-
టేస్టీగా పొటాటో స్టఫ్ చపాతీలు చేసుకోండిలా..!
కావలసినవి: బంగాళదుంపలు – 2 (తొక్క తీసి, తురుముకోవాలి) గోధుమ పిండి – 2 కప్పులు (కొద్దిగా నూనె ఉప్పు వేసుకుని.. గోరువెచ్చని నీళ్లతో చపాతీ ముద్దలా చేసుకుని.. మూత పెట్టుకుని, 15 నిమిషాలు పక్కన పెట్టుకుని, కాస్త పెద్దగా, చతురస్రాకారంలో చపాతీల్లా ఒత్తుకోవాలి) ఉల్లిపాయ ముక్కలు – 3 టేబుల్ స్పూన్లు కారం, ఉప్పు, పసుపు – తగినంత నూనె – సరిపడా తయారీ విధానం: బంగాళదుంప తురుమును, మూడు లేదా నాలుగు కప్పుల నీళ్లల్లో 3 నిమిషాల పాటు ఉడికించి.. నీళ్లన్నీ పోయేవరకు వడకట్టులో వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ల నూనెలో ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించి.. అందులో బంగాళదుంప తురుము వేసుకోవాలి. అది కూడా కాస్త వేగిన తర్వాత.. కారం, ఉప్పు, పసుపు కొద్దికొద్దిగా వేసుకుని బాగా కలిపి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక చపాతీపై కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని పెట్టుకుని.. మరో చపాతీతో కప్పి.. గుండ్రటి చిన్న ప్లేట్‌ని దానిపై వేసి గట్టిగా ఒత్తాలి. అనంతరం ప్లేట్ చుట్టూ ఉన్న చపాతీని తొలిగించి.. ఆ గుండ్రటి చపాతీలను నూనెలో దోరగా వేయించుకోవాలి. వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే భలే రుచిగా ఉంటాయి ఈ చపాతీలు. (చదవండి: హెల్తీగా రాగి డోనట్స్ చేసుకోండిలా..!) -
ఆలూ తింటే వెయిట్ పెరుగుతామా?
-
ఆలూ మసాలా రోస్ట్
ఫుల్ మీల్స్ కావలసినవి: బంగాళాదుంపలు - పావు కిలో, ఉల్లిపాయలు - 2, పచ్చిమిర్చి - 2, కారం - 2 చెంచాలు, మసాలా పొడి - 2 చెంచాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 చెంచా, కరి వేపాకు - మినప్పప్పు - శెనగపప్పు - జీలకర్ర - ఆవాలు - ఒక్కో చెంచా, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా తయారీ: బంగాళాదుంపల్ని ఉడికించి, తొక్క తీసేసి, పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకుని.. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు కలిపి కాసేపు నాననివ్వాలి. బాణలిలో నూనె వేడిచేసి కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేయాలి. వేగాక ఉల్లి పాయ, పచ్చిమిర్చి ముక్కలు, బంగాళాదుంప ముక్కలు వేయాలి. ముక్కలు బాగా మగ్గాక గరం మసాలా వేసి దించేసుకోవాలి. స్పైసీ క్యారెట్ పులావ్ కావలసినవి: బియ్యం - 2 కప్పులు, క్యారెట్లు - 4, పచ్చిమిర్చి - 2, ఉల్లిపాయలు - 2, పెరుగు - పావుకప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 చెంచాలు, ఆవాలు - 1 చెంచా, జీలకర్ర - 1 చెంచా, గరం మసాలా - 1 చెంచా, లవంగాలు - 5, దాల్చినచెక్క - చిన్నది, అనాసపువ్వు - 1, కరివేపాకు - 2 రెమ్మలు, కొత్తిమీర - 1 కట్ట, వేయించిన జీడిపప్పులు - 10, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, నెయ్యి - 4 చెంచాలు తయారీ: క్యారెట్స్ని చిన్నగా కోసుకుని, పెరుగు, గరం మసాలా, ఉప్పు, పసుపు కలిపి అరగంట ఉంచాలి. బియ్యం కడిగి, కాస్త పలుకు ఉండేలా అన్నం వండాలి. వండేప్పుడు లవం గాలు, దాల్చిన చెక్క, అనాసపువ్వు గుడ్డలో మూటగట్టి వేయాలి. మసాలా ఘాటు అన్నానికి పట్టేస్తుంది కాబట్టి వండిన తర్వాత మూట తీసేయాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి, ఆవాలు, జీల కర్ర, కరివేపాకు వేయాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక క్యారెట్ మిశ్రమం వేయాలి. రెండు నిమి షాల తర్వాత లోతైన గిన్నెలో అన్నం, క్యారెట్ మిశ్రమం పొర లుగా వేసుకుని, మూత పెట్టి, కాసేపు ఉడికించాలి. జీడిపప్పు, కొత్తిమీర చల్లి దించేసుకోవాలి. కొబ్బరి-కోవా లడ్డు కావలసినవి: పచ్చికొబ్బరి తురుము - రెండున్నర కప్పులు, పచ్చి కోవా - 1 కప్పు, పంచదార - అరకప్పు, యాలకుల పొడి - 1 చెంచా, నెయ్యి - పావుకప్పు, జీడిపప్పు- బాదంపప్పు-కిస్మిస్ - కావలసినన్ని తయారీ: అరకప్పు కొబ్బరి తురుమును ముందే పక్కన పెట్టేసుకోవాలి. స్టౌమీద గిన్నె పెట్టి నెయ్యి వేయాలి. కాగాక సన్నగా తరిగిన జీడిపప్పు, కిస్మిస్, బాదంపప్పులను వేసి వేయించి తీసేయాలి. అదే గిన్నెలో కొబ్బరి తురుము వేయాలి. కాస్త రంగు మారాక పచ్చికోవా వేసి మరికాసేపు వేయించాలి. తర్వాత చక్కెర వేయాలి. చక్కెర కరిగి మిశ్రమం అంతా ముద్దలా అయ్యాక వేయించిన డ్రైఫ్రూట్స్, యాలకుల పొడి వేసి కలిపి దించేయాలి. చేతికి నెయ్యి రాసుకుని, మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని లడ్డూలా చుట్టుకోవాలి. చివరగా లడ్డూలను కొబ్బరి తురుములో దొర్లించి సర్వ్ చేయాలి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్‌కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement