-
ఈ విజయం మారడోనాకు అంకితం..
బ్యూనెస్ ఎయిరెస్: 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కోపా అమెరికా ఛాంపియన్‌గా అవతరించిన అర్జెంటీనా ఆనంద డోలికల్లో తేలియాడుతుంది. ఆ జట్టు టైటిల్ గెలిచాక తొలిసారి ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించిన అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ.. ప్రతిష్టాత్మక టైటిల్‌ను దివంగత దిగ్గజ ఆటగాడు డీగో మారడోనా సహా కరోనా బాధిత కుటుంబాలకు అంకితమిచ్చాడు. అర్జెంటీనా జట్టు కోపా అమెరికా టైటిల్ గెలవాలని మారడోనా ఆకాంక్షించాడని, అతని కలను నా సారధ్యంలోని అర్జెంటీనా జట్టు సాకారారం చేయడం నా అదృష్టమని మెస్సీ పేర్కొన్నాడు. మారడోనా భౌతికంగా తమ మధ్య లేకపోయినా, అతని ఆత్మ జట్టును ప్రోత్సహిస్తూ ఉండిందని తెలిపాడు. మరోవైపు అభిమానులు విజయోత్సవాలను జరుపుకునే క్రమంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, ఈ విజయంతో లభించిన సంతోషంతో బలం తెచ్చుకొని వైరస్‌పై కలిసికట్టుగా పోరాడుదామని ఆయన పిలుపునిచ్చాడు. తన జీవితంలో అన్నీ ఇచ్చిన దేవుడికి ధన్యవాదాలు, ముఖ్యంగా తనను అర్జెంటైన్‌గా పుట్టించినందుకు దేవుడికి కృతజ్ఞతలు అంటూ మెస్సీ భావోద్వేగపూరిత పోస్టు పెట్టాడు. ఇదిలా ఉంటే, ఆదివారం జరిగిన కోపా అమెరికా ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా 1-0తో బ్రెజిల్‌ను చిత్తు చేసింది. దీంతో ఆ దేశ ఆటగాళ్లు, అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఇది మెస్సీ కెరీర్లో అతిపెద్ద అంతర్జాతీయ టోర్నీ విజయం కావడంతో అతని ఆనందానికి హద్దులు లేవు. ఈ నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించిన మెస్సీ.. జట్టు విజయాన్ని కోవిడ్ బాధిత కుటుంబాలకు, అలాగే గతేడాది మరణించిన దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు డీగో మారడోనాకు అంకితమిస్తున్నట్లు చెప్పాడు. ఈ సందర్భంగా ఆయన తనకు మద్దతు తెలిపిన కుటుంబసభ్యులకు, స్నేహితులకు, 45 మిలియన్ల అర్జెంటీనా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపాడు. -
28 ఏళ్ల నిరీక్షణకు తెర, కన్నీళ్లతో ఆటగాళ్లు..
అద్భుతమైన జట్టుగా పేరు.. అయితేనేం!. ప్రతిష్టాత్మకంగా భావించే ట్రోఫీని ఎత్తడానికి 28 ఏళ్లు ఎదురుచూసింది అర్జెంటీనా టీం. చివరకు మారడోనా లాంటి దిగ్గజానికి సైతం కలగా మిగిలిపోయిన టోర్నీ అది. అలాంటిది ఉత్కంఠభరింతగా జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ బ్రెజిల్‌ను ఓడించింది అర్జెంటీనా. తద్వారా కోపా అమెరికా 2021 టోర్నీ కైవసం చేసుకుని టైటిల్ ఛాంపియన్‌గా నిలిచింది. దక్షిణ అమెరికా ఖండంలోని దేశాల మధ్య జరిగే కోపా అమెరికా టోర్నీ 2021 సీజన్లో మొత్తం పది దేశాలు పాల్గొన్నాయి. వీటిలో బ్రెజిల్..అర్జెంటీనాలు ఫైనల్‌కు చేరుకున్నాయి. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం వేకువ జామున రియో డీ జనెయిరోలోని మారాకానా స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఆట ఇరవై రెండో నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు Ángel Di María చేసిన గోల్ మ్యాచ్‌కు కీలకంగా మారింది. ఇక బ్రెజిల్‌కు గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా కట్టడి చేయగలిగారు అర్జెంటీనా ఆటగాళ్లు. దీంతో లియోనెల్ మెస్సీ కెప్టెన్సీలోని అర్జెంటీనా టీం 15వ కోపా అమెరికా ట్రోఫీని ఎత్తి సంబురాలు చేసుకుంది. #CopaAmérica 🏆 ¡ACÁ ESTÁ LA COPA! Lionel Messi 🔟🇦🇷 levantó la CONMEBOL #CopaAmérica y desató la locura de @Argentina 🇦🇷 Argentina 🆚 Brasil 🇧🇷#VibraElContinente #VibraOContinente pic.twitter.com/PCEX6vtVee — Copa América (@CopaAmerica) July 11, 2021 మెస్సీ-నెయ్మర్.. ఇద్దరూ కన్నీళ్లే ఓవైపు ఓటమి భారంతో బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెయ్మర్ దా సిల్వ శాంటోస్ శోకంతో ఏడుస్తుంటే.. మరోవైపు తన నేతృత్వంలో అర్జెంటీనా తొలి కప్పు సాధించడంతో Lionel Messi భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని ఓదార్చుకున్నారు. #CopaAmérica 🏆 ¡LO LINDO DEL FÚTBOL! Emotivo abrazo entre Messi 🇦🇷 y Neymar 🇧🇷 ¡ÍDOLOS! 🇦🇷 Argentina 🆚 Brasil 🇧🇷#VibraElContinente #VibraOContinente pic.twitter.com/ecknhlv2VI — Copa América (@CopaAmerica) July 11, 2021 తన ప్రొఫెషనల్ క్లబ్ కెరీర్లో 34 టైటిల్స్ నెగ్గిన మెస్సీ.. అర్జెంటీనా తరఫున మాత్రం ఇప్పటి వరకు ఒక్క మేజర్ టైటిల్ గెలవలేకపోయాడు. తాజా విక్టరీతో అతనికి ఆ లోటు తీరినట్లయ్యింది. ఆట ముగిశాక.. బ్రెజిల్-అర్జెంటీనా ఆటగాళ్లు మైదానంలో కూర్చుని సరదాగా గడపడం ఆకట్టుకుంది. Messi is tossed in the air by his Argentina teammates. It means everything ❤️pic.twitter.com/cIMJahlCAQ — ESPN India (@ESPNIndia) July 11, 2021 ఇక ఇంతకుముందు అర్జెంటీనా 1993లో కోపా అమెరికా కప్ చాంపియన్‌గా నిలిచింది. 2004, 2007, 2015, 2016ల్లో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. విశేషం ఏంటంటే.. పీలే బ్రెజిల్ కెప్టెన్‌గా ఉన్న టైంలోనూ బ్రెజిల్ కోపాను గెల్చుకోలేకపోయింది. -
34 టైటిల్స్ గెలిచిన మెస్సీకి ఆ లోటు తీరేనా?!
రియో డి జనీరో: తన ప్రొఫెషనల్ క్లబ్ కెరీర్లో 34 టైటిల్స్ నెగ్గిన అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లయెనల్ మెస్సీ దేశం తరఫున మాత్రం ఇప్పటి వరకు ఒక్క గొప్ప టైటిల్‌ను కూడా గెలవలేకపోయాడు. కోపా అమెరికా కప్ రూపంలో ఆ లోటును తీర్చుకునే అవకాశం మళ్లీ మెస్సీకి లభించింది. ఆదివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ బ్రెజిల్‌తో అర్జెంటీనా తలపడనుంది. చివరిసారి అర్జెంటీనా 1993లో కోపా అమెరికా కప్ చాంపియన్‌గా నిలిచింది. 2004, 2007, 2015, 2016ల్లో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఈసారి ఎలాగైనా టైటిల్‌ను నెగ్గాలనే కసితో మెస్సీ బృందం కనిపిస్తోంది. ఫైనల్ ఆదివారం ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి సోనీసిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. -
రొనాల్డో రికార్డ్‌ను బద్దలు కొట్టిన మెస్సీ..
బ్రెసిలియా: కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా ఈక్వెడార్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ అరుదైన రికార్డును నెలకొల్పాడు. పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో పేరిట ఉన్న ఫ్రీకిక్ గోల్స్ రికార్డును ఈ అర్జెంటీనా సంచలన ఫుట్‌బాలర్ బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా మొత్తం మూడు గోల్స్ చేయగా.. అన్నింటిలోనూ మెస్సీ భాగస్వామిగా ఉన్నాడు. తొలి రెండు గోల్స్‌లో బాల్‌ను పాస్ చేయడంలో కీలకపాత్ర పోషించిన మెస్సీ.. ఓ ఫ్రీకిక్‌ను గోల్‌గా మలచి అర్జెంటీనా లీడ్‌ను 3-0కు పెంచాడు. ఈ క్రమంలోనే రొనాల్డో రికార్డును మెస్సీ అధిగమించాడు. ఇప్పటివరకు రొనాల్డో ఫ్రీకిక్స్తో 57 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉండగా, తాజాగా జరిగిన మ్యాచ్‌లో మెస్సీ 58వ సారి ఫ్రీకిక్ గోల్ సాధించి టాప్ ప్లేస్‌లోకి దూసుకెళ్లాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ప్రస్తుతానికి 76 గోల్స్ సాధించిన మెస్సీ.. మరొక్క గోల్ చేస్తే, అత్యధిక గోల్స్ సాధించిన సౌత్ అమెరికన్‌గా చరిత్ర పుటల్లో నిలుస్తాడు. ఈ జాబితాలో దిగ్గజ ఫుట్‌బాలర్, బ్రెజిల్ మాజీ కెప్టెన్ పీలే 77 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. -
ఇక నా వల్ల కాదు
మెస్సీ అస్త్ర సన్యాసం అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటన క్లబ్ ఫుట్‌బాల్‌లో తిరుగు లేని సూపర్ స్టార్... వేసే ప్రతి అడుగు, మైదానంలో పరుగుకు కోట్లాది రూపాయల కనకవర్షం కురుస్తుంది. మెస్సీ అంటే ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఉర్రూతలూగించే ఒక మాయ. నాలుగు చాంపియన్స్ లీగ్ టైటిల్స్, ఏకంగా ఎనిమిది స్పానిష్ లీగ్ ట్రోఫీలు, లెక్క లేనన్ని అవార్డులు, రివార్డులు, లెక్క పెట్టలేనంత మంది ఫ్యాన్స్. దేశం తరఫున 11 ఏళ్ల కెరీర్... చెప్పుకోదగ్గ అంతర్జాతీయ టైటిల్ ఒక్కటి కూడా లేదు. మూడు కోపా అమెరికా ఫైనల్స్‌లో ఓటమి. వరల్డ్ కప్ ఫైనల్ పోరు కూడా చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఐదు సార్లు ‘ఫిఫా’ ఉత్తమ ఆటగాడే అయినా ఆ ఉత్తమ ప్రదర్శన అర్జెంటీనాకు మాత్రం ఏ టైటిల్‌నూ తేలేదు. అతను ఆడిన నాలుగు ఫైనల్స్‌లోనూ పరాభవమే. సాక్షి క్రీడా విభాగం:- 29వ పుట్టిన రోజు జరుపుకున్న రెండు రోజులకే ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఇక దేశం తరఫున ఆడలేనంటూ అస్త్ర సన్యాసం చేశాడు. అర్జెంటీనా తరఫున అంతర్జాతీయ టోర్నీల్లో విజేతగా నిలిచేందుకు అన్ని ప్రయత్నాల్లోనూ విఫలమై, నిరాశా నిస్పృహకు లోనై, చివరకు ‘కోపా’ పరాజయ భారంలో ప్రధాన భాగమై అతను నిష్ర్కమించాడు. ఫైనల్లో చిలీ చేతిలో ఓడిన తర్వాత ‘నేను అర్జెంటీనా తరఫున ఆఖరి మ్యాచ్ ఆడేశాను’ అని అతను ప్రకటించాడు. 2005లో అర్జెంటీనా జట్టు తరఫున తొలి మ్యాచ్ ఆడిన మెస్సీ మొత్తం 113 మ్యాచ్‌లలో 55 గోల్స్ చేశాడు. ‘నేను చేయాల్సిందంతా చేశాను. నాలుగు ఫైనల్స్ ఆడినా గెలుపు దక్కలేదు. దేశం తరఫున టైటిల్ గెలవాలని అందరికంటే ఎక్కువగా భావించాను. రిటైర్మెంట్ కఠిన నిర్ణయమే. వెనక్కి వచ్చే ఆలోచన లేదు’ అని మెస్సీ స్పష్టం చేశాడు. రికార్డులే రికార్డులు అర్జెంటీనా ఫుట్‌బాల్‌ను శిఖరాన నిలిపిన మారడోనా తర్వాత మెస్సీనే ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. 2005లో తన దేశానికి అండర్-20 ప్రపంచకప్‌ను అందించాక ఈ కుర్రాడు ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆ తర్వాత అతి పిన్న వయసులో దేశం తరఫున ‘ఫిఫా’ ప్రపంచ కప్ ఆడిన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకోవటం లాంఛనమే అయింది. 5’7’’ ఎత్తు అంటే సాధారణంగా ఫుట్‌బాలర్లలో తక్కువగానే లెక్క. కానీ దీంతోనే అతను మైదానంలో చురుగ్గా దూసుకుపోయి ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచాడు. వరుసగా నాలుగు సార్లు ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిగా నీరాజనాలందుకున్న మెస్సీ... తక్కువ వ్యవధిలోనే దిగ్గజ ఫుట్‌బాలర్లలో ఒకడిగా తనదైన ముద్ర వేశాడు. ఆ ఒక్కటీ తప్ప... క్లబ్ ఆటగాడిగా ఉన్న గుర్తింపును పక్కన పెడితే అర్జెంటీనా తరఫున కూడా మెస్సీ ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. జట్టులో సీనియర్లు ఎంత మంది ఉన్నా... ఒంటిచేత్తో పలు మ్యాచ్‌లలో గెలిపించాడు. అయితే ఇన్నేళ్ల కెరీర్లో దురదృష్టం అతడిని వెంటాడింది. ఫుట్‌బాల్ ప్రపంచం మొత్తం గుర్తుంచుకునే ప్రధాన టోర్నీలలో మాత్రం అతనికి విజయానందం దక్కలేదు. మెస్సీ జట్టులోకి వచ్చిన తర్వాత మూడు ప్రపంచకప్‌లు, కోపా అమెరికా కప్‌లలో అర్జెంటీనా ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. దాంతో కీలక టోర్నీల్లో జట్టును గెలిపించలేడనే విమర్శను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆటతో ఎంత మెప్పించినా... ఈ విషయంలో మాత్రం మారడోనాను అతను మరిపించలేకపోయాడు. ఫలితంగా ఈ ‘పదో నంబర్’ ఆటగాడికి ప్రపంచం అర్జెంటీనా తరఫున రెండో స్థానమే ఇచ్చింది! 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడం ఒక్కటే అతనికి కాస్త ఊరటనిచ్చే విషయం. 31 ఏళ్ల వయసులో మరో ప్రపంచకప్ బరిలోకి దిగే అవకాశం ఉన్నా అతను దానిని వద్దనుకున్నాడు. తిరిగొస్తాడా..! మెస్సీ అనూహ్య రిటైర్మెంట్ ప్రకటన ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచింది. ఓటమి కారణంగా ఇది ఆవేశంలో తీసుకున్న నిర్ణయంగా కొందరు అభివర్ణిస్తుండగా, మరో వరల్డ్ కప్ ఆడినా అతని అంతర్జాతీయ కెరీర్‌కు పెద్దగా లాభం లేదని మరి కొందరు చెబుతున్నారు. అర్జెంటీనా సహచరులు రొమెరో, అగ్వెరో, హిగుయెన్ మాత్రం మెస్సీ లేని జట్టును ఊహించలేమని, అతను మళ్లీ ఆడతాడని విశ్వాసం వ్యక్తం చేశారు. జట్టు మేనేజర్ గెరార్డో వ్యాఖ్యలు కూడా మెస్సీని ఒప్పించే ప్రయత్నం జరుగుతున్నట్లు సూచిస్తున్నాయి. రిటైర్మెంట్ ప్రకటించినట్లు తమకే తెలీదని ఆయన మీడియా సమావేశంలో చెప్పడం విశేషం. ‘మేం ప్రపంచ కప్ అర్హత పోటీలు ఆడుతున్నాం. వీటిని అర్ధాంతరంగా వదిలేసి అతను వెళ్లిపోలేడు. అసలు కొనసాగకపోవడానికి తగిన కారణం కనిపించడం లేదు. అతను చాలా బాగా ఆడుతున్నాడు. ఫైనల్లో ఓటమి ఎవరినైనా బాధిస్తుంది’ అని గెరార్డో వ్యాఖ్యానించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా... జెట్ స్పీడ్‌లో
Advertisement