Asia Cup 2023: గెలిచి నిలిచిన బంగ్లాదేశ్‌.. ‘సూపర్‌–4’ రేసులో | Sakshi
Sakshi News home page

Asia Cup 2023: గెలిచి నిలిచిన బంగ్లాదేశ్‌.. ‘సూపర్‌–4’ రేసులో

Published Mon, Sep 4 2023 1:09 AM

Bangladesh win by 89 runs against Afghanistan - Sakshi

లాహోర్‌: ఆసియా కప్‌ క్రికెట్‌ టోర్నీలో బంగ్లాదేశ్‌ జట్టు ‘సూపర్‌–4’ రేసులో నిలిచింది. లంకతో జరిగిన గ్రూప్‌ ‘బి’ తొలి మ్యాచ్‌లో 160 పైచిలుకు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడిన బంగ్లాదేశ్‌ అఫ్గానిస్తాన్‌పై మాత్రం చెలరేగి 89 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

ఓపెనర్‌ మెహదీ హసన్‌ మిరాజ్‌ (119 బంతుల్లో 112 రిటైర్డ్‌హర్ట్‌; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), మిడిలార్డర్‌లో నజ్ముల్‌ హోసేన్‌ షాంతో (105 బంతుల్లో 104; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కారు. దాంతో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ 50 ఓవర్లలో 5 వికెట్లకు 334 పరుగులు చేసింది.

వన్డేల్లో బంగ్లాదేశ్‌కిది మూడో అత్యధిక స్కోరు. ఓపెనర్‌ నయీమ్‌ (28), వన్‌డౌన్‌ బ్యాటర్‌ తౌహిద్‌ (0) నిరాశపరిచినప్పటికీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మిరాజ్, నజు్మల్‌ మూడో వికెట్‌కు 194 పరుగులు జోడించారు. అఫ్గాన్‌ బౌలర్లలో ముజీబ్, గుల్బదిన్‌ చెరో వికెట్‌ తీశారు. అనంతరం కష్టమైన లక్ష్యఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్‌ 44.3 ఓవర్లలో 245 పరుగుల వద్ద ఆలౌటైంది.

ఇబ్రహీం జద్రాన్‌ (74 బంతుల్లో 75; 10 ఫోర్లు, 1 సిక్స్‌), కెపె్టన్‌ హష్మతుల్లా (60 బంతుల్లో 51; 6 ఫోర్లు) రాణించారు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో టస్కిన్‌ అహ్మద్‌ 4, షోరిఫుల్‌ ఇస్లామ్‌ 3 వికెట్లు తీశారు. మంగళవారం లాహోర్‌లో శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ గెలిస్తే మాత్రం బంగ్లాదేశ్‌తో కలిసి ఈ మూడు జట్లు రెండు పాయింట్లతో సమఉజ్జీగా నిలుస్తాయి. మెరుగైన రన్‌రేట్‌ ఉన్న రెండు జట్లు ‘సూపర్‌–4’ దశకు అర్హత సాధిస్తాయి.
 
స్కోరు వివరాలు 
బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: నయీమ్‌ (బి) ముజీబ్‌ 28; మెహదీ హసన్‌ మిరాజ్‌ (రిటైర్డ్‌హర్ట్‌) 112; తౌహిద్‌ (సి)జద్రాన్‌ (బి) గుల్బదిన్‌ 0; నజ్ముల్‌ (రనౌట్‌) 104; ముషి్ఫకర్‌ (రనౌట్‌) 25; షకీబ్‌ (నాటౌట్‌) 32; షమీమ్‌ (రనౌట్‌) 11; ఆఫిఫ్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 334. వికెట్ల పతనం: 1–60, 2–63, 2–257 (మిరాజ్‌ రిటైర్డ్‌), 3–278, 4–294, 5–324. బౌలింగ్‌: ఫరూఖి 6–1–53–0, ముజీబ్‌ 10–0–62–1, గుల్బదిన్‌ 8–0–58–1, కరీమ్‌ 6–0–39–0, నబీ 10–0–50–0, రషీద్‌ ఖాన్‌ 10–1–66–0. 

అఫ్గానిస్తాన్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) షోరిఫుల్‌ 1; జద్రాన్‌ (సి) ముష్ఫికర్‌ (బి) హసన్‌ 75; రహ్మత్‌ (బి) టస్కిన్‌ అహ్మద్‌ 33; హష్మతుల్లా (సి) హసన్‌ (బి) షోరిఫుల్‌ 51; నజీబుల్లా (బి) మిరాజ్‌ 17; నబీ (సి) ఆఫిఫ్‌ (బి) టస్కిన్‌ అహ్మద్‌ 3; గుల్బదిన్‌ (బి) షోరిఫుల్‌ 15; కరీమ్‌ (రనౌట్‌) 1; రషీద్‌ ఖాన్‌ (సి) షకీబ్‌ (బి) టస్కిన్‌ అహ్మద్‌ 24; ముజీబ్‌ (హిట్‌వికెట్‌) (బి) టస్కిన్‌ అహ్మద్‌ 4; ఫరూఖి (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (44.3 ఓవర్లలో ఆలౌట్‌) 245. వికెట్ల పతనం: 1–1, 2–79, 3–131, 4–193, 5–196, 6–212, 7–214, 8–221, 9–244, 10–245. బౌలింగ్‌: టస్కిన్‌ 8.3–0–44–4, షోరిఫుల్‌ 9–1–36–3, హసన్‌ 9–1–61–1, షకీబ్‌ 8–0–44–0, అఫిఫ్‌ 1–0–6–0, మిరాజ్‌ 8–0–41–1, షమీమ్‌ 1–0–10–0.  

Advertisement
Advertisement