-
Asia Cup 2023: గెలిచి నిలిచిన బంగ్లాదేశ్.. ‘సూపర్–4’ రేసులో
లాహోర్: ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో బంగ్లాదేశ్ జట్టు ‘సూపర్–4’ రేసులో నిలిచింది. లంకతో జరిగిన గ్రూప్ ‘బి’ తొలి మ్యాచ్‌లో 160 పైచిలుకు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడిన బంగ్లాదేశ్ అఫ్గానిస్తాన్‌పై మాత్రం చెలరేగి 89 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓపెనర్ మెహదీ హసన్ మిరాజ్ (119 బంతుల్లో 112 రిటైర్డ్‌హర్ట్; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), మిడిలార్డర్లో నజ్ముల్ హోసేన్ షాంతో (105 బంతుల్లో 104; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కారు. దాంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 334 పరుగులు చేసింది. వన్డేల్లో బంగ్లాదేశ్‌కిది మూడో అత్యధిక స్కోరు. ఓపెనర్ నయీమ్ (28), వన్‌డౌన్ బ్యాటర్ తౌహిద్ (0) నిరాశపరిచినప్పటికీ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిరాజ్, నజు్మల్ మూడో వికెట్‌కు 194 పరుగులు జోడించారు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్, గుల్బదిన్ చెరో వికెట్ తీశారు. అనంతరం కష్టమైన లక్ష్యఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్ 44.3 ఓవర్లలో 245 పరుగుల వద్ద ఆలౌటైంది. ఇబ్రహీం జద్రాన్ (74 బంతుల్లో 75; 10 ఫోర్లు, 1 సిక్స్), కెపె్టన్ హష్మతుల్లా (60 బంతుల్లో 51; 6 ఫోర్లు) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్ 4, షోరిఫుల్ ఇస్లామ్ 3 వికెట్లు తీశారు. మంగళవారం లాహోర్‌లో శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ గెలిస్తే మాత్రం బంగ్లాదేశ్‌తో కలిసి ఈ మూడు జట్లు రెండు పాయింట్లతో సమఉజ్జీగా నిలుస్తాయి. మెరుగైన రన్‌రేట్ ఉన్న రెండు జట్లు ‘సూపర్–4’ దశకు అర్హత సాధిస్తాయి. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: నయీమ్ (బి) ముజీబ్ 28; మెహదీ హసన్ మిరాజ్ (రిటైర్డ్‌హర్ట్) 112; తౌహిద్ (సి)జద్రాన్ (బి) గుల్బదిన్ 0; నజ్ముల్ (రనౌట్) 104; ముషి్ఫకర్ (రనౌట్) 25; షకీబ్ (నాటౌట్) 32; షమీమ్ (రనౌట్) 11; ఆఫిఫ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 334. వికెట్ల పతనం: 1–60, 2–63, 2–257 (మిరాజ్ రిటైర్డ్), 3–278, 4–294, 5–324. బౌలింగ్: ఫరూఖి 6–1–53–0, ముజీబ్ 10–0–62–1, గుల్బదిన్ 8–0–58–1, కరీమ్ 6–0–39–0, నబీ 10–0–50–0, రషీద్ ఖాన్ 10–1–66–0. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షోరిఫుల్ 1; జద్రాన్ (సి) ముష్ఫికర్ (బి) హసన్ 75; రహ్మత్ (బి) టస్కిన్ అహ్మద్ 33; హష్మతుల్లా (సి) హసన్ (బి) షోరిఫుల్ 51; నజీబుల్లా (బి) మిరాజ్ 17; నబీ (సి) ఆఫిఫ్ (బి) టస్కిన్ అహ్మద్ 3; గుల్బదిన్ (బి) షోరిఫుల్ 15; కరీమ్ (రనౌట్) 1; రషీద్ ఖాన్ (సి) షకీబ్ (బి) టస్కిన్ అహ్మద్ 24; ముజీబ్ (హిట్‌వికెట్) (బి) టస్కిన్ అహ్మద్ 4; ఫరూఖి (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (44.3 ఓవర్లలో ఆలౌట్) 245. వికెట్ల పతనం: 1–1, 2–79, 3–131, 4–193, 5–196, 6–212, 7–214, 8–221, 9–244, 10–245. బౌలింగ్: టస్కిన్ 8.3–0–44–4, షోరిఫుల్ 9–1–36–3, హసన్ 9–1–61–1, షకీబ్ 8–0–44–0, అఫిఫ్ 1–0–6–0, మిరాజ్ 8–0–41–1, షమీమ్ 1–0–10–0. -
శ్రీలంక భారీ స్కోరు
చిట్టగాంగ్: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో శ్రీలంక బ్యాట్స్‌మెన్ పరుగుల వరద పారిస్తున్నారు. కుశాల్ మెండిస్ (196; 22 ఫోర్లు, 2 సిక్స్‌లు), ధనంజయ డిసిల్వా (173; 21 ఫోర్లు 1 సిక్స్) భారీ శతకాలు నమోదు చేశారు. రోషన్ సిల్వా (87 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్) కెప్టెన్ చండిమాల్ (37 బ్యాటింగ్) రాణించడంతో శుక్రవారం ఆట ముగిసే సమయానికి లంక 3 వికెట్ల కోల్పోయి 504 పరుగులు చేసింది. ప్రస్తుతం బంగ్లా స్కోరుకు 9 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. ఓవర్‌నైట్ స్కోరు 187/1తో మూడోరోజు ఆట కొనసాగించిన మెండిస్, డిసిల్వా రెండో వికెట్‌కు 308 పరుగులు జోడించారు. అనంతరం ముస్తఫిజుర్ బౌలింగ్‌లో డిసిల్వా ఔట్ కాగా... మెండిస్ ద్విశతకానికి 4 పరుగుల దూరంలో తైజుల్ ఇస్లాంకు దొరికిపోయాడు. -
త్వరలో భారత్ తో సీరిస్.. బంగ్లా జట్టుకు షాక్
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెట్ వన్డే కెప్టెన్ మష్రఫే మోర్తాజా గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. మిర్పూర్ లో రోడ్డు ప్రమాదానికి గురయిన మోర్తాజా రెండు చేతులకు గాయాలయ్యాయి. బంగ్లా స్టేడియానికి జట్టు ట్రెయినింగ్ సెషన్ కోసం మోర్తాజా తన ఇంటి నుంచి రిక్షాలో బయలుదేరాడు. మార్గమధ్యలో ఓ బస్సు రిక్షాను ఢీకొట్టడంతో స్వల్పగాయాలతో బయటపడ్డాడు. మోర్తాజా ఆల్‌రౌండర్ గా కూడా జట్టుకు సేవల్ని అందించగల ఆటగాడు. ఒకవేళ మోర్తాజా కోలుకోకుంటే ఆ జట్టు కీపర్ స్థానాన్ని భర్తీచేయడానికి వేరొకరిని జట్టులోకి తీసుకోవాల్సి వస్తుంది. అయితే భారత్ తో ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే 3 మ్యాచ్ ల సీరిస్‌కు ముందు బంగ్లా కెప్టెన్ గాయాపాలవ్వడం ఆ జట్టుకు ప్రతికూలతగా మారనుంది. ట్రై సీరిస్ సమయానికి అతడు కోలుకోవచ్చునని బంగ్లా జట్టు మేనేజ్మెంట్ ఆశాభావం వ్యక్తం చేసింది. దురదృష్టవశాత్తూ మోర్తాజా గాయాలపాలయ్యాడని ఆ బంగ్లా కోచ్ చాందికా హతురసింఘా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశాడు.
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్‌లో..
Advertisement