-
భారతదేశంలో మొదటి టాటా వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ.. ఇదే!
భారతీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ భారతదేశంలో తన మొదటి 'రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ' (RVSF)ని రాజస్థాన్‌లోని జైపూర్‌లో ప్రారంభించింది. దీనిని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి 'నితిన్ గడ్కరీ' ప్రారంభించారు. టాటా మోటార్స్ ప్రారంభించిన ఈ ఆధునిక సదుపాయంతో సంవత్సరానికి 15,000 వాహనాలను స్క్రాప్ చేయవచ్చు. ఇందులో ప్యాసింజర్ వాహనాలు, కమర్షియల్ వాహనాలను స్క్రాప్ చేయవచ్చు. అంతే కాకుండా పేపర్‌లెస్ కార్యకలాపాల కోసం పూర్తిగా డిజిటలైజ్ చేయబడింది. స్క్రాప్ చేయాల్సిన వెహికల్స్ యొక్క టైర్లు, బ్యాటరీలు, ఫ్యూయెల్, ఆయిల్స్ వంటి వాటిని విడదీయడానికి కూడా ఇందులో ప్రత్యేకమైన స్టేషన్స్ ఉన్నాయి. ఇందులో వెహికల్ స్క్రాపింగ్‌కి అయ్యే ఖర్చులను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు, అంతే కాకుండా ఇది ఎప్పుడు అమలులోకి వస్తుందనేది కూడా ప్రకటించలేదు. టాటా వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ ప్రారంభ సమయంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి దశలవారీగా స్క్రాపేజ్ విధానం ఉపయోగపడుతుంది. ఇలాంటి సదుపాయాలను ఏర్పాటు చేసిన టాటా మోటార్స్‌ని అభినందిస్తున్నానన్నారు. అంతే కాకుండా దక్షిణాసియా ప్రాంతంలో భారతదేశాన్ని వాహన స్క్రాపింగ్ హబ్‌గా మార్చడానికి కృషి చేస్తున్నట్లు, భారతదేశంలో ఇలాంటి అత్యాధునిక స్క్రాపింగ్, రీసైక్లింగ్ యూనిట్లు మరిన్ని అవసరమని గడ్కరీ ఈ సందర్భంగా తెలిపారు. -
గడ్కరీ నోట ‘యూజ్ అండ్ త్రో’ వ్యాఖ్యలు.. బీజేపీ అధిష్ఠానానికి గురి?
ముంబై: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. కీలకమైన పార్లమెంటరీ కమిటీ నుంచి ఆయన్ని తప్పించిన తర్వాత రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరిగిన సంగతి తెలిసింది. ఈ క్రమంలో.. అవసరానికి వాడుకుని వదిలేయకూడదంటూ శనివారం నాగ్‌పూర్‌లో జరిగిన పారిశ్రామికవేత్తల కార్యక్రమం వేదికగా గడ్కరీ మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒక వ్యక్తి ఓడిపోయినప్పుడు కాదని, తాను పూర్తిగా వదిలేసినప్పుడే అంతమవుతాడని పేర్కొన్నారు. ‘బిజినెస్, సామాజిక పనులు, రాజకీయాల్లో ఉన్న ఎవరికైనా మానవ సంబంధాలే అతిపెద్ద బలం. అయితే, ఎవరూ వాడుకుని వదిలేసే మనస్తత్వంతో వ్యవహరించకూడదు. మంచి, చెడు రెండు సమయంలోనూ పట్టుకున్న చేతిని వదలకూడదు. ఎల్లప్పుడూ పట్టుకునే ఉండాలి. ఉదయించే సూర్యుడిని(ఎదిగే వ్యక్తులను) పూజించొద్దు.’ అని పేర్కొన్నారు గడ్కరీ. స్టూడెంట్ నాయకుడిగా ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు గడ్కరీ. ఆ సమయంలో మంచి భవిష్యత్తు కోసం తనను కాంగ్రెస్‌లో చేరాలని శ్రీకాంత్ జిక్కర్ కోరినట్లు చెప్పారు. అయితే, కాంగ్రెస్ భావజాలం తనకు నచ్చదని, పార్టీలో చేరటం కంటే బావిలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకైనా సిద్ధమని చెప్పినట్లు తెలిపారు. యువ పారిశ్రామిక వేత్తలు తమ ఆశలను ఎప్పటికీ వదులుకోవద్దని సూచించారు. ఇదీ చదవండి: ప్రభుత్వంపై నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు.. మరోసారి దుమారం! -
కేంద్ర మంత్రి గడ్కరీతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ
-
మోదీతో సహా కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం
-
నరేంద్ర మోదీ డ్రీమ్ టీమ్ ఇదే...
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డ్రీమ్ టీమ్ ప్రమాణ స్వీకారం చేసింది. భారత ప్రధానమంత్రిగా మోదీ రెండోసారి అంతఃకరణ శుద్ధితో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. మోదీ భారతదేశానికి 16వ ప్రధాని. మోదీ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కేంద్ర మంత్రిగా రాజ్ నాథ్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. కాగా కేబినెట్ కూర్పుపై ప్రధాని మోదీతో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సుదీర్ఘంగా చర్చలు జరిపినా చివరి వరకూ గోప్యత పాటించారు. 58మందితో నరేంద్ర మోదీ మంత్రివర్గం కొలువుతీరింది. మోదీతో సహా 25మంది కేంద్ర మంత్రులు, స్వతంత్ర హోదాలో 9మంది సహాయ మంత్రులు, 24 సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే శాఖల కేటాయింపు ఇంకా జరగలేదు. కాగా గత మంత్రివర్గంలో 25మంది కేంద్రమంత్రులుగా, 11 సహాయ (స్వతంత్ర), 40 సహాయ మంత్రులుగా ఉన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : మోదీతో సహా కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం కేంద్రమంత్రులు... 1. నరేంద్ర మోదీ (ప్రధానమంత్రి) 2. రాజ్‌నాథ్ సింగ్ 3. అమిత్ షా 4. నితిన్ గడ్కరీ 5. సదానంద గౌడ 6. నిర్మలా సీతారామన్ 7. రాంవిలాస్ పాశ్వాన్ 8. నరేంద్ర సింగ్ తోమర్ 9. రవిశంకర్ ప్రసాద్ 10. హర్సిమ్రత్ కౌర్ బాదల్ 11. థావర్ చంద్ గెహ్లాట్ 12. సుబ్రహ్మణ్యం జయశంకర్ 13. రమేశ్ పోఖ్రియాల్ 14. అర్జున్ ముండా 15. స్మృతి ఇరానీ 16. డాక్టర్ హర్షవర్థన్ 17. ప్రకాశ్ జవదేకర్ 18. పీయూష్ గోయల్ 19. ధర్మేంద్ర ప్రధాన్ 20. ముఖ్తార్ అబ్బాస్ నక్వీ 21. ప్రహ్లాద్ జోషీ 22. మహేంద్రనాథ్ పాండే 23. అరవింద్ సావంత్ 24. గిరిరాజ్ సింగ్ 25. గజేంద్ర సింగ్ షెకావత్ సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా) 1. సంతోష్ గాంగ్వర్ 2. రావ్ ఇందర్జీత్ సింగ్ 3. శ్రీపాద యశో నాయక్ 4. జితేంద్ర సింగ్ (సహాయ మంత్రి) 5. కిరణ్ రిజిజు (సహాయ మంత్రి) 6. ప్రహ్లాద్ సింగ్ పటేల్ (సహాయ మంత్రి) 7. రాజ్ కుమార్ సింగ్ (సహాయ మంత్రి) 8. హర్దీప్ సింగ్ పూరీ (సహాయ మంత్రి) 9. మన్సూఖ్ మాండవియా (స్వతంత్ర సహాయ మంత్రి) సహాయ మంత్రులు 1. ఫగ్గీన్ సింగ్ కులస్తే 2.. అశ్వినీ చౌబే 3. అర్జున్ రామ్ మేఘవాల్ 4. జనరల్ వీకే సింగ్ 5. కిృషన్ పాల్ గుజ్జర్ 6. దాదారావ్ పాటిల్ 7. కిషన్ రెడ్డి 8. పురుషోత్తం రూపాలా 9. రాందాస్ అథవాలే 10. సాధ్వీ నిరంజన్ జ్యోతి 11. బాబుల్ సుప్రియో 12. సంజీవ్ కుమార్ బాల్యాన్ 13. దోత్రే సంజయ్ శ్యారావ్ 14. అనురాగ్ సింగ్ ఠాకూర్ 15. సురేష్ అంగాడి 16. నిత్యానంద్ రాయ్ 17. రత్తన్ లాల్ కఠారియా 18. వి.మురళీధరన్ 19. రేణుకా సింగ్ 20. సోమ్ ప్రకాశ్ 21. రామేశ్వర్ తెలి 22. ప్రతాప్ చంద్ర సారంగి 23. కైలాస్ చౌదరి 24. దేవశ్రీ చౌదురి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్‌కప్‌కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement