-
Celebrities In Face Masks: కరోనా టైమ్‌లో మాస్క్‌లు ధరించిన నటీనటుల ఫోటోలు మళ్లీ వైరల్ (ఫొటోలు)
-
పనివేళల్లో ప్రైవేటు ప్రాక్టీస్ చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్, ప్రభుత్వ వైద్యకళాశాలల అధ్యాపకులు పనివేళల్లో ప్రైవేట్ ప్రాక్టీస్‌కు దూరంగా ఉండాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు అన్ని వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఉత్తర్వులు ఇచ్చింది. టీచింగ్ ఫ్యాకల్టీలు వారి పనివేళల్లో అంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రాక్టీస్ చేయొద్దని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఉత్తర్వులు ఇచ్చింది. పనివేళల్లో ఎవరైనా వైద్యులు ప్రాక్టీస్ చేస్తున్నట్లు గుర్తించినట్లయితే, అది వైద్య నైతిక నియమావళిని ఉల్లంఘించినట్లుగా భావించి, వారి రిజిస్ట్రేషన్ నంబర్లను తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ మెడికల్ రిజిస్ట్రీ నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. -
గాలిలో స్పృహ కోల్పోయి, గుడ్లు తేలేసి, తల వాల్చేసి.. నవ్విస్తున్న పారాగ్లైడర్
సోషల్ మీడియాలో తాజాగా పారాగ్లైడింగ్కు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఒక విదేశీయునికి సంబంధించినది. అతను పారాగ్లైడింగ్ చేస్తున్న సమయంలో ఎంతో ఉద్వేగానికి గురయ్యాడు. అతను గాలిలో స్పృహతప్పి పోయాడు. స్పృహలోకి రాగానే ఏం చేసాడో చూస్తే ఎవరైనా నవ్వు ఆపుకోలేరు. ఈ 15 సెకన్ల వీడియోలో ఒక వ్యక్తి పారాగ్లైడింగ్ చేస్తూ కనిపిస్తాడు. అతని పరిస్థితి చూస్తే అతను పారాగ్లైడింగ్‌ని పూర్తిగా ఆస్వాదించడం లేదని మనకు అర్థం అవుతుంది. పారాగ్లైడింగ్ చేస్తున్న సమయంలో అతని నోరు తెరిచి ఉంది. మెడ కూడా వేలాడుతోంది. వెనుకనున్న పారాగ్లైడింగ్ శిక్షకుడు అతని పరిస్థితి చూసి నవ్వుతున్నాడు. భయం లేదా అమిత ఉత్సాహం కారణంగా వ్యక్తి స్పృహ కోల్పోయే అవకాశం ఉంది. అతనిని చూసిన గైడ్ అతన్ని నవ్వించడానికి ప్రయత్నించాడు. ఆ వ్యక్తి స్పృహ వచ్చిన వెంటనే బిగ్గరగా అరవడం మొదలెడతాడు. ఈ వీడియోను సెప్టెంబర్ 13న @Enezator అనే వినియోగదారు Xలో భాగస్వామ్యం చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 78 వేలకు పైగా వ్యూస్ దక్కించుకుంది. ఈ వీడియోను చూసినవారు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్.. ‘అతను ఉత్సాహం ఎక్కువై మూర్ఛపోయినట్లు నాకు అనిపించడం లేదని’ రాశారు. మరొకరు ‘భయంతో స్పృహతప్పిపోయాడు’ అని రాశారు. ఈ వీడియోను చూసిన కొంతమంది ‘తాము నవ్వు ఆపుకోలేకపోతున్నామని’ కామెంట్ చేశారు. ఇది కూడా చదవండి: ఆ నగరం మన దేశానికి ఒక్కరోజు రాజధాని ఎందుకయ్యింది? fainted from excitement in the air pic.twitter.com/k7X80jze05 — Enezator (@Enezator) September 13, 2023 -
జెండా ఎగరేసి సొమ్మసిల్లిపడిపోయిన మంత్రి
భోపాల్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మధ్యప్రదేశ్‌లో అపశృతి చోటుచేసుకుంది. జెండా వందనం చేసే క్రమంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి డా. ప్రభురామ్ చౌధరి స్పృహతప్పి స్టేజిమీదే పడిపోయారు. అటు.. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గిరీష్ గౌతమ్ కూడా వేడుకల సందర్భంగా ఇచ్చే ఉపన్యాసంలో కుప్పకూలారు. एमपी विधानसभा के अध्यक्ष गिरीश गौतम को मऊगंज में स्पीच देते हुए आया चक्कर, सुरक्षाकर्मियों ने संभाला @NavbharatTimes #NBTMP #MPNews pic.twitter.com/4VGlyux9Nc — NBTMadhyapradesh (@NBTMP) August 15, 2023 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 'హర్ గర్ తిరంగ అభియాన్' కార్యక్రమంలో భాగంగా సోమవారం తివర్ణ పతాక ర్యాలీని నిర్వహించారు. విద్యార్థులు, పోలీసులు, అధికారులతో సహా ప్రజలందరూ కలిసి భారీ ఎత్తున ర్యాలీలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రభురామ్ చౌధరి స్వయంగా దగ్గరుండి ఏర్పాట్లు చూసుకున్నారు. నేడు రాష్ట్ర ప్రజలందరికి మంత్రి ప్రభురామ్ చౌధరి శుభాకాంక్షలు తెలిపారు. తివర్ణ జెండాను ఎగురవేసి, చురుకుగా వేడుకల్లో పాల్గొన్నారు. అయితే.. ఉన్నట్టుండి అకస్మాత్తుగా కిందపడిపోయారు. దీంతో మంత్రిని ఆస్పత్రికి తరలించారు అధికారులు. ప్రస్తుతం వైద్యుల సమక్షంలోనే ఉన్నారని తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అటు.. స్పీకర్ గిరీష్ గౌతమ్ కూడా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. रायसेन में परेड सलामी के दौरान चक्कर खा कर गिरे MP के स्वास्थ्य मंत्री Dr. Prabhuram Choudhary। #PrabhuramChoudhary #IndependenceDay2023 #IndependenceDay #raisen #Madhyapradesh #flaghosting @DrPRChoudhary pic.twitter.com/jsLsVYACfk — New India Live (खबर सातों पहर) (@Newindialive24) August 15, 2023 ఇదీ చదవండి: వారి వాహనాలపైనే త్రివర్ణ పతాకం రెపరెపలు.. కాదని మరొకరు ఈ పనిచేస్తే.. -
అందమైన భామలను తడిమి చూసి వదిలేసిన ఎలుగు.. తెలివితో తప్పించుకున్నారిలా!
ఎలుగుబంటి ఎంతో శాంతస్వభావం కలిగినదని చెబుతుంటారు. అయితే అది ఒక్కోసారి రెచ్చిపోయినప్పుడు దానిని ఆపడం ఎవరితరమూ కాదని కూడా అంటుంటారు. అయితే మీరు ఎప్పుడైనా అడవిమార్గం గుండా వెళ్లినప్పుడు ఎలుగుబంటి ఎదురైతే ఏం చేయాలో తెలుసా? దాని నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసా? సోషల్ మీడియాతో తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో అందమైన భామలు తాము ఎలుగుబంటి నుంచి ఎలా తప్పంచుకున్నదీ ఒక వీడియోలో చూపించారు. ఎలుగు ముంగిట చిక్కి, ఆపదలో ఉన్నవారికి ఈ వీడియో ఎంతో ఉపయోగపడేలా ఉంది. వైరల్ అవుతున్న వీడియోలో ముగ్గురు యువతులు రోడ్డుపక్కన ఉండటాన్ని గమనించవచ్చు. ఇంతలోనే వారి దగ్గరకు ఒక నల్లని ఎలుగుబంటి రావడాన్ని చూడవచ్చు. అది వారి దగ్గరకు వచ్చి, వారిని పట్టుకుంటుంది. అయితే ఆ యువతులు ఏ మాత్రం కంగారు పడకుండా కదలకుండా నిలుచునే ప్రయత్నం చేస్తుంటారు. దీంతో ఆ ఎలుగుబంటి ఆ అందమైన యువతుల నుంచి ఎటువంటి ప్రమాదం లేదని భావించి, అక్కడి నుంచి కామ్‌గా వెళ్లిపోతుంది. ఈ వీడియోను ట్విట్టర్లో @CCTV IDIOTS పేరుతో షేర్ చేశారు. ఈ వీడియోకు క్యాప్షన్‌గా ‘ఎలుగుబంటి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసుకోండి.. శాంతంగా, స్థిరంగా నిలుచోండి’ అని రాశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 269.4కేకు పైగా వీక్షణలు దక్కాయి. 3వేలకు పైగా లైక్స్ దక్కాయి. ఒక యూజర్ తన కామెంట్లో ఒకవేళ ఆ ఎలుగుబంటికి ఆ యువతుల స్మెల్ నచ్చకపోయి ఉంటే ఏమయ్యేదోనని అనగా, మరొకరు ఆ ఎలుగుబంటి వారిని కావలించాలనుకుంటోంది అని రాశారు. ఇది కూడా చూడండి: పట్టుతప్పి పట్టాలపై పిల్లాడు.. క్షణాల్లో స్పందించిన కార్మికుడు.. కన్నార్పనీయని వీడియో! How to survive a bear attack… stand still and stay silent pic.twitter.com/zyE17dTbSv — CCTV IDIOTS (@cctvidiots) August 13, 2023
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement