-
పాముకాటుతో మృతి
రాయదుర్గం రూరల్ : మండలంలోని డి.కొండాపురానికి చెందిన బోయ రాజు(25) పాముకాటుకు గురై ఆదివారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. తన స్నేహితలతో కలసి శనివారం రాత్రి అడవిలోకి వేటకు వెళ్లిన రాజు.. దారిలో పాముకాటుకు గురయ్యాడన్నారు. వెంటనే అతన్ని గ్రామంలోని నాటువైద్యుని వద్దకు తీసుకెళ్లారు. మూత్ర విసర్జన కాక పోవడంతో కుటుంబ సభ్యులు ఆదివారం మధ్యాహ్నం రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో తుదిశ్వాస వదిలాడని చెప్పారు. మృతునికి భార్య లక్ష్మీ, కుమారుడు నాలుగేళ్ల కుమారుడు శంకర, రెండేళ్ల కుమార్తె అమృత ఉన్నారు. -
అల్లుడి ఘాతుకం
- అత్తగారింటిని లారీతో గుద్ది భార్య, బిడ్డతో సహా అందరినీ హతమార్చే యత్నం - ఇంటి గోడలు కూలి అత్తకు తీవ్రగాయాలు, పరిస్థితి విషమం - తృటిలో తప్పించుకున్న ఐదుగురు - మారెంపల్లిలో అర్థరాత్రి అలజడి - పట్టుకునేలోగా పరారైన నిందితుడు గుమ్మఘట్ట (రాయదుర్గం) : రెండు కుటుంబాల్లో తలెత్తిన చిన్న వివాదంతో ఓ వ్యక్తి బంధం, బంధుత్వాలు మరచి క్రూరమృగానికన్నా క్రూరంగా మారిపోయాడు. కట్టుకున్న భార్య, బిడ్డతో సహా ఆమె కుటుంబీకులను అందరినీ మట్టుపెట్టేందుకు ఒడికట్టాడు. ఈ ఘాతుకానికి సంబంధించిన పూర్తి వివరాలు బాధితుల కథనం మేరకు... రాయదుర్గం మండలం డీ కొండాపురానికి చెందిన గొల్ల చంద్రశేఖర్‌కు మూడేళ్ల క్రితం గుమ్మఘట్ట మండలం మారెంపల్లికి చెందిన గొల్ల తిమ్మారెడ్డి కుమార్తె మారెక్కతో వివాహమైంది. రెండు కుటుంబాలవారూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఆ తర్వాత కొన్ని వివాదాలు వచ్చినప్పటికీ ఇరు కుటుంబాల వారూ సర్దుకున్నారు. ఇటీవల రెండు నెలల క్రితం మారెక్క మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు గాడిద పాలు పడితే మంచిదని భర్తకు చెప్పడంతో పిల్లాడి నాయనమ్మ గాడిదపాలు తీసుకొచ్చింది. అవి తాగించాక రెండు, మూడు రోజులు పిల్లాడు మల విసర్జన కాక ఇబ్బందిపడ్డాడు. వైద్యం చేయించడంతో నయమైంది. అయితే పిల్లాడి నాయనమ్మ పాలలో ఏదో కలిపిందని, అందువల్లే మలవిసర్జన కాలేదని పిల్లాడి అమ్మమ్మ వాళ్లు అనుమానం వ్యక్తం చేశారు. అది ఆనోటా ఈనోటా పడి నాయనమ్మకు తెలిసింది. ఆగ్రహించిన ఆమె మారెంపల్లికి వచ్చి కోడలు, ఆమె కుటుంబసభ్యులను నిలదీసింది. దీంతో గొడవ జరిగింది. గ్రామస్తులు సర్ధి చెప్పారు. ఈ విషయం తెలిసి చంద్రశేఖర్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. లారీ డ్రైవర్ అయిన ఆయన లోడ్ తీసుకెళ్లే లారీతోనే శుక్రవారం రాత్రి అత్తగారింటికి వచ్చి అత్త, భార్య, బావమరుదులతో గొడవ పడ్డాడు. మీ అంతు చూస్తానని, మిమ్మల్ని చంపి తీరతానని బెదిరించి వెళ్లాడు. సరిగ్గా రాత్రి 2 గంటల సమయానికి అన్నంత పనీ చేసేందుకు పూనుకొన్నాడు. లారీని తీసుకొచ్చి రివర్స్‌గేర్‌లో అత్తగారింటిని గుద్దేశాడు. ముందు గోడ, బయట వేసిన షీట్లు కుప్పకూలిపోయాయి. గోడ పక్కన నిద్రిస్తున్న అత్త గంగమ్మ(40) కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడింది. భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. మిగిలిన మరో ఐదుగురు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అంతేకాకుండా చంద్రశేఖర్ ఆరు బయట నిద్రిస్తున్న బావమరిది అంజినేయులుపై కత్తితో దాడి చేసేందుక్కూడా యత్నించాడు. ఈ ఘటన గ్రామంలో పెద్ద అలజడి సృష్టించడంతో అందరూ ఇళ్లు వదిలి గ్రామస్తులు రోడ్లపైకి పరుగుపెట్టారు. అంతమంది జనాన్ని చూసి భయపడిన నిందితుడు పరారయ్యాడు. స్పృహ కోల్పోయిన గంగమ్మను చిక్సిత కోసం హుటాహుటిన రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు గుమ్మఘట్ట ఎస్ఐ హైదర్‌వలీ తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
అమెరికన్ల ఇంటి పేర్లు ఎలా ఉంటాయో తెలుసా..!
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ప్రవీణ్‌తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- గర్ల్ ఫ్రెండ్‌కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement