-
చావో... బతుకో తేల్చుకోమన్నారు...
స్టార్ ఎఫర్ట్ బజరంగి భాయీజాన్‌తో పాటు, భర్ దో జోలి మేరి వంటి పాటలతో ఎప్పుడూ మనకి టచ్‌లో ఉండే గాయకుడు అద్నాన్‌సమి... బరువు తగ్గడం అనే విషయంలో ఒక అద్భుతం. ఇటీవల హైదరాబాద్‌లో సార్క్ ఛాంబర్ వుమన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కౌన్సిల్, ఫిక్కి వైఎఫ్ఎల్ఒ ఆధ్వర్యంలో నిర్వహించినవెల్నెస్ రూల్స్ ఈవెంట్లో పాల్గొన్నప్పుడు వెయిట్ లాస్‌కు సంబంధించి ఆయన పంచుకున్న అనుభవాలు ఇవి. ‘‘నేను లావుగా ఉన్నప్పుడు నా మోకాలి చిప్పలను కూడా నేను చూసుకోలేని పరిస్థితి. నిద్రలేమితో పాటు ఎన్నోరకాల అనారోగ్యాలు చుట్టుముట్టాయి. మరోవైపు మా నాన్నగారికి పాంక్రియాట్రిక్ కేన్సర్ ఉందని 1989లో నిర్ధారించారు. ఆయనకు చికిత్స కోసం లండన్‌లో ఉన్న సమయంలో ఆయన నన్ను వైద్య పరీక్షలు చేయించుకోమని సలహా ఇచ్చారు. ఆ పరీక్షల్లో... నేను ఎక్కువ కాలం బతికే అవకాశం లేదని డాక్టర్ తేల్చారు. అది కూడా మా తండ్రిగారి ముఖం మీదే. అప్పుడు ఆయన ముఖం నిజంగా నేను చూడలేకపోయాను. అంత ఆవేదన చెందారు. ఆయన నన్ను ఒకటే కోరారు. ఎప్పుడూ నా కళ్ల ముందు అంటే నాకంటే ముందు తాను చనిపోవాలని అనుకుంటున్నా అని. దాంతో ఆయన అన్న ఆ ఒక్క వాక్యం బరువు తగ్గించుకునేందుకు కారణమైంది. అప్పుడే నా 230 కిలోల బరువు తగ్గించుకోవడానికి చాలా కష్టపడ్డాను. మొత్తం 6 సంవత్సరాల్లో 160కిలోలు తగ్గాను. నా అనుభవంలో నేను చెప్పగలిగిందేమిటంటే... బరువు తగ్గడం అనేది 20శాతమే శారీరకం కాగా 80 శాతం మానసికం. నేను మానసికంగా ధృఢ నిర్ణయం తీసుకోబట్టే దీనిని సాధించగలిగాను’’ అంటూ వివరించారు అద్నాన్. ఎమోషనల్ ఈటర్... అద్నాన్... బేరియాట్రిక్తో సహా ఎటువంటి వెయిట్‌లాస్ సర్జరీలు చేయించుకోలేదు. పూర్తిగా సహజమైన పద్ధతుల్నే ఆశ్రయించారు. పంచదార కలపని టీ తాగడంతో ఆయన రోజు ప్రారంభమయ్యేది. ఒక టీస్పూన్ ఫ్యాట్ ఫ్రీ డ్రెస్సింగ్‌తో వెజిటబుల్ సలాడ్ లంచ్‌లో తప్పనిసరిగా ఉండేది. అదే విధంగా తండూరి ఫిష్ కూడా ఉండేది. వైట్‌రైస్, బ్రెడ్, పంచదార, నూనెల నుంచి దూరం జరిగి కేవలం వెజ్ సలాడ్స్, పాప్‌కార్న్, తండూరి ఫిష్, బాయిల్డ్ దాల్, నూనెలు కలపని కూరలు వాడారు. ఏ రకమైన ఆల్కహాలిక్ డ్రింక్స్ జోలికి పోలేదు. సుగర్ ఫ్రీ డ్రింక్స్, డైట్ ఫడ్జ్ స్టిక్స్, డైట్ ఐస్ లాలీస్... వంటివి ఆహారంలో భాగమయ్యాయి. పూర్తిగా కార్బోహైడ్రేట్స్ రహిత ఆహారం, ప్రొటీన్ డైట్ తీసుకున్నారు. లో కేలరీ డైట్ ప్లాన్ మీద ఆధారపడ్డాను. కేవలం డైట్ ద్వారానే 40 కిలోల బరువు తగ్గాను. అప్పుడు వ్యాయామాలు ప్రారంభించి రెగ్యులర్‌గా వర్కవుట్స్ చేశారు. న్యూట్రిషనిస్ట్‌లతో నిరంతరం చర్చిస్తూ ఉండడం వల్ల తానో ఎమోషనల్ ఈటర్‌ని అని తెలుసుకున్నారు. అంటే... ఆనందంగా ఉన్నా, విషాదంలో ఉన్నా తినడం అలవాటైంది. అదే ఆయన్ని అధిక బరువు బాధితుడిగా మార్చిందని అర్ధమై మానసిక చిత్త చాంచల్యం తొలిగించుకున్నారు అద్నాన్కు ఫిట్నెస్ ట్రైనర్‌గా ముంబయికి చెందిన ప్రశాంత్ సావంత్ వ్యవహరించారు. రన్నింగ్ చేసేందుకు నా శరీరం సహకరించదని భావించి ముందు సాధారణ వాకింగ్ చేయించడం, ఇలా నా శరీరానికి తగ్గట్టుగా వ్యాయామం చేయిస్తూ ఆయన అద్నాన్‌ను సాధారణ బరువుకు తీసుకువచ్చారు. -
బజ్రంగీ పవన్ భాయీజాన్?
సల్మాన్‌ఖాన్ నటించిన ‘బజ్రంగీ భాయీజాన్’ ఇవాళ భారతీయ సినిమా చరిత్రలో ఒక సంచలనం. ఈ లేటెస్ట్ సూపర్‌హిట్ ఫిల్మ్ విడుదలైన మూడోవారం కూడా కలెక్షన్ల ప్రభంజనం కొనసాగిస్తోంది. ఈ సోమవారం నాటికి దాదాపు రూ. 300 కోట్ల మైలురాయికి అతి చేరువలో నిలిచింది. ఇప్పటికే, ఆమిర్‌ఖాన్ ‘ధూమ్-3’ వసూళ్ళను కూడా అధిగమించి, బాలీవుడ్లో ‘రెండో అతి పెద్ద గ్రాసర్’ అయింది. అంతేకాదు. దాదాపు రూ. 330 కోట్ల పైచిలుకు వసూళ్ళతో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న ఆమిర్‌ఖాన్ ‘పీకే’ను కూడా దాటడానికి ‘బజ్రంగీ...’ సల్లూ భాయ్ వడివడిగా అడుగులు వేస్తున్నాడు. బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తున్న ఈ కథ మన తెలుగు రచయిత వి. విజయేంద్రప్రసాద్ రాయగా, హిందీలోకి వెళ్ళినదే! అక్కడ సూపర్‌హిట్టైన ఈ కథ ఇప్పుడు తెలుగులోకి వస్తోందా? కృష్ణానగర్ వర్గాలు అవుననే అంటున్నాయి. ఈ కథపై మోజెందుకు? పాకిస్తాన్‌కు చెందిన ఒక మాటలు రాని ముస్లిమ్ పసిపాప భారత్‌లో తప్పిపోతే, ఆ అమ్మాయిని సురక్షితంగా తన స్వదేశానికి చేర్చడానికి శ్రమించే ఒక హిందువుగా సల్మాన్ చేసిన పాత్ర మన తెలుగు హీరోలను అమితంగా ఆకర్షించింది. అమాయకంగా ఉంటూనే హీరోయిజానికి పరాకాష్ఠగా కనిపించే ఆ పాత్ర చిత్రణతో ప్రేమలో పడ్డ మన పెద్ద హీరోలు ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే, నటించాలని ఉత్సాహపడుతున్నారు. విశ్వసనీయ వర్గాల తాజా సమాచారం మేరకు పవన్‌కల్యాణ్ ఈ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారట! ఇటీవలే ‘సర్దార్’ సినిమాతో మళ్ళీ కెమేరా ముందుకొచ్చిన పవర్‌స్టార్ మతసామరస్యం, మానవత్వం లాంటి మంచి అంశాలున్న ఈ స్క్రిప్టు తనకు మరింత ఇమేజ్ తెస్తుందని భావిస్తున్నారట! డెరైక్షన్కో లెక్కుంది! నిజానికి, సల్మాన్ ఖాన్‌తో కలసి హిందీలో ‘బజ్రంగీ...’ చిత్రాన్ని నిర్మించింది - ప్రముఖ కన్నడ నిర్మాత ‘రాక్‌లైన్’ వెంకటేశ్. రజనీకాంత్ ‘లింగ’ లాంటి చిత్రాల ద్వారా తెలుగువారికి కూడా సుపరిచితుడైన ఆయనతోనే ఈ కథను తెలుగులో రీమేక్ చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని భోగట్టా. ఈ తెలుగు ‘బజ్రంగీ...’కి దర్శకుడిగా హరీశ్‌శంకర్ పేరు వినిపిస్తోంది. గతంలో నాక్కొంచెం తిక్కుంది... దానికో లెక్కుంది’ లాంటి డైలాగ్స్‌తో పవన్‌కల్యాణ్‌తో ‘గబ్బర్‌సింగ్’ లాంటి బాక్సాఫీస్ రికార్డ్ సినిమా రూపొందించిన ట్రాక్ రికార్డ్ హరీశ్ శంకర్‌ది. ‘ఆ ఘన విజయానికి తగ్గట్లే, ఈ ‘బజ్రంగీ...’ రీమేక్‌ను కూడా ఆయన డీల్ చేయగలరని పవన్‌కల్యాణ్ బృందం భావిస్తున్నారు. తేలని నిర్మాణ వ్యవహారం ఒక ప్రముఖ తెలుగు డిస్ట్రిబ్యూటర్ కమ్ నిర్మాత కూడా ఈ నిర్మాణంలో భాగస్వామి కావాలని ఉత్సాహపడుతున్నారు. కానీ, ఆ విషయంలో పవన్‌కల్యాణ్ ఎటు మొగ్గుతారన్నది ఇంకా తెలియ లేదు. ఫలితంగా నిర్మాతలు ఎవరు, నిర్మాణమెలా అనే విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. నిజానికి, సల్మాన్‌ఖాన్ సినిమా గతం లోనూ పవన్ కల్యాణ్‌కు కలిసొచ్చింది. సల్లూ భాయ్ చేసిన సూపర్‌హిట్ ‘దబంగ్’నే తెలుగులో పవన్‌కల్యాణ్ తనదైన పద్ధతిలో మలుచుకొని, ‘గబ్బర్ సింగ్’గా అందించారు. ఇప్పుడు మళ్ళీ సల్మాన్‌ఖాన్ సినిమానే పవన్‌కల్యాణ్ ఆశ్రయించడం, ‘గబ్బర్‌సింగ్‘ డెరైక్టర్ హరీశ్ శంకర్‌ను పెట్టుకోవడం ఈసారీ సెంటిమెంటల్‌గా కలిసొస్తుందా? ‘బాహుబలి’ రిలీజైన వారాని కల్లా వచ్చి, ఆ హవాను దీటుగా ఎదుర్కొన్న హిందీ ‘బజ్రంగీ...’ తెలుగులోకి వస్తే, ఇక్కడా రికార్డులు సృష్టిస్తుందా? ఏమో వేచి చూడాలి. అధికారికంగా అన్ని వివరాలూ తెలియడానికి ఇంకొన్ని రోజులు ఆగాలి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement