-
మరో(ర) మనిషి ...ఛార్లెస్ !
సాక్షి, హైదరాబాద్ : అందరి మాదిరిగానే ఛార్లెస్ చిరుమందహాసంతో పాటు ముఖం చిట్లించడం, ఆశ్చర్యపోవడం వంటి ఇతర వ్యక్తీకరణలు చేయగలడు. ఛార్లెస్ ఓ మరమనిషి (రోబో). కొత్త పరిశోధనలకు మరో ముందడుగులో భాగంగా మెదళ్లను చదవడంతో పాటు హావభావాలను వ్యక్తపరిచే ‘ఛార్లెస్’ సిద్దమయ్యాడు. వివిధ సందర్భాల్లో మనుషులు చేసే వ్యక్తీకరణలను చూసి వాటిని అనుకరించగలడు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఓ పరిశోధనలో భాగంగా దీనిని రూపొందించింది. విభిన్నమైన ఈ రోబోను మరింత శక్తివంతంగా తయారు చేసేందుకు అక్కడి డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ తదుపరి పరిశోధనలు నిర్వహిస్తోంది. మనుషుల లాగానే భావోద్వేగాలు వ్యక్తపరిచే రోబోలకు ఇది మరింత శక్తియుక్తులను అందిస్తుందని భావిస్తున్నారు. ముఖంలో భావాలు వ్యక్తిపరిచే రోబో... కెమెరాతో అనుసంథానించిన కంప్యూటర్ ప్రోగ్రామ్స్ వ్యవస్థ, ఇతర పరికరాల ద్వారా మనుషుల ముఖాలను రికార్డ్ చేస్తారు. ఈ ఫుటేజిని కంప్యూటర్ విశ్లేషిస్తుంది. ముఖంలోని కండరాలు, కనుబొమలు, దవడ, నోరు, ఇతర అవయవాలను తీరును కొలిచి ఆ వివరాలను ఛార్లెస్‌కు పంపిస్తుంది. ఈ ప్రక్రియ 2,3 సెకండ్లలోనే ముగుస్తుంది. వాటిని ఆ రోబో స్వీకరించాక తాను సొంతంగా హావభావాలను వ్యక్తపరుస్తుంది.‘సామాజిక సంబంధాల్లో భాగంగా మనుషులు వ్యక్తపరిచే సంకేతాలను తెలుసుకునే సామర్థ్యాన్ని కంప్యూటర్లకు కల్పించాలనేది మా ఆలోచన. ఇందులో మనుషుల ముఖకవళికలు, కంఠస్వరం, శరీర భంగిమ, సంజ్ఞలను ఇవి అర్థం చేసుకునేలా రూపొందిస్తున్నాం’ అని ఛార్లెస్ సష్టికర్త ప్రొ. పీటర్ రాబిన్సన్ పేర్కొన్నారు.మెరుగైన పద్ధతుల్లో అమర్చిన కత్రిమ అవయవాల కారణంగా ఛార్లెస్ మనిషిని పోలినట్టుగానే కనిపిస్తున్నా వ్యక్తపరిచే హావభావాలు మాత్రం ఇంకా అసహజంగానే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. గతంలో కత్రిమ మేథతో కూడిన హ్యుమనాయిడ్ ‘సోఫియా’ను (ప్రపంచంలోనే పౌరసత్వం లభించిన తొలి రోబో)రూపొందించిన రోబోటిస్ట్ డేవిడ్ హాన్సన్ సహకారంతో ‘చార్లెస్’ను రాబిన్సన్ రూపొందించారు. భావోద్వేగ మరమనుషులు.. మనుషుల ముఖకవళికల్లో వచ్చే మార్పులు చేర్పులు, భావనలను గ్రహించి ..అందుకు తగినట్టుగా (ప్రతిస్పందనగా) తమవైన సలహాలు, సూచనలు ఇచ్చే రోబోలను తయారు చేసేందుకు అనేక చోట్ల ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇటీవల లాస్‌వేగాస్‌లోని నెవాడాలో జరిగిన ‘వినియోగదారుల ఎలక్ట్రానిక్ ప్రదర్శన’ (సీఈఎస్)లో భావోద్వేగ రోబోతో సహా వివిధ నూతన ఆవిష్కరణలను ప్రదర్శించారు. రోబోలు కూడా భావాలను వ్యక్తికరించే విధంగా ‘భావోద్వేగ చిప్’ తయారుచేస్తున్నట్టు న్యూయార్క్‌కు చెందిన ఎమోషేప్ సంస్థ వ్యవస్థాపకుడు పాట్రిక్ లెవి–రోసెంతల్ వెల్లడించారు. జపాన్‌లో ఓదార్పు రోబోలు.. జపాన్‌లో వద్ధుల సంరక్షణ చర్యలు కొరవడుతున్న పరిస్థితుల్లో అందుకు రోబోల సేవలను ఉపయోగించే దిశగా ప్రయోగాలు చేస్తున్నాం. ఒకవేళ మీరు కళ్లనీళ్లు పెట్టుకుంటే మిమ్మల్ని ఈ రోబో ఓదారుస్తుంది. మీకు స్నేహితులెవరూ లేకపోతే ఇది మిత్రుడిగా వ్యవహరిస్తుంది. అంతర్ముఖులుగా ఉన్న వారు రోబోలతో స్వేచ్ఛగా మాట్లాడవచ్చు’ అని తమ రోబోల ప్రత్యేకతలను మూర్ ఇన్సైట్స్ అండ్ స్ట్రాటజీ సంస్థ టెక్నాలజీ అనలిస్ట్ పాట్రిక్ మూర్హెడ్ వివరించారు. అవసరం పడిన.పుడు వద్ధులకు ఆరోగ్య సలహాలు అందించే విధంగా కూడా అప్లికేషన్లు తయారు చేస్తున్న సంస్థలు కూడా ఉన్నాయి. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మనుషుల్లాగే నడిచే రోబో
వాషింగ్టన్: మనుషుల్లానే కాళ్లకు షూ వేసుకుని నడిచే రోబోలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అది మనలా నడవటమే కాకుండా నడకలో మనుషుల్ని అనుకరిస్తుంది కూడా. ఈ రోబోలు మానవుల మడమ, బొటనవేలిని తల పించే నిర్మాణాల సాయంతో నడుస్తాయి. దీని సాయంతో అవి మనుషుల నడకను అనుకరించగలవు. ఈ హ్యూమనాయిడ్ రోబోకి వారు డ్యూరస్ అని పేరు పెట్టారు. డ్యూరస్కి ముందున్న రోబో కాళ్ల నిర్మాణంలో కొన్ని మార్పులు చేసి దీన్ని తయారు చేశారు. నడిచే దారిని బట్టి నడకను మెరుగుపరుచుకునేలా ప్రోగ్రాం చేశారు. ఈ ప్రోగ్రాం దారి సవ్యంగా లేనప్పుడు అది కింద పడే అవకాశాన్ని తగ్గిస్తుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
ధర్మాగ్రహం ముందు నిలవని దాదాగిరి
కన్నీటి సుడులు.. కరిగె మారాజు
ఎవరినీ వదిలిపెట్టను
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్‌తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement