-
కాంస్యంతో సరిపెట్టుకున్న శివ
దోహా: ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో ఆకట్టుకుంటూ సెమీ ఫైనల్ వరకూ వెళ్లిన భారత యువ బాక్సర్ శివ థాపా కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. 56 కేజీల విభాగంలో పోటీపడ్డ శివ థాఫా సోమవారం జరిగిన సెమీ ఫైనల్ పోరులో 1-2 తేడాతో ఉజకిస్థాన్ బాక్సర్ మురోద్జోన్ అఖ్మాదాలీవ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. ఈరోజు పోరులో తృటిలో విజయాకాశాన్ని కోల్పోయినా.. రియో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ రేస్ లో మాత్రం నిలిచాడు. మరో సెమీ ఫైనల్లో ఓటమి పాలైన దిమిర్తీ అసునౌ తో జరిగే పోరులో శివ థాఫా విజయం సాధిస్తే రియోకు అర్హత సాధించే అవకాశం ఉంది. ఈ కేటగిరి నుంచి ముగ్గురు బాక్సర్లను అక్టోబర్ 15వ తేదీన రియో ఒలింపిక్స్ కు ఎంపిక చేయనున్నారు. అంతకుముందు శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో శివ థాపా 3-0తో హకన్ ఎర్సెకర్ (ఖతార్)పై గెలుపొంది పతకం ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే.దీంతో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గిన మూడో భారతీయ బాక్సర్‌గా శివ థాపా గుర్తింపు పొందాడు. గతంలో విజేందర్ సింగ్ (2009), వికాస్ కృషన్ (2011) కాంస్య పతకాలు సాధించారు. -
శభాష్... శివ
దోహా: తన పవర్ పంచ్ చాటుకుంటూ భారత యువ బాక్సర్ శివ థాపా ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. 56 కేజీల విభాగంలో పోటీపడుతున్న ఈ అస్సాం బాక్సర్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని సొంతం చేసుకునే అవకాశాన్ని సృష్టించుకున్నాడు. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో శివ థాపా 3-0తో హకన్ ఎర్సెకర్ (ఖతార్)పై గెలుపొందాడు. ఈ విజయంతో శివ థాపా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గిన మూడో భారతీయ బాక్సర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో విజేందర్ సింగ్ (2009), వికాస్ కృషన్ (2011) కాంస్య పతకాలు సాధించారు. మురద్జోన్ అఖమదలీవ్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగే సెమీఫైనల్లో శివ థాపా గెలిస్తే... వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందడంతోపాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకున్న తొలి భారతీయ బాక్సర్‌గా కొత్త చరిత్ర సృష్టిస్తాడు. మరోవైపు వికాస్ కృషన్ (75 కేజీలు) పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. హోసమ్ అబ్దిన్ (ఈజిప్టు)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో వికాస్ 0-3తో ఓడిపోయాడు.
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్‌స్టర్‌తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్‌లో..
కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
373 మంది గైర్హాజరు
●భారీగా తగ్గిన దిగుబడులు
డిమాండ్ ఉండే సమయానికి కాయలు రాలేదు
జిల్లా వ్యాప్తంగా నాయకులకు బహిష్కరణ నోటీసులు
ఖరీఫ్ కార్యాచరణ అమలుకు సమాయత్తం కావాలి
ఏసీఏ జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ నియామకం
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
ఎల్ అండ్ టి ఫైనాన్స్ లిమిటెడ్ హైదరాబాద్‌లో పూర్తి గృహ రుణాన్ని ప్రారంభించింది
రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్లు
తప్పక చదవండి
- విజయ్ సరసన హీరోయిన్గా ఛాన్స్.. చేయనని ఏడ్చేసిన బాలీవుడ్ బ్యూటీ
- మహిళా యూట్యూబర్ అరెస్టు
- సచిన్, గవాస్కర్ కాదు.. అతడే నా ఫేవరెట్: కేంద్ర మంత్రి జైశంకర్
- అల్లుడు హైడ్రామా..!
- సాయి రాజేష్ పాము లాంటి వ్యక్తి.. గాయత్రి సెన్సేషనల్ కామెంట్స్
- ‘బోట్ నెట్’పై ఎఫ్‌బీఐ గురి.. చైనా పౌరుడు అరెస్ట్
- Aditi Dugar: జీరో టు.. మ.. మ.. మాస్క్ వరకు!
- ప్రియుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య
- వెండే బంగారమాయెగా..
- Lok Sabha Election 2024: బీజేపీకి 295 –305 సీట్లు, కాంగ్రెస్‌కు 55–65 సీట్లు
Advertisement