-
ప్రాణాలు తీసిన కారు..
♦ హ్యాండ్‌బ్రేక్ సరిగా వేయకపోవడంతో వెనక్కి దూసుకెళ్లిన కారు ♦ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న యువతిని ఢీ కొట్టిన వైనం ♦ ఎదురుగా మరో కారు పార్క్ చేసి ఉండటంతో రెండు కార్ల మధ్య నలిగి మృత్యువాత ♦ నగరంలోని శ్రీనగర్ కాలనీలో దుర్ఘటన హైదరాబాద్: రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కారు ఆ యువతి పాలిట మృత్యు శకటంగా మారింది. పార్క్ చేసిన కారు డ్రైవర్ లేకుండానే ప్రమాదవశాత్తూ వెనక్కి దూసుకురావడంతో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతి దుర్మరణం పాలైంది. ఈ హృదయవిదారక ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్ కాలనీలోని గణపతి కాంప్లెక్స్ సమీపంలో ఓ సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయ కేంద్రం ఉంది. అక్కడ ఏపీ 09 సీజీ 2464 అనే చవర్లెట్ బ్లాక్ కలర్ కారును అమ్మకానికి ఉంచారు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో మరో కారు అమ్మకానికి రావడంతో విక్రయ కేంద్రం డ్రైవర్ చవర్లెట్ కారును బయటకు తీసుకొచ్చి ఫుట్‌పాత్‌పై పార్క్ చేశాడు. అయితే హ్యాండ్‌బ్రేక్ సరిగా వేయకపోవడంతో అక్కడ పార్క్ చేసిన నాలుగైదు నిమిషాల్లోనే రోడ్డు పల్లంగా ఉండటంతో కారు వెనక్కి వేగంగా దూసుకె ళ్లింది. చుట్టుపక్కల వారు గమనించి కేకలు వేయడంతో డ్రైవర్ గమనించి కారును ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇదే సమయంలో పక్కనే ఉన్న సిసిరో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సాఫ్ట్వేర్ సంస్థలో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్న దేవలె అంబికాభాయి(25) ఇయర్‌ఫోన్స్‌తో మొబైల్ మాట్లాడుకుంటూ రోడ్డుపక్క నుంచి నడుచుకుంటూ వెళ్తోంది. వెనక నుంచి కారు వస్తున్న విషయాన్ని ఆలస్యంగా గమనించి పక్కకు జరుగుదామని ఆమె అనుకున్నంతలోనే ఎదురుగా ఓ మారుతి కారు పార్క్ చేసి ఉంది. వెనకాల నుంచి దూసుకొస్తున్న కారు నుంచి తప్పించుకునే క్రమంలో రెండు కార్ల మధ్య ఇరుక్కుపోయింది. దీంతో ఆమె తలపగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో రక్తపుమడుగులో విలవిల్లాడింది. స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. కర్నూలు జిల్లా శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట గ్రామానికి చెందిన అంబిక గత నెల 23న ఈ సంస్థలో చేరింది. తండ్రి నాగేశ్వర్రావు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి కాగా, తల్లి ల క్ష్మీభాయి గృహణి. మృతురాలు అంబిక వివాహం ఇటీవలే నిశ్చయం కాగా వచ్చే నెలలో నిశ్చితార్థం జరపాలని తల్లిదండ్రులు తలపెట్టిన సమయంలోనే ఈ ప్రమాదం జరగడంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ ఘటనాస్థలంలో విచారణ చేపట్టారు. నిర్లక్ష్యంగా కారు పార్క్ చేసిన ప్రవీణ్ అనే డ్రైవర్‌పై ఐపీసీ 304(ఏ) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డ్రైవర్‌లేని కారు ఢీకొని యువతి మృతి
బంజారాహిల్స్: పక్కకు నిలిపి ఉంచిన కారు, డ్రైవర్ లేకుండానే పొరపాటున వెనక్కి దూసుకు రావడంతో నడుచుకుంటూ వెళ్తున్న యువతి దుర్మరణం చెందింది. ఈ ఘటన వివరాలివీ.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీ గణపతి కాంప్లెక్స్ సమీపంలో ఓ సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయకేంద్రం ఉంది. ఇక్కడ షెవర్లే కారును విక్రయం కోసం ఉంచారు. బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మరో కారు అమ్మకానికి రావడంతో విక్రయ కేంద్రం డ్రైవర్ అంతకుముందు పార్కింగ్ చేసిన షెవర్లే కారును బయటకు తీసుకొచ్చి ఫుట్‌పాత్ పైన ఉంచాడు. అయితే హ్యాండ్‌బ్రేక్ సరిగా వేయకపోవడంతో అక్కడ పార్కింగ్ చేసిన నాలుగైదు నిమిషాల్లోనే రోడ్డు పల్లంగా ఉండటంతో కారు వెనక్కి వేగంగా దూసుకె ళ్లింది. చుట్టుపక్కల వారు గమనించి హాహాకారాలు చేస్తుండగానే అది ఓ యువతిని ఢీకొట్టింది. ముందుగా మరో కారు ఆపి ఉండటంతో ఆమె తప్పించుకునేందుకు వీలులేకపోయింది. రెండు కార్ల మధ్య నలిగి ఆమె తల పగిలి తీవ్రంగా గాయపడింది. ఆమె అక్కడే ఉన్న సిసిరో ఇండియా సంస్థలో హెచ్ఆర్ మేనేజర్‌గా పని చేస్తున్న దేవలె అంబికా బాయి(25)గా గుర్తించారు. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కర్నూలు జిల్లా శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట గ్రామానికి చెందిన అంబిక గత నెల 23వ తేదీన ఈ సంస్థలో చేరింది. తండ్రి నాగేశ్వర్రావు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి కాగా, తల్లి లక్ష్మీబాయి గృహిణి. నిర్లక్ష్యంగా కారు పార్కింగ్‌చేసిన ప్రవీణ్ అనే డ్రైవర్‌పై ఐపీసీ 304(ఏ) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మృతురాలు అంబిక వివాహం ఇటీవలే నిశ్చయమైనట్లు తెలిసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అమెరికా వరల్డ్‌కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా
గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్‌తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్‌షాపై కోడ్ ఉల్లంఘన కేసు
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement