-
దారుణం: భార్యకు కరోనా.. గుండెపోటుతో భర్త మృతి
సాక్షి, మల్లాపూర్(కోరుట్ల): కరోనా విజృంభణ మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేస్తోంది.. వైరస్ సోకిన వారికి అండగా నిలిచి, మనోధైర్యం నింపాల్సిన బంధువులు, మిత్రులు, స్థానికులు భయపడుతూ దగ్గరకు రావడం లేదు.. దీంతో కొంతమంది మానసిక వేదనతో కృంగిపోతూ బలవన్మరణానికి పాల్పడుతున్నారు. మరికొందరు సమాజం నుంచి వెలివేయబడ్డామనే ఆందోళనతో మనోధైర్యాన్ని కోల్పోతున్నారు.. పలువురు అదే పనిగా ఆలోచిస్తూ గుండెపోటుతో చనిపోతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని సంస్థలు, కొంతమంది వ్యక్తులు మేమున్నాం.. అంటూ ముందుకు వస్తూ మాయమవుతున్న మానవత్వానికి పునర్జీవం పోస్తున్నారు.. ఇందుకు మల్లాపూర్ మండలంలోని రాఘవపేటలో జరిగిన ఘటనే సాక్ష్యం. స్థానికుల కథనం ప్రకారం.. రాఘవపేటకు చెందిన బెజ్జారపు పరమానందం(55)కు ఇద్దరు భార్యలు. రెండో భార్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. తన ఇల్లాలికి వైరస్ రావడంతో ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో సోమవారం గుండెపోటుతో మృతిచెందాడు. పరమానందం అంత్యక్రియలు చేయడానికి బంధువులు, చుట్టుపక్కలవారు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆయన భార్య తల్లడిల్లింది. సర్పంచ్ నత్తి లావణ్య, ఉపసర్పంచ్ ఎండీ.అమీనొద్దీన్, తహసీల్దార్ రమేష్‌లు ఈ విషయాన్ని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన కోరుట్లకు చెందిన ఆల్ ఇండియా మానవత్వ సందేశ సమితి సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంస్థ సభ్యులు నజీర్ అలీ, ఇసాక్ అబ్దుల్లా, సుష్యాల్, హఫీజ్, అబ్దుల్ రబ్‌లు ప్రత్యేక అంబులెన్స్‌లో రాఘవపేటకు చేరుకున్నారు. పీపీ కిట్లు ధరించి, పరమానందం మృతదేహాన్ని గ్రామ శివారులోని శ్మశానవాటికకు తీసుకెళ్లి, అంత్యక్రియలు నిర్వహించారు. మానవత్వాన్ని చాటుకున్న ఆ సమితి సభ్యులకు బాధిత కుటుంబ సభ్యులు, ఆ గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా మృతుడికి ఒక కుమారుడు ఉన్నాడు. -
గుండెపోటుతో భార్య.. ఆ షాక్‌తో భర్త మృతి
ఆ భార్యాభర్తలిద్దరు చిట్టచివరి క్షణం వరకు కలిసే ఉన్నారు. చివరకు మరణంలోనూ కలిసే ఉన్నారు. విమానంలో వెళ్తున్న ఆ దంపతుల్లో భార్య గుండెపోటు వచ్చి మరణించగా.. అది చూసి తట్టుకోలేక షాక్ తిన్న భర్త కూడా వెంటనే ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన స్పైస్ జెట్ విమానంలో చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని చురు ప్రాంతానికి చెందిన ప్రేమలత (65) తన భర్తతో కలిసి ఢిల్లీ నుంచి గువాహటికి విమానంలో బయల్దేరారు. వాళ్లిద్దరితో పాటు మరో ఇద్దరు బంధువులు కూడా అదే విమానంలో ఉన్నారు. ప్రయాణం మొదలైన కొద్ది సేపటికే తనకు గుండెలో నొప్పిగా ఉన్నట్లు ఆమె చెప్పారు. వెంటనే సిబ్బంది అప్రమత్తమై పైలట్‌కు చెప్పగా, విమానాన్ని వెంటనే వెనక్కి తిప్పి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దింపేశారు. వెంటనే ప్రేమలతను అక్కడుకు సమీపంలోని మాక్స్ ఆస్పత్రికి తరలించారు. కానీ, తీసుకొచ్చేసరికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆ విషయం తెలిసిన కొద్దిసేపటికే ఆమె భర్త శాంతిలాల్ జైన్ (75) షాక్‌తో కుప్పకూలిపోయారు. వైద్యులు పరిశీలించి, ఆయన కూడా మరణించినట్లు చెప్పారు!!
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్‌కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్‌లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్‌సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement