-
అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 తెలుగు సినిమాలు
-
ఆల్‌టైమ్ హయ్యస్ట్ గ్రాసర్ లిస్ట్‌లో ‘సంజు’!
రణ్‌బీర్ కపూర్ లుక్‌ను రిలీజ్ చేసినప్పటినుంచీ సంజు సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. టీజర్, ట్రైలర్ విడుదలయ్యాక సినీ అభిమానులు సంజు కోసం ఎదురుచూశారు. మొత్తానికి సినిమా విడుదలై రికార్డుల వేటను మొదలుపెట్టింది. సినిమా రిలీజ్ రోజు నుంచీ కలెక్షన్ల మోతమోగిస్తోంది. సంజు మూవీ కంటెంట్ పట్ల కొందరు వ్యతిరేకతను ప్రదర్శిస్నున్నా.. అవేమీ సినిమా కలెక్షన్లపై ప్రభావాన్ని చూపలేకపోతున్నాయి. మొన్నటికి మొన్న వివాదాస్పద దర్శకుడు వర్మ ఈ సినిమాపై తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు. నిజాల్ని దాచి సంజయ్‌దత్‌ను మంచిగా చూపించాడనే విమర్శలు వినిపిస్తోన్నా.. ఈ మూవీ మాత్రం బాలీవుడ్లో ఆల్‌టైమ్ హిట్‌గా నిలుస్తోంది. విడుదలైన ఐదో వారాంతం కూడా అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయని ప్రముఖ ట్రేడ్ అనలిష్ట్ తరణ్ ఆదర్శ్ ట్విటర్లో పేర్కొన్నారు. టైగర్ హై జిందాను దాటి.. పీకేను చేజ్ చేస్తూ.. ఇప్పటికి నాల్లో హయ్యస్ట్ గ్రాసర్‌గా 339కోట్లతో వసూళ్లతో దూసుకెళ్తోందంటూ ట్వీట్ చేశారు. సంజయ్‌దత్‌గా రణ్‌బీర్ నటన ఈ మూవీకి హైలెట్‌గా నిలిచింది. #Sanju crosses *lifetime biz* of #TigerZindaHai... Now FOURTH HIGHEST GROSSING *Hindi* film... Chasing #PK *lifetime biz* now... [Week 5] Fri 45 lakhs, Sat 87 lakhs, Sun 1.15 cr. Total: ₹ 339.75 cr. India biz. ALL TIME BLOCKBUSTER. — taran adarsh (@taran_adarsh) July 30, 2018 -
సంపాదనలో అగ్రరాజు మనోడే!
సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ సంపాదనలో దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాది నాలుగు సూపర్ టైటిళ్లు అందుకున్న ఈ గుంటూరు మిర్చి (230,423 యూఎస్‌డాలర్లు) 1.54 కోట్ల రూపాయలతో ఓవరాల్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ సంపాదన లిస్టులో అగ్రస్థానం సంపాదించాడు. ఇంకొద్దిరోజుల్లోనే నెం.1 ర్యాంకు అందుకునే అవకాశమున్న ఈ నెం.2 ర్యాంకర్ మిగతా పురుషుల షట్లర్ల కన్నా అధికంగా ఆర్జిస్తున్నాడు. ఈ ఏడాది గెలిచిన నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్ల ప్రైజ్‌మనీ సంపాదనలో శ్రీకాంత్‌ను నెం.1గా నిలబెట్టాయి. తరువాతి స్థానంలో ఉన్న మలేషియా ప్లేయర్ లీ చాంగ్ వెయ్ కన్నా శ్రీకాంత్ సంపాదన మూడు రెట్లు అధికంగా ఉండటం విశేషం. ఈ మాజీ నెం.1 ర్యాంకర్ లీ చాంగ్ ఇంగ్లండ్ టైటిల్, రెండు సూపర్ సిరీస్‌ల్లో రన్నరప్‌గా 86,275 యూఎస్ డాలర్లు( రూ.56 లక్షలు) ఆర్జించాడు. ఇక ఉమెన్ షట్లర్స్ తై జూ యింగ్, పీవీ సింధూల కన్న శ్రీకాంత్ సంపాదనే ఎక్కువగా ఉండటం మరో విశేషం. కలలో కూడా ఉహించలేదు: గోపిచంద్ శ్రీకాంత్ ఘనతపై కోచ్ పుల్లెల గోపిచంద్ స్పందిస్తూ.. ‘మంచి రోజులు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. శ్రీకాంత్ సాధించింది ఓ అద్భుతమైన ఘనత. ఓ భారత్ షట్లర్ సంపాదనలో నెం.1గా నిలుస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు. కానీ శ్రీకాంత్ ఈ ఘనత సాధించి ఆశ్చర్యానికి గురిచేశాడు. -
దంగల్ @ 2000 కోట్లు... నాటౌట్
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా ‘బాహుబలి’ నిలిచింది. అయితే ఇది నిన్నటి మాట. ఇప్పుడీ స్థానాన్ని హిందీ చిత్రం ‘దంగల్’ దక్కించుకుంది. రూ. 2,000 కోట్లు వసూళ్లు సాధించి, ఎక్కువ కలెక్ట్ చేసిన ఇండియన్ సినిమాగా వరల్డ్‌లో ‘నంబర్ వన్’ స్థానంలో నిలిచింది ‘దంగల్’. ఇటీవల చైనాలో ఈ చిత్రాన్ని ‘షుయి జియావో బాబా’ పేరుతో విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్కడ మాత్రమే ఈ చిత్రం 1,200 కోట్లు రాబట్టింది. దాంతో ‘బాహుబలి’ రికార్డుని బీట్ చేసింది. ఇంకా ఈ సినిమా చైనాలో విజయవంతంగా దూసుకెళుతోందట. ఆ సంగతలా ఉంచితే.. ‘బాహుబలి–2’ని వచ్చే నెల చైనాలో విడుదల చేయనున్నారు. మరి.. ఈ చిత్రం అక్కడ సాధించే వసూళ్లను బట్టి ఎక్కువ కలెక్ట్ చేసిన ఫస్ట్ ఇండియన్ సినిమా ఏది? అనేది డిసైడ్ అవుతుంది. ‘ఇండియన్ సినిమా నంబర్ వన్’ రికార్డు గురించి పక్కన పెడితే ‘దంగల్’ చైనీస్ కలెక్షన్స్ హాలీవుడ్ సినిమాలకు షాక్ ఇచ్చాయి. హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ అయిన ‘కెప్టెన్ అమెరికా: సివిల్ వార్’, ‘ట్రాన్స్ఫార్మర్స్: డార్క్ ఆఫ్ ది మూన్’, ‘కుంగ్‌ఫూ ఫాండా’, ‘ది జంగిల్‌బుక్’లతోపాటు వరల్డ్ సూపర్‌హిట్ మూవీ ‘అవతార్’కు మించిన వసూళ్లను చైనా బాక్సాఫీసు వద్ద ‘దంగల్’ రాబట్టుకోవడం విశేషం. చైనాలో అత్యధిక వసూళ్లను రాబట్టిన నాన్–ఇంగ్లీష్ మూవీగా ఐదో స్థానం దక్కించుకుంది. అక్కడ మిగతా నాలుగు స్థానాల్లో నిలిచిన నాన్–ఇంగ్లీష్ చిత్రాలు ఏంటంటే... ‘ది మెర్మైడ్’ (చైనా), ‘మాన్స్టర్ హాంట్’ (చైనా), ది ఇన్టచ్బుల్స్(ఫ్రాన్స్), యువర్ నేమ్ (జపాన్). ఐదో స్థానంలో ఇండియన్ మూవీ ‘దంగల్’ ఉండటం గర్వించదగ్గ విషయం. గ్రేట్ రెజ్లర్ మహావీర్‌సింగ్ ఫోగట్ జీవితం ఆధారంగా నితీష్ తివారీ డైరెక్షన్లో అమీర్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. -
కలెక్షన్ల రికార్డులను...'పీకే'స్తోంది
ఓవైపు విమర్శలు, వివాదాలు వెల్లువెత్తుతున్నా....మరోవైపు 'పీకే' చిత్రం బాలీవుడ్ పాత చిత్రాల కలెక్షన్ల రికార్డులను 'పీకే'స్తోంది. అత్యధిక కలెక్షన్లు వసూలు చేస్తున్న చిత్రంగా 'పీకే' దూసుకు వెళుతోంది. ఈ సందర్భంగా ఆమీర్ ఖాన్ తన రికార్డును తాను బ్రేక్ చేశాడు. గతంలో ధూమ్ 3 చిత్రం రూ. 271.82 కోట్లు వసూలు చేయగా, పీకే విడుదల అయిన రెండు వారాలకే రూ. 278.52 కోట్లు వసూలు చేసింది. ట్రెండ్‌ను చూస్తుంటే పీకే చిత్రం ఓవరాల్‌గా రూ. 500కోట్లకు పైగానే వసూలు రాబట్టొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆమీర్ ఖాన్, అనుష్క శర్మ జంటగా రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వం వహించిన పీకే.. మూఢ నమ్మకాలు, దొంగస్వాముల చుట్టూ కేంద్రీకృతమై.. సునిశిత హాస్యంతో తెరకెక్కిన విషయం తెలిసిందే. తొలి నుంచి సినిమాపై భారీ అంచనాలు ఉండటం, రివ్యూలు పాజిటివ్‌గా రావడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కనకవర్షం కురుస్తోంది. గతంలో రాజ్‌కుమార్ హిరాణీ, ఆమీర్ ఖాన్ కాంబినేషన్లో వచ్చిన 3 ఇడియట్స్ రూ.202 కోట్లు వసూలు చేసింది. మరోవైపు పీకే చిత్రం హిందూ మత విశ్వాసాలను దెబ్బతీసేదిగా ఉందని దానిపై నిషేధం విధించాలని బజరంగ్ దళ్ ఆందోళనలు, నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్‌రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్‌కు సర్వం సిద్ధం
ప్రజ్వల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్‌కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement