-
చూసొద్దాం.. రండి
హిందూపురం నుంచి గౌరిబిదనూరుకు వెళ్లేదారిలో తొలి స్టేజ్‌లోనే బసవన్నపల్లి గ్రామం వస్తుంది. ఇక్కడ సుమారు 200 అడుగుల ఎత్తున ఉన్న భారీ శివుడి రూపాన్ని చూడవచ్చు. రోడ్డు పక్కనే ఉన్న ఈ ఆలయంలో నీలపు ఛాయతో తపోదీక్షలో ఉన్న శివుడి విగ్రహాన్ని చూడగాన్నే భక్తిభావంతో మనసు పరవశించిపోతుంది. ఈ విగ్రహం ఎదుట భారీ రూపంలో ఉన్న నంది, చుట్టూ వివిధ ఆకృతుల్లో ఉన్న వందలాది శివలింగాలు ఉంటాయి. నిత్యపూజలతో శోభాయమానంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి పండుగకూ ఇక్కడ విశేష పూజలు ఉంటాయి. ఇక మహా శివరాత్రి నాడు చెప్పనలవి కాదు. కార్తీక మాసంలో వేకువ జాము, సాయంత్రం వేళల్లో దీపాలను వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకుంటుంటారు. ఆ మాసంలో జరిగే లక్ష దీపార్చన చూసేందుకు రెండు కనులు చాలవు. ఈ ఆలయాన్ని సందర్శించాలంటే జిల్లా కేంద్రం అనంతపురం నుంచి 123 కిలోమీటర్లు ప్రయాణించి హిందూపురం మీదుగా మరో ఐదు కిలోమీటర్లు గౌరిబదనూరు మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. - హిందూపురం అర్బన్ -
బతుకు చూపిన ‘పాడి’
వర్షాభావ పరిస్థితులు వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసింది. పంట పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక అన్నదాతలు మానసికంగా నలిగిపోయారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్ట లేకపోయింది. పంట సాగు తప్ప మరో పని చేతకాని రైతన్నలు ప్రత్యామ్నాయ రంగాలపై దృష్టి సారించారు. వ్యవసాయానికి అనుబంధంగా ఉండే పాడిపోషణ వైపు ఆసక్తి పెంచుకున్న అన్నదాత... ఆర్థికంగా బలపడుతూ వచ్చాడు. తనతో పాటు మరికొన్ని కుటుంబాలకు బతుకు చూపుతున్నాడు. - లేపాక్షి (హిందూపురం) లేపాక్షి మండలం కంచిసముద్రం పంచాయతీ పరిధిలోని కె.బసవనపల్లి రైతులు పాడిపరిశ్రమలో రాణిస్తున్నారు. 76 కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో ప్రతి కుటుంబానికి మూడు, నాలుగు పాడి ఆవులు ఉన్నాయి. ఈ ఒక్క గ్రామం నుంచే ప్రతి రోజూ ఉదయం 400 లీటర్లు, సాయంత్రం మరో 450 లీటర్ల పాలు డెయిరీలకు చేరుతోంది. ప్రభుత్వ ప్రోత్సహం లేకున్నా.. కె.బసవనపల్లిలోని 90 శాతం మంది పాడి పరిశ్రమనే జీవనాధారంగా చేసుకున్నారు. ప్రత్యేక శ్రద్ధతో మేలుజాతి పాడి ఆవులను కొనుగోలు చేసి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్లో ఉంచుతున్నారు. తరచూ వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయిస్తుంటారు. పోషకాహారమైన దాణాతో పాటు పచ్చిగడ్డిని అందజేస్తున్నారు. పాడి ఆవుల పెంపకం చేపట్టిన తర్వాతనే గ్రామంలోని రైతులు ఆర్థికంగా బలపడుతూ వచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఏ మాత్రం ఆశించకుండా స్వయం కృషితో అనూహ్యమైని విజయాలను ఇక్కడి రైతులు సొంతం చేసుకుంటున్నారు. పితికిన పాలను అలాగే డెయిరీలకు తరలిస్తుంటారు. అంతేకాక ఆ పాలలో ఎల్ఆర్, ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ శాతాలను పరిశీలించేందుకు రైతులు సొంతంగా ఓ ఎనలైజర్నే ఏర్పాటు చేసుకున్నారు. పాడి ఆవులే ఉపాధి మా ఇంటిలో ఉన్న ఐదుగురుమూ పాడి పోషణపై ఆధారపడి ఉన్నాం. తొమ్మిది ఆవులు, మూడు లేగదూడలు ఉన్నాయి. వాటి బాగోగులు చూడడం, స్నానాలు చేయించడం రోజూ వారి పనిగా పెట్టుకున్నాం. తరచూ వైద్య పరీక్షలు చేయిస్తుంటాం. తొమ్మిది ఆవుల నుంచి రోజూ 140 లీటర్ల పాలు సేకరిస్తున్నాం. దీని ద్వారా రోజూ రూ. 3వేలు ఆదాయం వస్తే అందులో నుంచి పశుగ్రాసం, దాణా కోసం రూ. 1,500 పోతోంది. – అశ్వత్థప్ప, బసవనపల్లి పశుగ్రాసం కొరతగా ఉంది నా వద్ద రెండు పాడి ఆవులు, రెండు లేగదూడలు ఉన్నాయి. ప్రతి రోజూ పది లీటర్ల పాలను డెయిరీకి అందజేస్తున్నాను. పితికిన పాలను అలాగే తీసుకెళుతుంటాను. పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంది. ఈ సమస్య లేకుంటే ఇంకా మంచి ఆదాయం ఉంటుంది. – శ్రీనివాసులు, బసవనపల్లి
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
ఎండగంట పడకుండా..
పోలింగ్ నిబంధనలు పాటించాల్సిందే..
తస్మాత్ జాగ్రత్త
పురాతన చరిత్ర నిడదవోలు సొంతం
నేడు ప్రధాని మోదీ రాక
పోస్టల్ బ్యాలెట్.. రైట్‌రైట్
పూలవనం..గోదారి సోయగం..
అర్ధర్రాతి నల్గొండలో భారీ వర్షం (ఫొటోలు)
అక్కరకురాని సుట్టాలెందుకు.. కాంగ్రెస్, బీజేపీపై కేటీఆర్ సెటైర్లు
తప్పక చదవండి
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement