-
‘పంచె’ చిచ్చు!
సాక్షి, చెన్నై : తమిళ సంప్రదాయం పంచెకట్టుకు వ్యతిరేకంగా చెన్నై క్రికెట్ క్లబ్లో చోటు చేసుకున్న వ్యవహారం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పంచె కట్టును వ్యతిరేకించడమే కాకుండా, బాధ్యత గల పదవి లో ఉన్న న్యాయమూర్తి, న్యాయవాదుల్ని బయటకు గెంటివేయడాన్ని న్యాయలోకం, తమిళాభిమాన సం ఘాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఆ క్లబ్ భరతం పట్టడంతో పాటుగా తమిళ సంప్రదాయానికి వ్యతిరేకంగా వ్యవహరించే సంస్థలు, స్టార్ హోటళ్లతో ఢీ కొట్టేందుకు రెడీ అయ్యాయి. ముట్టడికి యత్నం తమిళర్ వాల్వురిమై కట్చి నేత వేల్మురుగన్ ఆదేశాలతో ఆ పార్టీ నేత వేణుగోపాల్ నేతృత్వంలో సుమారు వంద మంది కార్యకర్తలు ఉదయాన్నే పంచె కట్టుతో చేపాక్కంలో ప్రత్యక్షం అయ్యారు. తమ పార్టీ జెండాలను చేత బట్టి చేపాక్కంలోని చెన్నై క్రికెట్ క్లబ్‌లోకి చొరబడే యత్నం చేశారు. దీంతో అక్కడి భద్రతా సిబ్బంది అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. పరస్పరం వాగ్యుద్ధానికి దిగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసు వల యాన్ని తోసుకుంటూ ఆ క్లబ్‌లోకి వెళ్లడానికి ఆందోళనకారులు యత్నించారు. చివరకు పోలీసులు వారందరినీ బలవంతంగా అరెస్టు చేయడానికి యత్నించడంతో స్వల్ప తోపులాట, ఉద్రిక్తత చోటు చేసుకుం ది. ఎట్టకేలకు వారందరినీ అరెస్టు చేశారు. తమిళర్ వాల్వురిమై బాట లో మరికొన్ని సంఘాలు ప్రయత్నిం చినా, మార్గం మధ్యలోని వారిని పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టుల తో నిరసన ఆగదని, ఆ క్లబ్ భరతం పట్టి తీరుతామంటూ తమిళాభి మాన సంఘాలు హెచ్చరించాయి. కోర్టుకు : తమిళ సంప్రదాయా న్ని కించపరిచే విధంగా వ్యవహరించిన క్రికెట్ క్లబ్‌పై కోర్టుకు వెళ్లేందుకు సీనియర్ న్యాయవాది గాంధీ నిర్ణయించారు. ఆ క్లబ్ గెంటి వేసిన బాధితుల్లో సీనియర్ న్యాయవాది గాంధీ, స్వామినాథన్ కూడా ఉన్నారు. ఆ పుస్తక కార్యక్రమానికి ఆటంకం కలగకూడదన్న ఒకే ఒక్క కారణంతో ఆ రోజున ఆ క్లబ్ నుంచి మౌనంగా బయటకు రావాల్సి వచ్చిందన్నారు. ఆంక్షలను పక్కన పెట్టి, కనీసం తమ హోదాకు మర్యాదైనా ఇవ్వాల్సి ఉందని, ఇందుకు భిన్నంగా నడుచుకున్నారని మండి పడ్డారు. ఆ క్లబ్ నిర్వాకాన్ని విడిచి పెట్టే ప్రసక్తే లేదని, తమిళ సంప్రదాయం పంచెకట్టుకు వ్యతిరేకంగా వ్యవహరించిన క్రికెట్ క్లబ్‌ను కోర్టు మెట్లు ఎక్కిస్తానంటూ గాంధీ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి పిటిషన్ దాఖలు చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలిపారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్‌తోపాటుగా మరికొన్ని రాజకీయ పక్షాలు పంచెకట్లు పరాభవం మీద స్పందించాయి. చెన్నై క్రికెట్ క్లబ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, డ్రెస్ కోడ్ వంటి ఆంక్షలను తమిళనాడులో రద్దు చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమర్థింపు : పంచెకట్టుకు ఎదురైన పరాభవాన్ని క్రికెట్ క్లబ్ సమర్థించుకుంది. ఆ సంఘం కార్యదర్శి కాశీ విశ్వనాథన్ పేర్కొంటూ, తమ క్లబ్ ఆంక్షలు నిన్న మొన్న పెట్టినవి కాదని వివరించారు. ఏళ్ల తరబడి అనుసరిస్తున్న తమ ఆంక్షలను ఎలా మార్చుకోమంటారని ఎదురు ప్రశ్న వేశారు. తమ క్లబ్లో ఏదేని ప్రైవేటు కార్యక్రమం జరపదలచిన పక్షంలో, ఆ నిర్వాహకులకు ముందుగానే ఆంక్షల వివరాలను తెలియజేస్తామన్నారు. తమ ఆంక్షలు, డ్రెస్ కోడ్‌ను సంబంధిత పుస్తకావిష్కరణ నిర్వాహకులకు తెలియజేసినట్లు వివరించారు. వారు తమ ఆహ్వానితులకు ఆ వివరాలు తెలియజేయనప్పుడు తామెలా బాధ్యులు అవుతామంటూ ఆయన ప్రశ్నించారు. -
‘పంచె’ కట్టుకు పరాభవం
సాక్షి, చెన్నై: తమిళనాడు సంప్రదాయ వస్త్రధారణ ‘పంచె’ కట్టుకు పరాభవం ఎదురైంది. పంచెకట్టుతో వచ్చిన న్యాయమూర్తి, న్యాయవాదులను లోనికి అనుమతించకుండా చెన్నై క్రికెట్ క్లబ్ నిర్వాహకులు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అయింది. పీఎంకే నేత రాందాసు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు. పంచె కట్టు తమిళ సంప్రదాయానికి ప్రతీక. ఈ సంప్రదాయాన్ని గౌరవించే విధంగా ఁపంచెరూ. దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వారంలో ఓ రోజు కొన్ని విభాగాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు పంచె కట్టుతో విధులకు హాజరయ్యే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పక్షాల నాయకులు పంచె కట్టులోనే దర్శనం ఇస్తుంటారు. యూపీఏ -2 అధికారంలోకి వచ్చిన సమయంలో తమిళ సంప్రదాయానికి వన్నె చేకూర్చే విధంగా డీఎంకే ఎంపీలు పంచెకట్టుతో ఢిల్లీ వేదికగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భం ఉంది. పపంచ అత్యున్నత న్యాయ స్థానం ఐక్యరాజ్య సమితిలో పీఎంకే అధ్యక్షుడు జికే మణి పంచెకట్టుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విదేశాల నుంచి వచ్చేవారు తమిళ సంప్రదాయం మీద మక్కువ చూపుతున్న తరుణంలో ఆధునిక నాగరికత చెన్నైలో విశ్వరూపం దాల్చుతున్నట్టుగా కొన్ని సంఘటనలు ఇటీవల వెలుగు చూస్తున్నాయి. డ్రెస్ కోడ్ : చెన్నైలోని అనేక స్టార్ హోటళ్లు, క్లబ్‌లు డ్రెస్ కోడ్ అమలుచేస్తున్నాయి. ప్యాంట్, టీ షర్టు, సూటు కోటుల్ని తప్పని సరి చేశాయి. తమ హోటల్‌కు తగ్గట్టుగా డ్రెస్ కోడ్‌తో వచ్చే వారిని మాత్రమే లోనికి అనుమతించే పనిలో పడ్డాయి. తమిళ సంస్కృతి పరిరక్షణా నినాదంతో ప్రభుత్వం, తమిళాభిమానులు ముందుకు సాగుతున్న సమయంలో పాశ్చాత్య సంస్కృతిని హోటళ్లు, క్లబ్‌లు తెర మీదకు తెస్తుండడం విమర్శలకు దారి తీస్తోంది. ఈ డ్రెస్ కోడ్ కొన్ని సందర్భాల్లో వివాదాలకు దారి తీసినా, వెలుగులోకి మాత్రం రావడం లేదు. అయితే, తాజాగా పంచె కట్టుకు పరాభవం ఎదురు కావడంతో తమిళాభిమానుల్లో ఆగ్రహం రేగుతోంది. పరాభావం : చెన్నై చేపాక్కం స్టేడియం సమీపంలో తమిళనాడు క్రికెట్ క్లబ్ ఉంది. ఆంగ్లేయుల హయాంలో ఏర్పాటు చేసిన ఈ క్లబ్లో నేటికీ, బ్రిటీషు వారి పెత్తనం సాగుతోంది. ఆంగ్లేయులు పెట్టిన ఆంక్షలు ఇక్కడ అమల్లో ఉండడం ఇందుకు నిదర్శనం. ఈ పరిస్థితుల్లో శుక్రవారం ఈ క్లబ్లో ఓ ప్రైవేటు పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొనేందుకు హైకోర్టు న్యాయమూర్తి హరి పరందామన్, సీనియర్ న్యాయవాదులు గాంధీ, స్వామినాథన్‌లకు ఆహ్వానం అందింది. వీరంతా వేర్వేరుగా శుక్రవారం సాయంత్రం ఆ క్లబ్ వద్దకు చేరుకున్నారు. అయితే, అక్కడి సిబ్బంది వీరిని అడ్డుకున్నారు. పంచె కట్టుతో వచ్చినవారిని లోనికి అనుమతించే ప్రసక్తే లేదని క్లబ్ నిర్వాకులు, సిబ్బంది స్పష్టం చేశారు. తాము న్యాయమూర్తులమని, సీనియర్ న్యాయవాదులమని చెప్పుకున్నా, పంచె కట్టు అడ్డు రావడంతో వెను దిరగాల్సి వచ్చింది. తనకు, పంచెకట్టు సంస్కృతికి ఎదురైన పరాభావాన్ని న్యాయమూర్తి హరి పరందామన్ ఓ మీడియాతో పంచుకున్నారు. వివాదంలో క్రికెట్ క్లబ్ : పంచెకట్టును అడ్డుకున్న చెన్నై క్రికెట్ క్లబ్ వివాదంలోకి ఎక్కింది. ఈ క్లబ్‌లోని ఆంక్షలపై న్యాయమూర్తి హరి పరందామన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆంగ్లేయులు వదలి పెట్టి వెళ్లిన ఆంక్షల్ని ఇక్కడ అమలు చేస్తుండడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఇక, పీఎంకే నేత రాందాసు, పీఎంకే అధ్యక్షుడు జికేమణి ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు. ఆ క్లబ్ నిర్వాకాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. తమిళ సంస్కృతి సంప్రదాయాలను కించ పరిచే విధంగా వ్యవహరిస్తున్న క్లబ్‌లు, స్టార్ హోటళ్లపై చర్యకు ప్రభుత్వం సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ నాయకులు అందరూ పంచె కట్టుతో కనిపిస్తుంటారని గుర్తు చేస్తూ, ఈ వ్యవహారం మీద ప్రభుత్వ తక్షణం స్పందించాలని, లేని పక్షంలో తమిళ సంస్కృతి సంప్రదాయాల్ని ఈ క్లబ్‌లు, హోటళ్లు సర్వనాశనం చేయడం ఖాయం అని ఆందోళన వ్యక్తం చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement