-
చైనా ప్లాన్ మామూలుగా లేదుగా.. ప్రపంచవ్యాప్తంగా రహస్య పోలీస్ స్టేషన్లు!
బీజింగ్: గ్లోబల్ సూపర్‌పవర్‌గా ఎదగాలనే తన లక్ష్యాన్ని సాధించేందుకు చైనా శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. అభివృద్ధి చెందిన కెనడా, ఐర్లాండ్ వంటి దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అక్రమంగా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. ఈ రహస్య పోలీస్ స్టేషన్లపై సంచలన విషయాలు వెల్లడించింది ఓ నివేదిక. ఈ అంశంపై మానవ హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెనడా వ్యాప్తంగా పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో(పీఎస్బీ) అనుబంధంగానే అలాంటి అక్రమ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారని ఇన్వెస్టిగేటివ్ జర్నలిజమ్ రిపోర్టికా..స్థానిక మీడియాతో వెల్లడించింది. చైనా విరోధులను నిలువరించేందుకు ఈ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. గ్రేటర్ టొరొంటే ప్రాంతంలోనే ఇలాంటివి మూడు స్టేషన్లు ఉన్నాయని తెలిపింది. మరోవైపు.. ఈ అక్రమ పోలీస్ స్టేషన్ల ద్వారా పలు దేశాల్లో ఎన్నికలను సైతం చైనా ప్రభావితం చేస్తోందని సంచనల విషయాలు వెల్లడించింది. 21 దేశాల్లో 30 అక్రమ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు చైనాలోని ఫుఝో పోలీసులు తెలిపారని రిపోర్టికా పేర్కొంది. ఉక్రెయిన్, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, యూకే వంటి దేశాల్లోనూ చైనా పోలీస్ స్టేషన్లకు కావాల్సిన సౌకర్యాలు కల్పించారని తెలిపింది. ఆయా దేశాల్లోని పలువురు నేతలు చైనా ప్రబల్యాన్ని ప్రశ్నిస్తున్నారని, మానవ హక్కులు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు రిపోర్టికా పేర్కొంది. మరోవైపు.. స్వదేశంలో భద్రత పేరుతో ప్రజలను అణచివేస్తున్న తీరుపై అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాపై విమర్శలు గుప్పిస్తున్నారు మానవ హక్కుల ప్రచారకర్తలు. ఇదీ చదవండి: జనంలోకి జిన్‌పింగ్ -
సెలబ్రిటీ పాండా చనిపోయింది!
ఎక్కువ కాలం జీవించిన పాండాగా గుర్తింపు బీజింగ్: ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించిన జెయింగ్ పాండా బాసి ఇకలేదు. చైనాలో 37 ఏళ్ల పాటు జీవించిన ఈ వృద్ధ పాండా గురువారం చనిపోయింది. ఈ విషయాన్ని ఆగ్నేయ చైనాలోని ఫుజౌ జూ నిర్వాహకులు వెల్లడించారు. పాండాలు 37 ఏళ్లు జీవించడమంటే మాటలు కాదు. ఎందుకంటే మనిషి 170 సంవత్సరాలు జీవించడంతో 37 సమానం అన్నమాట. నాలుగు లేదా ఐదేళ్ల వయసులో బాసి అనే లోయలో దొరకడంతో దీనికి ఆ పేరు పెట్టారు. బాసి చైనాలో చిన్నసైజు సెలబ్రిటీ. బరువులు మోయడం, బైక్ నడపటం, ఆటలు ఆడటం ఇలా ఎన్నో పనులు చేయడం దీని ప్రత్యేకత. ప్రతిఏటా బాసి పుట్టనరోజు వేడుకలను జూ అధికారులు ఎంతో ఘనంగా నిర్వహించేవారు. 1990లో నిర్వహించిన తొలి ఏషియా గేమ్స్ మస్కట్‌కు ఇది స్ఫూర్తిగా నిలవడం విశేషం.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement