-
టీడీపీలో లోకల్ వార్.. నిస్తేజంలో కేడర్
నాయకత్వ లోపం తమ పార్టీ కొంప ముంచుతోందని దర్శి నియోజకవర్గ టీడీపీ నాయకులు అంతర్మథనం చెందుతున్నారు. అభ్యర్థి ఎంపికలో గందరగోళం, గ్రూపు రాజకీయాలు నేటికీ సమసిపోకపోవడంతో టీడీపీ కేడర్‌లో నిస్తేజం నెలకొంది. దర్శి: దర్శి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా టీడీపీ తరఫున గొట్టిపాటి లక్ష్మిని ఖరారు చేసి బరిలోకి దించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 4వ తేదీన ఆమె దర్శిలో తొలిసారి ఎన్నికల ప్రచారం నిర్వహించగా ప్రజల నుంచి స్పందన కరువైంది. కేడర్‌లో పట్టుమని పది మంది కూడా ఆమె వెంట ప్రచారానికి రాకపోవడం గమనార్హం. దర్శిలో ఆమె అడుగుపెట్టినప్పటి నుంచి ముస్లిం మైనారిటీలు, బీసీ సామాజికివర్గానికి చెందిన 500 మందికి పైగా టీడీపీ సానుభూతిపరులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. దీనికితోడు గొట్టిపాటి లక్ష్మి ప్రచారంలో పైసా ఖర్చు చేయడం లేదని కార్యకర్తలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. టీడీపీ శ్రేణుల నుంచే వ్యతిరేకత 2009 సార్వత్రిక ఎన్నికల్లో దర్శి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా మన్నం వెంకటరమణతో చంద్రబాబు పోటీ చేయించారు. ఆయనతో టీడీపీ అధిష్టానం భారీగా డబ్బు ఖర్చు చేయించగా.. సొంత సామాజిక వర్గం వారే నాన్ లోకల్ అంటూ ఓడించారు. రాబోయే ఎన్నికల్లో దర్శి నుంచి పోటీ చేసేందుకు ఒంగోలు చెందిన గోరంట్ల రవికుమార్ ఉవిళ్లూరగా స్థానికుడే కావాలని ప్రధాన నాయకులు పట్టుబట్టడంతో చంద్రబాబు వెనక్కి తగ్గారు. దర్శిలో బూచేపల్లిని ఎదుర్కొనే సత్తా ఉన్న నేతలెవరూ లేకపోవడంతో మల్లగుళ్లాలు పడిన టీడీపీ అధిష్టానం చివరికి గొట్టిపాటి లక్ష్మిని బరిలోకి దించింది. చంద్రబాబు ఏకపక్ష నిర్ణయాన్ని స్థానిక టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. స్థానికేతరురాలైన వ్యక్తికి సపోర్ట్ చేసే ప్రసక్తే లేదని అంతర్గత సమావేశాల్లో టీడీపీ నేతలు తెగేసి చెబుతున్నారు. నియోజకవర్గంలో సొంత పార్టీ శ్రేణుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుండటం, గెలుపు అవకాశాలు అంతంతమాత్రమేనని గ్రహించిన గొట్టిపాటి లక్ష్మి కాస్తో కూస్తో కూడా డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. దర్శిలో అడుగుపెట్టిన తొలిరోజే‘నేను పక్కా లోకల్’ అని గొట్టిపాటి లక్ష్మి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులతోపాటు ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు. ‘నరసరావుపేట నుంచి దర్శికి వచ్చిన ఆమె ఎలా లోకల్ అవుతుంది.. వచ్చిన తొలిరోజే ఇలా అబద్ధాలు మాట్లాడమేంటి’ అని టీడీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు. లక్ష్మి వ్యాఖ్యలపై నెటిజన్లు సైతం విరుచుకుపడ్డారు. ‘దర్శిలో ఇల్లూవాకిలి లేదు.. నీ పూర్వీకులు, కుటుంబీకులు కూడా ఎప్పుడూ ఇక్కడ నివాసం ఉండలేదు. అలాంటపుడు ఎలా లోకల్ అవుతావు’ అని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు నిలదీస్తున్నారు. బూచేపల్లిని ఢీకొట్టలేం! వైఎస్సార్ సీపీ దర్శి అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఆయన తల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, సతీమణి నందిని సైతం గడప గడపకూ వెళ్లి ప్రజలతో మమేకం అవుతున్నారు. బూచేపల్లి ఇప్పటికే దర్శి నియోజకవర్గంలో 80 శాతం ప్రచారం పూర్తి చేయడం విశేషం. గత 20 ఏళ్లుగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి స్థానికంగా నివాసం ఉంటూ నియోజకవర్గ ప్రజలకు సేవలందిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నప్పటికీ ప్రజాభిమానం ఏమాత్రం తగ్గని బూచేపల్లిని రాజకీయంగా ఢీకొట్టడం కష్టమని దర్శికి చెందిన టీడీపీ నేత ఒకరు పేర్కొన్నారు. -
కొత్త గ్రూపులకు ‘సారథి’!
నూజివీడు: ఇంకా టీడీపీలో చేరనేలేదు... ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించలేదు... టికెట్ ఇస్తామని ప్రకటించలేదు... కానీ, అప్పుడే కొలుసు పార్థసారథి నూజివీడులో గ్రూపు రాజకీయాలు మొదలు పెట్టారు. దీంతో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వర్గం మండిపడుతోంది. ఇప్పటికే ఇక్కడ టీడీపీలో ఉన్న గ్రూపుల గోల సరిపోదన్నట్లు... పార్థసారథి రాకముందే మరో కొత్త గ్రూపును తయారు చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మొదట ప్రగల్బాలు.. చివరకు సొంత సామాజికవర్గ నేతకు ఎసరు గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పెనమలూరు నియోజకవర్గం నుంచి కొలుసు పార్థసారథి పోటీ చేసి విజయం సాధించారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ పెనమలూరు నుంచి సీటు ఇవ్వడం సాధ్యం కాదని, ప్రత్యామ్నాయం ఆలోచిద్దామని వైఎస్సార్సీపీ అధిష్టానం పార్థసారథికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. ఇందుకు ఆయన అంగీకరించకుండా తాను పెనమలూరు నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. అదే సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును రహస్యంగా కలిసి ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. కానీ, అక్కడ టీడీపీ ఇన్చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అడ్డం తిరగడంతో చంద్రబాబు వెనక్కి తగ్గారు. పెనమలూరు తనకు కావాల్సిందేనని బోడే ప్రసాద్ గట్టిగా పట్టుపట్టారని, బీసీ నేత ముద్దరబోయిన అయితే మౌనంగా వెళ్లిపోతారని పార్థసారథిని నూజివీడు నుంచి పోటీ చేయాలని చంద్రబాబు సూచించినట్లు ప్రచారం సాగుతోంది. చివరకు తాను పెనమలూరు నుంచే పోటీ చేసి గెలుస్తానని ప్రగల్బాలు పలికిన పార్థసారథి కూడా అస్త్రసన్యాసం చేశారు. పెనమలూరులో బోడే ప్రసాద్‌ను తప్పించి తనకు సీటు ఇవ్వాలని చంద్రబాబును అడిగే ధైర్యం చేయలేక నూజివీడు వచ్చి పదేళ్లుగా టీడీపీని నమ్ముకుని ఉన్న తన సొంత సామాజికవర్గ నేతకు అన్యాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ముద్దరబోయిన ఫొటోల తొలగింపు నూజివీడు మండలం రావిచర్లలోని ఓ టీడీపీ నాయకుడి ఇంట్లో బుధవారం జరిగే శుభకార్యానికి పార్థసారథి హాజరుకానున్నట్లు తెలిసింది. ఆయనకు స్వాగతం పలుకుతూ మంగళవారం నూజివీడు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. వాటిలో ప్రస్తుత టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఫొటో కూడా ఉంది. పార్థసారథి కనీసం టీడీపీలో చేరకుండానే ఆయనకు స్వాగతం పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ముద్దరబోయిన వర్గం కంగుతింది. దీనిపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వ్యక్తిని వారు నిలదీయగా.. తనకు ఇద్దరు నాయకులు కావాలని, అందుకే ఇద్దరి ఫొటోలు వేశానని అతను చెప్పినట్టు సమాచారం. ఇద్దరి ఫొటోలు ఉండటానికి వీల్లేదని ముద్దరబోయిన వర్గం స్పష్టం చేసింది. ముద్దరబోయిన ఫొటోను తీసేయాలని, లేకపోతే తామే తమ నాయకుడి ఫొటోను తొలగిస్తామని హెచ్చరించింది. ఆ తర్వాత ఫ్లెక్సీలపై ఉన్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఫొటోను వారే కట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం నూజివీడులో హాట్ టాపిక్‌గా మారింది. పార్థసారథి అధికారికంగా టీడీపీలోకి రాకముందే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఈ గ్రూపుల గోల మరింత పెరిగే అవకాశం ఉందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పదేళ్ల నుంచి పార్టీ ఇన్చార్జిగా ఉన్న నేతను అధిష్టానం విస్మరించడం, మరోసారి వలస నేతను తీసుకురావడం, ఆయన మరో కొత్త వర్గాన్ని తయారు చేసుకునే పని ప్రారంభించడంపై నియోజకవర్గంలోని టీడీపీ సీనియర్ నాయకులు సైతం మండిపడుతున్నారు. నియోజకవర్గంలో గ్రూపుల గోల వల్ల ఇప్పటికే వరుసగా రెండుసార్లు ఓడిపోయామని, తాజా పరిణామాలు కూడా రానున్న ఎన్నికల్లో తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
భీమిలి నియోజక వర్గంపై గంటా కర్చీఫ్
-
విశాఖ: ఉత్తరాంధ్ర టీడీపీలో ముసలం!
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో గ్రూపు రాజకీయల నడుమ చిచ్చు ఒక్కసారిగా భగ్గుమంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన నేపథ్యంలో ఉత్తరాంధ్ర టీడీపీ లుకలుకలు బయటపడ్డాయి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ప్రాధాన్యత ఇవ్వడంపై చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వెల్లగక్కారు. ఈ క్రమంలోనే అలిగిన అయ్యన్న.. చంద్రబాబు సభకు దూరంగా ఉండాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. నిన్న బీసీ కార్యక్రమానికి సైతం అయ్యన్న డుమ్మా కొట్టారు. అలాగే తన తనయుడు విజయ్‌కి ఎంపీ టికెట్.. తమ ఎమ్మెల్యే టికెట్‌పైనా స్పష్టత ఇవ్వాలని అయ్యన్న అధిష్టానం వద్ద డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. గత నాలుగేళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్న గంటాకు ఉన్నపళంగా అధిక ప్రాధాన్యత ఇవ్వడంపైనా అయ్యన్న వర్గీయులు టీడీపీని నిలదీస్తున్నారు. ఇదిలా ఉండగా.. పాయకరావుపేట టీడీపీలోనూ వర్గ విభేదాలు బయటపడ్డాయి. వంగలపూడి అనితకు వ్యతిరేకంగా పార్టీలో ఓ వర్గం సమావేశం అయినట్లు సమాచారం. ఆమె ఫిర్యాదుతో ఇద్దరు నేతలపై వేటు పడడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. -
బాబు ఏం చెప్పారు?.. జ్యోతుల నెహ్రూ ఎందుకు రగిలిపోతున్నారు?
తమది క్రమశిక్షణ గల పార్టీ అని డబ్బా కొట్టుకుంటారు తెలుగుదేశం నాయకులు. కాని ఆ పార్టీలో ఉన్నన్ని గ్రూప్‌లు ఎక్కడా కనిపించవు. కాకినాడ జిల్లా టీడీపీలో తాజాగా జరుగుతున్న కొట్లాటలే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. జిల్లాలోని సీనియర్ నేతల మధ్య నడుస్తున్న గ్రూప్ పాలిటిక్స్ కేడర్‌కు ఆందోళన కలిగిస్తున్నాయని టాక్. ఇంతకీ కాకినాడ దేశంలో ఏం జరుగుతోందో మీరే చదవండి. కాకినాడలో కస్సు బుస్సు కాకినాడ జిల్లా తెలుగు దేశం పార్టీలోని కొందరు మాజీ ఎమ్మెల్యేలకు కంటి మీద కునుకు లేకుండా పోయిందట. టీడీపీ నాయకుల ఈ కష్టానికి కారణం అధికార పక్షం అనుకుంటే పొరపాటే. సొంత పార్టీలో నడుస్తున్న గ్రుప్ రాజకీయాలతోనే ఈ పరిస్ధితి దాపురించిందని ఆ పార్టీ నాయకులే వాపోతున్నారు. కాకినాడ జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడుగా మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్ వ్యవహరిస్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా పోటీ చేయ్యాలని నవీన్ భావిస్తున్నారు. ఎప్పటి లానే జ్యోతుల నెహ్రూ జగ్గంపేట ఎమ్మెల్యే సీటుకు పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే తండ్రీ, కొడుకులు పోటీ చేయాలనే ప్రతిపాదనలు పార్టీలోని కొందరు సీనియర్లకు రుచించడంలేదు. ఈ నేపథ్యంలో కొంతకాలం క్రిందట చంద్రబాబును కలిసిన పిఠాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గాల నేతలు ఈ విషయం గురించి చర్చించారు. నవీన్ ఎంపీగా పోటీ చేస్తే.. తమ నియోజక వర్గాల్లో ఆ ఖర్చును తామే భరించాల్సి వస్తే కష్టంగా ఉంటుందని బాబుకు చెప్పారట. ఈ విషయం ఆ జ్యోతుల నెహ్రూకు తెలిసిందట. దీనిపై రగిలిపోతున్న జ్యోతుల నెహ్రూ తన వ్యతిరేకులకు సమయం చూసి ఝలక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. కోల్డ్ వార్ c/o హీట్ పాలిటిక్స్ జ్యోతుల నెహ్రూ ఎదురు చూసిన సందర్భం వచ్చింది. చంద్రబాబు జిల్లా పర్యటన నేపథ్యంలో తన గ్రూప్ పాలిటిక్స్ ను ప్రయోగించారు. ప్రత్తిపాడు, పిఠాపురం నియోజకవర్గాల్లో తనను, తన కుమారుడిని అడ్డుకునే నేతలకు వ్యతిరేకంగా తన మద్దుతదారులతో నెహ్రూ ఆందోళన చేయించారు. ప్రత్తిపాడు సీటు బీసీలకు ఇవ్వాలని.. పిఠాపురం సీటు జ్యోతుల నవీన్‌కు కేటాయించాలని ఆ నేతలు చంద్రబాబును కలిసి తమ డిమాండ్లు వినిపించారు. ఐతే కొద్ది రోజులకు ప్రత్తిపాడు ఇన్ఛార్జ్ వరుపుల రాజా అకాల మరణం చెందారు. ఇక నెహ్రూకు వ్యతిరేకంగా మిగిలింది పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మనే. దీంతో వర్మను టార్గెట్ చేసుకుని జ్యోతుల నెహ్రూ తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు. వర్మకు గాడ్ ఫాదర్ గా ఉండే టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పార్టీలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా.. కాపాడుతూ వస్తున్నారు. జిల్లా పార్టీలో తొలి నుంచీ జ్యోతుల నెహ్రూ.. యనమల రామకృష్ణుడు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. పార్టీలో ఎంతో పలుకుబడి ఉన్న యనమల రామకృష్ణుడి కుటుంబంలోనే ప్రస్తుతం టిక్కెట్ వార్ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో యనమల తనను కాపాడుతాడనే నమ్మకం వర్మకు కనిపించడంలేదు. దీంతో జ్యోతుల నెహ్రూ బారి నుంచి నెలా బయటపడాలో... భవిష్యత్‌లో జరిగే పరిణామాలు ఎలా తట్టుకోవాలో వర్మకు అర్థం కావడంలేదట. జ్యోతుల టెన్షన్‌తో వర్మకు కంటి మీద కునుకులేకుండా పోయిందనే టాక్ నడుస్తోంది. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్‌కప్‌కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement