-
ఆహారం మిగిలిందా.. మాకివ్వండి
తణుకు అర్బన్(పశ్చిమగోదావరి): శుభ కార్యాల్లో ఆహారం మిగిలిపోయిందా? హోటళ్లలో భోజనం, అల్పాహారం ఉండిపోయిందా.. అయితే ఆ ఆహారాన్ని మాకందించండి మీ తరపున పేదలకు అందిస్తాం అంటున్నాయి తణుకుకు చెందిన ఫీడ్ ద నీడ్ – గిఫ్ట్ ఎ మీల్ రిఫ్రిజరేటర్స్ కేంద్రాలు. పేదల ఆకలిని తీర్చేందుకు తణుకు ప్రభుత్వ ఆస్పత్రి ముఖద్వారంలో, తణుకు సొసైటీ రోడ్డులోని బాలగంగాధర తిలక్ ఆడిటోరియం ప్రాంతంలో ఈ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏ ఒక్కరూ ఆకలితో పడుకోకూడదనే.. ఏ ఒక్కరూ కూడా ఆకలితో పడుకోకూడదనే లక్ష్యంతో ఫీడ్ ద నీడ్ ఫ్రిజ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మిగిలిపోయిన ఆహారాన్ని భద్రపరిచే ఆలోచనతో తణుకులో ఏర్పాటుచేసిన రెండు కేంద్రాలు ఇప్పుడు అన్నపూర్ణలుగా మారాయి. ఫీడ్ ద నీడ్ – గిఫ్ట్ ఏ మీల్ రిఫ్రిజరేటర్లను ఈనెల 21న ప్రారంభించారు. ఈ రెండు కేంద్రాలు పేదలకు ఆహారాన్ని అందించడంలో సేవలందిస్తున్నాయి. ఆకలి బాధను దిగమింగుకుంటూ అడుగులు వేస్తున్న పేద అవ్వా తాతలు, దివ్యాంగుల, అనాథల కడుపులు నింపుతున్నాయి. ఈ కేంద్రాల్లో మూడు షిఫ్టుల్లోను ముగ్గురు ,చొప్పున ఆరుగురు విధుల్లో ఉండి పేదలకు ఆహారాన్ని అందించేలా రూపకల్పన చేశారు. కేంద్రానికి వచ్చే ఆహార పదార్థాల్ని ఫ్రిజ్‌ల్లో భద్రపరచడం, ఆహారం కోసం వచ్చే పేదలకు ఆహారాన్ని అందించడం సిబ్బంది కర్తవ్యం. ఈ కేంద్రాల ఏర్పాటుపై ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గృహాలు, శుభకార్యాల్లో మిగిలిన ఆహారం గృహాలు, శుభకార్యాల్లోను మిగిలిపోయిన ఆహారాన్ని పారవేయకుండా ఔదార్యం ఉన్న మహానుభావులు ఈ కేంద్రాలకు తరలిస్తే వాటిని ఫ్రిజ్‌లలో ఉంచి పేదలకు అందించే విధంగా ఏర్పాటుచేశారు. మానవత్వం, సామా జిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరూ ఆహారాన్ని వృథాగా పారవేయకుండా ఈ కేంద్రాలకు అందచేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఎమ్మెల్యే కారుమూరి, పట్టాభి ఫౌండేషన్ ఔదార్యం ఆపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫీడ్ ద నీడ్ ఫ్రిజ్ కేంద్రాల్లో ఒక కేంద్రం ఏర్పాటుకు తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు రూ. 7 లక్షలు అందించగా, మరొక కేంద్రాన్ని తణుకుకు చెందిన పట్టాభి ఫౌండేషన్ సంస్థ ఏర్పాటుచేశారు. అంతేకాకుండా మునిసిపాలిటీ కూడా విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించారు. గుప్పెడు ఆహారం అందించడం కోసమే.. పేదలకు గుప్పెడు ఆహారం అందించాలనే లక్ష్యంతో ఫీడ్ ద నీడ్ ఫ్రిజ్ కేంద్రాలు ఏర్పాటుచేశాం. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి రెండు చొప్పున ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో సంస్థ పనిచేస్తోంది. ఆహారం లేక ఖాళీ కడుపుతో ఏ ఒక్కరూ పడుకోకూడదనే ఉద్దేశ్యంతో ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. తణుకు ఎమ్మెల్యే కారుమూరి, అధికారులు ఎంతగానో ప్రోత్సాహం అందించారు. – డాక్టర్ నీలిమ ఆర్య, ఆపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా పేదలకు ఆహారం అందించాలనే లక్ష్యం నచ్చి.. వారసుల ఆదరణ కొరవడిన అవ్వా, తాతలు, అనాథలు, దివ్యాంగులు ఆహారం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. స్వతహాగా అన్నం పెట్టడమంటే నాకు చాలా ఇష్టం. పేదలకు ఆహారం అందాలనే లక్ష్యం నచ్చి ఆపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధి కేంద్ర ఏర్పాటుపై నా దృష్టికి తీసుకురాగానే వెంటనే నా వంతుగా సాయం చేశాను. ఆ కేంద్రాల ద్వారా పేదల ఆకలి తీరడం నాకు చాలా ఆనందంగా ఉంది. – కారుమూరి వెంకట నాగేశ్వరరావు, తణుకు ఎమ్మెల్యే -
సీఎం జగన్ పుట్టినరోజు నుంచి ఏపీలోనూ ‘ఫీడ్ ది నీడ్’
సాక్షి, హైదరాబాద్: అన్నార్తులకు ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ప్రారంభించిన ‘ఫీడ్ ది నీడ్’ కార్యక్రమాన్ని ఏపీలోనూ ప్రారంభించనున్నట్లు యాపిల్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ నీలిమాఆర్య తెలిపారు. సీఎం జగన్మోహన్రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని 21న విశాఖ, తిరుపతిలో రిఫ్రిజిరేటర్లను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. యాపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా ఫౌండేషన్, మ్యాచ్ పాయింట్ బ్యాడ్మింటన్ అకాడమీ, యాపిల్ టీమ్ టెనీషియస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో శుక్రవారం హోటెల్ తాజ్ దక్కన్లో మిక్స్ అండ్ మింగిల్–కేక్ మిక్సింగ్ కార్యక్రమం నిర్వహించారు. నీలిమా ఆర్య మాట్లాడుతూ ఏపీలోని 175 నియోజకవర్గాల్లో 350 రిఫ్రిజిరేటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్‌రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
మోదీది సవతి తల్లి ప్రేమ
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement