగపిల్లలు ఆడపిల్లల్ని అమితంగా ద్వేషిస్తుంటారు. ఆ ద్వేషం వాళ్ల ముఖంలో కనిపించేస్తుంటుంది. వాళ్లు అలా ఉన్నప్పుడు తటాలున వెళ్లి ముద్దు పెట్టేసేదాన్ని. టీచర్ బయటికి వెళుతోందంటే.. అబ్బాయిలు నేనేం చేస్తానని ఎవరి జాగ్రత్తలో వాళ్లు ఉండేవాళ్లు. కొందరైతే టీచర్ తోపాటు జంప్..’’ అని కల్కీ ఒకటే నవ్వడం! -
వేశ్య అని వేధించేవారు: బాలీవుడ్ నటి
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలు, వివాదాలపై ఏ మాత్రం జంకకుండా తన అభిప్రాయాలను వెల్లబుచ్చడంలో బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్ ఎప్పుడూ ముందుంటారు. ఫ్రాన్స్‌కు చెందిన కల్కి బాలీవుడ్లో మంచి నటిగా గుర్తింపుపొందారు అంతేకాకుండా ఏ విషయంలోనైనా నిక్కశ్చిగా, ముక్కుసూటిగా మాట్లాడతారు. అయితే తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని అవమాన సంఘటనలు తాజాగా అభిమానులతో పంచుకున్నారు. తొలి చిత్రం ‘దేవ్ డి’తర్వాత ఎన్నో అవమానాలతో పాటు పరోక్షంగా లైంగిక వేధింపులను ఎదుర్కొన్న విషయాన్ని బయటపెట్టారు. ఈ చిత్రంలో వేశ్య పాత్ర పోషించడంతో తనను రష్యన్ వేశ్య అని వేధించేవారని ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: బిడ్డ సరే... మరి నీ భర్త ఎక్కడ?) ‘దేవ్ డి చిత్రం విడుదలైన తర్వాత ఓ ఆంగ్ల పత్రికలో ఇలాంటి రష్యన్ వేశ్యలను బాలీవుడ్‌కు ఎందుకు తీసుకొస్తారో తెలియదు అని పరోక్షంగా నా గురించి ఓ వార్త రాశారు. ఇది చదివాక నేను చాలా బాధపడ్డాను. అయితే నేను రష్యా నుంచి రాలేదు కదా అనుకున్నా. ఇక 2013లో కల్కి.. రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొణే కలిసి ‘యే జవానీ హై దివానీ’ వంటి సూపర్ హిట్ సినిమాలో నటించినా నాకు సరైన అవకాశాలు రాలేదు. దీంతో కొంత కాలం ఖాళీగా ఉన్నాను. ఈ క్రమంలో ఓ సినిమా నిర్మాత సినిమా అవకాశం ఇస్తానని చెప్పి పరోక్షంగా లైంగికంగా వేధించాడు. ఈ లైంగిక వేధింపులు, అవమానాలు కేవలం బాలీవుడ్లోనే కాదు హాలీవుడ్లో కూడా ఉంటాయి. ఒక సారి హాలీవుడ్లో నటించడానికి వెళితే ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చి నువ్వు రష్యన్ వేశ్య అని అసభ్యకరంగా ప్రవర్తించారు. అంతేకాకుండా ఓ మహిళ నా దగ్గరకు వచ్చి నీ ముఖ్యంపై ముడతలు కనిపించడంలేదు, ఎక్కువగా నవ్వకు, జట్టు పైకి కట్టుకో అంటూ బెదిరించింది. ఇలా అన్ని చోట్లా అవమానాలు, వేధింపులు భరించాను. అంతేకాకుండా నేను పెళ్లికి ముందే ఓ బిడ్డకు జన్మనివ్వబోతుండటంతో అందరూ ఆ బిడ్డకు తండ్రెవరు అంటూ సూటిపోటి మాటలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పెళ్లికి ముందే పిల్లల్ని కనడం అంటే ఇప్పటికీ సమాజం ఓ తప్పుగా భావిస్తుంది. నా ఇంట్లోవారికి నా పక్కింటి వారికి నేనుంటున్న కాలనీ మొత్తానికి నాకు పెళ్లి కాలేదని తెలుసు. కానీ వాళ్లెప్పుడూ నన్ను వేలెత్తి ప్రశ్నించింది లేదు. ఇక నేను తల్లిని కాబోతుండటంతో నన్ను సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నారు ఈ ఆలోచనా విధానం మారాలి’అని కల్కి పేర్కొన్నారు. రీసెంట్గా ఈ భామ సైఫ్ అలీ ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ నటించిన నెట్‌ఫ్లిక్స్ ‘సేక్రెడ్ గేమ్స్’ లో కనిపించిన విషయం తెలిసిందే.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్‌పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్‌కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్‌సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement