-
ఆట ఒకటే... దొంగలే వేరు!
ఆ సీన్ - ఈ సీన్ ఏ విషయంలోనైనా అనుసరణ ఉండాలి తప్ప అనుకరణ ఉండకూడదు అంటారు. కానీ ఈ విషయాన్ని సినిమావాళ్లు పట్టించుకోరేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ముఖ్యంగా దొంగాట లాంటి సినిమాలు చూసినప్పుడు ఆ అభిప్రాయం మరింత బలపడుతుంది! జగపతిబాబు, సౌందర్యలతో కోడి రామ కృష్ణ తీసిన ‘దొంగాట’ చిత్రం తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. గిలిగింతలు పెట్టే కామెడీ, కంటతడి పెట్టించే సెంటి మెంట్, మనసును తడిమే సన్నివేశాలు, చక్కని సంభాషణలు... అన్నీ కలిసి ‘దొంగాట’లో దర్శకుడిని విజేతగా నిలి పాయి. అయితే నిజానికి... ఈ ఆటను హాలీవుడ్‌వాళ్లు అంతకు ముందే ఆడేశారు. కేట్ కెనడాలో హిస్టరీ టీచర్. ప్రియుడు చార్లీని పెళ్లాడటానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే చార్లీకి బిజినెస్ పనిమీద ప్యారిస్ వెళ్లాల్సి వస్తుంది. ఆమెనూ రమ్మంటాడు కానీ, విమాన ప్రయాణమంటే ఉన్న భయం వల్ల రానంటుంది. అతను వెళ్లిపోతాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి, ప్యారిస్‌లో పరిచయమైన ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డానని చెప్తాడు. షాక్ తిన్న కేట్ ప్యారిస్ బయలుదేరుతుంది. ఫ్లయిట్ ఎక్కాక భయంతో వణికిపోతుంటే, పక్క సీట్లో కూర్చున్న ల్యూక్ మాటల్లో పెట్టి, భయం లేకుండా చేస్తాడు. అతడో దొంగ. తను కొట్టేసి తీసుకెళ్తోన్న డైమండ్ నెక్లెస్‌ని, కస్టమ్స్ వాళ్లు పట్టుకుంటారన్న భయంతో కేట్ లగేజీలో కలిపేస్తాడు. తర్వాత దాని కోసం ఆమెనే అనుసరిస్తాడు. ఆ క్రమంలో కేట్కు అండగా మారతాడు. అతని సాయంతో చార్లీని కలుసుకుంటుంది కేట్. కానీ చార్లీ ఎంత చెడ్డవాడో తెలుసుకుని, అతణ్ని తనతో తీసుకెళ్లాలన్న ఆలోచనను విరమించుకుంటుంది. తగిన బుద్ధి చెప్పి తిరిగి ప్రయాణమవుతుంది. వెళ్లేముందు ల్యూక్ని పట్టుకోవడానికి తిరుగుతోన్న పోలీసాఫీసరుకి తన దగ్గరున్న నెక్లెస్‌ని ఇచ్చేసి, అతణ్ని వదిలేయమంటుంది. వైన్యార్డ్ పెట్టి సెటిలవ్వడానికే ల్యూక్ దొంగతనాలు చేస్తున్నాడని తెలుసుకుని, తను దాచుకున్న డబ్బు మొత్తం అతనికి చెందేలా చేసి బయలుదేరుతుంది. అది పోలీసు ద్వారా తెలుసుకున్న ల్యూక్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి, తన ప్రేమను కేట్కి తెలపడంతో కథ ముగుస్తుంది. ఇది 1995లో విడుదలైన ‘ఫ్రెంచ్ కిస్’ చిత్ర కథ. అచ్చం ‘దొంగాట’ కథలాగే ఉంది కదూ! కథే కాదు... కథనం, సన్ని వేశాలు అన్నీ అచ్చు గుద్దినట్టే ఉంటాయి. నటీనటులు, ప్రదేశాలే మారతాయి. హాలీవుడ్లో హీరోయిన్ మెగ్ ర్యాన్ కెనడా నుంచి ఫ్రాన్స్‌కు వెళ్తుంది. టాలీవుడ్లో సౌందర్య ఓ పల్లెటూరి నుంచి సిటీకి వస్తుంది. మెగ్ ఫ్లయిట్ ఎక్కితే, సౌందర్య రెలైక్కుతుంది. ఆమెకు విమానం టేకాఫ్ అయ్యేటప్పుడు భయం. ఈమెకు రైలు బ్రిడ్జిమీద వెళ్లేటప్పుడు భయం. ఇలా మన నేటివిటీకి తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు చేశారు తప్ప, మిగతాదంతా సేమ్ టు సేమ్. సినిమా మొత్తం హీరో, హీరోయిన్, ఆమె ప్రియుడు, అతడు ప్రేమించిన అమ్మాయి, పోలీసాఫీసర్... ఈ ఐదు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. కాకపోతే తెలుగులో కొందరు కమెడియన్లను యాడ్ చేశారు. మనకు పాటలూ ముఖ్యం కాబట్టి వాటినీ చేర్చారు. ఇంకే తేడా ఉండదు. ‘దొంగాట’ విడుదలైన తర్వాతి ఏడు హిందీలో కూడా ‘ఫ్రెంచ్ కిస్’ని తీశారు... ‘ప్యార్తో హోనా హీ థా’ పేరుతో. అజయ్ దేవగన్, కాజోల్ జంటగా నటించారు. అది కూడా మక్కీకి మక్కీనే. కాకపోతే అక్కడా హిట్టయ్యింది. ఈ మూడు సినిమాల్లో ఒక్కటి చూసినా మరొకటి చూడక్కర్లేదు. ఎంత కాపీ కొట్టినా మరీ ఇలా జిరాక్స్ కాపీల్లాగా కనిపించే సినిమా మరోటి ఉండదేమో. వేరే భాషలో సక్సెస్ సాధించిన చిత్రం నుంచి స్ఫూర్తి పొంది, మనవాళ్లకూ ఆ సినిమాను అందించాలను కోవడంలో తప్పు లేదు. కాకపోతే కథ మనది కానప్పుడు కనీసం రచయితలు తమ పేరు వేసుకోకుండా ఉంటే బాగుంటుంది. ఆ విషయాన్ని విస్మరించి క్రెడిట్ తీసుకోవడం మాత్రం అన్యాయమే! కొసమెరుపు: సినిమాయే కాపీ అంటే, ‘దొంగాట’లో ఓ పాట కూడా కాపీయే. ‘ఓ చిలకా... రా చిలకా’ అన్న పాట, చాలా యేళ్ల క్రితం వచ్చిన ‘రామ్ తేరీ గంగా మైలీ’ చిత్రంలో ‘సున్ సాహిబా సున్’ అన్న హిట్ పాటకు కాపీ. ఈ చిత్రాలకు ప్రాణం హీరోయిన్ల పర్ఫార్మెన్సే అని చెప్పాలి. ‘ఫ్రెంచ్ కిస్’లో మెగ్ ర్యాన్ నటన శిఖరాగ్ర స్థాయిలో ఉంటుంది. తెలుగులో సౌందర్య కూడా అమాయకమైన అమ్మాయిగా అదరగొట్టింది. హిందీలో కాజోల్ కూడా కంటతడి పెట్టించింది. ఈ కథకు నూరు శాతం న్యాయం జరిగింది, లాభాల పంట పండింది అంటే... అందుకు ముఖ్య కారణం ఈ నటీమణుల అద్భుత నటనే. -
రామ్‌గోపాల్ వర్మను డెరైక్ట్ చేయమంటే కుదరదన్నారు!
‘‘ఈ చిత్రాన్ని రామ్‌గోపాల్ వర్మ డెరైక్షన్‌లో చేయాలనుకున్నాను. ఆయనను అడిగితే, ఇది తన జానర్ సినిమా కాదని నిరాకరించారు. ఆ తర్వాత వంశీకృష్ణను అడిగాను. ఎప్పట్నుంచో తను నాకు ఫ్రెండ్. దర్శకుడిగా మొదటి సినిమా నాతోనే చేస్తానన్నాడు. అలానే చేశాడు. ఈ చిత్రాన్ని వంశీ బాగా తీస్తాడననుకున్నాను కానీ, ఇంత బాగా తీస్తాడని మాత్రం అనుకోలేదు’’ అని మంచు లక్ష్మి అన్నారు. విద్యా నిర్వాణ సమర్పణలో మంచు ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎస్. వంశీకృష్ణ దర్శకత్వంలో మంచు లక్ష్మీప్రసన్న నటించి, నిర్మించిన చిత్రం ‘దొంగాట’. అడివి శేష్, మధు నందన్ ముఖ్య పాత్రలు చేశారు. ఈ నెల 8న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ - నాగార్జున, రవితేజ, మనోజ్, నాని, రానా, సుశాంత్, సుదీప్, నవదీప్, శింబు, తాప్సీ నటించిన పాట ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. సినిమా ద్వితీయార్ధంలో నా పుట్టినరోజు సందర్భంగా వచ్చే పాట ఇది. నేను పాడిన ‘ఏందిరో..’ పాటకు ఇప్పటికే మంచి స్పందన లభించింది. వినోద ప్రధానంగా సాగే ఈ చిత్రంలో ఓ హీరోయిన్ని కిడ్నాప్ చేస్తారు. ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనేది ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రం తరువాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించబోతున్నాననీ, అతను దర్శకత్వం వహించిన ‘సైన్మా’ అనే లఘు చిత్రం చూసి, అవకాశం ఇస్తున్నాననీ లక్ష్మి తెలిపారు. -
నవ్వుల దొంగాట
ఎలాగైనా డ బ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్న యువకుడు తన స్నేహితులతో కలిసి ఓ అమ్మాయిని కిడ్నాప్ చేస్తాడు. దొంగాట ఆడాలనుకున్న ఆ యువకులను ఈ అమ్మాయి నానా తిప్పలు పెడుతుంది. అనుకున్నది ఒకటి అయినదొకటి అన్నట్టుగా తయారైన వారి పరిస్థితి చూసి నవ్వుకోవాలనుకుంటే ‘దొంగాట’ చూడాల్సిందే. మంచు ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మంచు లక్ష్మీప్రసన్న ప్రధాన పాత్రలో నటిస్తూ, నిర్మించిన ఈ చిత్రానికి వంశీకృష్ణ దర్శకుడు. వచ్చే నెల 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ -‘‘9 మంది హీరోలు కనిపించిన ఓ పాట ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది’’ అని చెప్పారు. మంచి ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించామనీ, సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందర్నీ ఆకట్టుకుంటాయనీ దర్శకుడు చెప్పారు. . ఈ చిత్రానికి సంగీతం: సత్యమహావీర్, రఘు కుంచె, సాయి కార్తీక్, ఎడిటర్: ఎస్.ఆర్ శేఖర్, సహనిర్మాత: గాంధీ. -
బిగ్ ఎఫ్ఎంలో మంచు లక్ష్మి సందడి
-
ఆ పాట ప్రత్యేకం!
పది మంది హీరోలు ఒకేసారి తెరపై కనిపిస్తే, ఆ మజాయే వేరు. ప్రేక్షకులకు ఆ కిక్‌ను పంచనున్న చిత్రం ‘దొంగాట’. మంచు ఎంటర్టైన్మెంట్స్పై ఎస్.వంశీకృష్ణ దర్శకత్వంలో మంచు లక్ష్మీ నిర్మిస్తున్న చిత్రం ఇది. అడివి శేష్, మంచు లక్ష్మీ నటిస్తున్న ఈ చిత్రం లోగోను హైదరాబాద్‌లో విడుదల చేశారు. లక్ష్మీ మాట్లాడుతూ -‘‘ఈ చిత్రానికి కీలకంగా నిలిచే ప్రత్యేక పాట ఒకటుంది. అందులో నటించడానికి నాగార్జున, రవితేజ, నాని, మనోజ్, రానా, శింబు, నాని, నవదీప్, సుధీర్‌బాబు, సుశాంత్ ఒప్పుకున్నారు’’ అని చెప్పారు. ‘‘నా గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమాలో కామెడీ ట్రై చేశా. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుంది’’ అని అడివి శేష్ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: గాంధీ.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్‌పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్‌కుమార్ ఆగ్రహం
Advertisement