-
చిన్నారికి చేయూత
రేగిడి : మండలంలో చిన్నశిర్లాం గ్రామానికి చెందిన మీసాల ఇంద్రజకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసింది. ఇంద్రజకు పుట్టుకతోనే తల పెద్దదిగా ఉంది. ఎదుగుదల తక్కువగా ఉండడంతోపాటు తలభాగం పెద్దగా అవుతుండటంతో తల్లిదండ్రులు కృష్ణవేణి, అప్పలనాయుడు అప్పులు చేసి ఆస్పత్రులను ఆశ్రయించారు. చిన్నారికి ఆపరేషన్ చేయాలంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. వావిలవలస గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త పాలూరి సిద్దార్ధ ఇటీవల విశాఖపట్నం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్దకు చిన్నారితోపాటు తల్లిదండ్రులను తీసుకువెళ్లి పరిస్థితిని వివరించారు. ఇందుకు స్పందించిన ముఖ్యమంత్రి చిన్నారి ఆపరేషన్‌కు అవసరమయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని చెప్పి కుటుంబం నిలదొక్కుకునేందుకు రూ.లక్ష చెక్కును ఇచ్చారని సిద్దార్ధ విలేకరులకు తెలిపారు. ఆ చెక్కును చిన్నారి తల్లిదండ్రులకు బుధవారం అందజేశారు. -
ఇంత ఆనందం ఎన్నడూ పొందలేదు
న్యూఢిల్లీ: ‘ఐదేళ్ల పిల్లల ఆరోగ్యంపై యునెటైడ్ నేషన్స్ సర్వసభ్య సమావేశంలో తాను మాట్లాడటం చాలా ఆనందంగా ఉందని బాలీవుడ్ నటి కాజోల్ అన్నారు. యూఎన్ సర్వసభ్య సమావేశాల్లో తాను మాట్లాడటం ఇది రెండోసారని ఆమె తెలిపారు. కాగా పిల్లల ఆరోగ్యంలో చేతులు శుభ్రం చేసుకోవడం చాలా కీలకమని తాను చెప్పిన విషయం అందరికీ నచ్చిందన్నారు. ‘ఇక్కడ నా స్పీచ్‌కు నేను ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన లభించింది..’అని గొప్పగా చెప్పారు. లైఫ్‌బాయ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘హ్యాండ్‌వాష్ క్యాంపైన్’లో భాగంగా ఆమె మాట్లాడారు. చేతులు శుభ్రం చేసుకోకపోవడం వల్ల చిన్నారులు డయేరియా వంటి అంటువ్యాధుల బారిన పడే అవకాశముందని ఆమె తెలిపారు. ‘చేతులు శుభ్రం చేసుకోవడమనేది చాలా ముఖ్యమైన, ప్రాథమికమైన అంశం.. అంటువ్యాధుల గురించి మాట్లాడే ప్రతిఒక్కరూ ఈ అంశం ప్రాధాన్యతను అర్థం చేసుకునే ఉంటారు. 0-2 ఏళ్ల లోపు పిల్లల్లో అధిక శాతం ఈ అంటువ్యాధుల బారిన పడుతున్నారు..’ అని కాజోల్ వివరించారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయమై ఆమె విస్తృత ప్రచారం చేస్తున్నారు. తన మూడు రోజుల పర్యటనలో ఆమె యూఎన్ సెక్రటరీ జనరల్ భర్య యూ సూన్-టీక్, గేబాన్ ప్రథమ మహిళ సిల్వియా బాంగో ఓన్డింబా, యునీలివర్ సీఈవో పాల్ పాల్మన్ భార్య కిమ్, నటీమణులు లిల్లీ కోల్, అమీ స్మార్ట్ వంటి మహుమహులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాజోల్ మాట్లాడుతూ..‘యూ సూన్-టీక్, పాల్మన్ భార్య చాలా గొప్ప మహిళలు. వారు నేను చెప్పిన అన్ని విషయాలతో ఏకీభవించారు. నా ప్రసంగాన్ని ఆసాంతం శ్రద్ధగా విన్నారు, పిల్లలకు చిన్నతనం నుంచే శుభ్రతను నేర్పించాలన్న నా వాదనతో వారు పూర్తిగా ఏకీభవించడమే కాక ఆ దిశలో తామూ కృషిచేస్తామని చెప్పడం నాకు చాలా ఆనందం ఇచ్చింది. ఈ వేదిక నుంచి మేమందరం ఆయా దేశాల్లో చిన్నారులు చేతులు శుభ్రం చేసుకోవడం అంశంపై పూర్తి దృష్టి పెట్టాలని పిలుపునిచ్చాం.. ఈసారి నా యూఎస్ పర్యటనను నేను ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకుంటాను..’ అని ఆమె వ్యాఖ్యానించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్‌ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty : గ్రాండ్‌గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్‌గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్‌తో తొక్కించి ఏఎస్ఐ హత్య
హీరోగా జబర్దస్త్ కమెడియన్.. ఆసక్తిగా ట్రైలర్!
‘రాహుల్ గాంధీపై పాక్ ప్రేమ ఆందోళన కలిగించింది’
తప్పక చదవండి
- కొత్త పగటివేషగాడు వచ్చాడు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement