-
టైటిల్ పోరుకు సాకేత్–రామ్ జోడీ
చెన్నై: కెరీర్లో 16వ ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్ సాధించడానికి భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని విజయం దూరంలో నిలిచాడు. చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీలో సాకేత్–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జోడీ పురుషుల డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. హైదరాబాద్‌కు చెందిన బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ–నిక్కీ పునాచా (భారత్) జంటతో నేడు జరిగే ఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం తలపడుతుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో సాకేత్–రామ్‌కుమార్ 6–3, 6–2తో రెండో సీడ్ తొషిహిడె మత్సుయ్–కైటో యుసుగి (జపాన్)లపై నెగ్గగా... రిత్విక్–నిక్కీ పునాచా 6–3, 4–6, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో జేకబ్ షానైటర్–మార్క్ వాల్నర్ (జర్మనీ)లను ఓడించారు. 58 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో సాకేత్–రామ్ జోడీ ఎనిమిది ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. -
పాకిస్తాన్‌తో మ్యాచ్.. భారత జట్టులో సాకేత్
ఇస్లామాబాద్ వేదికగా పాకిస్తాన్ జట్టుతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 3, 4 తేదీల్లో జరిగే డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్ మ్యాచ్‌లో పాల్గొనే భారత టెన్నిస్ జట్టును ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాకేత్ మైనేని జట్టులోకి పునరాగమనం చేశాడు. 2022 సెప్టెంబర్‌లో నార్వేతో జరిగిన వరల్డ్ గ్రూప్ తొలి రౌండ్ మ్యాచ్‌లో చివరిసారి సాకేత్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. రామ్‌కుమార్ రామనాథన్, శ్రీరామ్ బాలాజీ, యూకీ బాంబ్రీ, నిక్కీ పునాచా, దిగి్వజయ్ ప్రతాప్ సింగ్ జట్టులో ఇతర సభ్యులుగా ఉన్నారు. -
పోరాడి ఓడిన సాకేత్–యూకీ జోడీ
హాల్ ఆఫ్ ఫేమ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ పోరాటం ముగిసింది. అమెరికాలోని న్యూపోర్ట్‌లో జరిగిన ఈ టోరీ్నలో సాకేత్–యూకీ ద్వయం పురుషుల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లో పోరాడి ఓడింది. గంటా 59 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో మూడో సీడ్ సాకేత్–యూకీ జంట 7–6 (7/2), 6–7 (2/7), 9–11తో టాప్ సీడ్ నథానియల్ లామోన్స్–జాక్సన్ విత్రో (అమెరికా) ద్వయం చేతిలో ఓటమి చవిచూసింది. సాకేత్–యూకీలకు 10,660 డాలర్ల (రూ. 8 లక్షల 74 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
పోరాడి ఓడిన సాకేత్–యూకీ జోడీ
యూఎస్ పురుషుల క్లే కోర్టు టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత డబుల్స్ జోడీ సాకేత్ మైనేని, యూకీ బాంబ్రీ జోడీ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. అమెరికాలోని హ్యూస్టన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–యూకీ ద్వయం 6–7 (6/8), 6–2, 5–10తో ‘సూపర్ టైబ్రేక్’లో రాబర్ట్ గాలోవే (అమెరికా)–మిగేల్ ఎంజెల్ రేయస్ వరేలా (మెక్సికో) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. గంటా 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్, యూకీ మూడు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్వీస్‌లో ఆరుసార్లు బ్రేక్ పాయింట్లను కాపాడుకున్న సాకేత్, యూకీ ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశారు. అయితే నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో మాత్రం గాలోవే–వరేలా ద్వయం పైచేయి సాధించింది. తొలి రౌండ్లో నిష్క్రమించిన సాకేత్, యూకీలకు 3,510 డాలర్ల (రూ. 2 లక్షల 87 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
Myneni Saketh: సెమీస్‌లో పోరాడి ఓడిన సాకేత్ జోడీ
ATP 250 Dallas Open: డాలస్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ సెమీఫైనల్లో ఓటమి పాలైంది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాకేత్–యూకీ ద్వయం 6–7 (11/13), 5–7తో లామోన్స్–విత్రో (అమెరికా) జోడీ చేతిలో ఓడింది. గంటా 43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్–యూకీ మూడుసార్లు బ్రేక్ పాయింట్ అవకాశాలను వృథా చేసుకున్నారు. సాకేత్–యూకీలకు 12,230 డాలర్ల (రూ. 10 లక్షలు) ప్రైజ్‌మనీ, 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. చదవండి: రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర, బెంగాల్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మీ పనులు సులువుగా అవ్వాలంటే.. ఇవి వాడాల్సిందే..!
తలసేమియాపై అవగాహన
Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ
పంజాబ్‌కు బ్రేకులు వేసిన సీఎస్కే
ప్రచారంలో భారతమ్మ..!
బాబే భూబకాసురుడు
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. సీపీ శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌కు కేతిరెడ్డి సవాల్
రాజస్తాన్ రాయల్స్ జట్టుతో సైనా నెహ్వాల్.. ఫొటోలు వైరల్
ఆస్పత్రిలో హీరోయిన్.. మత్తు మందు.. బాధ తట్టుకోలేకపోతున్నా!
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్‌కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- Parvathipuram: ఎన్ఆర్ఐకు ఎదురుగాలి
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement