-
చలో వియన్నా
పారిస్: భూమ్మీద అత్యంత నివాసయోగ్య నగరంగా ఆస్ట్రియా రాజధాని వియన్నా నిలిచింది. జీవన ప్రమాణాల్లో సుస్థిరత, మౌలిక సదుపాయాలు, మంచి ఆరోగ్య వ్యవస్థ, విస్తృతమైన ఉపాధి అవకాశాలు, వినోదం–విజ్ఞానం–సంస్కృతి తదితర ప్రామాణికాల ఆధారంగా ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈయూఐ) ఏటా ఈ ర్యాంకులిస్తుంది. గతేడాది టాప్‌లో ఉన్న అక్లండ్ (న్యూజిలాండ్)ను తోసిరాజని వియన్నా తొలి స్థానంలోకి వచ్చినట్టు ఎకనామిస్ట్ పత్రిక ప్రచురించింద కరోనా దెబ్బకు ఆక్లండ్ 34వ స్థానానికి పడిపోయింది. వియన్నా 2018, 2019 ల్లో నూ తొలి స్థా నంలో నిలిచింది. కరో నా వచ్చిన కొత్తల్లో రెస్టారెంట్లు, మ్యూజియంలు తదితరాలన్నీ మూతబడటంతో 2020లో 12వ స్థానానికి పడిపోయింది. సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఈసారి మొదటి స్థానంలో నిలిచిందని నివేదిక వెల్లడించింది. డెన్మార్క్ రాజధాని కోపెన్హగెన్ రెండో స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్‌కు చెందిన జ్యురిచ్, కెనడాలోని కేల్గరీ నగరాలు సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. పారిస్ 19 స్థానంలో, లండన్ 33, మిలన్ (ఇటలీ) 49, న్యూయార్క్ 51వ స్థానంలో నిలిచాయి. టాప్ 10 నగరాలు 1. వియన్నా (ఆస్ట్రియా) 2. కోపెన్హగెన్ (డెన్మార్క్) 3. జ్యురిచ్ (స్విట్జర్లాండ్) 4. కాల్గరీ (కెనడా) 5. వాంకోవర్ (కెనడా) 6. జెనీవా (స్విట్జర్లాండ్) 7. ఫ్రాంక్ఫర్ట్ (జర్మనీ) 8. టొరంటో (కెనడా) 9. ఆమ్స్టర్డామ్ (నెదర్లాండ్స్) 10. ఒసాకా (జపాన్) మెల్బోర్న్ (ఆస్ట్రేలియా) -
మెల్బోర్న్ మరో ఘనత
న్యూయార్క్: ప్రపంచంలోనే నివసించడానికి అత్యంత యోగ్యమైన నగరంగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ఎంపికైంది. ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) తాజాగా నిర్వహించిన ప్రపంచ నివాసయోగ్య నగరాల సర్వేలో ఈ విషయం వెల్లడైంది. వియన్నా, వాంకోవర్ నగరాలను వెనక్కునెట్టి అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాకే చెందిన సిడ్నీ నగరం టాప్ 10 నుంచి కిందకు పడిపోయింది. చిన్న నగరాలైన అడిలైడ్, పెర్త్ టాప్ 10లో చోటు దక్కించుకోవడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 140 నగరాలపై స్థిరత్వం, ఆరోగ్య సేవలు, సంస్కృతి, పర్యావరణం, విద్య, మౌలిక వసతులు తదితర 30 అంశాలను ఆధారంగా చేసుకుని ఈఐయూ ఈ సర్వే చేసింది. మొదటి లేదా చివరి పది సిటీల్లో ఏ భారత నగరానికీ చోటు దక్కలేదు. ఆస్ట్రియా రాజధాని వియన్నా, కెనడాలోని వాంకోవర్, టొరంటో, కల్గరీ వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్‌కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
విశ్వసనీయతే విజయానికి మెట్టు
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్‌కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్‌కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement