-
వైభవంగా గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లి!
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కూతురి వివాహం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ పెళ్లి కోసం ఏకంగా రూ. 500 కోట్ల ఖర్చు చేయనున్నారనే వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఎలా ఖర్చుచేస్తారనే విషయంపైనా కథనాలు వస్తున్నాయి. గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మాణీ వివాహం హైదరాబాద్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పాణ్యం విక్రమ్ దేవరెడ్డి, రమాదేవి దంపతుల కుమారుడు రాజీవ్ రెడ్డితో ఈ నెల 16న బెంగళూరులో జరగనున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ పెళ్లికి ఆహ్వానిస్తూ గతంలో పంచిన శుభలేఖలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఈ పెళ్లి శుభలేఖ బాక్స్‌లో ఎల్ఈడీ స్క్రీన్ ఉండటం, బాక్స్ తెరువగానే.. అందులో గాలి జనార్దన్ రెడ్డి కుటుంబంపై చిత్రీకరించిన పెళ్లిపాట ఉండటం.. అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ వెరైటీ పెళ్లికార్డు ఒక్కోదానికి రూ. ఎనిమిదివేల వరకు ఖర్చు అయినట్టు కథనాలు వచ్చాయి. ఇప్పుడు దేశమంతా నగదు బదిలీ వ్యవహారంలో మునిగిపోయిన సమయంలో ఏకంగా రూ. 500 కోట్లతో గాలి జనార్దన్ రెడ్డి కూతురు పెళ్లి వేడుకను నిర్వహించనున్నట్టు కథనాలు వస్తున్నాయి. శ్రీ కృష్ణదేవరాయలకు చెందిన విజయనగర ప్యాలెస్‌ను పెండ్లిమండపంగా వేస్తారని, తిరుమల తిరుపతి దేవస్థానం పూజరులను ఈ పెళ్లి వేడుక నిర్వహించేందుకు పిలిచారని తెలుస్తోంది. అంతేకాకుండా గాలి జనార్దన్‌రెడ్డి చిన్ననాటి ఇంటిని పునర్నిర్మించి అందులోనే వరుడికి వధువు అప్పగింతల కార్యక్రమం చేపడతారని సమాచారం. అంతేకాకుండా బాలీవుడ్ ప్రముఖులు షారుఖ్ ఖాన్, ప్రభుదేవ, టాలీవుడ్ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకలో ప్రదర్శన ఇస్తారని కథనాలు వస్తున్నాయి. -
ఒక్కో వెడ్డింగ్ కార్డు ఖరీదు రూ.8వేలు!
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఆయన కుమార్తె బ్రహ్మాణీ వివాహం హైదరాబాద్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పాణ్యం విక్రమ్ దేవరెడ్డి, రమాదేవి దంపతుల కుమారుడు రాజీవ్ రెడ్డితో ఈ నెల 16న బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బళ్లారి హవంబావిలోని జనార్దన్ రెడ్డి నివాసంలో పెళ్లి కార్యక్రమాలు మొదలయ్యాయి. సోమవారం ఇంటిముందు పెళ్లి పందిరి నిర్మించారు. గాలి జనార్దనరెడ్డి, ఆయన సతీమణి లక్ష్మీఅరుణ, కుమారుడు కిరీటిరెడ్డి, పెళ్లికూతురు బ్రహ్మణీలతోపాటు గాలి సోమశేఖరరెడ్డి, ఆయన సతీమణి విజయ తదితరులు పూజలో పాల్గొన్నారు. ఆకాశమంత పందిరి వేసి.. భూదేవంత అరుగువేసి అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు జరిపించారనే నానుడి వింటుంటాం. అంతగా కాకపోయినా తమ రేంజ్‌కు తగ్గట్టుగా తల్లిదండ్రులు తమ బిడ్డల వివాహాలు జరిపిస్తుంటారు. గాలి జనార్దన్ రెడ్డి కూడా తన కూతురు వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన కూతురు పెళ్లి ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెడ్డింగ్ కార్డుతో పాటు ఖరీదైన వెండి వినాయకుడి విగ్రహం, డ్రై ప్రూట్స్ తదితర సరంజామాను ఓ బాక్స్ లో పొందుపరిచి బంధుమిత్రులకు అందజేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వెడ్డింగ్ కార్డు ఒక్కొక్కదానికి సుమారు రూ. ఏడు నుంచి ఎనిమిదివేల వరకూ ఖర్చు అయినట్లు భోగట్టా. వినూత్నంగా తయారు చేయించిన ఈ వెడ్డింగ్ బాక్సులో పెళ్లి పిలుపుతో పాటు ప్రత్యేకంగా ఎల్సీడీ స్క్రీన్ ఏర్పాటుచేశారు. బాక్స్ తెరవగానే గాలి జనార్దన్ రెడ్డి కుటుంబసభ్యులు ఉన్న వివాహ పాట మొదలవుతోంది. నిమిషం నిడివిగల ఆ వీడియోలో 'అతిథిదేవోభవా..' అంటూ జనార్దన్ రెడ్డి, ఆయన సతీమణి, కుమారుడితోపాటు వధూవరులిద్దరూ కనిపిస్తారు. పెళ్లికి తరలిరావాల్సిందిగా ఆహ్వానిస్తున్న గాలి జనార్దన్ కుటుంబం ఆ వీడియోలో కనిపిస్తుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్‌తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
రోడ్డు ప్రమాదంలో నవ వరుడు దుర్మరణం
ఏటా కోటి ఉద్యోగాల భర్తీ ఏమైంది?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement