-
యాదాద్రి భువనగిరి జిల్లా భీమనపల్లిలో కల్తీ పాల కలకలం
-
ఆషాఢంలో ఇంటికి వస్తున్నాడని అల్లుడి హత్య
సాక్షి, అమలాపురం టౌన్: ఆషాఢ మాసంలో తరచుగా తమ ఇంటికి వస్తున్నాడన్న కోపంతో అల్లుడిని హత్య చేసిన మామకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అల్లుడిని హత్య చేశాడన్న నేరం రుజువు కావడంతో తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం భీమనపల్లికి చెందిన లోకినెడి అక్కిరాజు(మామ)కు జీవిత ఖైదు, రూ.రెండు వేలు జరిమానా విధిస్తూ అమలాపురం రెండో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి బీఎస్వీ హిమబిందు బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. భీమనపల్లి శివారు సంత మార్కెట్ ప్రాంతానికి చెందిన అక్కిరాజు, తన అల్లుడైన ముమ్మిడివరం మండలం క్రాప చింతలపూడికి చెందిన అమలదాసు సత్తి బాబును హత్య చేశాడు. ఆషాఢ మాసంలో అత్తవారింటికి తరచూ రావద్దని పదేపదే చెప్పినా వినకపోవడంతో కోపంతో 2015 జూలై 8న అల్లుడిని కోళ్లను కోసే కత్తితో నరికాడు. అప్పటికి అతడి భార్య దుర్గాభవాని 9వ నెల గర్భిణి. ఈ కేసును అప్పటి ఉప్పలగుప్తం ఏఎస్ఐ బి.జనార్దన్ నమోదు చేయగా రూరల్ సీఐ జి. దేవకుమార్ దర్యాప్తు చేశారని ఉప్పలగుప్తం ఎస్సై బి.రామకృష్ణ తెలిపారు. పీపీ అజయ్‌కుమార్ ప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపించారు. -
మితిమీరిన వేగం..మృత్యుపాశం
కొత్తపేట / ఉప్పలగుప్తం / అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ :కొత్తపేట మండలం మోడేకుర్రు శివారు గొలకోటివారిపాలెం వద్ద ఆదివారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి శివారు తాడిచెరువుగట్టు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ చాట్ల దుర్గారావు (40) అతని భార్య దుర్గ (35), కుమార్తె చిట్టి (3), తల్లి నాగరత్నం (పాపమ్మ) (60), పినతల్లి నాగమణి (45), పినతండ్రి కొడుకు బాలకృష్ణ (35), అన్న కుమారుడు నాని (10), అక్క నేదునూరి మంగ (45), పినతండ్రి చాట్ల వెంకటేశ్వరరావు(45) విగతజీవులయ్యారు. దుర్గారావు మరో కుమార్తె జ్యోతి (5), వెంకటేశ్వరరావు కుమారుడు పల్లయ్య గాయాలతో బయటపడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. దుర్గారావు ఆటోను అతివేగంగా నడపడంతో పాటు సెల్ఫోన్లో మాట్లాడడమే ఈ మృత్యుహేలకు మూలకారణమని ప్రమాదాన్ని చూసిన వారు అంటున్నారు. ఈ విషాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ముహూర్తం వేళకు చేరాలన్న ఆత్రంతో ముప్పు.. ఆటో డ్రైవర్ దుర్గారావు చెల్లెలు లంక పార్వతిది రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడు. ఆమెకు ఇటీవల ఆడబిడ్డ పుట్టింది. ఆ పాపకు మీదు (పై) పళ్లు వచ్చాయి. అలా రావడం మేనమేమకు దోషమన్న నమ్మకంతో శాంతి చేయించాలనుకున్నారు. ఆదివారం ఉదయం 9.10 గంటలకు అందుకు ముహూర్తంగా నిర్ణయించారు. ఆ వేడుకకు కుటుంబసభ్యులను, రక్తసంబంధీకులను తీసుకుని తాడిచెరువుగట్టు నుంచి బయల్దేరిన దుర్గారావు ముహూర్తం వేళకు ముమ్మిడివరప్పాడు చేరుకోవాలన్న ఆరాటంతో ఆటోను అతివేగంగా నడిపాడు. గొలకోటివారిపాలెం వచ్చేసరికి ముందు వెళుతున్న అమలాపురం- రాజమండ్రి ఆర్టీసీ బస్సు ప్రయాణికులు దిగేందుకు ఆగింది. అతివేగంగా ఆటోను నడుపుతూనే సెల్ఫోన్లో మాట్లాడుతున్న దుర్గారావు బస్సును తప్పించే ప్రయత్నం చేయగా.. ఆటో రోడ్డుపై తిరగబడింది. అదే సమయంలో రావులపాలెం నుంచి ముక్కామల వైపు కొబ్బరి లోడుతో వెళుతున్న ఐషర్‌వ్యాన్ ఆటోను బలంగా ఢీకొని కొన్నిమీటర్ల దూరం ఈడ్చుకుపోయి రోడ్డు పక్కనే ఉన్న తురాయి చెట్టు, వంతెనగోడల మీదికి దూసుకుపోయింది. ఆటో.. వ్యానుకు, చెట్టు, వంతెన గోడలకు మధ్య ఇరుక్కుని నుజ్జయిపోగా దుర్గారావు, దుర్గ, నాగరత్నం, నాగమణి,బాలకృష్ణ, నాని, మంగ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ వెంకటేశ్వరరావు, చిట్టి, పల్లయ్యలను రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చిట్టి, వెంకటేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా దారిలో మరణించారు. పల్లయ్య రాజమండ్రిలో చికిత్స పొందుతుండగా.. స్వల్పగాయాలతో బయటపడ్డ జ్యోతిని కొత్తపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అనంతరం బంధువులు తీసుకుపోయారు. ఈ ఘోర ప్రమాదంతో అటు తాడిచెరువుగట్టు గ్రామంలో ఇటు ముమ్మిడివరప్పాడులో విషాదం అలముకుంది. బాధితులకు నేతల పరామర్శ అమలాపురం ఎంపీ జి.వి.హర్షకుమార్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, కొత్తపేట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ చిర్ల జగ్గిరెడ్డి ఈ విషాద సంఘటన పట్ల సంతాపం వ్యక్తం చేశారు. గొలకోటివారిపాలెం, కొత్తపేట ప్రభుత్వాస్పత్రులకు వచ్చి మృతదేహాలను పరిశీలించారు. రోదిస్తున్న బంధువులను ఊరడించారు. రావులపాలెం సీఐ సుధాకర్, ఎస్సై ఎ.బాలాజీ ప్రమాద వివరాలను నాయకులకు వివరించారు. కాగా కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి వచ్చిన అమలాపురం ఆర్డీవో సీహెచ్ ప్రియాంకను కోనసీమ మాదిగ దండోరా నాయకులు ఘెరావ్ చేసి, మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా తాడిచెరువుగట్టులో మృతుల బంధువులను వివిధ పార్టీల నాయకులు పరామర్శించారు. వ్యాను వేగమూ ప్రమాద తీవ్రతకు కారణం.. ప్రమాద తీవ్రతకు ఆటో.. వ్యానుకు, తురాయి చెట్టు, వంతెన గోడలకు మధ్య ఇరుక్కుపోవడమే కారణమని స్థానికులు అంటున్నారు. చెట్టు, వంతెన గోడల మధ్య ఇరుక్కోకుంటే.. వ్యాను ఈడ్చుకుపోయిన ఆటో కాలువలో పడి, ఇంత ప్రాణనష్టం జరిగి ఉండేది కాదని అంటున్నారు. అలాగే ఆటో తిరగబడిన సమయంలో వ్యాను అతివేగంతో రావడం కూడా ఇంత ఘోరానికి కారణమంటున్నారు. ప్రమాద స్థలం గొలకోటివారిపాలెంతో పాటు సమీప గ్రామాలకు ముఖ్యకూడలి. రోజూ అదే సమయంలో ఎందరో విద్యార్థులు బస్సు ఎక్కేందుకు అక్కడ వేచి ఉంటారు. అయితే ఆదివారం కావడంతో ఆ కూడలి దాదాపు నిర్జనంగా ఉంది. లేకుంటే ఈ దుర్ఘటన మరింత విషాదానికి కారణమయ్యేది. ఏడీ నాన్న అంటే.. ఏం చెప్పేది? ‘ఒడిలో బిడ్డ.. కడుపులో బిడ్డ.. రేపు వీళ్లిద్దరూ.. ‘అమ్మా! నాన్న ఎక్కడ?’ అంటే నేనేమి చెప్పేది భగవంతుడా!’ అని తాడిచెరువుగట్టుకు చెందిన కుమారి గుండెలవిసేలా రోదిస్తోంది. గొలకోటివారిపాలెం వద్ద జరిగిన ప్రమాదంలో మరణించిన బాలకృష్ణ ఆమె భర్త. వారికి రెండేళ్ల కుమార్తె ఉండగా ప్రస్తుతం కుమారి గర్భిణి. ఆడపడుచు ఇంట జరిగే వేడుకకు కుమారి కూడా వెళ్లాల్సి ఉన్నా ఆదివారం కావడంతో చర్చికి వెళ్లాలని ఆగిపోయింది. బాలకృష్ణ అన్న శ్రీను హైదరాబాద్‌లో ఉంటుండగా.. అతడి కుమారుడు నాని చిన్నాన్న వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. ఆదివారం సెలవు కావడంతో చిన్నాన్న వెంట బయల్దేరిన నాని కూడా మృత్యువాత పడ్డాడు. నాన్న ఇక రాడమ్మా..! ప్రమాదంలో మరణించిన వెంకటేశ్వరరావు భార్య మంగ ఉపాధి నిమిత్తం రెండు నెలల క్రితం కువైట్ వెళ్లింది. వారి కుమార్తెలు రాజ్యలక్ష్మి, ప్రమిత గొల్లవిల్లి సాంఘిక సంక్షేమ వసతిగృహంలో ఉండి చదువుకుంటున్నారు. రాజ్యలక్ష్మి పదో తరగతి పరీక్షలు రాస్తోంది. పెద్ద కుమారుడు హైదరాబాద్‌లో ఉంటుండగా చిన్నవాడైన పల్లయ్య తండ్రితో వేడుకకు బయల్దేరి గాయాల పాలయ్యాడు. జరిగిన ఘోరం తెలిసి హాస్టల్ నుంచి వచ్చిన రాజ్యలక్ష్మి, ప్రమిత.. ఒకరిని పట్టుకుని ఒకరు గోలుగోలును విలపించారు. ‘అమ్మా.. నాన్న మనకిక లేడమ్మా.. తిరిగి రాడమ్మా’ అంటూ రోదిస్తుంటే అందరి హృదయాలూ బరువెక్కాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్‌లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్‌కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement