అందమైన భామలను తడిమి చూసి వదిలేసిన ఎలుగు.. తెలివితో తప్పించుకున్నారిలా!

13 Aug, 2023 13:04 IST|Sakshi

ఎలుగుబంటి ఎంతో శాంతస్వభావం కలిగినదని చెబుతుంటారు. అయితే అది ఒక్కోసారి రెచ్చిపోయినప్పుడు దానిని ఆపడం ఎవరితరమూ కాదని కూడా అంటుంటారు. అయితే మీరు ఎప్పుడైనా అడవిమార్గం గుండా వెళ్లినప్పుడు ఎలుగుబంటి ఎదురైతే ఏం చేయాలో తెలుసా? దాని నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసా? సోషల్‌ మీడియాతో తాజాగా వైరల్‌ అవుతున్న ఒక వీడియోలో అందమైన భామలు తాము ఎలుగుబంటి నుంచి  ఎలా తప్పంచుకున్నదీ ఒక వీడియోలో చూపించారు. ఎలుగు ముంగిట చిక్కి, ఆపదలో ఉన్నవారికి  ఈ వీడియో ఎంతో ఉపయోగపడేలా ఉంది. 

వైరల్ అవుతున్న వీడియోలో ముగ్గురు యువతులు రోడ్డుపక్కన ఉండటాన్ని గమనించవచ్చు. ఇంతలోనే వారి దగ్గరకు ఒక నల్లని ఎలుగుబంటి రావడాన్ని చూడవచ్చు. అది వారి దగ్గరకు వచ్చి, వారిని పట్టుకుంటుంది. అయితే ఆ యువతులు ఏ మాత్రం కంగారు పడకుండా కదలకుండా నిలుచునే ప్రయత్నం చేస్తుంటారు. దీంతో ఆ ఎలుగుబంటి ఆ అందమైన యువతుల నుంచి ఎటువంటి ప్రమాదం లేదని భావించి, అక్కడి నుంచి కామ్‌గా వెళ్లిపోతుంది.

ఈ వీడియోను ట్విట్టర్‌లో @CCTV IDIOTS పేరుతో షేర్‌ చేశారు. ఈ వీడియోకు క్యాప్షన్‌గా ‘ఎలుగుబంటి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసుకోండి.. శాంతంగా, స్థిరంగా నిలుచోండి’ అని రాశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 269.4కేకు పైగా వీక్షణలు దక్కాయి. 3వేలకు పైగా లైక్స్‌ దక్కాయి. ఒక యూజర్‌ తన కామెంట్‌లో ఒకవేళ ఆ ఎలుగుబంటికి ఆ యువతుల స్మెల్‌ నచ్చకపోయి ఉంటే ఏమయ్యేదోనని అనగా, మరొకరు ఆ ఎలుగుబంటి వారిని కావలించాలనుకుంటోంది అని రాశారు. 
ఇది కూడా చూడండి: పట్టుతప్పి పట్టాలపై పిల్లాడు.. క్షణాల్లో స్పందించిన కార్మికుడు.. కన్నార్పనీయని వీడియో!
 

మరిన్ని వార్తలు